డబ్బు - కష్టము
డబ్బు - కష్టము


అయినా డబ్బులున్న వాళ్ళ కష్టాలు నీకు తెలీదులేరా అన్నాడు శీను. అదేంట్రా అలా అంటావ్, నీలాగా నా దగ్గర డబ్బులుంటే అసలు కాలేజీకి వచ్చే వాడినే కాదు అన్నాడు రాజు.
అక్కడే నువ్వు ఉప్పు వేసిన పప్పులో కాలు వేసావు. ఇలా డబ్బుంటే చదవకుండా, కష్టపడకుండా ఉండొచ్చు అని నువ్వనుకుంటావు..మా ఇంట్లో ఏమంటారో తెలుసా. కష్టపడి చదువుకోవాలి. బయట పనులు చేసి అనుభవం సంపాదించాలి. అప్పుడే నీకు డబ్బును సరిగ్గా ఉపయోగించే బుద్ధి ఉంటుంది అంటారు.
కాబట్టి డబ్బున్నా,లేకున్నా కష్టం విలువ అనేది మనిద్దరికీ ఒకటే. కానీ డబ్బులున్నాయనే ధైర్యం కొందరినీ, సంకల్ప శక్తి కొందరినీ కష్టాల్ని దాటేలా చేస్తుంది అన్నాడు శీను.
రాజు ఏమీ అర్థం కాలేదన్నట్లు ముఖం పెట్టాడు.