naveen surya

Abstract Drama Inspirational

3.9  

naveen surya

Abstract Drama Inspirational

విజేత - 2

విజేత - 2

3 mins
454


మా అబ్బాయి ఇంటర్వూ కి వెళ్ళిన రోజు ప్రముఖ వ్యాపారవేత్త జయంత్ బెనర్జీ PA మా ఇంటికి వచ్చారు . మీ అబ్బాయి పలానా వస్తువు తయారు చేశాడు . దాని గురించి వార్తల్లో ఇచ్చారు . అది మేము కొనడానికి వచ్చాము అని 


ఇంకా అతను చెప్పుకుంటూ వెళ్తున్నాడు " మేము దీన్ని కొంటాము మరియు నంద కిషోర్ గారి పేరు మీదనే హక్కులు తీసుకుంటాం 

మేము ఈ ప్రొడక్ట్ నీ మార్కేటింగ్ చేయాలి అనుకుంటున్నాం . వాటా ల్లో నంద కిషోర్ నీ భాగస్వామి నీ చేయాలి అనుకుంటున్నాం 


మా అబ్బాయి వచ్చాక నేను మా అభిప్రాయం తెలియజేస్తాను అని చెప్పగానే అతను జేబు నుండి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి మీ కాల్ కోసం ఎదురుచూస్తాను అని చెప్పి బయలుదేరాడు 


జయంత్ బెనర్జీ గారా అయన గురించి తెలియంది ఎవరికి వాళ్ల నాన్న అనంత్ బెనర్జీ నుండి వ్యాపారం ఆస్తిపాస్తులు వచ్చినా తన తండ్రి కంటే రెండు రెట్లు అస్తి మరియు పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తి . ఆయన నా కొడుకు దగ్గరకి తన PA నీ పంపడం అంటే మాటలా . అయ్యో నా కొడుకు నీ సరిగ్గా అర్థం చేసుకోలేక పోయానే అని బాధ 


తన గురించి వార్తల్లో వచ్చిన కూడా నా దగ్గర చెప్పలేదు అంటే నేనే కారణం అయి ఉండాలి . నేను తనని అర్థం చేసుకోలేదు , అడగలేదు , మాట్లాడలేదు , చెప్పనివ్వలేదు తండ్రి గా వాడికి కావాల్సింది ఇచ్చాను ఏమో కానీ వాడికి ఏమి కావాలో తెలుసుకోలేక పోయాను


అయినా నేను నా కొడుకు బాగుండాలి అనే కోరుకున్నాను తను బాగున్నప్పుడు ఎక్కడ ఉంటే ఎంటి , ఈ సంఘటన తర్వాత నాకు అర్థం అయింది ఎంటి అంటే జీతం కోసం కాదు జీవితం కోసం బ్రతకాలి అని , చేయగలిగే సామర్థ్యం , తెలివితేటలు ఉంటే ఎక్కడైనా సాధించగలరు . నా కొడుకు కంటే వాడి కల కంటే నాకు ఏది ఎక్కువ కాదు , వాడు అనుకున్నదే చేయనివ్వని అని అనుకున్నాను 


ఈ విషయాలన్నీ నేను వాడితోనే మాట్లాడొచ్చు , నా కొడుకు ప్రతిభ నలుగురికి అర్థం కావాలి . కొడుకులను చదువుల పేరుతో ఇష్టం లేకున్నా విదేశాలకు పంపే సంస్కృతి మారాలి తల్లి తండ్రులు గా వాళ్ళ ఇష్టాలను , అభిప్రాయాలను మనం గౌరవించాలి అనే ఉద్దేశం తో నా కొడుకు గెలుపు నీ మీ అందరికీ తెలియ జేయాలనే ఆలోచన తో ఈ ఫంక్షన్ ఏర్పాట్లు చేశాను


త్వరలో మన వాళ్ళలో చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పంపాలి అనుకోవచ్చు , రేపు ఎప్పుడైనా మీకు ఈ ఆలోచన రావొచ్చు అలాంటి రోజు గనక మీకు వస్తే ముందుగా మీ కొడుకు తో మాట్లాడండి , వాళ్ళకి ఇష్టం ఉంటేనే మీరు పంపండి లేకపోతే లేదు


తన జీవితం మీద తనకి పూర్తి హక్కు ఉంది , వాళ్ళ నిర్ణయం వాళ్ళకే వదిలేద్దాం , వారికి మనం అండగా నిలబడదాం . ధన్యవాదాలు


నందు నీకు సంతోషమే గా ........


హ్మ్మ్ అన్నట్లు నిట్టూర్పు 


ఆనందం మరియు ఆశ్చర్యం కలగలిసిన కన్నీళ్లు 


--------------------------


బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ - 2021 లో భాగంగా ఎంట్రెప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోబోతుంది NK గ్లోబల్ సొల్యూషన్స్ ఫౌండర్ & మేనేజింగ్ డైరెక్టర్ నంద కిషోర్ 


అన్ని రంగాల ప్రముఖులు మధ్య , అతిరథ మహారథుల సమక్షం లో

అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ వేడుక లో అవార్డ్ అందుకున్న నంద కిషోర్ ఒక్కసారిగా చుట్టూ చూశారు 


ఈ విజయం నీకే అకింతం ఇస్తున్నాను అన్నట్లు గా నాన్న వైపు ఒక చూపు , దూరంగా కొడుకు విజయాన్ని ఆస్వాదిస్తూ చప్పట్లతో అభినందిస్తూ మురిసిపోతున్న తండ్రి మరియు అవార్డ్ నీ ఎడమ చేతితో ఎత్తి పట్టుకుని విజయ దరహసంతో స్టేడియం అంతా ఒక్కసారిగా చూసాడు 


మొత్తానికి నంద కిషోర్ అనుకున్నది సాధించాడు 


ఒక ప్రముఖ వ్యాపార మాగజైన్ నంద కిషోర్ తో ఇంటర్వూ తీసుకుంది , తన జీవిత కథ నీ అందులో ఆర్టికల్ గా రాసింది 


°°°°°°°°°°°°°°°′°°°°°°°°°°°°


మా నాన్న కూడా నన్ను అర్థం చేసుకుని , నాకు సహకరించి ఉంటే

ఇవ్వాళ నంద కిషోర్ స్థానం లో నేను ఉండేవాడిని ఏమో 

నాలాగా ఇంకా ఎంత మంది ఉన్నారో అనుకుంటూ మాగజైన్ మూసేసి ఆఫీస్ కి బయలుదేరారు సుందర్ మాడుగుల



( కలల్ని చంపుకుని బ్రతికే సుందర్ మాడుగుల లాంటి వాళ్ళందరికి అంకితం ) 







Rate this content
Log in

Similar telugu story from Abstract