STORYMIRROR

Naveen Surya

Drama Crime Thriller

4  

Naveen Surya

Drama Crime Thriller

ఎవరు - 4

ఎవరు - 4

4 mins
280

🚗🚗🚗🚗( సురేంద్ర ఇంటికి వెళ్తూ )


మురళి : రంజిత్ సార్ , ఒక్కసారి సురేంద్ర డెత్ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి కనుక్కోండి 

రంజిత్ : హా రాజేష్. , కొంచెం సురేంద్ర గారి డెత్ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయో కాస్త చెప్పగలరా !!! 

రాజేష్ : రంజిత్ సార్ , ఇవ్వాళ సాయంత్రం లేదా రేపు ఉదయం వస్తాయి , మనకి సాలిడ్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది 

రంజిత్ : ఓహ్ అలాగా !!! సరే నేను మళ్ళీ చేస్తాను 

రంజిత్ : హా ! చెప్పండి విశ్వనాధం గారు , 

విశ్వనాధం : సార్ ! ఎక్కడ ఉన్నారు ??

రంజిత్ : నేను సురేంద్ర ఇంటికి వెళ్తున్నాను 

విశ్వనాథం : సార్ ! మీరు నేను పంపిన లొకేషన్ కి రండి సార్ 

రంజిత్ : ఏమైంది సార్ !!! 

విశ్వనాధం : సార్ !! భూషణ్ గారి డ్రైవర్ చనిపోయారు

రంజిత్ : ఎప్పుడు !!! ఎలా !!! 

విశ్వనాధం : ఆత్మ హత్య సార్ 

రంజిత్ : సరే నేను 1 గంటలో అక్కడ ఉంటాను , మురళి సార్ భూషణ్ గారి డ్రైవర్ చనిపోయారు , సూసైడ్ 

మురళి : అయితే కచ్చితంగా భూషణ్ హత్య కి సంబందించిన ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి లేదంటే భూషణ్ హత్య తో అయినా సంబంధం ఉంది 

రంజిత్ : సార్ సురేంద్ర డెత్ రిపోర్ట్స్ రేపు ఉదయం రావొచ్చు అంటున్నాడు రాజేష్ , మనం సురేంద్ర గారి ఇంటికి వెళ్ళి

అక్కడ నుండి డ్రైవర్ రాజు ఇంటికి వెళ్ళాలి 

మురళి : సరే పదా !!! 

------------------------------------------------------

రంజిత్ : హలో పద్మజ గారు !!!! నా పేరు రంజిత్ , సార్ మా సీనియర్ మురళి గారు !!! 

పద్మజ : చెప్పండి సార్ 

మురళి : మీ ఆయన ఎలా ఉన్నారు చనిపోవడానికి ముందు !!??? 

పద్మజ : రాత్రి ఫోన్ వస్తె బయటకు వెళ్ళారు ! చిన్న పని ఉంది 1 గంటలో చుస్కుని వస్తాను !! నువ్వెళ్లి పడుకో అని చెప్పాడు 

రంజిత్ : మరీ ఎంత సేపట్లో వచ్చాడు !!?? ఎక్కడకి వెళ్ళాడో కనుక్కున్నారా !!!! 

పద్మజ : పది నిమిషాలు ఆలస్యంగా వచ్చారు , పాత స్నేహితుడు కలిశాడు అని చెప్పారు 

రంజిత్ : మీ ఆయన ఫోన్ ఇస్తారా !!! 

పద్మజ : ఆయన ఫోన్ పాడైపోయింది సార్ 

రంజిత్ : ఒక్కసారి ఆయన రూం చుడొచ్చా. ?? 

పద్మజ : చూడండి సార్ , 

------------------------------------------------------

మురళి : రంజిత్ , సురేంద్ర ఫోన్ పాడైపోవడం వెనుక ఎవరి హస్తం ఉండొచ్చు 

రంజిత్ : ఎంటి సార్ ఆ అనుమానం మీకు కూడా వచ్చిందా !!! 

