SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"క్రికెటర్ - 2"

"క్రికెటర్ - 2"

5 mins
413


"ది క్రికెటర్ - 1" (- a story of dream sacrifier) కి

కొనసాగింపు...

"ది క్రికెటర్ - 2" (- a story of dream sacrifier)

ఆ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు...,

క్రికెటర్ అవ్వాలన్న తన డ్రీమ్ కి తొలిమెట్టైన ఆ అండర్ 17 క్రికెట్ టోర్నమెంట్...

ఒకేసారి రావడంలో సందిగ్ధంలో పడ్డ పవన్ కి, ఆ డ్రిల్ మాస్టారు అదే ఆయన కోచ్ అండగా నిలబడి ఏకంగా పవన్ కోసం ఆ క్రికెట్ టోర్నమెంట్ మార్చే పనిలో పడ్డాడు. తనకు తెలిసిన వాళ్ళని, అంతంతగా పరిచయం ఉన్న వాళ్ళను పట్టుకుని, తనకున్న పలుకుబడంతా ఉపయోగించి ఆ టోర్నమెంట్ ఎలాగైన కేన్సిల్ చేయించాలనే పట్టుదలతో కృషి చేస్తున్నాడు.

"కానీ, ఒక్కడి కోసం ఈ టోర్నీ ఆపవడం సమాజం కాదు." అంటూ వాళ్ళందరూ ఆయనకి తెగేసి చెప్పారు.

"పైగా పదవ తరగతి పరీక్షలు అంటున్నారు, ఈ క్రికెట్ పేరుతో అతని చదువును నాశనం చేయడం దేనికి? ఈ టోర్నీ కాకపోతే, మళ్ళీ వచ్చే సంవత్సరం టోర్నీ లో ఆడతాడు. ఇంత దానికి ఈ టోర్నమెంట్ ఆపడం ఎందుకు?" అంటూ ఆ డ్రిల్ మాస్టారుకి సలహా ఇస్తూ మందలించారు.

తను ఎంత బతిమాలినా వాళ్ళు ససేమెరా అనడంతో...

ఇక చేసేది ఏం లేక, అక్కడి నుండి వచ్చేసిన ఆ డ్రిల్ మాస్టారికి పవన్ కి ఎలా సర్ది చెప్పాలో? తన మొహం ఎలా చూపించాలో? అర్ధం కావడం లేదు.

ఇంతలో తన దగ్గరకి వచ్చిన పవన్, విషయం ఏమైందని ఆతృతగా అడగగా తనకి జరిగిన సంగతి చెప్పక తప్పలేదు. దాంతో పవన్ బాగా నిరాశలోకి జారుకున్నాడు. అది గమనించిన ఆ కోచ్ 

"పద ఒకసారి మీ ఇంట్లో ఈ విషయం గురించి చెప్పి, కనీసం వాల్లనైనా ఒప్పిద్ధాం" అంటూ తనకి దైర్యం చెప్పే ప్రయత్నం చేసాడు.

అసలే ఇంట్లో పరిస్థితులకి బాగా అలవాటు పడిన పవన్, దానికి భయపడ్డాడు. తన కోచ్ చెప్పిన దానికి నిరాకరించాడు. "అసలే వాళ్ల నాన్న గారు ఆటలు పాటలు అంటే కాళ్ళు విరగగొడతారని, ఎప్పుడూ చదువు పైనే ఫోకస్ పెట్టాలని తనకి సూచిస్తారనీ, కాసేపు స్నేహితులతో సరదాగా బయట తిరిగిన ఆయనికి ఇష్టం ఉండదని, ఆయని నచ్చని పని తను చేయనని...

క్రికెట్ మీద ఇష్టంతో ఆయనికి తెలియకుండానే, మీ ప్రోత్సాహంతో ఇక్కడవరకూ నెట్టుకురాగాలిగాను తప్ప ఇక ఇప్పుడు ఇంకా దీన్నే కొనసాగించడం ఇష్టం లేదు" అంటూ అయిష్టంతోనే అక్కడి నుండి వెను దిరిగి వెళ్ళిపోయాడు పవన్...

