సరదాగా కాసేపు
సరదాగా కాసేపు
ఉదయం 9 గంటలకు ,, పేరు పొందిన ప్రముఖ హాస్పిటల్ , హైదరాబాద్ మహాలక్ష్మి : శ్రీరామ్ మనం చాలా కార్యక్రమాలు చేసాము, కానీ ఇది మనకి చాలా ప్రత్యేకం. పిల్లలో ప్రతికూల ప్రభావాలను దూరం చేసి, వాళ్ళకి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఇది విజయవంతం కావాలి
శ్రీరామ్ : తప్పకుండా అవుతుంది పిన్ని
మహాలక్ష్మి : స్వప్నిక రెహా క్యాన్సర్ బాధితులకు ఊరట కలిగించేందుకు కృషి చేస్తుంది , నా ఆశయం లో మీరంతా భాగం అవ్వడం , క్యాన్సర్ బాధితులకు అండగా నిలబడడం అందుకు మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే శ్రీరామ్ : మీరే మమ్మల్ని ముందు ఉండి నడిపిస్తున్నారు పిన్ని , మీరే మాకు ఆదర్శం
డాక్టర్ వెంకట సుష్మ : నిజం చెప్పావు శ్రీరామ్ , హా ! మహాలక్ష్మి గారు నేను రౌండ్స్ కి వెళతాను , అందరూ రాగానే నాకు కాల్ చేయండి
మహాలక్ష్మి : అలాగే అండి , శ్రీరామ్ ! అతిథులు చేరుకునే సమయం అయింది నువ్వెళ్ళి ఆ ఏర్పాట్లు చుడు
శ్రీరామ్ : పిన్ని ! నేను అందరికీ కాల్స్ చేశాను , ఇంకో పది నిమిషాల్లో వాళ్ళు ఇక్కడ ఉంటారు
-------------------
మహాలక్ష్మి : సీత నువ్వు ప్రోగ్రాం మొదలు పెట్టు
సీత : అలాగే అక్క , ఇక్కడకి వచ్చిన అతిథులకు , పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకి , ముఖ్యంగా హాస్పిటల్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు , ఇప్పుడు మీతో డాక్టర్ వెంకట సుష్మ గారు మాట్లాడతారు
వెంకట సుష్మ : ధన్య వాదాలు సీత మరియు మహాలక్ష్మి గారికి , స్వప్నిక రెహ చేస్తున్న ప్రతి పనిలో , ప్రతి కార్యక్రమం లో ఒక అతిధి గా , డాక్టర్ గా ,కార్యకర్త గా , సంస్థ సభ్యురాలిగా పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. వాట్సప్ గ్రూప్ ద్వారా రక్తదానం , స్క్రీనింగ్ టెస్ట్ లు , సోషల్ మీడియా ద్వారా అందరికీ క్యాన్సర్ మీద అవగాహన తెస్తున్నాం , అవసరం అయిన వారికి ఆర్థిక సహాయం చేస్తున్నాం . ముఖ్యంగా గ్రామాల్లో , తండాల్లో మా అవసరం ఎక్కువ గా ఉంది అని భావించి అక్కడ కూడా హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం ఈ ఫౌండేషన్ మొదలు పెట్టే ముందు మహాలక్ష్మి తన ఆలోచన నీ పంచుకోవడం లో నేను భాగం అయినందుకు గర్వపడుతున్నాను అందరికీ ధన్యవాదాలు ,
హిమాజ : సంస్థ మొదలైనప్పటి నుండి నేను భాగం అవుతున్నాను , క్యాన్సర్ పోరాటం లో మహాలక్ష్మికి తోడుగా నా వంతు సహకారం అందిస్తున్నాను , ఈరోజు ఈ కార్యక్రమం లో భాగం అవ్వడం నాకు సంతోషంగా ఉంది , మొదటి దశలోనే క్యాన్సర్ నీ పోగొట్టేందుకు మహాలక్ష్మి గారు చేస్తున్న కృషి అభినందనీయం , కీమోథెరపీ రేడియేషన్ చికిత్స ద్వారా జుట్టు కోల్పోతున్న చిన్నారులకు విగ్ తయారు చేసి పంచే అలోచన లో కూడా ఉన్నాము . భవిష్యత్ లో జరిగే కార్యక్రమాలకు నా వంతు సహకారం తప్పక ఉంటుంది అని తెలుపుతూ ముగిస్తున్నాను
పిల్లలు ఇప్పుడు మీతో సరదాగా గడపడానికి , మిమ్మల్ని అలరించడానికి సింగర్స్ రాహుల్ , రమ్య వచ్చారు , వాళ్ళు ఇప్పుడు మీ కోసం పాటలు పాడుతారు
రమ్య : హెల్లో ! పిల్లలు ఎలా ఉన్నారు
పిల్లలు : బాగున్నాము
రమ్య : ఎవరు అయినా డైలాగ్స్ చెప్తారా ? మంచిగా చెప్తే వీళ్ళు మీకు బోలెడన్ని గిఫ్ట్స్ , చాక్లెట్స్ , స్నాక్స్ ఇస్తారు
సుమ : లైఫ్ ఎది మనకి ఎదురు వచ్చి ఇవ్వదు , మనమే ఎదురెళ్లి తీసుకోవాలి , అది బాధ నుండి సంతోషం అయినా , ఓటమి నుండి గెలుపు అయినా
రమేశ్ : పుష్ప , తగ్గేదేలే