మురళి : కానీ ఈ వ్యాపార వ్యక్తిగత రహస్యాలు అనేవి పనివాళ్ళు అలాగే డ్రైవర్స్ కే కదా ఎక్కువగా తెలిసేది !!! ఎక్కడకి వెళ్తున్నాడు

, ఎందుకు వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తాడు అనే విషయాల గురించి ఎక్కువ స్పష్టత విల్లకే ఉంటుంది , అది డ్రైవర్ రాజు ఆత్మహత్య తో

బయటపడింది 

రంజిత్ : రాజు ది ఆత్మహత్య లేదంటే హత్య అన్నది ఇప్పుడే నిర్ణయించలేము  

రంజిత్ : అయితే మన అనుమానం కూడా అక్కడ నుండి మొదలవ్వాలి , ఒక్కసారి రాజు మరణం అలాగే , సురేంద్ర డెత్ మిస్టరీ వీడితే చాలా విషయాలు స్పష్టత వస్తాయి 

మురళి : పని వాళ్ళలో కానీ , డ్రైవర్ లలో కానీ ఎవరో ఒకరికి ఏదో ఒక విధంగా సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది 

రంజిత్ : అయితే మనం రంగయ్య ఇతర వ్యక్తుల బ్యాంక్ డీటైల్స్ అలాగే కాల్స్ డేటా చెక్ చేయాలి 

మురళి : హలో సార్ చెప్పండి 

అరుణ్ ప్రసాద్ : మురళి ఎక్కడ ఉన్నారు 

మురళి : సురేంద్ర వాళ్ళ ఇంట్లో వెరిఫికేషన్ కి వచ్చాము సార్ 

అరుణ్ ప్రసాద్ : DSP రవీందర్ గారు ఉదయం నుండి కనపడటం లేదు , ఇందులో మన టీమ్ హస్తం ఉందని నా అనుమానం 

మురళి : అలాంటిది ఏమి లేదు సార్ ! నేను మాట్లాడతాను , ఇప్పుడే మీకు తెలియజేస్తాను 

రంజిత్ : ఏమైంది సార్ 

మురళి : DSP రవీందర్ కనపడటం లేదు అంట , ఇంకా ఇందులో మా టీమ్ ఉందని అరుణ్ ప్రసాద్ గారు అంటున్నారు 

రంజిత్ : ఎలా సాధ్యం అవుతుంది సార్ ,ఎక్కడో ఏదో తప్పు జరిగింది 

మురళి : నాకు అదే అనిపిస్తుంది , 

రంజిత్ : సార్ మీరు వెళ్ళండి , నేను ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని డ్రైవర్ రాజు ఇంటికి వెళతాను 

మురళి : నేను వెళ్తాను , నువ్వు జాగ్రత్త !!! 

రంజిత్ : ( ఒక్క నిమిషం సార్ ) నాకు ఇదంతా ఎందుకో ట్రాప్ లాగా అనిపిస్తుంది ,

మురళి : ఏమంటున్నావ్ రంజిత్ 

రంజిత్ : అవును సార్ , కేసు నీ తప్పు దోవ పట్టిస్తున్నారు , ఒకటి ఫాంహౌస్ కి అలాగే భూషణ్ ఇల్లు , ఆఫీస్ లలో మన టీమ్ కి ఏదైనా క్లూ దొరికి ఉండాలి , మన ప్లాన్ మనకి అరుణ్ కి తప్ప ఎవరికి తెలీదు , మన వాళ్ళకి అరుణ్ ప్రసాద్ కాల్ చేసి ఉండాలి . అరుణ్ ప్రసాద్ గారే మనకి తప్పు సమాచారం అందించి ఉండాలి 

మురళి : అస్సలు అరుణ్ ప్రసాద్ గారు ఫ్రేమ్ లోకి ఎప్పుడు వచ్చారు

రంజిత్ : ముందు రవీందర్ కి కాల్ చేస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది 

మురళి : ఏదో మిస్ అవుతున్నాం రంజిత్ !!! అరుణ్ ప్రసాద్ కి కావాల్సిన క్లూ దొరికితే DSP రవీందర్ కనపడటం లేదు అని చెప్పాడు కదా , పైగా సురేంద్ర రిపోర్ట్స్ కూడా ఇంకా రాలేదు 

రంజిత్ : రిపోర్ట్స్ వచ్చేలోగా DSP నీ కనపడకుండా చేస్తే రిపోర్ట్స్ తన చేతుల్లోకి వస్తాయి అని SP మరియు మినిస్టర్ భావిస్తున్నారు కావొచ్చు 

