STORYMIRROR

Naveen Surya

Drama Tragedy Crime

4  

Naveen Surya

Drama Tragedy Crime

ఎవరు - 2

ఎవరు - 2

4 mins
371

భూషణ్ హత్య జరిగిన 3వ రోజు

-------------------------------------

ఆనంద్ : ఎంటి సార్ ఇంత త్వరగా వచ్చారు ఇవ్వాళ ఆఫీస్ కి 

మురళి కృష్ణ : ఆ ఆనంద్ గుడ్ మార్నింగ్ !! ఈ ఆఫీస్ నాకు గుడి లాంటిది ఇన్నేళ్ళు ఈ డిపార్ట్మెంట్ కి సేవలు అందించాను. ఇక మీదట ఈ ఆఫీస్ తో, మీతో సంబంధాలు ఉండవు అని అనిపించినప్పుడు ఎవరో ఒక కుటుంబ సభ్యుడుని కోల్పోయినట్లు అనిపిస్తుంది . అందుకే ఇవ్వాళ కాస్త ఎక్కువ సమయం ఇక్కడ గడుపుదామని !!! 

ఆనంద్ : ఏమి మాటలు సార్ అవి ! ఇవ్వాళ మీ పదవి విరమణ రోజు . ఆనందంగా ఉంది సార్ నాకు . మిమ్మల్ని మీ మాటల్ని మిస్ అవుతాం సార్ 

మురళి : అవును , నేను కూడా మిస్ అవుతాను 

ఆనంద్ : కానీ నేను నిర్వర్తించే నా కర్తవ్యం లో నాకు మీ సహాయం తప్పకుండా అవసరం అవుతుంది సార్ 

మురళి : భలే వాడివయ్య ఆనంద్ , నువ్వు అడగటం నేను చెప్పకపోవడం ... ఎంత మాట 

సూర్య : ఎంటి జూనియర్ , సీనియర్ ఏదో గుసగుసలాడుతున్నారు

ఆనంద్ : Mr. సూర్య గారిని కిడ్నాప్ చేస్తున్నాం , దాని గురించే మాట్లాడుతున్నాం 

సూర్య : ఊరుకో ఆనంద్ !!! సార్ ఇంతకీ పార్టీ ఎప్పుడు ???

మురళి : వచ్చే ఆదివారం ఇంటికి రండి . మీ భార్య లతో

ఆనంద్ : అయితే Mr.సూర్య కి ఇంకా పెళ్లి కాలేదు కదా

సూర్య : అయితే నేను నా ప్రేయసి రమ్య తో వస్తాను , సార్ నాకు ఆహ్వానం ఉందా

మురళి : భలేవాడివి సూర్య . మాకు పరిచయం చెయ్ నీ గర్ల్ ఫ్రెండ్ నీ 

సూర్య : తప్పకుండా సార్

విజయ్ : మురళి సార్ !!! సీనియర్ అధికారుల నుండి మనకి మెయిల్ వచ్చింది . ఇంకా కేస్ తాలూకు డీటైల్స్ పంపారు

మురళి : ఎంటి ఆ కేస్ ...???

విజయ్ : ప్రముఖ వ్యాపార వేత్త సురేంద్ర గారినీ 

మొన్న రాత్రి హత్య చేశారు 

సూర్య : ఏమైనా కారణాలు , సాక్షాలు , ఆనవాళ్లు తెలుసా Mr.విజయ్

విజయ్ : హత్య జరిగింది మొన్న , కానీ హత్య జరిగింది అనే విషయం ఇవ్వాళ పొద్దున్న తెలిసింది ,

📞 ఒక నిమిషం 

మురళి : హా! సార్ గుడ్ మార్నింగ్ , ఇప్పుడే కేస్ గురించి టీమ్ తో చర్చిస్తున్నాను , కానీ నేను ఇవ్వాళ రిటైర్డ్ అవుతున్నాను కదా

అరుణ్ ప్రసాద్ : మురళి గారు , నేను ఉన్నత అధికారులతో మాట్లాడతా , మీరు ఈ కేస్ పూర్తి చేయండి తర్వాత రిటైర్మెంట్ తీసుకోండి. ఇలాంటి క్రిటికల్ కేస్ లలో ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు దాన్ని కేర్ చేయకుండా కేస్ లో డెవలప్మెంట్ చూపిస్తారు . ఇది మీరు కొనసాగించండి . సీఐ అలాగే DSP చేయాల్సిన కేస్ నీ మీకు అప్పగిస్తున్నాను , ప్రతి update నాకు తెలియాలి , నేను మీకు అందుబాటు లో ఉంటాను , ఎలాంటి సహకారం అయినా నేను ఇస్తాను

మురళి : ఈ కేస్ ఎందుకు ఇంత సీరియస్ అనేది నేను తెలుసుకోవచ్చా

అరుణ్ ప్రసాద్ : మినిష్టర్ గిరీష్ కుమార్ కి సురేంద్ర ఫ్రెండ్ అంట , అందుకే మినిష్టర్ దీన్ని పర్సనల్ గా తీసుకున్నాడు 

మురళి : సరే సర్ ! మేము మీకు update ఇస్తాము 

ఆనంద్ : అయితే సర్ ! ఇక మొదలు పెడదామా !!!

