Naveen Surya

Drama Crime Thriller

4.7  

Naveen Surya

Drama Crime Thriller

ఎవరు - 5

ఎవరు - 5

5 mins
356


ఒక వైపు సురేంద్ర , భూషణ్ లు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు , ఎవరు చంపారో తెలీదు డ్రైవర్ రాజు ది హత్య నా , ఆత్మహత్య నా తెలీదు , DSP రవిందర్ మిస్సింగ్ నిజమా అబద్దమా తెలీదు , రంగయ్య కి ఏమైందో తెలీదు , ఎస్పీ అలాగే మినిస్టర్ ల సంబంధం ఏంటో తెలీదు ఇంత గందరగోళంలో కేస్ లోకి కొత్త పాత్ర వచ్చింది , నిజానికి ఇది కొత్త పాత్ర కాదు , పాతదే , కానీ మనకి కొత్తగా తెలిసింది !!! ఇది ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఆ పాత్ర నే మనకి చెప్తుంది , ఇప్పటికే రంగయ్య విషయం తెలుసుకున్న రంజిత్ , మురళి కేస్ కొత్త మలుపు తిరగడం తో ఇంకా కన్ఫ్యూజన్ లో పడిపోయారు . సో , ఇంతకీ ఎవరా వ్యక్తి ఈ కేస్ లోకి ఎందుకు వచ్చాడు , ఎలా వచ్చాడు , ఎప్పుడు వచ్చాడు 

--------------------------------------------

మురళి : రంజిత్ ఇప్పుడు మనం రంగయ్య దగ్గరికి లేదంటే రాజు దగ్గరికి కాదు పోవాల్సింది , సురేంద్ర డెత్ వెనుక ఉన్న మిస్టరీని తెలుసుకుంటే కేస్ నీ ఈజీ గా కంప్లీట్ చేయొచ్చు 

రంజిత్ : 📞📞📞📞 రాజేష్ , సురేంద్ర డెత్ రిపోర్ట్స్ వచ్చాయా 

రాజేష్ ( ఫోరెన్సిక్ ) : రేపు ఉదయమే వస్తాయి సార్ 

రంజిత్ : సరే రాజేష్ రాగానే కాల్ చెయ్ 

మురళి : నా రిటైర్మెంట్ రోజు ఒక కేస్ ఇన్ని మలుపులు తిరుగుతుంది అని అనుకోలేదు , ఏదేమైనా ఈ రోజు ఎప్పటికీ గుర్తుంటుంది 

రంజిత్ : నాక్కూడా సార్ , సరే సార్ మీ ఇంటి దగ్గర దింపేసి నేను వెళ్తాను 

మురళి : నా భార్య , పిల్లలు , బందువులు , స్నేహితులు , అందరూ హడావిడి చేస్తుంటారు . నా రిటైర్మెంట్ సెలబ్రేట్ చేయడానికి , హహహ పాపం వాళ్ళకి తెలీదు కదా

రంజిత్ : అవును సార్ , సార్ మీ ఇల్లు వచ్చింది 

మురళి : కేసు గొడవల్లో పడి పొద్దున నుండి సరిగ్గా తినలేదు , ఇద్దరం కలిసి భోజనం చేస్తాను 

రంజిత్ : పర్లేదు సార్ , ఇంకొరోజు వస్తాను 

మురళి : ఒకరోజు నువ్వు , నీ భార్య మా ఇంటికి భోజనాలకి రావాలి 

రంజిత్ : అలాగే సార్ , ఉంటాను 

--------------------------------------------------

తర్వాత రోజు ఉదయం 8:30 నిమిషాలకు , రంజిత్ ఇంటి దగ్గర 

--------------------------------------------------

ఇవ్వాళ సురేంద్ర డెత్ రిపోర్ట్స్ వస్తె కేస్ ఒక కొలిక్కి వస్తుంది అని భావిస్తున్న రంజిత్ , మురళి కి కొత్త విషయాలు తెలుస్తాయి , ఇంకా మురళి అలాగే రంజిత్ లకి ఏమి తెలిసింది , అది కేస్ కి ఏ విధంగా ఉపయోగపడింది ,ఈరోజు రంజిత్ అలాగే మురళి కి చాలా కీలకం , కేస్ ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళిన ఆనంద్ , విజయ్ , సూర్య నుండి వచ్చే సమాచారం తో పాటు , సురేంద్ర మిస్టరీ కూడా విడబోతుంది

నేటితో రంగయ్య , అలాగే డ్రైవర్ రాజు కి ఈ కేస్ తో ఉన్న సంబంధం కూడా తేలనుంది , మరీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేస్ లోకి రాబోతున్న కొత్త వ్యక్తి ద్వారా కేస్ ఇంకెన్ని మలుపులు తిరగనుందో ముందు ముందు తెలుస్తుంది 

-------------------------------------------------

రంజిత్ : 📞📞పది నిమిషాల్లో వస్తున్నాను సార్ రెడీ గా ఉండండి , అలాగే ,,,,, ఒక్కనిమిషం సార్ ,, ఎంటి ఇది బ్రెయిలీ లిపి లో రాసింది , నా కార్ మిర్రర్ పైన ఎవరు పెట్టి ఉంటారు !!! 

