STORYMIRROR

Dinakar Reddy

Abstract

5  

Dinakar Reddy

Abstract

ప్యాషన్ ప్లస్ vs ఫార్చ్యూనర్

ప్యాషన్ ప్లస్ vs ఫార్చ్యూనర్

1 min
407

ఏరా శ్రీనూ! చూడు. నీ బామ్మర్ది ఫార్చ్యూనర్లో వచ్చాడు. వాణ్ణి చూడగానే అందరూ లేచి నిలబడుతున్నారు. నా బావ మరిది అనిల్ వస్తూ ఉండటం చూసి నా దగ్గరి బంధువు ఒకరు అంటున్న మాటలివి.

అందరం పెళ్ళిలో కలవడం నాకు చాలా సంతషంగా ఉంది. కానీ సంపాదన పోల్చి చూడడాలు..

సర్లే. ఇవన్నీ ఎప్పుడూ ఉండేవేగా అనుకుని అనిల్ ఎదురుగా వెళ్ళాను.

నన్ను చూడగానే అరే బావా! ఎలా ఉన్నావ్ అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.

వధూవరులను ఆశీర్వదించి ఇద్దరం భోజనాలు చేయడానికి ఒకే వరుసలో కూర్చున్నాము.

అనిల్! ఏమైనా నువ్వు బాగా సంపాదించావ్! బాగా కష్ట పడ్డావ్. మేమిలా కూపస్త మండూకాల్లా ఉండిపోయాం అని నా మనసులో ఉన్న మాట బయటికి అనేశాను.


అనిల్ నవ్వుకున్నాడు. తన ప్లేట్లో ఉన్న స్వీట్ తింటూ అన్నాడు. అయినా బావా! ఉదయం వెళ్ళి సాయంత్రానికి ఆఫీసు నుండి వచ్చేసి లక్షలు సంపాదించి కూడబెట్టేయాలి అనుకోవడం.. ఒక్క జీతం డబ్బులతో అన్నీ జరిగిపోవాలి అనుకుంటూ ఇంకే ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏ పనీ చేయకుండా కోటీశ్వరులం కాలేదు అని బాధ పడిపోవడం సబబేనా..

ఆలోచించు. నాకంటే నీకే తెలివి తేటలు ఎక్కువ కదా.

అని సమాధానం చెప్పాడు. 

ఏవో వేరే విషయాలు మాట్లాడుకుంటూ భోజనం పూర్తి చేశాను.


తాంబూలం వేసుకుంటూ ఆలోచించాను.

నిజమే. అనిల్ బిజినెస్ లో చాలా కష్టపడ్డాడు. ఎంతో శ్రమ పడితే కానీ ఈ పొజిషన్ లోకి రాలేదు.

ఏ పనీ చేయకుండా ఇంకొకరి సంపాదనతో పోల్చుకోవడం కరెక్టేనా. 


నా ప్యాషన్ ప్లస్ బైక్ అదోలా చూస్తున్నట్టు అనిపించింది.


Rate this content
Log in

Similar telugu story from Abstract