STORYMIRROR

Naveen Surya

Horror

4.0  

Naveen Surya

Horror

ఎల్విన్ కథలు

ఎల్విన్ కథలు

3 mins
25

ఆరోజు అమావాస్య , అర్థరాత్రి , అప్పటికే సమయం 12 కావొస్తోంది , చుట్టూ చీకటి , ఒంటరి ప్రయాణం ,  కార్ అద్దం  దించి ఒక్కడే సిగరెట్ ముట్టించుకుని తాగుతూ , మళ్ళీ ఇంకొకటీ అంటిస్తూ  అలా 40KPH లో వెళ్తున్నాడు . దూరంగా నక్క అరుస్తున్న శబ్దాలు , ఎక్కడో దూరంగా కనిపిస్తున్న మరో కారు లైట్ లు , నగరానికి 40 నిమిషాలలో చేరుకునేంత దూరం అడవిని దాటే క్రమం లో ఇంకాస్త స్పీడ్ పెంచి పోనీస్తున్నాడు కుమార్ , ఇంతలో భార్య నుండి కాల్ , ఎన్ని  సార్లు చెప్పాను ఎల్విన్  రోడ్ లో రాత్రి పూట అది అమావాస్య  రోజు రావొద్దు అని , మళ్ళీ మీరు అదే రోడ్ లో వస్తున్నారు , త్వరగా  రండి నాకు భయం వేస్తుంది   వస్తున్న అని చెప్పి పెట్టిసే లోపు వెనక నుండి ఒక కార్ గుద్దడం తో ఫోన్ కిందకి పడి స్టీరింగ్  తల కి గుద్దుకుని తేరుకుని కార్ దిగి వెనక వైపు వెళ్ళాడు 

రెండవ కార్ ముందు బంపర్ బలంగా తగలడం వల్ల ఒక దట్టమైన పొగ , ఆ పొగ నుండే కార్ లో ఎవరు ఉన్నారో అని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు కుమార్ , కానీ ఎవరు కార్ లో లేకపోయేసరికి ఇది యాదృచ్చికంగా జరగలేదు అనే నిర్ణయానికి వచ్చి తిరిగి తన కార్ స్టార్ చేసి వెళ్ళసాగాడు  సరిగ్గా 4 కిలోమీటర్ల దూరం వెళ్ళాక అదే కార్ తనకి.ఎదురుగా రావడం గమనించాడు . అప్పుడే కొత్తగా రోడ్ వేయడం వల్ల ఆ తారు అంటుకుని కారు నిదానంగా రావడం గమనించిన కుమార్ తిరిగి అడవిలోకి వెళ్ళసాగాడు దాదాపు 20 నిమిషాలు వెళ్ళాక అదే సమయానికి కార్ ఆగిపోయింది . ఎంతకీ కారు స్టార్ట్ అవ్వకపోవడం తో ఏమి చేయాలో అర్థం కాని స్తితి లో ఉండిపోయాడు , కార్ డిక్కీ లో తన కొడుకు కోసం కొన్న సైకిల్ ను తీసుకుని అడవి గుండా ప్రయాణం సాగించాడు 

ఇంతలో తనకి ఎదురుగా ఒక మనిషి రావడం గమనించి సైకిల్ ను పక్కకి ఆపి ఒక పొడవాటి కర్ర ను చేతిలోకి తీసుకుని ఆ మనిషి రాకకోసం ఎదురు చూడసాగడు, దగ్గరకి రాగానే వెంటనే వెనక నుండి కుమార్ ఆ మనిషిని కొట్టే లోపే కుమార్ ను కొడతారు . కుమార్ కి కనిపించిన మనిష తో పాటు ఇంకో మనిషి ఇద్దరు కలసి కుమార్ ను 2 కిలోమీటర్లు కుమార్ కార్ లోనే తీసుకుని వెల్లీ చిన్న ఇంట్లో బందిస్తారు.అప్పటికి స్పృహ కోల్పోని కుమార్ ఎక్కడో ఉన్న కార్ ఇక్కడికి ఎలా వచ్చింది కార్ ఎలా స్టార్ట్ అయింది అని ఆలోచించ సాగాడు ఇంతలోనే తన కార్ ను గుద్దిన కార్ కూడా అక్కడికి రావడం గమనించాడు కుమార్ . చీకట్లో మనుషులని గుర్తు పట్టలేక , వాళ్ళ మాటలు వినిపించక పోవడం తో మత్తు వల్ల నిద్ర లోకి జారిపోతాడు 


