ఆరోజు....
ఆరోజు....


గోదావరి ఎక్సప్ర్ స్ ఖాజిగూడ స్టేషన్ దాటింది
AC టుటైర్లో ప్రయాణిస్తున్న రామానికినిద్రపట్టక గత స్మృతులలోకి వెళ్ళాడు
తాను కందుకూరుదగ్గర కుగ్రామంలో సామాన్యకుటుంబంలో మూడోవాడుగా పుట్టాడు
B SC చీరాలలోపూర్తి చేశాడు
పైచదువులకు పంపలేనన్నాడు తండ్రి
అన్నయ్య చొరవతో చేను కుదవపెట్టి వైజాగ్ లో వచ్చిన M Sc జియాలజీలో చేరి gold medallist గా డిగ్రీ సంపాదించాడు
రిజల్టు రాగానే ONGC లో సైంటిస్టుగా ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చి బరోడాలో చేరాడు
మరో మూడు నెలల్లో మేనమామ కూతురు వరలక్ష్మితో పెళ్ళి.
కొత్త దంపతులను అన్నయ్యవదినలు తీసుకొచ్చి బరోడాలో కాపురం పెట్టించడం టకటకాజరిగి పోయాయి
ఏడాది తిరిగే సరికి చిట్టిపాపాయి మురిపించ సాగింది
చమురు నిక్షేపాలు కని పెట్టడంలో రామం అపరభగీరథుడని పేరు
ఆసంవత్సరం ఓమారుమూల కుగ్రామం లో క్యాంపు కెళ్ళి టెంట్లోనే కాపురం
పగలంతా జీపులో తిరిగి చమురునిధుల జాడ పసిగట్టి మ్యాచ్ తయారు చేసి రాత్రి ఏ 10 గంటలకో ఆదమరిచినిద్ర పోయేవాడు
ఆరోజు 11 గంటలైంది
పాలకోసం పాప ఏడ్చింది
వరలక్ష్మి నిద్ర పోతోంది
రామం మిల్క్ బాటిల్తో పాలుపట్టి పాపను నిద్రపుచ్చాడు
వరలక్ష్మి నుదురుమీద ముద్దుపెట్టి పక్కనే వున్న కిరోసిన్ లాంతరు వెలుగు తగ్గించి ఆదమరిచి అలసి నిద్రపోయాడు
ఓ గంట గడిచింది
పెద్దగా హాహాకారాలు చేస్తూ పాపను పొదువుకొన్న వరలక్ష్మిని హటాత్తుగా లేచి చూశాడు
టెంట్ మంటలు పైపైకి ఎగసి పడుతున్నాయి
లాంతరు దొర్లినందున మంటలు ఎగిశాయి
భార్యను, పాపను బయటకుతెచ్చే ప్రయత్నంలో పాప చేయి జారి కింద పడింది
ట్ంట్ బయటపడ్డ భార్యాభర్తల బట్టలకు మంటలు వ్యాపించాయి
మూడు రోజుల జీవన పోరాటంలో భార్య ఓడిపోయింది
పాప టెంట్లోనే మసిఅయిపోయింది
వారం తర్వాత స్పృహలోకి వచ్చిన రామానికితన వరం ఇక లేదని చెప్పడానికి అన్నయ్యకు నోరు పెగల లేదు
రైలు కుదుపుకు నిద్ర లేచిన రామం తన నిజ జీవితంలో జరిగిన ఆ సంఘటన గుర్తుకు వచ్చి చలించి పోయాడు
అది కల అయి వుంటే బాగుండు ననుకున్నాడు
పీడకలగా భావించలేకపోతున్నాడు
డా.ఆర్ . అనంతపద్ననాభరావు