సుందరం స్టీల్స్
సుందరం స్టీల్స్


జగపతి వాళ్ళ పింగాణి ఫ్యాక్టరీ 1948 లో వాళ్ళ తాత సుందరలాల్ ప్రారంభించి 30 ఏళ్ళు నడిపారు
నాణ్యతకు,మన్నికకు సుందరం పింగాణి సామాన్లు మార్కెట్ లో పేరు తెచ్చుకున్నాయి. దక్షిణ దేశంలో అన్ని పట్టణాలలో
ఏజెంట్లు బ్రాంచీలు పెట్టి లాభాలు గడంచారు
సుందరలాల్ తన వ్యాపార బాధ్యతలు కొడుకు శివలాల్ కు 1978 లో అప్పగించారు
అప్పటికే పింగాణి స్థానంలో స్టీలు సామానులు వాడకంలోకివచ్చాయి
అయినా శివలాల్ కంపెనీ వ్యాపారం వదలుకోదలుచుకోలేదు
ప్రొడక్షన్ క్రమంగా తగ్గిపోయింది
ఉన్నంతలో సర్దుక పోయే మనస్తత్వం ఆయనది
2014లో తన కొడుకు జగపతిలాల్ కి కంపెనీ బాధ్యతలు అప్పగించాడు
ఎం బి ఏ పాసయి వచ్చిన జగపతి కొత్త ఆలోచనలు మెదలు పెట్టాడు
మోడీ ప్రభుత్వ పథకం ద్వారా బ్యాంకు లోన్ తీసుకొనికొత్త మిషన్లు తెప్పించాడు
పాత ఫ్యాక్టరీ మూసివేసే కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల మీటింగు పెట్టి ఇలా వివరించాడు
మిత్రులారా! మన కంపెనీ లో ఇన్నేళ్ళుగా మీరు పనిచేసి లాభాల బాటలో నడిపించారు. రోజులు మారాయి. స్టీలు యుగం వచ్చింది . పింగాణీకి గుడ్ బైచెప్పాలి
మీలో కొందరువయసులో పెద్దవాళ్ళయ్యారు
55 సంవత్సరాల వాళ్ళు స్వయంగా పని ముగించుకోక తప్పదు. మీ ఇంట్లోఅర్హులకు కొత్త ఫ్యాక్టరీ లో అవకాశం ఇస్తాం
దీపావళిరోజే కంపెనీ సుందరం స్టీల్స్ పేరుతో ప్రారంభం
మీ కుటుంబాల వారి కందరిక ఓ సంతోషకరమైన వార్త
ముందుగా రిటైరయ్యే 45 సంవత్సరాల వారికి ఇల్లు లేని పక్షంలో క్వార్టర్లను ఖాళీ చేయవలసి వస్తే లోన్ ఇస్తాం
జగపతి మాటలు ఉద్యోగుల్లో ఉత్సాహం నింపింది
సుందరం స్టీల్స్ జై జై
బగపతిలాల్ కి జై జై అని చప్పట్లు చరిచారు