STORYMIRROR

Naveen Surya

Abstract Tragedy Inspirational

4  

Naveen Surya

Abstract Tragedy Inspirational

నా అనుభవం

నా అనుభవం

3 mins
242

ఈ మధ్య నేను బాగా వింటున్న ఆంశం , నన్ను బాగా కలవరపెడుతున్న అంశం . ఒప్పుకుంటున్న నీకంటూ స్కిల్స్ లేకపోతే నీకు జీవితం లో మనుగడ ఉండదు 

కాకపోతే ఇక్కడ కొంత మంది వ్యక్తుల వాదనలు , ప్రస్తావనలు ఎలా ఉన్నాయి అంటే నాకు కార్ నడపడానికి రాదు కాబట్టి నేను స్టీరింగ్ ముట్టుకోకూడదు అనే రకంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు 


కార్ రాదు కాబట్టి స్టీరింగ్ ముట్టుకోకూడదు 

క్రికెట్ రాదు కాబట్టి బ్యాట్ పట్టుకోకూడదు

స్విమ్మింగ్ రాదు కాబట్టి బావి లో దూకొద్దు అన్న విధంగా ఉంది కొందరి ఆలోచన తీరు . మళ్ళీ పేరుకు జాగ్రతలు చెప్తున్నాం 


మనం చేస్తున్న / చేయాలి అనుకుంటున్న పనికి అనుభవం , అవగాహన , స్కిల్స్ లాంటి పదాలను వాడుతూ నీకే నీతులు చెప్తారు నీకు తెలీదు కాబట్టి చేయొద్దు (అవగాహన) ,నీకు రాదు కాబట్టి చేయొద్దు (అనుభవం) . నాకు తెలియక అడుగుతున్న 

నీకు అనుభవం అవగాహన , స్కిల్స్ లేకపోతే నువ్వు ఎది కొత్తగా ప్రయత్నించ వద్దా ??? 


మాట్లాడితే నీకు అనుభవం లేదు , అవగాహన లేదు , స్కిల్స్ లేవు అంటూ తగ్గిస్తూ మాట్లాడుతున్నారు కదా కంప్యూటర్ కనిపెట్టిన చార్లెస్ , బల్బ్ కనిపెట్టిన ఎడిసన్ , redio కనిపెట్టిన మార్కొని , టెలిఫోన్ కనిపెట్టిన గ్రహంబెల్ వీళ్ళందరికీ ఏమి అనుభవం ఉందో నాకు అర్థం కావట్లే వాళ్లంతా మేము చేయగలము అని నమ్మి , ప్రయత్నించి , అవగాహన తెచ్చుకుని , అనుభవం గడించి , అవరోధాల్ని ఎదుర్కొని సాధించిన వాళ్ళు 


నేను ఆలోచిస్తుంది ఏంటంటే నాగరికత మొదలై ఆవిష్కరణలు పుట్టుకొస్తున్న సమయం లో బహుశా సృష్టికర్త లకు ఇలాంటి సంఘటనలు ఎదురై ఉండవు ఒక వేళ ఉండి ఉంటే ఇలాంటి సంఘటనలు ఎదురై ఉండుంటే మనం ఇవ్వాళ అనుభవిస్తున్న సౌకర్యాల వెనుక , గొప్పగా చెప్పుకుంటున్న అద్భుతాలను మనం చూసే వాళ్ళం కాదేమో . 


థామస్ అల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టడానికి 1000 కి పైగా ప్రయత్నాలను చేశాడని చదువుకున్నాం . ఆ కాలం లో ఆయన కి అడ్డు చెప్పేవాళ్ళు లేరో , లేదంటే ఆయన వాటన్నింటినీ లెక్క చేయలేదో కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా అవన్నీ దాటుకుని బల్బ్ కనిపెట్టి ఇవ్వాళ మనం అనుభవిస్తున్న సౌకర్యం వెనుక ఆయనకి

కి వేల కట్టలేని కృషి దాగి ఉంది 


సాధారణంగా బల్బ్ కనిపెట్టడానికి 1000 ప్రయత్నాలు చేశాడు కాబట్టి 1000 రోజులు వేసుకుందాం రోజుకి ఒక ప్రయత్నం చేసినా 

దాదాపు 3 సంవత్సరాల కష్టం . మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని చేరుకోవడానికి సమయాన్ని కేటాయించుకుని మనకి ఉన్న పరిమితులకు లోబడి , మన ఆర్థిక అవసరాల కోసం , ఎదుగుదల కోసం ప్రయత్నాలు చేస్తుంటే .... ఇలా మొదలు అవుతుందో లేదో అలా చుట్టాలు , బంధువులు , ఫ్రెండ్స్ అంటూ మన మీద దండయాత్ర మొదలుపెడతారు . 


