Parimala Pari

Abstract Drama Fantasy

4.5  

Parimala Pari

Abstract Drama Fantasy

అన్న ప్రేమ

అన్న ప్రేమ

2 mins
515



ఇంట్లోకి అడుగు పెడుతూనే ఎదురుగా రౌద్రంగా చూస్తున్న విజయ్ ని చూసి హాల్లోనే ఆగింది నీలిమ.


"నీకు ఎన్ని సార్లు చెప్పాను ఆ రాహుల్ తో కలిసి తిరగద్దు అని, వాడొక పచ్చి అబద్ధాల కోరు, దొంగ వెధవ...." అంటూ కోపంగా తిట్టడం మొదలెట్టాడు రాహుల్ తో బండి మీద చెల్లి నీలిమని చూసిన విజయ్.


"అన్నయ్యా, రాహుల్ నువ్వనుకున్నట్టు చెడ్డవాడు ఏమి కాదు, అతను చాలా మంచివాడు" అంది నీలిమ.


"ఓహ్ వాడి గురించీ నువ్వే నాకు చెప్పాలి మరి, నిన్ను ఎదో మాయ మాటలాడి బుట్టలో వేసుకున్నట్టు ఉన్నాడు, నీకేదో మందు పెట్టినట్టు ఉన్నాడు అందుకే వాడి చెడు కూడా నీకు మంచి లాగానే కనపడుతుంది." అన్నాడు విజయ్.


"అదేం కాదు.. నీ పోలీస్ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. అయినా అతనేం నన్ను బుట్టలో వేసుకోలేదు, చెప్పాలంటే నేనే అతన్ని ప్రేమించాను. నన్ను ప్రేమించమని నేను బ్రతిమాలితేనె ఒప్పుకున్నాడు. నీకు కాబోయే బావగారి గురించి వాడు వీడు అని తప్పుగా మాట్లాడితే బాగోదు, చెప్తున్నా. నువ్వు అవునన్నా కాదన్నా నా పెళ్లి రాహుల్ తోనే!" అంది నీలిమ.


"ఓహో అంతవరకూ వచ్చిందా వ్యవహారం. అయితే నేను చెప్పేది కూడా విను..." అంటూ ఇద్దరూ గొడవ పడుతూ ఉండగానే "సర్, అర్జెంట్ మేటర్" అంటూ కానిస్టేబుల్ వచ్చి ఒక ఫోటో, ఫైల్ ఇచ్చి, సారీ చెప్పి వెళ్ళిపోయాడు.


ఆ ఫోటో చూసిన విజయ్ నొసలు చిట్లించాడు. కాస్త కోపంగా చెల్లితో 


"ఆ రాహుల్ పెద్ద మోసగాడు. అమ్మాయిలందర్ని అలాగే ఎదో మాయమాటలు చెప్పి వాళ్లే వచ్చి తనకు ప్రపోజ్ చేసేలా చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళతో అన్నీ అయిపోయాక వాళ్ళకి కనపడకుండా మాయమైపోతాడు. ఆ కాంటాక్ట్ నెంబర్ కానీ, అడ్రస్ కానీ ఉండదు. చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు వాడి మీద. వాడి గురించే మేం చాలా రోజులుగా వెతుకుతున్నాం. ఇప్పుడే వాడి ఫోటో, డీటెయిల్స్ అన్నీ కూడా దొరికాయి. ఇదుగో చూడు! వాడి అసలు పేరు సాల్మన్, రాహుల్ కాదు. పేరు మార్చుకుని నీతో ప్రేమ నటించి మా దగ్గర కేసులు కొట్టేయించాలని వాడి ప్లాన్." అంటూ తన దగ్గర కానిస్టేబుల్ ఇచ్చిన ఫోటో, వివరాలు చూపించాడు.


అది చూసిన నీలిమ షాక్ లో కొయ్యబారి పోయింది. నీలిమని చూసి విజయ్ దగ్గరకి వచ్చి, ఓదార్చి, "ఊరుకో, ఇంకా నువ్వు లక్కీ. ఈ అన్నయ్య వాడిని కనిపెట్టగలిగాడు. ఇకమీదట వాడ్ని మర్చిపోయి హ్యాపీగా ఉండు" అన్నాడు.


"అన్నయ్యా! అలాంటి వెధవని ఊరికే వదిలెయ్య కూడదు. నేను స్టేషన్కి వచ్చి నీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను" అని వాడి అడ్రెస్ ఇచ్చి, తను కూడా వెళ్లింది.


అక్కడ రాహుల్ ఉరఫ్ సాల్మన్ ని చూసిన నీలిమ, "ఏరా, ఎంత ధైర్యం రా నీకు? అమ్మాయిలని మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తావా. మా అన్నయ్య పోలీస్ అని తెలిసి నన్ను నీ ట్రాప్లో పడేస్తావా. ఆడది అంటే అమాయకురాలు కాదురా, అవసరం అయితే భద్రకాళీ అయ్యి నిన్ను చంపేస్తుంది" అంటూ అతన్ని పట్టుకుని చెడా మడా వాయించింది. 


నీలిమ చేసిన పనికి షాక్లో ఉన్న సాల్మన్, తన నుంచి విడిపించేందుకు ప్రయత్నం చేస్తుండగా..

విజయ్ వచ్చి, నీలిమ చేతిలో తన్నులు తిన్న సాల్మన్ ని అరెస్ట్ చేసి, స్టేషన్కి తీసుకుని వెళ్ళిపోయాడు.


సమాప్తం...


Rate this content
Log in

Similar telugu story from Abstract