మాటలూ ఉన్నాయి స్వగతాలు, గతాలు!
మాటలూ ఉన్నాయి స్వగతాలు, గతాలు!
మిత్రమా!
నాపైన రోజూ అలా రాళ్ళు విసిరి కిందపడిన మామిడి పండు తినడం అలవాటు చేసుకున్నావు! మీ మానవజాతి చరిత్ర పరిశీలిస్తే గతంలో పురాణ కథలు ఏం చెప్పారో
యో తెలుసా?అంది మామిడి చెట్టు
వృక్షోరక్షిత రక్షితః! అని కదా!
సూతుడు శౌనకాది మునులకు వినిపించిన కధలు ఎక్కడో తెలుసుకోవాలని ఉందా?
మా నైమిశారణ్యం లో. అది లేకపోతే పురాణాలకు చోటే లేదు. మొన్నటి కి మొన్న చాగంటి కోటేశ్వరరావు శర్మ గారు శిష్యబృందంతో నైమిశారణ్యం వెళ్లి
భాగవత సప్తాహం ప్రవచనాలు చేసి వచ్చారు.
నైమిశారణ్యం టూర్లు ఎందరో ఏర్పాటు చేశారు.
రామాయణ,భారతాలలో రాజులు అరణ్యాలకు వేటకు పోవడం వల్ల కధలు ముందు కు నడిచాయి తెలుసా?
నీకు మీ అమ్మ నాన్నలు ఈకథలు ఎన్నడూ చెప్పలేదు గానీ, నేను చెబుతాను విను! అంది మామిడి చెట్టు.
పండ్లున్న చెట్టు కే రాళ్ళు తగులుతాయి! అనే సామెత ఊరికే అనలేదు
మా కాయలు ఊరగాయలు పచ్చళ్లు చేసుకుని ఏడాది పొడుగునా లొట్టలు వేసుకుంటూ తింటూ ఉన్నారు
శుభకార్యాలకు మామిడి తోరణాలు కట్టి సంబరాలు చేసుకుంటున్నారు
సైంటిస్టులు మామిడి తోరణాలు ఆక్సిజన్ విడుదల చేస్తాయని ఇప్పుడు చెప్పారు. తరతరాలుగా మీతాతముత్తాతలు ఆచారం అంటే
మీ కుర్రకారు పిల్లలు చాదస్తం అని గేలి చేశారు
వేపచెట్టు కు పేటెంట్ రైట్స్ తెచ్చుకుని సంబరపడ్డారు
రామాయణం అన్నాను కదూ! వాల్మీకి మహర్షి నోట 'మానిషాద ప్రతిష్టాత్వం' అనే రామాయణం ప్రథమశ్లోకం చెట్టు మీద కూర్చుని వున్న
క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని కిరాతుడు బాణం వేసి చంపినపుడు అప్రయత్నంగా నోటివెంట వచ్చింది.ఆదికావ్యావతరణకు
ఆ చెట్టు ,దానిపై పక్షులు మూలమని నేను సిద్ధాంతం చేస్తున్నా!
దశరథుడు అరణ్యానికి వేటకు వెళ్ళి శ్రవణ కుమారుని చంపడం రామాయణకథాగమనంలో పెద్ద మలుపు.
సీతమ్మ తల్లి అశోకవనంలో చెట్టు కింద కూర్చుని పదినెలలు గడిపిన తర్వాత అదే చెట్టు మీద కూర్చుని హనుమంతులవారు
ఆమె కు రాముని వర్ణించాడు.అంగుళీయం ప్రదానం చేశారు. చెట్టు లేక పో తే....
నీకు నవ్వుటాలుగా వుంటే భారతం కథ విను!
అరణ్యానికి వెళ్ళిన పాండు రాజు మృగాల జంటగా సరద
ాపడుతున్న ఒక మృగంపై బాణం వేసి చంపినపుడు కిందముడనే మునిశాపం పెట్టాడు
ఆతర్వాత పాండవులు పుట్టారు సుమా!
భగవంతుడు కాలంలో కనిపించి మామిడి పండు చేతిలో పెడితే ఎందరో పుణ్యపురుషులు జన్మించారు
చారిత్రక సంఘటనలు వృక్షాల తో ముడిపడి ఉన్నాయి. బోధి వృక్షం క్రింద తపస్సు చేసి గౌతముడు బుధ్ధుడయ్యాడని
మీ హిస్టరీ మేష్టారు చెప్పారు కదా!
అశోకుడు చెట్లు నాటించెను! అని బట్టీ పెట్టావు!
తెలుగు కవులు అష్టాదశ వర్ణనలలో వనవర్ణనచేశారు
మామిడి జాతి చెట్లు మహాకవి పోతన కు ఋణపడి ఉంటాయి.
బాలరసాలసాలనవపల్లవకోమలకావ్యకన్యకన్! అని కావ్యకన్యను మృదు మధుర మైన మామిడి చిగుళ్ళతోపోల్చి
మమ్మల్ని శాశ్వతంగా సాహిత్యం లో నిలిపాడు
దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యద గ్రంథం లో..
కాంచెన్ వైష్ణవుడర్ధయోజనజటాఘటోత్థశాఖోపశాఖా...అని మూడు పాదాలసంస్కృతసమాసంవేసి చివరన
వటక్ష్మాజమున్ అని వటవృక్షం వర్ణించాడు
వటవృక్షం అంటే ఏమిటో నీకు తెలుసా? మర్రి చెట్టు.
అనంతపురం జిల్లాలో కదిరికి సమీపంలో తిమ్మమ్మ మర్రిమాను అతిప్రాచీనం
మర్రిచెట్టు కింద సేదదీరిన ఒక యాత్రీకుడుపైకిచూచి అంతపెద్ద చెట్టు కు ఇంత చిన్న కాయలు పెట్టి పక్కనే
సన్నని గుమ్మడితీగ కు కిలోల బరువు గల పండ్లు పెట్టాడు! బ్రహ్మ దేవుడు ఎంత తెలివితక్కువ వాడు అనుకుంటూ
నిద్రకుపక్రమించాడు
ఓగంట తర్వాత లేచి చూస్తే ఒంటిమీద ఎన్నో మర్రి కాయలు.
ఓరి భగవంతుడా! అదే గుమ్మడి కాయ లైతే నేను హరీ!మనేవాడిననుకొన్నాడట!
ఇప్పుడు పట్టణాలలో కాంక్రీటు జంగిల్స్ కనిపిస్తున్నాయి
వనమహోత్సవాలు ప్రభు త్వానికే పరిమితం కాకుండా ప్రజాకార్యక్రమాలు కావాలి మిత్రమా!
ప్రధానమంత్రి మోడీ ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమంలో చెట్లు నాటే ఉద్యమం చెప్పారు
కొందరు ట్రీఛాలెంజ్ చేపట్టారు. మీరు చెట్లు నరికే గొడ్డలి కర్ర కూడా మాదే!
మిత్రమా! ఆ భగవంతుడు మాకు రెండు చేతులు ఎందుకు ఇవ్వలేదు?
మిమ్మల్ని శిక్షిస్తామనా?
సెలవు! టాటా! అని అతని చేతిలో పడేలా ఓ మామిడి పండు రాల్చింది.