ఒక పక్క ఆ కోచ్ తనని ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా...

పవన్ లోలోపల పడుతున్న బాధను అర్థం చేసుకున్న ఆ కోచ్.. ఇక లాభం లేదనుకుని, పవన్ వాళ్ల అమ్మా నాన్నలతో మాట్లాడడానికి సిద్ధ పడ్డాడు. అనుకున్నదే తడవుగా పవన్ వాళ్లంటికి పయనమయ్యాడు.

అలా పవన్ వాళ్లింటికి వెళ్ళిన ఆయనను, పవన్ వాళ్ళమ్మ నాన్న గార్లు చూడగానే గుర్తుపట్టారు. ఎంతైనా వాళ్ళకి తానొక పరిచయం అవసరం లేని వ్యక్తి కదా..!

వాళ్లింట్లో వాళ్ల తల్లిదండ్రుల ముందు సడెన్ గా దర్శనమిచ్చిన ఆ కోచ్ నీ చూసి పవన్ షాక్ అయ్యాడు.

అంతలోనే ఆ కోచ్ నేరుగా విషయం చెప్పదలచి, వాళ్ల ముందు పవన్ కి ఆటపైనున్న మక్కువను ప్రస్తావనకు తీసుకువచ్చాడు.

ఒకపక్క వెనుక నుండి పవన్...

"వద్దు.. వద్దు..!" అని ఎంత వారిస్తున్నా వినకుండా..

దానికి పవన్ నాన్న గారు కూడా సూటిగానే బదులిచ్చారు.

"నా కొడుకుని ఒక ప్రయోజకుడిని చేయాలనుకుంటున్నాను తప్ప! అప్రయోజకుడిని కాదని తెగేసి చెప్పారు.

పవన్ ని ఒక ఇంజినీర్ గా చెయ్యాలని నా ఆశ...

ఒక్క నేననే కాదు.. ప్రతీ కన్న తండ్రి తన కొడుకుని ఒక ఇంజినీరో.., డాక్టరో...లాయారో చేయాలనుకుంటాడు తప్ప,

ఇలా పనికిమాలిన ఆటలనే ఉచ్చులోకి తోసి ఏ తండ్రి తన బిడ్డ భవిష్యత్తును నాశనం చేయాలనుకుంటాడు.

ఆయన మాటలకు కొంచెం అసహనం వ్యక్తం చేసిన ఆ కోచ్,

"మీరన్న ఆ అటకలతోనే దేశం తరుపున ప్రాతినిధ్యం వహిస్తూ అదే ఆటలలో గొప్ప కీర్తి సంపాదించిన వాళ్ళందరి తల్లిదండ్రులు మీలాగే ఆలోచించి ఉంటే, ఈ రోజు వాళ్ళకి దేశం తరుపున గౌరవం దక్కేదా...?

అంతెందుకు ఈ మధ్యే ఈ క్రికెట్ ఆటలో అతి చిన్న వయసులోనే అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ అనే ఒక టీనేజ్ కుర్రాడు పాకిస్తాన్ మీద చిచ్చర పిడుగుల రెచ్చిపోయాడు.

ఒక్కసారిగా... ఆ కుర్రాడికి దేశం అంతా ఫ్యాన్స్ అయిపోయారు. ఆ కుర్రాడు ఇంకా 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు అంట.

అలాగే 7 ఏళ్ల క్రితం మన దేశానికి ప్రపంచ కప్ సాధించిన ఒక కపిల్ దేవ్, ఆయన టీమ్ లో భాగస్వాములైన సునీల్ గవాస్కర్, వెంగాసర్కర్, శ్రీకాంత్, అమర్నాథ్ వంటి వాళ్ళను ఇంటి దగ్గరే ఆపి ఉంటే ఈ రోజు మన దేశ నైపుణ్యం ప్రపంచానికి తెలిసేదా?

ఒక్క క్రికెట్ అనే కాదు,

హాకీలో ధ్యాన్ చంద్, రన్నింగ్ లో పీ టీ ఉష..

