చిన్ననాటి కలలు
చిన్ననాటి కలలు
చిన్నప్పుడు వచ్చిన కలలు అసలు గుర్తు లేవే. అప్పుడన్నీ బయటకు చెప్పే విషయాలే. డాక్టర్ పొందే గౌరవం, ఆ వృత్తికి మిగతా వాళ్ళు ఇచ్చే విలువ ఇలాంటి విషయాలు చూసి డాక్టర్ అవుదాం అనుకుంటాము.
పోలీసు దొంగలను పట్టేసుకుంటాడు, అందరూ చప్పట్లు కొడతారు.
కాబట్టి పోలీసు కావాలి అనుకుంటాము.
విమానం చూసినప్పుడు అందులో తిరగాలని, రైలు చూస్తే దాన్ని నడిపెయ్యాలని బయటికే అంటుంటాం. ఆటల్లో కూడా వాటిని భాగం చేసేస్తాం.
పెద్దయ్యాక ఎలాగోలా డబ్బులు సంపాదిస్తే చాలు అనే వాళ్ళలో ఒకరుగా మారిపోతాం. మారిపోవాలేమో..