హోమ్ లోను
హోమ్ లోను


నీరజా! బ్యాంకు వాళ్ళతో ఆర్గ్యూ చేయడం వల్ల మీరు లాభపడేది ఏమీ ఉండదు.
బ్యాంకు మేనేజర్ తాపీగా టీ తాగుతూ అన్నాడు.
నీరజ ప్రక్కనే కూర్చున్న తన తండ్రి చేయి మీద చేయి పెట్టి మేనేజర్ వైపు చూసింది.
హోమ్ లోన్ తీసుకునేటప్పుడు టర్మ్ మొత్తానికి ఒకే వడ్డీ రేటు కట్టే అవసరం లేదనీ వడ్డీ రేట్లు మార్చుకునే అవకాశం ఉందని మీరు ఎందుకు చెప్పలేదు సర్! అని నీరజ ప్రశ్నించింది.
నేనే కాదు నూటికి నూరు పాళ్ళు ఏ బ్యాంకు వాళ్ళూ మీకు ప్రతీదీ విడమర్చి చెప్పరు. మీకు కావల్సింది లోను. అది మేము ఇస్తున్నాం కదా. అని బ్యాంకు మేనేజర్ బెల్ కొట్టాడు.
మార్కెట్ రేటు కంటే ఎక్కువ వడ్డీ చెల్లిస్తూ అలసిపోయిన తండ్రి వైపు చూసింది నీరజ.
తండ్రీ కూతుళ్లు ఇద్దరూ నిశ్శబ్దంగా బయటికి నడిచారు.