Parimala Pari

Abstract Drama Tragedy


4  

Parimala Pari

Abstract Drama Tragedy


ధనుంజయం

ధనుంజయం

2 mins 275 2 mins 275


ఇన్నేళ్ల తర్వాత నా స్నేహితుడు ధనుంజయ్ నుంచీ ఫోన్ వస్తే ఆశ్చర్యంతో లిఫ్ట్ చేసాను.


"అరేయ్ పద్మాకర్ నువ్వొకసారి అర్జెంటుగా కేర్ హాస్పిటల్ కి రాగలవా, చూడాలని ఉందిరా నిన్ను, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. తొందరగా రా రా" అనేసి ఫోన్ పెట్టేసాడు.


ఆదరబాదరగా హాస్పిటల్కి వెళ్ళేసరికి నర్స్ ఇంజెక్షన్ ఇచ్చి, కాసేపు డిస్టర్బ్ చేయకండి పేషెంట్ ని అంది. వాణ్ణి ఆ స్థితిలో చూసి మతిపోయింది నాకు. 


ఎంత హుందాగా, దర్జాగా మహారాజులా ఉండేవాడు ఎలా అయిపోయాడు అని గుండె తరుక్కుపోయింది. 


ఇద్దరం చిరకాల మిత్రులం, ఎంతో కష్టపడి బిసినెస్ లో రాణించాడు వాడు, నన్ను చేరమని అడిగితే నేను వద్దని వాడి వ్యాపార విషయాలకు దూరంగా ఉన్నాను. మరికొందరు స్నేహితులని పార్టనర్లుగా చేసుకుని వ్యాపారం వృద్ధిలోకి తెచ్చాడు. భార్య పోయిన తర్వాత కూడా పిల్లల్ని చాలా ప్రేమగా, జాగ్రత్తగా పెంచాడు. ఇద్దరు కొడుకులు, కూతురు మంచిగా సెట్టిల్ అయ్యారు. ఇప్పుడు వీడేంటిలా అంతటి కష్టం ఏం వచ్చిందా అని ఆలోచిస్తూ, మా చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కూర్చున్నాను.


ఈలోగా ధనుంజయ్ మెలకువ వచ్చి నన్ను చూసి "వచ్చావా " అని చాలా సంతోషించాడు.


"ఏమైందిరా, నువ్వేంటి ఇక్కడ? ఎలా ఉంది నీకు" అని అడిగాను.


"ఇదుగో ఇలా ఉన్నా రా, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అసలు ఏం జరిగింది అంటే...


ఇన్నేళ్లు నా పిల్లలకోసం అహోరాత్రాలు కష్టపడి నాకంటూ ఒక సుస్థిర వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాను. నాకంటూ ఒక పేరు గుర్తింపు గౌరవం అన్నీ సంపాదించుకున్నాను. కానీ ఏం లాభం ఈ జీవితపు చివర అంకంలో నాకంటూ ఎవ్వరూ లేరు. నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నన్ను దూరం పెట్టారు, నా స్నేహితులు నన్ను మోసం చేశారు. 


నాకు చెప్పకుండా, నా వెనుక కొందరు చేసిన కొన్ని పనుల వల్ల నా వ్యాపారం పూర్తిగా దెబ్బతిని నష్టాల్లో కూరుకుపోయింది. నా కొడుకులు నా వ్యాపారం వాళ్ళకి అవసరం లేదని విదేశాలకు వెళ్లిపోయారు. వాళ్ళకి ఫోన్ చేసినా ప్రయోజనం లేదు. 


అత్తారింటికి పంపిన కూతురి మీద భారం వెయ్యలేను. ఆ దిగులుతో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మొన్ననే అడ్మిట్ అయ్యాను ఇక్కడ. నిన్ను చూడాలని, నీతో ఇవన్నీ చెప్పాలని ఏదైనా సలహా ఇస్తావని పిలిచాను. 


ఇటువంటి పరిస్థితుల్లో నేను ధైర్యం తెచ్చుకుని జీవించగలగటానికి ఒక్క మార్గం చెప్పగలవా?!" అని అడిగాడు.


వాడి దైన్యస్థితికి జాలేసింది. "నీ భార్య తోడు లేకుండా పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసావు, కష్టపడి వ్యాపారాన్ని వృద్జిలోకి తెచ్చావు. నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా, ఒకసారి మీ అమ్మాయిని అల్లుడిని కూడా పిలిచి మాట్లాడు" అన్నాను.


వెంటనే కూతురికి ఫోన్ చెయ్యగానే అరగంటలో వచ్చారు ఇద్దరూ. ధనుంజయ్ ని అలా చూసి చాలా బాధపడ్డారు. విషయం తెలుసుకుని  


"మావయ్యా మాకు ఒక్కమాట కూడా ఎందుకు చేప్పలేదు ఇప్పటివరకూ, మా నాన్న ఎంతో మీరు అంతే కదా నాకు. మీ వ్యాపారం సంగతి నేను చూసుకుంటాను. మా ఇంటికి రండి, ముందు మీరు రెస్ట్ తీసుకోండి. తర్వాత ఆలోచిద్దాం" అన్నారు అల్లుడు చైతన్య, కూతురు భార్గవి. 


"చూసావా, కూతురు అంటే అదేరా తండ్రి మీద ఎంత ప్రేమ ఉంది చూడు, నీ కొడుకులే కాదంటే అల్లుడు నిన్ను చేరదీస్తున్నాడు. నువ్వు అదృష్టవంతుడివి రా, ఇది చాలదా సంతోషంగా బ్రతకటానికి" అన్నాన్నేను.


వాడు ఆనందంతో నన్ను కౌగలించుకొని, కూతురు అల్లుడితో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాడు..


*****సమాప్తం*****


Rate this content
Log in

More telugu story from Parimala Pari

Similar telugu story from Abstract