మురళి : నాకు తెలిసి ఇంతకు జరిగిన వ్యాపార వేత్త భూషణ్ హత్య కి అలాగే ఈ హత్య కి ఏదో కనెక్షన్ ఉందనిపిస్తుంది 

విజయ్ : ఈ రెండు రోజులు సురేంద్ర డెత్ గురించి ఎలాంటి సమాచారం తెలియకపోవడానికి కారణం ఏంటి అన్నది తెలుసుకోవాలి 

సూర్య : సర్ ఈ భూషణ్ కేస్ టేకప్ చేసింది నా ఫ్రెండ్ రంజిత్ 

మురళి : అయితే ఇప్పుడే మాట్లాడించు !!! 

సూర్య : హా ! రంజిత్ ! మాకు ఒక కేస్ వచ్చింది మురళి సార్ మితో మాట్లాడతారు

మురళి : సురేంద్ర కి అలాగే భూషణ్ హత్య కి ఏదో ఒక సంబంధం ఉందని అనిపిస్తుంది రంజిత్ !! 

రంజిత్ ; కేస్ గురించి అరుణ్ ప్రసాద్ గారు కూడా ఇందాక మాట్లాడారు , నాకు కూడా అదే అనిపిస్తుంది. , అన్ని కోణాల్లో దర్యాప్తు చెస్తున్నాం,కానీ ఎలాంటి ఉపయోగం లేదు

మురళి : నాకు మీ సహాయం కావాలి రంజిత్ . మనం కలిసి పని చేద్దాం !! 

రంజిత్ : భలేవారు సార్ ! నాకు మీతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది 

మురళి : కేస్ డీటైల్స్ నాకు ఫార్వర్డ్ చేయండి 

రంజిత్ : కానీ భూషణ్ గారి హత్య కేసులో అసలు హంతకుడు ( ప్రధాన హంతకుడు ) అరెస్ట్ అయ్యాడు , రెండవ హంతకుడు నీ వదిలేసాను 

మురళి : నువ్వే చెప్తున్నావు కదా హంతకుడు అని , బహుశా ఇద్దరికీ సుపారి ఇచ్చింది ఒక్కరేమో 

రంజిత్ : అయ్యుండొచ్చు సార్ నా అనుమానం కూడా అదే , మొదటి హంతకుడుకి ఏ మాత్రం అవకాశం దొరకక పోయినా రెండవ హంతకుడు ఆ పని పూర్తి చేస్తాడు , సూపారి ఇచ్చిన వ్యక్తి భూషణ్ నీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేయకుడదు అని అనుకుని ఉంటాడు

మురళి : ఇక్కడ ముఖేష్ కి భూషణ్ మీద కోపం ఉంది కాబట్టి భూషణ్ నీ హత్య చేస్తే మరీ సురేంద్ర నీ ఎవరు చేశారు , ఎందుకు చేశారు 

సూర్య : ఇక్కడ విషయం క్లియర్ సార్ , భూషణ్ అలాగే సురేంద్ర ఒకేరోజు చంపబడ్డారు , కానీ సురేంద్ర హత్య విషయం రెండు రోజులు ఆలస్యంగా తెలిసింది , భూషణ్ అలాగే సురేంద్ర కి మినిస్టర్ అలాగే ఎస్పీ కి ఏదో సంబంధం ఉంది

మురళి : నిజం చెప్పావు సూర్య , భూషణ్ , సురేంద్ర , మీ SP అలాగే మినిస్టర్ గిరీష్ కుమార్ లకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి అందుకే భూషణ్ హత్య గురించి SP అలాగే సురేంద్ర హత్య గురించి మినిస్టర్ ఆరా తీస్తున్నారు 

ఆనంద్ : కానీ సార్ , సురేంద్ర హత్య గురించి 2 రోజుల పాటు ఎవరికి తెలియక పోవడం వెనుక ఏదైనా కుట్ర ఉందంటారా 

విజయ్ : కానీ మినిస్టర్ అలాగే ఎస్పీ ఈ కేస్ లో ఫ్రెండ్షిప్ కొద్ది అసక్తి చూపిస్తున్నారా , లేదా ఇంకా. ఏదైనా కారణం ఉందా

మురళి : అన్ని తెలుసుకుందాం విజయ్ 

రంజిత్ : అయితే మనం ముఖేష్ తో విచారణ మొదలు పెట్టాలి 

మురళి : ఆనంద్ , విజయ్ మీరు ఇద్దరు వెళ్లి ముఖేష్ ఇంట్లో , ఆఫీస్ లో వెతకండి , ఇంకా సూర్య భూషణ్ ఫాంహౌస్ కి వెళతాడు , నేను అలాగే రంజిత్ ముఖేష్ నీ కలుస్తాం 

రంజిత్ : 📞 ఒక్క నిమిషం ,,,,,,, భూషణ్ హత్య జరిగిన సమయం లో సురేంద్ర కూడా భూషణ్ ఫాంహౌస్ లో ఉన్నాడు 

మురళి : ఇప్పుడు కేస్ కొలిక్కి వస్తుంది , పదా ముఖేష్ గారినీ కలుద్దాం 



Rate this content
Log in

Similar telugu story from Drama