మురళి : ఎంటి రంజిత్ ఏమైంది 

రంజిత్ : ఏమి లేదు సార్ , బ్రెయిలీ లిపి లో ఏదో పేపర్ ఉంది అది నా కార్ మిర్రర్ దగ్గర ఉంది

మురళి : అది తీసుకుని రా , చూద్దాం అదేంటో దాని సంగతి ఏంటో

--------------------------------------------------

మురళి : మీరున్న ప్రాంతం నుండి సరిగ్గా 5 కిలోమీటర్లు వస్తె ఒక విగ్రహం కనపడుతుంది , ఆ విగ్రహం దగ్గర ఉన్న కవర్ తీసి చూడండి 

ఇది రంజిత్ సంగతి 

రంజిత్ : ఎవరూ సార్ ఇతను , నాతో ఆయనకి ఏమి పని , పోలీస్ అని తెలిసి గేమ్ అడుగుతున్నడా , తెలియక గేమ్ అడుతున్నడా

మురళి : సరే, వెళ్తేనే కదా తెలిసేది

-------------------------------------------------------

విగ్రహం దగ్గర ఉదయం 9:20 నిమిషాలకు 

మురళి : నేను ఎవరో తెలుసుకోవడం కంటే అసలు ఈ కేస్ లో ఏమి జరుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం , ఇందులో ఉన్న పెండ్రైవ్ లో మీకు కావల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి 

రంజిత్ : ఎవరో మనతో ఆడుకుంటున్నారు సార్ , కేసు నీ దారి మళ్లిస్తున్నారు

మురళి : రంజిత్ అతను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మనకి హెల్ప్ అవుద్దో లేదో తెలీదు కానీ అతను ఎవరు అనేది తెలుసుకోవడం మనకి చాలా ముఖ్యం , పైగా సురేంద్ర రిపోర్ట్స్ రావడానికి టైం ఉంది,అతను ఇస్తున్న. పెండ్రైవ్ ఏంటో చూద్దాం తన ఇన్ఫర్మేషన్ నిజం అయితే మనం కేస్ లో ముందుకు వెళ్తాం , లేదు తప్పు అయితే సురేంద్ర డెత్ రిపోర్ట్స్ మనకి చెప్తాయి నిజం ఏంటో 

రంజిత్ : భూషణ్ డెత్ లో సురేంద్ర ప్రమేయం ఉండొచ్చు లేదా భూషణ్ నీ చంపడాన్ని చూసిన సురేంద్ర , ఎక్కడ పోలీస్ లకి చెప్తాడేమో అని చంపేసి ఉండొచ్చు 

మురళి : అందుకే ముఖేష్ లేదంటే ఎస్పీ , మినిస్టర్ ఎవ్వరూ అనేది తెల్చలేకపోతున్నాము , సరే అది వదిలేద్దాం , ఆ పెండ్రైవ్ సంగతి

ఏంటో చూద్దాం , 

రంజిత్ : వచ్చేశాం సార్ 2 నిమిషాలు 

మురళి : రంజిత్ మనం ఒక తప్పు చేశాం 

రంజిత్ : రంగయ్య , డ్రైవర్ రాజు ఫింగర్ ప్రింట్స్ హే కదా

మురళి : అవును 

రంజిత్ : రాత్రే మా కానిస్టేబుల్ కి చెప్పాను సార్ తీసుకున్నాడు , దిగండి సార్ ఇదే 

--------------------------------------------

మురళి : ఈ పెన్ డ్రైవ్ లో ఏముంది ఇంతకు 

రంజిత్ : సార్ ! ఏదైనా ఉండని ! ఇప్పుడు అది కేస్ కి పనికి వస్తే వాడుకుంటాం లేదంటే మనల్ని మిస్ గైడ్ చేసిన వ్యక్తి నీ పట్టుకుంటాం 

మురళి : అతన్ని పట్టుకోవడం వల్ల కూడా మనకి ప్లస్ అవుతుంది రంజిత్ , ఇది చేయిస్తున్న వాడు ఎవరో తేలుతుంది కదా 

రంజిత్ : మీరు చెప్పింది నిజమే. సార్ , 

మురళి : రంజిత్ ఆఫీస్ కి వద్దు , మన దాంట్లో కోవర్ట్ లు ఉండే అవకాశం ఉంది అందుకే మీ ఇంటికి వెళదాం పదా 