వీళ్ళే కాదు... ఎందరెందరో క్రీడను ఒక వ్యాయంలా కాకుండా తమ కెరీర్ కు గోల్ గా మలుచుకున్న వారే.

ఒక్క వారి కష్టంతోనే కాదు, వారి తల్లిదండ్రుల మద్దతు కూడా వారికి అండగా ఉంటూ... వారిని, వారి భవిష్యత్తును ఆ స్థాయిలో... తారా స్థాయిలో నిలిపింది మీరనే ఈ పనికిమాలిన ఆట.

ఒకవేళ వాళ్ల అమ్మానాన్నలు కూడా వాళ్ళని ఏ డాక్టర్ , ఏ ఇంజినీరో చేస్తే వాళ్ళు ఈ ప్రపంచానికి తెలిసేవాల్లా... వాళ్ళు అలా ఆటలు ఆడడం వల్ల, వాళ్ల భవిష్యత్తు నాశనమయ్యిందని అంటారా?

చుట్టూ ఇంత జరుగుతున్నా కూడా...

మన ధోరణి మాత్రం నూతిలో కప్పల్లా ఉంటూ....

మనం ఏర్పరచుకుని అందుకోలేకపోయిన ఆ కలలను మన పిల్లలపై బలవంతంగా రుద్దుతున్నాము. అసలు అది వాళ్ళకి ఇష్టమో కాదో కూడా మనం పట్టించుకోకుండా, మరి వాళ్ళు స్వతహాగా కన్న కలలను నెరవేర్చే బాధ్యత ఎవరిది?"

అంటూ ఆ కోచ్ పవన్ తండ్రి మాటలకు అడ్డుపడి, ఆయనని కన్విన్స్ చేయబోతుంటే,

అందుకు పవన్ తండ్రి ఏ మాత్రం తగ్గకుండా...

ఆ కోచ్ మాటలను తిప్పికొడుతూ...

"ఎదిగిన ఆ నాలుగైదు పేర్లు కాదు,

ప్రయత్నించి ఓడిపోయిన వాల్లెందరూ..?

వాళ్ళందరూ చివరకి ఏమైపోయారు...?

కష్టానికి తగ్గ నైపుణ్యం ఉన్నా...,

రాజకీయ పలుకబడి లేకో, డబ్బు, ఆస్తి లేకో ఆగిపోయిన వాల్లెందరూ... వాళ్లందరిలో రోడ్డున పడ్డ వాల్లేందరూ..?

అవి కూడా చెప్పండి.!

మీరేవో స్థిరపడిన నలుగురైదుగురు పేర్లు చెప్పినంత మాత్రాన, వాళ్ళతోనే నా బిడ్డను పోల్చుకుని ఇలాంటి ఓ అవివేకపు నిర్ణయం తీసుకుని ఇప్పుడు వాడి కెరీర్ నీ పణంగా పెట్టలేను.

అయినా ఆ ఆర్గనైజేషన్ వాళ్లు అన్నట్టు...

క్రికెట్ ఈ సంవత్సరం కాకపోతే, వచ్చే సంవత్సరం ఆడతాడు. అందులో ఏముంది!

దానికి బంగారం లాంటి చదువు నాశనం చేసుకోవడం ఎందుకు?

మీరన్న సచిన్ కి కష్టం తో పాటు, అదృష్టం కూడా తోడుగా ఉండి ఉంటుంది. రేపు వీడు ఎంత కష్టపడినా ఆ అదృష్టం కూడా ఉండాలిగా ...

అది కానీ అటు ఇటు అయితే ...

రేపు నా కొడుకు భవిష్యత్ కి ఎవరు సమాధానం చెప్తారు..?" అంటూ పవన్ తండ్రి ఆయన్ని ప్రశ్నిస్తాడు.

"అది కాదు...

ఒకసారి నేను చెప్పేది వినండి!" అని ఆ కోచ్ అనబోతుంటే,

"ఇప్పటివరకు మీరు చెప్పింది చాలు...

నా నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.

ఇంతకాలం వాడు...

