RA Padmanabharao

Others

4.8  

RA Padmanabharao

Others

రఘు బాబు వర్ధిల్లాలి!

రఘు బాబు వర్ధిల్లాలి!

2 mins
321


రఘు బాబు వర్ధిల్లాలి! వర్ధిల్లాలి!_ అంటూ జనం రఘు బాబును భుజాలపై కెక్కించు కొని ఊరేగింపు నిర్వహించారు

కార్మిక సంఘాల ప్రతినిధులు తమ పార్టీ అధ్యక్షుడు గా ఏకగ్రీవంగా ఎన్నికైన రఘుని ప్రశంసిస్తూ ప్రసంగించారు

యర్రగుంట్ల ప్రైవేటు సిమెంట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించిన రఘు నాలుగేళ్లలో అందరి దృష్టి నాకర్షించాడు

పనిపట్ల విధేయత, సహా యశీలస్వభావం అందరూ మెచ్చుకున్నారు

యస్.వీ.యూనివర్సిటీలో ఎం.ఏ ఎకనామిక్స్ ఫస్ట్ క్లాస్ తో పాసై ఎం.ఎల్.ఏ సిఫార్సు తో ఈఫాక్టరీలో ఉద్యోగం సంపాదించి నలుగురికీ తలలో నాలుక అయ్యాడు

కంపెనీ మునిగిపోయే దశ లో చేరి దాన్ని బ్రతికించే కృషి చేయాలని పిలుపునిచ్చాడు

రెండు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు

సమ్మె లు, హర్తాళ్లతో కంపెనీ ప్రొడక్షన్ పనులు కుంటు పడ్డాయి

రఘు కంపెనీ డైరెక్టర్ల సానుభూతి సంపాదించి ప్రయోజకు డనిపించు కున్నాడు

బొంబాయి లో ఉంటూ పరిపాలన సాగించే చైర్మన్ శశాంక్ ఈ ఫాక్టరీ వ్యవహారాల విషయం పట్టించుకోడు

సీనియర్ ఆఫీసర్లు వేరే రాష్ట్రం వాళ్ళు

కంపెనీ లాభాల బాటలో నడపాలని ఆలోచించరు

కార్మిక సంఘాలు నాలుగు ఉన్నాయి

నక్సలైట్ ఉద్యమంలో పాల్గొని వచ్చిన వారు కొందరు అధికారులను బెదిరించి స్వప్రయోజనాలు సాధించుకొంటూ సంఘాలకు ఎన్నికలు జరగకుండా

20 ఏళ్ళు నెట్టుకొచ్చారు

ఈ సంవత్సరం మే నెలలో కొత్త యం.డి వచ్చాడు

ఫాక్టరీ వ్యవహారాల విషయం అధ్యయనం చేసి రుగ్మత లో ఉన్న కంపెనీ లాభాల బాటలో నడపాలని నిర్ణయించుకోవడం కార్మిక సంఘాలు నాలుగు వ్యతిరేకించాయి

ఈదశలో రఘు బాబు రంగం సిద్ధం చేసుకున్నాడు

యం.డి తనను పిలిచి మా ట్లాడినపుడు సంపూర్ణ సహకారం అందించి ఎన్నికలు జరిగే లా చూస్తానని హామీ ఇచ్చాడు

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు ్

కొందరు కార్మికులు రఘు బాబుని నిలబడి ఫాక్టరీ భవిష్యత్తు కార్యాచరణను చేపట్టమని కోరారు

పాతకాపులైన నాయకులు నిన్ను లేపేస్తామని బెదిరించి స్వప్రయోజనాలు సాధించుకోవాలని చూశారు

రఘు బాబు లో పట్టుదల పెరిగింది. తన కంపెనీ బాగుపడితే రెండేళ్లుగా మూత పడుతుందనుకున్న భూతాన్ని తరిమేయవచ్చు

ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ రఘు బాబు కార్మిక సంఘాల కు చేతులెత్తి మొక్కాడు

ఏకగ్రీవంగా ఎన్నికైన నాయకుడు యాజమాన్యం తో కార్మికుల

ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయగలడు

నేను మీ అభిమానాన్ని పొంది నాయకుడినైతే రెండేళ్ల తర్వాత కొత్త యూనిట్ తెరిపిస్తానని వాగ్దానం చేస్తున్నా! ఎన్నో ఏళ్లుగా పే రివిజన్ జరగలేదు.

అంటూ సుదీర్ఘ ప్రస్థానాన్ని గురించి మాట్లాడుతూ ఉండగా వెనుక కూర్చున్న ఓ పెద్దమనిషి_-

20 వ తేదీ జీతాలు తీసుకుంటూ పేరివిజన్ అని భ్రమలో పెట్టవద్దు అని పెద్దగా అరిచాడు

అందరూ గొల్లున నవ్వారు

ఒకటో తారీఖు జీతాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు రఘు బాబు

ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు

రెండేళ్ళలో రెండో యూనిట్ ప్రారంభం చేయించాడు

బొంబాయి నుండి వచ్చిన చైర్మన్ శాంక్ రఘు బాబు ను స్టేజి మీద కూర్చోబెట్టి శాలువా కప్పి సత్కారం చేశాడు

రఘు బాబు వర్ధిల్లాలి! అంటూ కార్మికులు జయజయధ్వానాలు చేశారుRate this content
Log in