మాయలు - మంత్రాలు
మాయలు - మంత్రాలు


రవీ! మొన్న సినిమా చూసాను. అందులో ఎన్ని పురుగులు ఇసుకలోంచి బయటికి వస్తాయో తెలుసా అని సినిమా స్టోరీ చెబుతూ ఉన్నాడు. అంటే అవన్నీ మంత్రాల పురుగులా అని అడిగాడు రాజు.
అంతలో మాష్టారు పాఠం చెప్పేందుకు రావడంతో ఇద్దరూ మాట్లాడ్డం ఆపి పాఠం విన్నారు. స్కూలు అయిపోయాక, రాజు ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉన్నాడు.
మిగతా సినిమా స్టోరీ చెప్పు అన్నాడు రాజు. మొత్తం సినిమా స్టోరీ చెప్పాక రవి ఒక ప్రశ్న వేసాడు.
మొత్తానికి నీకు ఏమర్థమయ్యింది? అని అడిగాడు.
మాయలు, మంత్రాలు ఉన్న సినిమా స్టోరీ చూస్తేనే బాగుంటుంది. వేరే వాళ్ళు చెప్పినా మనకు పూర్తిగా అర్థం కాదు అన్నాడు రాజు.
రవి నోరెళ్ళబెట్టాడు.