Parimala Pari

Tragedy Inspirational Children

4.5  

Parimala Pari

Tragedy Inspirational Children

అమూల్యమైన నవ్వు

అమూల్యమైన నవ్వు

2 mins
385



రంగయ్య వాళ్ళ ఇల్లు మా సందులోనే ఒక మూల ఉంది. మొదట్లో అందరూ ఖండించారు, పెద్ద భవంతుల మధ్యలో చిన్న రేకుల షెడ్ ఏమిటీ అని. కానీ రంగయ్య, తన భార్య మా వీధిలో అందరికీ ఏదొక సహాయం చేస్తూ ఉండటంతో అందరూ రంగయ్యని అక్కడే ఉండనివ్వాలని అనుకున్నారు.


రంగయ్య కూతురు పల్లవి ఏడుస్తూ రోడ్డు మీదకి వచ్చింది.

సరిగ్గా అప్పుడే కార్ దిగుతున్న నేను చూసి, "మీ అమ్మ కొట్టిందా?" అని అడిగితే తల అడ్డంగా ఊపింది.


అది ఎప్పుడూ ఉండే గొడవేలే అని నేనూ ఊరుకున్నాను. కారణం రంగయ్య తాగుడుకి పచ్చి బానిస. మా దగ్గర పనులు చేసి, రోజంతా, నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బంతా తాగుడుకి తగలేస్తాడు. అంతేకాకుండా భార్య దాచి పెట్టిన డబ్బు కూడా తీసుకుని మరీ తాగుతాడు.


ఇంటి ఖర్చులకు చాలా జాగ్రత్తగా డబ్బు దాస్తుంది నాగవేణి. అప్పుడప్పుడూ మా ఆవిడ దగ్గర దాచటం కూడా నాకు తెలుసు. రంగయ్యకి తాగుడు అలవాటు మాన్పించాలని అందరం ప్రయత్నం చేసాం. కానీ రంగయ్య ఎవరు చెప్పినా ఎంత చెప్పినా వినడు.


తాగుడుకి డబ్బుల్లేవని పెళ్ళాన్ని తంతాడు, రంగయ్య భార్య నాగవేణి ఆ కోపం, అసహనం అంతా పిల్ల మీద చూపిస్తుంది. పిల్ల తినటానికి కానీ, బడికి కావాల్సిన పుస్తకాలు కానీ ఏదైనా అడిగితే పిల్లని చావకొడుతుంది.


ఆ పిల్ల కాసేపు ఏడ్చి, ఏడ్చి ఊరుకునేది, లేదా వాళ్ళ అమ్మే కాసేపటికి వచ్చి తీసుకుని వెళ్లిపోయేది.


కానీ ఆరోజు పల్లవి ఏడుస్తునే ఉంది. మా ఆవిడకి ఎదో అనుమానం వచ్చి, దగ్గరకి వెళ్ళి, ఏమైందని అడిగితే జరిగింది చెప్పింది.


ఆరోజు పల్లవికి ఐస్ క్రీమ్ తినాలని అనిపించి, నాగవేణిని కొనమని అడిగిందట., అప్పుడే ఇంట్లో డబ్బంతా కొల్లగొట్టుకు పోయాడు రంగయ్య, దాంతో పాటు అడ్డొచ్చిందని భార్యని కూడా నెట్టేసాడు. ఆ విసురుకి తల తలుపుకి తగిలి రక్తం కారుతూ పడిపోయింది. పల్లవి అమ్మా అని ఎంత లేపినా లేవలేదుట నాగవేణి. ఏడుస్తూ సాయం కోసం బయటకి వచ్చింది పాప.


ఆ విషయం వినగానే నా భార్య పరుగున పాపని ఎత్తుకుని లోపలకి వెళ్ళింది, తన వెనుకే నేనూ వెళ్ళాను. రక్తం మడుగులో స్పృహ లేకుండా పడి ఉంది నాగవేణి. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. కానీ అప్పటికే ఆలస్యం అయ్యిందని, అధిక రక్తస్రావం వల్ల తను చనిపోయింది అనీ చెప్పేసారు డాక్టర్లు. నా భార్య ఏడుస్తూనే ఉంది, పాప కూడా "అమ్మా అమ్మా!" అని ఏడుస్తునే ఉంది.


ఇవేమీ పట్టని రంగయ్య తాగిన మత్తులో పడి ఉన్నాడు. అప్పుడే నా భర్తకి నాకూ ఒక ఆలోచన వచ్చింది. పోలీసులతో, చిల్డర్న్స్ కేర్ వాళ్ళతో మాట్లాడి పల్లవిని మా అమ్మాయిగా దత్తతు తీసుకున్నాం.


పెళ్ళై ఏడేళ్లయినా పిల్లలు లేని మాకు ఇదే మంచి అవకాశం అనిపించింది. దేవుడే మరో అవకాశం ఇచ్చాడు అనుకున్నాం. పల్లవిని మాతో పాటు తీసుకుని వెళ్లిపోయాం. అప్పటినుంచీ తను అడిగినవి అన్నీ తీరుస్తూ ఇద్దరం సంతోషంగా ఉన్నాం.


పల్లవి కళ్ళలో మెరుపు, స్వచ్ఛమైన నవ్వు, ఆ నవ్వులో ఆనందం ఎంతో అమూల్యమైనవిగా తోచాయి మాకు.


******


Rate this content
Log in

Similar telugu story from Tragedy