దీపావళి టపాసులు
దీపావళి టపాసులు


మేడమ్! దీపావళి రోజున టపాసులు కాల్చకూడదని కొంత మంది ప్రభుత్వానికి నివేదిక అందజేసారు. దీనిపై ఒక సామాన్య వ్యక్తిగా మీ అభిప్రాయం ఏమిటి అని ఒక టీవీ జర్నలిస్టు అడిగాడు.
అప్పుడే ఆఫీసులో అనుమతి తీసుకుని పండక్కి కావాల్సిన వస్తువులు కొందామని బయటికి వచ్చిన సునీత సమాధానం కోసం ఆ టీవీ జర్నలిస్ట్ ఎదురు చూస్తున్నాడు.
కాల్చకూడదనే నియమం పెట్టే కన్నా, కాలుష్యాన్ని కలిగించని పదార్థాలు ఎక్కువ ఉండేలా టపాసు ఉత్పత్తిదారులు చూసుకునేలా చేయాలి అందామె.
అంటే ఇప్పుడు ప్రభుత్వం వారికి కావాల్సిన మార్గదర్శకాలు జారీ చేసి వారిని ఆదుకోవాలి అంటారా అన్నాడు ఆ జర్నలిస్ట్.
>
ఆదుకోవడం కాదండీ. అది ప్రభుత్వ బాధ్యత. ఎన్నో సంవత్సరాల నుండీ ఆ టపాసుల వృత్తిని నమ్ముకుని ఉన్న వారికి ఒక ప్రోత్సాహం ఉండాలి కదా. మన ఇష్టం వచ్చినప్పుడు కాల్చమని, తరువాత వద్దని ఇలా చేస్తుంటే దాన్నే నమ్ముకున్న వారి జీవితాలు ఏం కావాలి?
అలాగని ప్రకృతి కాలుష్యం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం కూడా సరి కాదు.
రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి అందామె.
ఇంత బాగా మాట్లాడుతున్నారు మీరెవరో తెలుసుకోవచ్చా అని అడిగాడు ఆ జర్నలిస్టు.
ఇంతకు ముందు మీరు పరిచయం చేసినట్లే ఒక సామాన్య వ్యక్తిని అందామె.