ప్రదీప్ : ఫ్లూట్ జింక ముందు ఊదు , సింహం ముందు కాదు
విజయ్ : ప్రపంచం లో తల్లిని మించిన యోధులు ఉండరు
( సురేష్ : ధన్యవాదాలు మహాలక్ష్మి గారు , క్యాన్సర్ బాధితుల కోసం చాలా శ్రమ తీసుకుంటున్నారు , మా పాప కి వచ్చిన ఈ మాయదారి రోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నమో మాకు తెలుసు , మా లాంటి వాళ్ళకి మీ ఫౌండేషన్ ఒక భరోసా నీ ఇస్తుంది , మీ వంతు సహాయం చేస్తుంది
మహాలక్ష్మి : చిన్న పిల్లలకి కూడా క్యానర్ రావడం అనేది చాలా బాధాకరం అందుకే మేము 12 సంవత్సరాలు నిండిన అబ్బాయిలు అమ్మాయిలు గార్డి సెల్లా వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటున్నాం
సురేష్ : మా పాప. కొలుకున్నాక క్యాన్సర్ కాంపైన్ లో విసృత ప్రచారం చేస్తాను , అందరికీ దీని గురించి అవగాహన వచ్చేలా నా వంతు ప్రయత్నం చేస్తాను
మహాలక్ష్మి : తప్పకుండా సురేష్ గారు , ధన్య వాదాలు )
రమ్య : ఇంకా ఎవరైనా చెప్తారా
పిల్లలు : నో
( మహలక్ష్మి : మీరంతా వెళ్ళి పిల్లలకి గిఫ్ట్స్ , స్నాక్స్ ఇవ్వండి )
రమ్య : నేను రాహుల్ అన్నయ్య పాటలు పాడుతాము , ఎవరిది బాగుందో చెప్పండి
రాహుల్ : హలో పిల్లలు ! ఇది మీ కోసమే
నువ్వని ఇది నీదని , ఇది నిజమని అనుకున్నావా !!
కామన్ పాడండి !!! ఏదని బదులు ఏదని ఒక ప్రశ్నగా నిలుచున్నవా_______
పిల్లలు : హమ్ చేస్తారు
రాహుల్ : బాగుందా
పిల్లలు : సూపర్
రమ్య : ఇప్పుడు నేను పాడతా
కొమ్మ ఉయ్యాలా , కొన జంపాలా , అమ్మ వొళ్ళో నేను రోజు ఊగలా
కొమ్మ చాటున పాడే కోయిల కు అంటూ కూ అంటూ నాతో ఉండాలా ! నాతో ఉండాలా !_____
రమ్య : ఎవరిది బాగుంది
పిల్లలు : రెండు బాగున్నాయి
రమ్య : మీరు డైలాగ్స్ చెప్పినందుకు మీకు శ్రీరామ్ అన్నయ్య గిఫ్ట్ స్నాక్స్ ఇచ్చాడు , అన్నయ్య కి థాంక్స్ చెప్పండి
పిల్లలు : థాంక్స్ అన్నయ్య
సీత : ఇప్పుడు వెంకటేష్ గారు మాట్లాడతారు
డాక్టర్ వెంకటేష్ : కుటుంబం లో ఒక వ్యక్తి నీ కోల్పోయి , మానసికంగా మరియు శారీరకంగా కుంగిపోయిన సమయం అది , పైగా రెండు మేజర్ సర్జరీలు అయ్యాయి. అలాంటి సమయంలో సుష్మ కి తన ఆశయం గురించి చెప్పడం అలాగే నేను వీళ్లతో కలిసి పనిచేయాలని అనుకోవడం ఇంకా ఆ తర్వాత జరిగింది ఎంటో సుష్మ గారు మీకు ఇంతకు ముందే చెప్పారు . గాయమైన వాడికే సాయం విలువ తెలుస్తుంది అనే సినిమా డైలాగ్ కి నిజమైన నిదర్శనమే మహాలక్ష్మి గారు.క్యాన్సర్ బాధితుల కోసం ఎంత తపన పడ్డారో మాకు మాత్రమే తెలుసు. కరోనా సమయం లో మొబైల్ హాంగ్ అయినప్పుడు కాల్స్ ఆన్సర్ చేసే అవకాశం లేదు , అప్పుడు అందరికీ వాట్సప్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు . ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ఉంటాయి .అందరికీ ధన్య వాదాలు
సీత : ఇప్పుడు మహాలక్ష్మి గారు మాట్లాడతారు
మహాలక్ష్మి : సంస్థ విజయాల్ని నా వ్యక్తిగత విజయల కంటే సంస్థ విజయాలుగానే
నేను భావిస్తాను . నా ఆలోచనకు శ్రీకారం చుట్టి నాతో నడుస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు . ముఖ్యంగా డాక్టర్ వెంకటేష్, సుష్మ అలాగే మా సంస్థ సభ్యులు శ్రీరామ్ , సీత , దినకర్ లకి వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే . నా ప్రయాణం లో నా భర్త శ్రీనివాస్ మరియు నా కుటుంబం సహకారం ఎంతో ఉంది , అందరూ అండగా ఉన్నారు కాబట్టే నేను ఇదంతా చేయగలుగుతున్నాను
అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా హాస్పిటల్ యాజమాన్యానికి
సీత : అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ , ముగిస్తున్నాను