లేచే సరికి కాళ్ళు చేతులు కట్టి ఉంచడం తో పాటు , ముఖాన్ని మాస్క్ తో కప్పి ఉంచే సరికి తన ఎదురుగా ఉన్న మనుషులని గుర్తు పట్టలేక పోయాడు .చిన్న రంధ్రం ద్వారా తనని బంధించిన వాళ్ళలో ఒక వ్యక్తి నీ చూసాడు కుమార్ . పూర్తిగా నల్లని శరీరం తో  చూడడానికి విచిత్రంగా ఉంది .కాసేపటి తరువాత ముఖానికి బొగ్గు రాసుకుని ఉన్నారు అనే విషయం అర్థం అయింది .సరిగ్గా 12 సంవత్సరాల క్రితం తన నాన్నమ్మ చెప్పిన ఎల్విన్ కథలలో ఒక కథ గుర్తుకు వచ్చింది , అది మనిషి ఆకారం మరియు రూపాలను తెలియ జేసిన కథ . కథ లో చెప్పిన విషయాలు కళ్ళ ముందు జరిగేసరికి నిర్గాతపోయాడు కుమార్ .అంటె నా చిన్నప్పటి నుండి నేను విన్న కథలు అన్ని నిజమేనా అనే సందేహం లోకి వెళ్ళాడు

ఇప్పుడు ఏమి చేయబోతున్నారు అనేది ఆలోచిస్తే నే భయం వేసింది కుమార్ కి ,ఎలా తప్పించుకోవాలి అనేది అర్థం కాలేదు యాదృచ్ఛికంగా కాళ్ళకి ఏదో తగిలినట్లు అనిపించింది , అదే రంధ్రం నుండీ ఎంటా అని చూడసాగాడు . ఏడు రోజుల క్రితం తన ఇంట్లో ఒక మూలాన ఉన్న వస్తువు ఇక్కడ ఉంటడం గమనించాడు. అదే వస్తువు నీ తదేకంగా చూస్తూ ఉండి పోయాడుఅది ఒక బహుమతి . ఆఫీసు లో నందిని అనే అమ్మాయి నా పుట్టిన రోజు సందర్భంగా నాకు కనుక ఇచ్చింది ఐతే ఆది ఇక్కడకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు కుమార్ కి కనుక కంటే ముందు ఎల్విన్ కథలు గుర్తుకు తెచ్చుకోవాలి అస్సలు ఈ రోడ్ లో ఏమి జరిగింది మనీషా , దెయ్యమా , ఎల్విన్ అంటే అమ్మాయా , అబ్బాయా అస్సలు ఆ కథ లలో ఏముందో ఆలోచించసాగాడు

వెంటనే ఫోన్ తీసి ఇంటర్నెట్ లో ఎల్విన్ కథలు మాస్క్ కి ఉన్న చిన్న రంధ్రం ద్వారా చదవడం ప్రారంభించాడు గది లోకి ఎవరో వస్తున్న శబ్దం విని ఆగిపోయాడు . కానీ శబ్దం ఆగిపోవడంతో మళ్ళీ కథలు చదవడం లో కుమార్ నిమగ్నం అయ్యాడు , ఆ ఫోన్ వెలుతురు లో తన చుట్టు అస్తి పంజరాల గుట్ట ఉండటం తో భయానికి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు , తప్పించుకోవాడానికి ప్రయత్నం చేయసాగాడు .. ఎన్నీ  ప్రయత్నాలు  చేసిన ఇక్కడ నుండి తపోయించు కోలేదు anna మాటలు ... ఎల్విన్ కథలకి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచించసాగాడు కుమార్ ( To Be Continued ) 


Rate this content
Log in

Similar telugu story from Horror