Parimala Pari

Drama Inspirational Children

4  

Parimala Pari

Drama Inspirational Children

బద్ధకం

బద్ధకం

2 mins
472


ఏడు గంటలకు మోగిన అలారం ఆపేసి మళ్ళీ ముసుగు పెట్టింది నేహా.


"నేహా లే, ఈరోజు ఇంటర్వ్యూ ఉందన్నావు. మర్చిపోయావా?" అంటూ అమ్మ గుర్తుచేసింది.


"గుర్తుంది మా, లేస్తాను ఒక 5 మిన్స్.." అంటూ మళ్ళీ పడుకుంది. లేచేసరికి 8:30 అయింది. గబగబా ఫ్రెష్ అయ్యి 10 నిముషాలలో హాల్లోకి వచ్చింది నేహా.


"చెప్పాను కదా పొద్దునే లెమ్మని, చూడు ఇప్పుడు టైం ఎంతయ్యిందో. టిఫిన్ చేసే టైం కూడా లేదు, ఎలా వెళ్తావ్ ఆఫీస్ కి?" ప్రశ్న వేసింది అమ్మ హేమ.


"టీఫిన్ వద్దు మా, మిల్క్ ఇవ్వు, తాగేసి వెళ్తా, ఈలోపు క్యాబ్ బుక్ చేస్తా అంటూ మొబైల్ పట్టుకుంది. ఎంత సేపటికి తనకి కావాల్సిన క్యాబ్ దొరకలేదు.


ఎలాగూ క్యాబ్ రాలేదు కదా, ఈలోపు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు అంటూనే ఉంది హేమ. వద్దు మా మళ్ళీ క్యాబ్ వస్తే కష్టం అంటూ పాలు మాత్రం తాగి, అరగంట తర్వాత వచ్చిన క్యాబ్ ఎక్కి ఆఫీసుకి వెళ్ళింది.


అప్పటికే ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోవడంతో చాలా మంది ఉన్నారు అక్కడ. తన నెంబర్ లిస్టులో లాస్ట్ కి వచ్చింది. ఇప్పుడు తనని పిలిచె దాకా ఎక్కడికీ వెళ్లకూడదు. ఉదయం పాలు మాత్రమే తాగిన నేహా కడుపులో ఆకలి మొదలైంది. గంటలు గడుస్తున్నా తన టర్న్ రావట్లేదు. ఇంకా ఎంత సేపురా దేవుడా అనుకుంటూ కూర్చుంది.


లంచ్ అయ్యాక మిగిలిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తామని చెప్పి అందర్నీ కాంటీన్ కి వెళ్ళమన్నారు. అన్నదే తడవుగా వెంటనే వెళ్లి కడుపునిండా తినేసింది నేహా. ఇంటర్వ్యూకు కావాల్సిన సమాధానాలు దారిలో ప్రిపేర్ అవుదాం లే అనుకుని ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. లంచ్ చేసాక బద్ధకంగా అనిపించి అలా ఒక కునుకు తీసింది. తన టర్న్ వచ్చి ఇంటర్వ్యూకి పిలిచారు. తనకి తెలిసిన ప్రశ్నలే అయినా ముందుగా ప్రిపేర్ అవ్వకపోవటం వల్ల సరిగా సమాధానం చెప్పలేకపోయింది. దాంతో తనకి ఇష్టమైన జాబ్లో సెలెక్ట్ కాలేదు.


బాధగా ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి జరిగింది అర్ధం చేసుకుంది హేమ. తనని ఫ్రెష్ అవ్వమని చెప్పి, వేడి వేడి పకోడీలు వేసి తీసుకుని వచ్చింది. పక్కనే కూర్చోమని ఇలా చెప్పింది.


"చూసావా నేహా, ఇంటర్వ్యూలో అన్నీ నీకు తెలిసున్న ప్రశ్నలే అయినా కొంచం ముందు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అది లేకనే నువ్వు ఆన్సర్ చెయ్యలేకపోయావు. అంతేకాకుండా ఉదయం బద్ధకంతో ఇంకాసేపు అంటూ లేవకుండా పడుకున్నావు. ఉదయన్నే లేచి తొందరగా రెడి అయ్యి ఉంటే హర్రీ అయ్యేదానివి కాదు. ప్రశాంతంగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేదానివి. చూసావా నీ బద్ధకం వల్ల ఈరోజు నీకు ఎంతో ఇష్టమైన జాబ్, నీకు రావాల్సిన జాబ్ పోగొట్టుకున్నావు. ఇక నుంచి అయినా నీ బద్ధకం కాస్త తగ్గించుకో. లేదంటే రేపు పెళ్లయ్యాక అత్తారింట్లో ఇంట్లో పని, ఉద్యోగం, అత్తామామలు అన్ని చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా నువ్విలాగే బద్ధకిస్తే, మీ అమ్మ నీకేమి నేర్పలేదా అని నన్నే అంటారు. కాబట్టి ఆ బద్దకాన్ని వదిలించుకో..." అంటూ హితబోధ చేసింది.


"నిజమే నా బద్ధకంతో నాకు రావాల్సిన ఉద్యోగాన్ని సైతం నేను మిస్ అయ్యాను. ఇకమీదట బద్ధకంగా ఉండకూడదు, ఉండను అమ్మా" అని హేమకి ప్రామిస్ చేసింది నేహా.


Rate this content
Log in

Similar telugu story from Drama