రంజిత్ : అలాగే సార్ 

 --------------------------------------------------------------------

మీరు దర్యాప్తు సరిగ్గా చేయడం లేదు , మినిస్టర్ ఎస్పీ అలాగే సురేంద్ర భూషణ్ వీళ్ళందరికీ ఉన్న సంబంధం తెలుసుకోవడం లో మీరు ఆలస్యం చేస్తున్నారు , భూషణ్ గారి ఫాంహౌస్ లో కెమెరాలు పని చేయడం లేదు సరే మరీ సురేంద్ర గారి ఇంట్లో వేతికారా ??? భూషణ్ ఫాంహౌస్ కి ఎవరెవరు వస్తున్నారు అని భూషణ్ భార్య నీ అడిగారు కానీ , రంగయ్య నీ అడగడం మరిచిపోయారు , అలాగే టెక్నీషియన్ సురేష్ అందుబాటు లో లేకపోతే ఇంకో టెక్నీషియన్ ద్వారా Cc ఫుటేజ్ చూడొచ్చు కదా , అస్సలు ఈ కోణం లో మీరెందుకు ఆలోచించలేదు ఎస్పీ అలాగే మినిస్టర్ కి హంతకుడు నుండి అపాయం ఉండొచ్చు కదా ! లేదంటే వాళ్ళు అందరూ కలిసి చేసిన తప్పు ఏదైనా బయటపడుతుంది ఏమో అని భయపడుతూ ఉండొచ్చు కదా !! రంజిత్ నీ కార్ డిక్కి లో ఒక కవర్ ఉంటుంది అందులో ఫొటోస్ ఉన్నాయి ఇప్పుడు మొదలు పెట్టండి మీ దర్యాప్తు

-----------------------------

మురళి : ఇంత దగ్గర నుండి మనల్ని ఫాలో అయింది ఎవరు అయి ఉంటారు 

రంజిత్ : కచ్చితంగా మన డిపార్ట్మెంట్ మనిషే , సర్లే పదండి సార్

ఆ కవర్ ఏంటో చూద్దాం ---- సార్ ఈ కవర్ లో మినిస్టర్ , ఎస్పీ అలాగే భూషణ్ , సురేంద్ర లతో పాటు ఇంకో వ్యక్తి ఉన్నాడు 

మురళి : ఎవరు 

రంజిత్ : రంగయ్య , ఇంకా ఇక్కడ ఏదో పేపర్ ఉంది సార్ 

మురళి : ఫోటో లో ఉన్నది నకిలీ రంగయ్య , అసలైన రంగయ్య భూషణ్ చనిపోయాక చనిపోయాడు 

రంజిత్ : 📞📞 వెంకట్రామయ్య ఇంతకీ రంగయ్య ఎప్పుడు చనిపోయారు

హెడ్ కానిస్టేబుల్ : భూషణ్ చనిపోయిన పది నిమిషాల తర్వాత 

మురళి : ( రంజిత్ తో )మరీ నువ్వు భూషణ్ ఇంటికి వెళ్ళినప్పుడు కనిపించిన రంగయ్య ఎవరు !!

రంజిత్ : ( హెడ్ కానిస్టబుల్ వెంకట్రామయ్య తో ) భూషణ్ చనీ పోయిన రోజు నువ్వు నాతో పాటు రాలేదు కాదా నీకు రంగయ్య ఎలా తెలుసు

హెడ్ కానిస్టేబుల్ : అదేంటంటే సార్ ! భూషణ్ గారి కార్ లో రంగయ్య నీ చంపి పెట్టారు సార్ ! రంగయ్య చనిపోయింది నిన్న అని తెలుసు కానీ చనిపోయింది భూషణ్ చనిపోయిన రోజే సార్ ! భూషణ్ గారి భార్య గుర్తుపట్టారు రంగయ్య నీ 

మురళి : అలాగైతే మనం నకిలీ రంగయ్య నీ పట్టుకోవాలి . అతనే చెప్తాడు 

రంజిత్ : విషయం స్పష్టం అయింది సార్ , భూషణ్ చావు కంటే ముందే రంగయ్య చనిపోయాడు 

మురళి : సురేంద్ర అక్కడికి వెళ్ళింది కూడా అదే సమయం 

రంజిత్ : ఇంతకీ ఆ సమయం లో సురేంద్ర అక్కడకి ఎందుకు వెళ్లినట్లు 

మురళి : ఇదంతా మొదలైంది భూషణ్ ఫాంహౌస్ లో , అక్కడకి వెళ్తే నే తెలుస్తుంది , మన టీమ్ నీ రమ్మను , అలాగే ఫోరెన్సిక్ వాళ్ళని , DSP రవీందర్ నీ కూడా , అక్కడే తెలుసుకుందాం 

రంజిత్ : మన కేస్ కి క్లైమాక్స్ ఎక్కడ మొదలు అయిందో అక్కడే పూర్తి చేద్దాం 



Rate this content
Log in

Similar telugu story from Drama