Bhramara Suma

Abstract

5  

Bhramara Suma

Abstract

పండ్ల నోము

పండ్ల నోము

3 mins
519


సత్యవతి గారికి కి చేయి కాలు నిలబడటం లేదు ఎలా అయితే కొడుకు కోడలు ఇంటికి రావడానికి ఒప్పుకున్నందుకు ఆవిడకి ఒకటే ఆనందంగా ఉంది పెళ్ళయ్యి మూడు నెలలు అయింది అమ్మాయి ఎక్కువ చదువుకున్నా అణుకువగా ఉన్నందుకు సత్యవతి గారికి కూతురు లేని లోటు తీర్చుకోవాలని ఒకటే ఆరాట పడుతున్నారు. కోడలితో 16 ఫలాల నోము పట్టించాలని ఆమె కోరిక అమ్మ చిన్న సరదాలు ఎందుకు కాదనాలి అని భార్యను ఒప్పించి తీసుకొచ్చాడు గౌతమ్.

       సుగుణ బాగా చదువుకున్న వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి వాళ్ళింటిలో సాంప్రదాయాలు ఆచారాలు ఎక్కువ ఏమీ తెలియదు అంతేకాకుండా సుగుణ ఎనిమిదో తరగతి నుంచి హాస్టల్ లోనే ఉండేది భర్త మాటకు గౌరవం ఇచ్చి అత్తగారి సరదాకి ఓకే చేసింది

        నోము నొప్పించడానికి పట్టుకొచ్చిన పండ్లు చూస్తే ఒక చిన్న పండ్ల దుకాణం లాగా కనిపించింది సుగుణ కి ఒక ప్రక్కన వింతగానే ఉంది మరో ప్రక్క కొత్తగా కూడా వుంది.

       బాగా అలిసిపోయి ఉన్నారు శుభ్రంగా స్నానం చేసి వేడివేడిగా భోంచేసి పడుకో రేపు తెల్లవారు 5:00 కి లెగాలి పంతులుగారు ఏదో పని ఉందని త్వరగా వచ్చి పూజ నీతో పూజ చేస్తానని చెప్పారు వాయనం అందుకోవడానికి 8 గంటల నుంచి అందరూ వస్తారు నువ్వు శుభ్రంగా పడుకొ పోతే రేపు నీ మొహం నీరసంగా అందరికీ కనబడతాయి అని చెప్పి గదిలోంచి నుంచి వెళ్లారు సత్యవతి గారు

         సత్యవతి గారికి గౌతం ఒక్కడే కొడుకు ఆవిడ పంచప్రాణాలు కొడుకు మీదే ఏనాడు గౌతం మాటకి ఎదురు చెప్పలేదు ఏ లోటూ రానివ్వకుండా పెంచారు ఆవిడకి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం కూతురు ఉంటే ఎన్ని సరదాల తీర్చుకునేవారు ఎప్పుడూ గౌతమి చెబుతూ ఉండేవారు అమ్మకి సుగుణ ద్వారా ఆవిడ కోరికలన్నీ తీర్చాలని గౌతమ్ అనుకున్నాడు కానీ సుగుణ ఇవన్ని టికీ ఎలా స్పందిస్తుందో లోపల చాలా భయంగా ఉంది .

        తెల్లవారుజామున 5:00 కల్లా సుగుణ లేపి చన్నీళ్లతో తలస్నానం చేయించారు జలుబు రాకుండా సాంబ్రాణి కూడా వేయించారు పంతులుగారు వచ్చేసరికి అన్నీ సిద్ధం చేసి పూజ అయిన తర్వాత పంతులు గారికి సుగుణ చేత భారీ మొత్తంలోనే సంభావన ఇప్పించారు.

        సుమారు తొమ్మిది గంటల తర్వాత నుంచి వరుసగా ముత్తయిదువులు రావటం మొదలైంది వాళ్ళందరికీ కీ సుగుణ చేత కాళ్ళకు పసుపు రాయించి ప్రతి ఒక్కరికి అన్ని రకాల పళ్ళ వాయనం ఇప్పించారు అందరితోనూ సుగుణ గురించి ఇంకొన్ని గుణాలు కలిపి గొప్పగా చెప్పుకుంటూ మొదలుపెట్టారు అందులో కొందరు నువ్వు చాలా అదృష్టవంతురాలివి నీ కోడలు ఈరోజుల్లో నీ అమ్మాయి కాదు అంటూ పొగిడే సరికి ఊబి తబ్బి బై పోయారు తెలియకుండానే మధ్యాహ్నం అయిపోయింది. మధ్యలో సుగుణ తో నీరసంగా ఉంటే పాలు త్రాగే ఎవరికీ చెప్పకు అని అనేసరికి విన్న నాకు నవ్వొచ్చింది. పాపం సుగుణ బాగా అలసి పోయింది అక్కడ తతంగం అంతా అయ్యాక సుబ్బరంగా భోంచేసి గదిలోకి వెళ్లి ఆదమరిచి నిద్రపోయింది సాయంత్రం సత్యవతి గారు సుగుణకి దృష్టి తీసి పక్కన చేరి కబుర్లు మొదలు పెట్టింది మన పెద్ద వాళ్ళు పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అనేవారు మనం మనస్ఫూర్తిగా కొంతమందికైనా పండ్లు పంచి పెట్టడం వల్ల పండులాంటి బిడ్డను కంటార నీ నీ ఈ ఆచారం పెట్టారు పాత రోజుల్లో అందరూ పళ్ళు కొనుక్కునే స్థోమత లో ఉండేవారు కాదు అందుకని మనతోపాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా దానం పేరు మీద అ పళ్ళు ఇవ్వాలని ఇలా నోములు చేయించేవారు మనం ఎప్పుడైనా నా ఎదుటివాడికి పెట్టేది మంచి వస్తువు ఇవ్వాలి దేవుడు పూజ నిమిత్తం ఎందుకు చేయి ఇస్తారంటే సుచి శుభ్రత కోసం. ఏమిటో ఇవన్నీ మీకు నా చాదస్తంగా కనబడొచ్చు కానీ కానీ ఇందులో కూడా చాలా అర్థం ఉంటుంది అని చెప్తున్నా అత్తగారి వంక కన్ను ఆర్పకుండా చూస్తూ ఉండి పోయింది సుగుణ.

            రాత్రికి గదిలో సుగుణ ని ఎలా సముదాయించాలో అనుకుంటూ ఆలోచనలోకి వెళ్ళాడు గౌతమ్. నవ్వుతూ వచ్చిన సుగుణ ని చూసి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చు కున్నాడు. నేను రేపు నీతో రావడం లేదు ఒక వారం లీవ్ కి అప్లై చేశాను అత్తగారితో ఇంకా చాలా పూజలు ఉన్నాయి అవన్నీ అయ్యాక వస్తాను అని చెప్పే సరికి ఇది కలా నిజమా అనిపించింది.


Rate this content
Log in

Similar telugu story from Abstract