Naveen Surya

Abstract Tragedy Inspirational

3.5  

Naveen Surya

Abstract Tragedy Inspirational

ఏజెంట్ వినోద్

ఏజెంట్ వినోద్

3 mins
275


సార్ , 2 నిమిషాలు పక్కనే ఉన్నాను , మీరు అక్కడే వెయిట్ చేయండి అని కస్టమర్ కి సమాచారం అందించాడు వినోద్ , వినోద్ కి వృత్తి రీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారం లో ఉన్నారు , చేయడం అయితే చేస్తున్నాడు కానీ ఆదాయం లేదు , ఆశ అంత కన్నా లేదు , మానవ ప్రయత్నం గా చేస్తున్నారు , నిజానికి వినోద్ కీ ఇందులో పెద్ద అసక్తి లేదు కానీ కాస్తో కూస్తో సంపాదిస్తే చౌరస్తా లో ఒక సూపర్ మార్కెట్ స్టోర్ ఓపెన్ చేయాలనే లక్ష్యం తో ఉన్నాడు 


సార్ , ఇదే సార్ ఇల్లు 1500 చదరపు గజాలు , 2BHK , అన్ని సౌకర్యాలు ఉన్నాయి , మీకు రోడ్ కి దగ్గర , స్కూల్ , సూపర్ మార్కెట్ , మెడికల్ షాప్ అన్ని పక్కనే ఉన్నాయి రెట్ కోటి రూపాయలు చెప్తున్నారు , మంచి డిమాండ్ ఉంది సార్ దీనికి , అన్ని అమ్ముడు పోగా ఇది ఒక్కటే మిగిలింది , నా తరపున నే ఇంకా ఇద్దరు ఉన్నారు , మీరు ఏదో ఒకటి చెప్తే నేను ఓనర్ తో మాట్లాడతా 


సరే ఆలోచించుకుని , మా వాళ్ళతో మాట్లాడి చెప్తాను అని చెప్పి ఫోన్ లో కార్ స్టార్ట్ చేయబోయాడు 


సార్ మేము ఎక్కడో ఉంటాము , మా లాంటి వాళ్లు వ్యాపారం పెట్టాలనే ఉద్దేశం తో , జాబ్ లో సాలరీ సరిపోదు అనీ , ఇంకా ఇలా చాలా కారణాలతో ఈ పని చేస్తాం , తర్వాత చెప్తాం అని మీరు చెప్పే ఒక్క చిన్న మాట మమ్మలని ఎంత బాధ పెడుతుంది అన్నది మీకు తెలియదు సార్ 


అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అయ్యా , డబ్బులతో వ్యవహారం జాగ్రత్త గా ఉండాలి కదా మరి


సార్ ! మీరు నిజంగానే తీసుకునే ఉద్దేశం ఉండి, మంచి ఇల్లు కొనాలి అనుకుంటే మీ రిక్వైర్మెంట్స్ మరియు మీ బడ్జెట్ కి ఏమి తీసిపోదు సార్ ఈ ఇల్లు అయినా ఎందుకు ఆలోచిస్తున్నాను 


చాలా ఉంటాయి కదా బాబు , డబ్బులు సర్దుబాటు చేసుకోవాలి , కుటుంబం తో నిర్ణయాలు తీసుకోవాలి 

నా రిక్వైర్మెంట్స్ ప్రకారం అయితే ఉంది , ఇంటీరియర్ మిగతా విషయాలు ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చాలి కదా ! వాస్తు విషయాలు కూడా చూసుకోవాలి


సమయం చూసుకునే చెప్పండి సార్ ! ఏమి అనుకోక పోతే ఒక చిన్న మాట ! నా కమిషన్ లో తేడా రాదు కదా


ఎలా కనిపిస్తున్నాను అయ్యా ! నీ ఉద్దేశం ఎంటి నేను డబ్బు ఎగ్గొడతాను అనా !! 


ఉద్దేశాలు దాకా ఎందుకు సార్ ! చాలా మంది ఇలాగే చెప్పారు ! నా మాట నేను చెప్పాలి కదా


భలే వాడివి దొరికావ్ అయ్యా అంటూ వెళతాడు


----------------------------------

హ ! వినోద్ అన్ని బాగున్నాయి కానీ , ఇప్పట్లో ఫ్లాట్ వద్దు అనుకుంటున్నాం బాబు 


నాకు తెలుసు సార్ కచ్చితంగా ఇలాంటి సమాధానం వస్తుంది అని 


అంటే ఏమంటావ్ నేను నా నిర్ణయం మార్చుకునే అధికారం కూడా లేదా ! చూపించడం నీ బాధ్యత 

తీసుకోవాలో , లేదో మాదే తుది నిర్ణయం 


సార్ ! మరోలా అనుకోక పోతే చిన్న మాట , ఇల్లు అంటే నాలుగు రూములు కాదు సార్ , నలభై ఏళ్ళ భవిష్యత్తు , మీ కంటే ఎక్కువ ఆసక్తి , ఆందోళన మాకే ఉంటాయి సార్ , మీరు చెప్పిన దానికంటే రెండింతలు కష్టపడతాం , పదింతలు ఆలోచిస్తాం మా కమిషన్ కంటే మీ Satisfaction ఎక్కువ అని అనుకుని పని చేస్తాం 


మీరు చెప్పిన రిక్వైర్మెంట్ 100% పూర్తి చేసేలా ప్రయత్నిస్తాం , సొంత డబ్బులతో తిరిగి మంచి ప్రొడక్ట్ నీ మీ ముందు పెడతాం , అయినా మీరు ఒక్కమాటలో సారీ చెప్పేస్తారు 



ఆశ కి అవసరానికి ఊగిసలాడే బతుకులు సార్ మావి , తేలిగ్గా చెప్పేస్తున్నారు



పో పోవయ్య చాలా మందిని చూసాను , కబ్జా చేసిన చెరువు కావొచ్చు , డిస్ప్యూట్ లాండ్ లోనే కట్టవచ్చు

చాలా చూశాం , ఎవరికీ చెప్తున్నారు , డబ్బుల కోసం ఎన్నైనా చెప్తారు 


నిజమే సార్ , మా మార్కెటింగ్ వ్యూహంతో కస్టమర్ కి ప్రొడక్ట్ ఇస్తాము , కానీ మా ప్రొడక్ట్ లో తప్పులు ఉండవ్ సార్ , ప్రతి Sector lo ఉన్నట్లు ఈ సెక్టార్ లో కూడా సమస్యలు ఉంటాయి తప్పులు జరుగుతాయి 

కానీ కస్టమర్ నష్టపోవాలి అని ఏ ఏజెంట్ అనుకోరు 


మంచిది , ఇంకోసారి ఈ ఫ్లాట్ , ఆ ఫ్లాట్ అంటూ ఫోన్స్ చేయకు 


మా సమయం విలువ , కష్టం విలువ తెలియని మీ లాంటి వాళ్ళకి అయితే అస్సలు చేయను సార్ 






Rate this content
Log in

Similar telugu story from Abstract