శీతాకాలంలో
శీతాకాలంలో
ఎండల్లో బాగా గుర్తొచ్చావు నువ్వు. ఇద్దరం కలిసి మిద్దె మీద మంచాలు వేసుకుని, దోమ తెర కట్టుకునే వాళ్ళం కదా అందామె.
శీతాకాలంలో గుర్తు రాలేదా అన్నాడతను ఆమె భుజాన తల వాల్చి.
ఎందుకు గుర్తు రాలేదూ? అప్పుడు నువ్వే నా దుప్పటి, దిండు అన్నీ.. టేడ్డి బీర్ నువ్వే కదా అని అతని వైపు చూసిందామె.
ఇంకా ఎన్నాళ్ళు ఇలా అన్నాడతను..ఈ ప్రకృతి ఉన్నంత వరకూ ఇలానే ఉంటే బాగుంటుంది కదా అందామె.
ప్రేమ వికృతంగా మారకుండా ఉండదు కదా. మనకు హద్దులు ఉండాలి అన్నాడతను..ఆమె వర్షాకాలపు ఉరుములా చూసింది. అతని కరుగుతాడో, లేక కరిగి ఆవిరవుతాడో..