Kishore Semalla

Comedy Drama Others


5.0  

Kishore Semalla

Comedy Drama Others


ఇదేం ట్విస్టు🙄

ఇదేం ట్విస్టు🙄

3 mins 34.2K 3 mins 34.2K


మనం ఆశించినది దొరికినప్పుడు, కోరుకున్నది చేరుకున్నప్పడు, ఇలా జరిగితే బాగున్ను అనుకునేది జరిగినప్పుడు మనలో తెలియని ఓ అనుభూతి కలుగుతుంది. అది ఎన్ని కోట్లు ఇచ్చిన కొనలేనిది. అది అంతులేని సంపద, ఎవరు మన నుంచి దోచుకోలేనిది.

అదే అనుకున్నది తేడా గా జరిగితే చెప్పేదే ఈ కథ...

     ****************************

తనని మొదటిసారి ఓ గుడిలో చూసాను. పచ్చ రంగు ఓని, పొడవాటి జడ, కొప్పునిండా సన్నజాజులు, మెడలో మెరిసే ఆ రవ్వల నెక్లెస్, తన కాలి మువ్వల సవ్వడి వీటన్నిటితో పాటు మెరిసే ముత్యం లాంటి తన మొఖం చూసిన మొదటి క్షణం లొనే నన్ను ఆకర్షించాయి.

ఇంత అందాన్ని ఇంతవరకు ఇంతసేపు నేను ఎప్పుడు చూడలేదు. దూరంగా నిల్చుని తన అందాన్ని ఆస్వాదిస్తున్న. ఎంత తిప్పుకున్న తన కళ్ళు ఐస్కాంతం లా నన్ను లాగేస్తున్నాయి. మాట్లాడలన్న ఆశ లోపల పరిగెడుతూ ఉంది. ఏం అనుకుంటుదోనన్న భయం కూడా ఓ వైపు.

మనసు కి కాస్త నచ్చజెప్పాలని పరిగెత్తుకుంటూ ఒక చోటికి చేరాను.

       

         "తొందర పడకు ఓ మనసా!!!" ఇంకాస్త సమయాన్ని ఇవ్వు. తన అందం అపురూప దర్శనం. తన నవ్వే మనకో వరం లాంటిది. తొందర పడి నలుగురిలో నవ్వుల పాలు అవ్వడం మనకు అవసరమా??? నువ్వే చెప్పు అంటూ నా బుజ్జి మనసుకు అర్ధం అయ్యేలా బుజ్జగించాను

కాసేపటికి కుదుటపడింది నా మనసు. మళ్ళీ వెనక్కి వెళ్ళాను. ఆ అందాల దేవత కనిపించలేదు. మొత్తం వెతికాను, కానీ అప్పటికే తను వెళ్లిపోయిందనుకుంటా, చాలా బాధ పడ్డాను. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో తన రూపం అనుకుని బయల్దేరాను.

ఎన్ని రోజులైనా తన అందం నా కళ్లెదుట అలానే నిలిచిపోయింది. ఎక్కడ మువ్వల సవ్వడి వినిపించినా తనేమో అనుకునేవాడ్ని. పొడవాటి జుత్తు కనిపిస్తే ఆగిపోయే వాడ్ని. తానో కాదో చూసే వాడ్ని. కలలో కూడా తన రూపమే. నన్ను తన మాయలో పడేసింది పూర్తిగా.......

కొన్నాళ్లకు అన్నయ్య పెళ్లి సందడి లో వున్నారు అందరు. నేను కూడా స్నేహితులతో వచ్చి పోయే చుట్టాలతో ముచ్చట్లు పెట్టుకుంటున్నా.

ఇంతలో ఫోటో కోసం స్టేజి పైకి రమ్మన్నారు నాన్నగారు. ఇప్పుడే వస్తా అని చెప్పి స్టేజ్ ఎక్కాను. నాన్నగారు భుజం పైన చేయి వేసి నిల్చున్న ఫోటో కోసం. కెమెరా మ్యాన్ 'స్మైల్ ప్లీజ్' అని చెప్పాడు.