మురళి : ఇందులో ఇద్దరి హస్తం ఉందా ఒక్కరి హస్తం ఉందా తెలియడం లేదు  

రంజిత్ : సార్ నా అంచనా కరెక్ట్ అయితే భూషణ్ నీ కలిశాక సురేంద్ర ఇంటికి వెళ్ళి ఉండాలి భూషణ్ నీ చంపేశాక సురేంద్ర నీ చంపడానికి 30 నిమిషాలు పడుతుంది , ఎందుకంటే భూషణ్ ఫాంహౌస్ నుండి సురేంద్ర ఇల్లు 10Km . భూషణ్ చనిపోయిన 30 నిమిషాలకు సురేంద్ర చనిపోతే అప్పుడు చంపింది ఒక్కరూ కాదు ఇద్దరు అని అనుకోవాల్సి వస్తోంది !!!

మురళి : ఒకవేళ ఇలా అయి ఉండొచ్చు కదా బుషణ్ కోసం వెళ్ళిన సురేంద్ర అక్కడి నుండి వచ్చాక భూషణ్ నీ చంపి హంతకుడు వెళ్ళిపోతాడు ! భూషణ్ ఇంటి నుండి 30 నిమిషాల్లో చేరుకున్న సురేంద్ర అప్పటికే సురేంద్ర కోసం ఇంకో హంతకుడు వేచి ఉంటాడు

సమయం చూసుకుని సురేంద్ర నీ చంపి ఉండాలి 

రంజిత్ : ఇక్కడ మనకి స్పష్టత రావాల్సింది ఒక్కటే , భూషణ్ చనిపోయిన 20 నిమిషాలకు మళ్ళీ చంపబడ్డాడు అంటే సురేంద్ర నీ చంపిన రెండవ హంతకుడు అప్పటికి సురేంద్ర నీ చంపలేదు అంటే అప్పటికి సురేంద్ర ఇంకా ఇంటికి చేరుకోలేదు అలాంటప్పుడు సురేంద్ర నీ చంపిన వ్యక్తి భూషణ్ నీ చంపలేదు 

మురళి : అయితే సుపారీ మినిస్టర్ అలాగే SP కలిసి ఇద్దరికీ ఇచ్చి ఉండాలి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ముఖేష్ మనీషి  భూషణ్ నీ మొదటి సారి చంపాడా రెండవ సారి చంపాడా అని !!! 

రంజిత్ : ఆల్రెడీ భూషణ్ చనిపోయి ఉన్నాడు కాబట్టి డబ్బులు కోసం ముఖేష్ దగ్గర అబద్దం అడాడు ఏమో 

మురళి : అయ్యుండొచ్చు 

రంజిత్ : అయితే ఇప్పుడు మనం నిరూపించాల్సింది ఒక్కటే మినిస్టర్ , ఎస్పీ అలాగే భూషణ్ మరియు సురేంద్ర లకి ఉన్న సంబంధం 

డ్రైవర్ మరణానికి కారణం ఎంటి , రంగయ్య ప్రమేయం , 

మురళి : అది సరే అరుణ్ ప్రసాద్ చెప్పింది నిజమా !!! కాదా అన్నది తెలుసుకోవడం ఎలా 

రంజిత్ : నాకెందుకో సురేంద్ర రిపోర్ట్స్ నీ మార్చే ప్రయత్నం జరుగుతోంది అనిపిస్తుంది 

మురళి : ఆ అవసరం కచ్చితంగా ఉంది , అది తెలుసుకోవడానికి అంటే ముందు మనం డ్రైవర్ మరణం అలాగే రంగయ్య ప్రమేయం ఎంటి అన్నది తెలుసుకోవాలి 

రంజిత్ : కెమెరాలు పని చేయకపోవడం , టెక్నీషియన్ అందుబాటు లో లేకపోవడం , నాకు తెలిసి రంగయ్య నే హంతకుడు కి సాయం చేసి ఉండాలి ...చెప్పండి సార్

వెంకటయ్య హెడ్ కానిస్టేబుల్ : సార్ రంగయ్య చనిపోయాడు 



Rate this content
Log in

Similar telugu story from Drama