వాళ్ళ పిల్లలు , చుట్టూ పక్కల వాళ్ళ పిల్లలు , బందు మిత్రుల పిల్లల సమాచారం మొత్తం మన ఇంట్లో ఏకరువు పెడతారు . సమాజం ఎలా ఉంది అంటే ఒక కమిట్మెంట్ తో పనిచేసే వాడికి సహకరించక పోగా తిరిగి మళ్లీ మన కమిట్మెంట్ నే తగ్గించి తక్కువ చేసి మాట్లాడుతూ , మన లక్ష్యాల్ని , ఆశయాలను చులకన భావం తో చూస్తూ మాట్లాడతారు . 


అలాంటి వాళ్ళ మొదటి ఆయుధం నీ స్కిల్స్ లేదా నువ్వు ఎంచుకున్న రంగం . మనం ఏదో కొత్తగా ప్రయత్నించాలి అని , ఏదైనా సాధించాలి అని మనం ముందడుగు వేస్తుంటే నీకు , నీ వాళ్ళకి లేనిపోనివి చెప్పి నీ మనుగడ నే ప్రశ్నిస్తూ , నిన్ను నువ్వే అనుమానించుకునే విధంగా , ఒక రకమైన కన్ఫ్యూజన్ సృష్టిస్తూ 

 నీ భావజాలల్ని వ్యతిరేకిస్తూ పబ్బం గడుపుకునే వారి లిస్ట్ చాలానే ఉంది ఈ ప్రపంచం మరియు ప్రపంచం లోని మనుషులు మన అవసరాల్ని మరియు మన బలహీనతల్ని చాలా చక్కగా వాడుకుంటున్నారు . డబ్బు , సెక్యూరిటీ , అవసరాలు అనే పదాలు వాడి సమాజం లో నీ ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తారు 


ఈ మధ్య కొత్త గా ఆ లిస్ట్ లో ఫ్రెండ్స్ చేరిపోయారు. 6-7 ppls ఉన్న ఒక గ్రూప్ లో ఒక అతను ఏదైనా ప్రయత్నిద్దాం అనుకుంటే వాడిని ఎక్కడ లేని అపోహలను , భయాలను సృష్టిస్తూ వాడు నమ్మింది , నమ్ముతున్నది ఒక అపోహ గా చిత్రీకరిస్తారు . పోనీ వాళ్ళు ఏమైనా సాధించారా అంటే లేదు ఇంకో విషయం ఏంటంటే మిగతా వాళ్ళు అలాగే ఆ ఒక్కడు అదే కేటగిరీ కాకపోతే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు , వీడు అవ్వలేదు అంతే తేడా 



నువ్వు చేస్తుంది తప్పో , ఒప్పో నువ్వే నిర్ణయించుకోలేనంత హిప్నోటైజ్ చేస్తారు నిన్ను , నిన్ను ఒక సందిగ్ధం లో పడేస్తారు , ఒక మీమాంస లో , అసంతృప్తి తో బ్రతికే విధంగా నిన్ను మలుస్తారు 

అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి అందరిలో ఒక్కడిగా , ఒక సామాన్యుడి లా బ్రతికుతుంటారు . ఏదో ఒక రోజు జ్ఞానోదయం కలిగినా అప్పుడు నీ చేతుల్లో ఏమీ ఉండదు 


100 కి 95 మంది ఇలా బయటకి రావాల్సింది కేవలం 40 మంది మాత్రమే వస్తున్నారు మిగతావాళ్ళు కుటుంబం , బాధ్యత ల చుట్టూ తిరుగుతూ నచ్చని బ్రతుకు కొనసాగిస్తారు


Rate this content
Log in

Similar telugu story from Abstract