వాడి చదువు కి ఆటంకం కలగకుండా ఆటను, చదువును బ్యాలన్స్ చేస్తూ వచ్చాడు కాబట్టి మేము వీటికి ఒప్పుకున్నాం. కానీ, ఇప్పుడు చదువు పక్కన పెడతాను అంటే దానికి నేను ఒప్పుకోలేను.

దయచేసి ఒక డ్రిల్ మాస్టారు గా కాకుండా ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచించండి!

మీరు వచ్చిన పని అయిందనుకుంటా...

ఇక మీరు వెళ్ళొచ్చు.!

పవన్ మార్గాన్ని మార్చే ఇలాంటి ఆలోచనలతో మళ్ళీ మీరు ఇక్కడికి రావొద్దు." అంటూ కరాఖండిగా చెప్తాడు పవన్ వాళ్ల నాన్నగారు ఆ డ్రిల్ మాష్టర్కి.

ఇక చేసేదేం లేక అక్కడినుండి నిరాశగా వెనుదిరుగుతాడు ఆయన.

ఇక ఒకపక్క పవన్ 10th క్లాస్ ఎగ్జామ్స్ , మరొకపక్క ఆ క్రికెట్ టోర్నీ రెండూ ఒకేసారి జరిగాయి. పవన్ మాత్రం ఆ ఎగ్జామ్స్ వల్ల టోర్నీ లో పాల్గొనలేక పోయాడు.

ఇక కొన్ని రోజులకు ఆ 10th క్లాస్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. పవన్ స్కూల్ టాపర్ అయ్యాడు. ఆ వూరికి మంచి పేరు తెచ్చాడు. కానీ, పవన్ లో మాత్రం ఆనందం లేదు.

ఎందుకంటే, ఆ క్రికెట్ టోర్నీ లో జిల్లా తరుపున పాల్గొన్న ప్రతి ఆటగాడు ఆ జిల్లాకు మంచి పేరు తెచ్చారు. మంచి మంచి రివార్డులు పొందారు. కొంతమంది వారి ప్రదర్శనతో స్టేట్ టీంలో ప్లేస్ సంపాదించారు. వాళ్ళందరూ పవన్ కన్నా కొంచెం తక్కువ నైపుణ్యం కలిగిన వాళ్ళే!

పవన్ కూడా ప్రాతినిధ్యం వహించే ఉంటే, ఖచ్చితంగా తను కూడా ఆ స్టేట్ టీమ్ కి సెలెక్టయ్యి వుండేవాడు.

చదువుతో తన నైపుణ్యం ఊరికి మాత్రమే తెలిసింది. అదే ఆటతో అయితే రాష్టానికి కూడా తెలిసేది.

ఇక ఆ కోచ్

"ఏం పర్లేదు..!

నీకింకా చాలా భవిష్యత్ ఉంది. నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం...

ఎవరో ఏదో చెప్పారని, నీ టాలెంట్ నీ మాత్రం తాకట్టు పెట్టకు" అంటూ తనకి అండగా నిలిచాడు.

"వచ్చే సంవత్సరం అయినా పవన్ స్టేట్ టీమ్ లో ప్లేస్ సాధిస్తాడా..?

లేక తండ్రి మాటలతో చదువు మీద ఫోకస్ పెట్టీ తన లక్ష్యానికి చేరుకోలేక చతికిల పడతాడా?

పవన్ గమ్యం ఎటువైపు..

తండ్రి చెప్పినట్టు ఇంజనీరింగ్ వైపా?

కోచ్ మద్దతుతో క్రికెట్ వైపా?"

తర్వాతి భాగం

"క్రికెటర్"

- The story of a dream sacrifier

Part - 3

లో తెలుసుకుందాం ఏం జరగబోతుందో..

అప్పటివరకూ....

మీ విలువైన అభిప్రాయాలను సమీక్షల రూపంలో తెలుపగలరు. అవి నా ఈ కథకు దోహదపడుతూ నన్ను మరింత ప్రోత్సహిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు.

రచన: "సత్య పవన్ (అఆ- అక్షర ఆయుధం)"



Rate this content
Log in

Similar telugu story from Abstract