శతదినోత్సవం
శతదినోత్సవం


శంకరయ్య వస్త్రాల వ్యాపారం 30 ఏళ్ళు గా చేస్తున్నాడు
తాతల నాటి నుండి నేటి వరకూ వాళ్ళు చీరల షాప్ నెల్లూరు జిల్లాలో పేరు మోసింది
ట్రంక్ రోడ్ లో ఏ.సి షోరూం చేయించాడు శంకరయ్య
తండ్రి హయాంలో కంచిపట్టుచీరలకు ఆ షాపు యజమాని మంచిపేరు తెచ్చుకున్నారు
అతనికి ఒక్కడే కొడుకు శంకరం.వాణ్ణి బాగా చదివించి ఉద్యోగం హైదరాబాద్ లో చేయించాలని తండ్రి సంకల్పం
శంకరం ఎలానో తంటాలు పడి వి.ఆర్.కాలేజిలో బి.కాంలో చేరాడు
టెన్తుక్లాసునుంచి రోజూ ఓ సినిమా కెళ్ళే ప్రతిజ్ఞ చేశాడు
ఇంట్లో తెలిసీ తెలీకుండా వెళ్ళి వచ్చేవాడు
షాపు నుంచి రాత్రి పదింటికి వచ్చే వాడు తండ్రి.కొడుకు విషయం పట్టించుకోలేదు
శంకరం సినిమాలు చూడటంలో ఘనాపాటి అయ్యాడు
డిగ్రీ మూడేళ్లలో 1500 సార్లు సినిమాల కెళ్ళి రికార్డు సృష్టించిన ఘనత సాధించిన వాడయ్యాడు
ఫలితం డిగ్రీ మూడేళ్లలో ఏ సబ్జెక్టులో పాస్ కాలేకపోయాడు
కొడుకు నిర్వాహకం చూసి తండ్రి అతణ్ణి షాపు లో కూచో బెట్టి వ్యాపారం చూసుకో మన్నాడు
అప్పటి కాతనికి ఇరవై ఏళ్ళు నిండాయి.
చురుకుదనం మాటతీరు లో శంకరం కస్టమర్లను ఆకట్టుకునే వాడు
తన సినిమా నియమానికి భంగం రాకుండా సెకండ్ షో మూవీలకు వెళ్ళేవాడు
సిగరెట్లు తాగడం అలవాటు అయింది. ఇంట్లో వాళ్లు కనిపెడతారని కిళ్ళీలు వేసుకోవడం అలవాటు చేసుకున్నాడు
పెళ్లి చేస్తే సినిమా పిచ్చి తగ్గుతుందని ఈడూజోడూ చూసి రమ నిచ్చి పెళ్లి చేశారు
పెళ్ళి రోజూ ఎలానో వ్రతభంగం కాకుండా వెళ్లి వచ్చాడు సినిమా కు. అయితే ఇంటర్వెల్ లో వచ్చేశాడు
శోభనం రోజున మ్యాట్నీకి భార్యాసమేతంగా వెళ్లి వచ్చాడు
###########
తండ్రి పెద్ద వాడై షాపు బాధ్యతలు శంకరం మీద వదిలేశాడు
శంకరం వ్యాపారం మెళుకువలు నేర్చుకున్నాడు
సూరత్ వెళ్లి చీరల లోడ్ బుక్ చేసివచ్చేవాడు. వందరూపాయలనుండి పది వేల వరకు చీరెలు షోరూం లో పెట్టించాడు
టీ.వీ ఛానల్స్ లో లలితా జూలియర్స్ తరహా లో అడ్వర్టైజ్ చేశాడు
విలువైన చీరెలు కట్టుకున్న సేల్స్ గర్ల్స్ ఇరవైమంది షాపు లో గ్రాండ్ గా పనిచేస్తున్నారు.
లక్షలు కోట్లు సంపాదించి అనేక సంఘాల సన్మానాలు శాలువాలు
అందు'కొన్నా'డు. శాలువాలు తానే ఇచ్చేవాడు
వ్రతభంగం కాకుండా సెకండ్ షో సినిమా కెళ్ళే ప్రతిజ్ఞ చేశాడు
షాపు లో పైఫ్లోర్లో కంచిపట్టుచీరలు ఆకర్షణీయంగా పెట్టారు. లోపలికి రాగానే ఆడవాళ్ళకు బొట్టు పెడతారు. వెళ్ళేటప్పుడు చేతినిండా గాజులు వేస్తారు
దీపావళి శుభాకాంక్షలు చెబుతూ పట్టు చీర కొన్నవారికి గిల్ట్ వొడ్డాణం ఫ్రీగా ఇచ్చారు
రోజూ సెకండ్ షోకి భర్త వెళ్తున్నా రమ గొడవ పెట్టలేదు
తాను నిత్యం టీవీలో కనీసం రాత్రి పదింటిదాకా తెలుగు, హిందీ సీరియల్స్ చూస్తుంది
పనిమనిషి, వంటమనిషి అన్నీ చూసుకొంటారు.
సినీ ఫాన్స్ అసోసియేషన్ సెక్రటరీ ఓసాయంకాలం భార్యకు చీర కొని పెట్టడానికి శంకరయ్య షాపు కొచ్చాడు
తనకు రేపు జూన్ నెలలో యాభై సంవత్సరాలు నిండుతాయన్నాడు శంకరం
'మంచి అకేషన్. నీ సినీజీవితస్వర్ణోత్సవం ఘనంగా టౌన్ హాల్ లో చేద్దాం
తమన్నా ను పిలుద్దాం.ఖర్చు అవుతుంది 'అన్నాడు సెక్రటరీ.
మరీ ఖర్చు లేకుండా చూడు బ్రదర్ అన్నాడు శంకరం
చరిత్రలో నీపేరు నిలిచి పోతుంది. 14వ నాటినుండి 50 ఏళ్ళ వరకు అవిఘ్నంగా సినిమా లు చూసిన ఘనత మీది.
ఈ సందర్భంగా చిత్రరత్నాకర అనే బిరుదు ప్రదానం చేస్తాం. స్వర్ణకిరీటం స్వయంగా తమన్నా పెడుతుంది.
మీటింగ్ ఖర్చు లక్ష దాటకుండా చూడు బ్రదర్!
ఇంతలో సెక్రటరీ భార్య చీరకు బిల్ చెల్లించేందుకు వచ్చింది.
ఫర్వాలేదు. దీపావళి గిఫ్ట్ అనుకో మన్నాడు శంకరం
జూన్ లో సందడే సందడి
టౌన్ హాల్ నిండా జనం
హొయలొలుకుతూ తమన్నా వచ్చింది
శంకరం,రమలను పెద్ద సింహాసనం పై కూచో బెట్టి స్వర్ణకిరీటం తమన్నా చేతులు మీదుగా పెట్టించారు
ఆస్థాన పండితుడు పద్యరత్నాలు గొంతు విప్పి చదివాడు
సెక్రటరీ చిత్రరత్నాకర అనే నిలువెత్తు బిరుదు ఫలకం మంత్రి చేతుల మీదుగా ఇప్పించారు
వెనక కూర్చున్న ఓ పెద్దాయన ' తిక్కన పుట్టిన ఊళ్ళో తిక్క శంకరయ్య కాకుండా చిత్రశంకరయ్య పుట్టాడని చమత్కరించారు