ఇంతలో ఎదురుగా ఏ చూపు ఐతే నన్ను గుడిలో పలకరించిందో, అదే అందం ఎదురుగా. దేవత మళ్ళీ కరుణించింది. నా చూపు అంతా తన పైనే. కెమరామెన్ ఒక వైపు పిలుస్తున్నాడు. మళ్ళీ కళ్ళని దించితే తను దొరకదేమోనన్న భయం లోపల.

నాన్నగారు భుజం తట్టి పిలిచారు. కెమెరా వైపు చూడమని. చూసి చిన్న నవ్వు విసిరాను. మళ్ళీ నా చూపులు తనకోసం వెతికాయి. అక్కడ తను లేదు. చుట్టూ తనకోసం కాళ్ళని పైకి లేపి మరి చూస్తున్నా ఎక్కడా కనిపించట్లేదు తను.

ఛ!!! అనుకునే లోపు స్టేజ్ పైకి తను వాళ్ళ అమ్మగారు కలిసి ఫోటోకోసం వస్తున్నారు. నేను దిగబోయా...నాన్నగారు ఆగమన్నారు.... తను నా పక్కన నిల్చుంది. ఇంకేముంది నా గుండే వన్డే మ్యాచ్ లా పరుగులు తీస్తూనే వుంది.

ఈ అందాల దేవత నా పక్కన నిల్చుందా???? ఏం అదృష్టం ఇది అనుకున్నా. తను నా వైపు చూసి చిన్న నవ్వు విసిరింది, గాలితూఫాన్ తాకినట్టు అనిపించింది. నేను చిన్నగా నవ్వాను.

ఇంతలో నాన్నగారు పిలిచారు. నన్ను అడిగారు, ఎవరో గుర్తు పట్టవా నాన్న??? అని.

లేదు గుర్తు రావట్లేదు అని చెప్పాను.

మీ రత్నం పిన్ని రా అని చెప్పారు.

ఓ అవునా!!! అనుకుని, ఏంటి పిన్నా???? అనుకున్నా లోపల. అంటే తను నాకు చెల్లి అవుతుందా!!!

నాన్నగారు మీ చెల్లి రా... మర్చిపోయావ చిన్నప్పుడు మన ఇంటి దగ్గరే ఉండేవారు, మీరు ఇద్దరు ఆడుకునే వారు కూడా.

ఇంకా ఎన్ని చెప్పినా ఏం లాభం. నా ఫ్యూజ్ లు అప్పటికే ఎగిరిపోయాయి. ఇన్నాళ్లు అందాల దేవత, కలల రాకుమారి అనుకుని ఈ రెండేళ్ల లో ప్రపోజ్ చేసిన ప్రతి అమ్మాయిని చెల్లి అని పిల్చాను. ఇంత ఎదురు చూస్తే చెల్లి అంట అనుకుని క్రుంగిపోయాను.

ఐనా ఈ వరసలేంటో!!!! దేవుడు చాలా కఠినాత్ముడు. చూసి చూసి సురక పెడతాడు అనుకున్నా ఇంకా ఏం చెయ్యలేక.

ఇంతలో తను 'అన్నయ్య' బాగున్నారా???? అంది.

మండి పోయింది లోపల. చీ నా బ్రతుకు అనుకున్నాను ఇంక.

ఎంత కష్టంగా వున్నా చెల్లి అని పిలవాల్సి వచ్చింది. జన్మలో ఇంకా అందాన్ని ఆస్వాదించను, కలలు కూడా మానేస్తా అనుకుని నిశ్చయించుకున్న ఆరోజు.....

       ***********************************

కొన్ని కలలు నిజమైతే ఎంత బాగుంటాయో😍, అవే కలలు తేడా కొడితే ఇలా ఉంటుంది😂😀Rate this content
Log in

More telugu story from Kishore Semalla

Similar telugu story from Comedy