Kishore Semalla

Children Stories Comedy Drama

4.5  

Kishore Semalla

Children Stories Comedy Drama

తియ్యటి జ్ఞాపకాలు (ప్రేమ పరిచయం)

తియ్యటి జ్ఞాపకాలు (ప్రేమ పరిచయం)

5 mins
900         


బాల్యం అన్నాక ఆటలు, ఆనందాలు, అల్లరులు మరియు వీటితో పాటు ప్రేమ కూడా ఒక మధుర జ్ఞాపకమే...ఇప్పటి ప్రేమలు లా కాదు..అవి వేరే


ఆకర్షణ అనుకోవచ్చు.. కానీ ప్రేమలో మొదటి అడుగు అక్కడ నుంచే మొదలవుతుంది..ఎంతో మందిని చూసాను కానీ తన దగ్గరే ఆగిపోయాను.. తన అందాన్ని చూస్తూ రోజులు గడిపేసాను.. తనతో మాట్లాడటానికి మాటలే ఉండేవి కావు.. తన మాటలు వినడానికి ఇష్టపడేవాడ్ని.. తనకోసం స్కూల్ కి టైంకి రావడం.. అన్నిట్లో ముందుండి తన దృష్టి ని నా వైపు తిప్పుకోవాలని చాలా ప్రయత్నించేవాడ్ని.. ప్రేమ వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి... అంత తేలికగా తీసిపారేయకండి ప్రేమ ని..


తన పరిచయం, తనతో జ్ఞాపకాలు, తనతో గొడవలు, తన వల్ల కోపం, తన వల్ల ఆనందం... మొత్తం తనే అనిపించే ఒక ప్రపంచం... ఇదే చెప్పాలి అనుకుంటున్నాను.. అందరికి ఫస్ట్ లవ్ ఉంటుంది.. ఇది చదివాక మీకు మీ స్కూల్ లవ్ గుర్తుకు వస్తుంది అనుకుంటున్నాను..

        

       **************************


             ప్రేమ పరిచయం9థ్ క్లాస్ లో అసిస్టెంట్ స్పోర్ట్స్ లీడర్ గా నా బాధ్యత ని నిర్వర్తిస్తున్న రోజులు అవి.. అంతా నా చేతుల్లోనే వుండేది.. చాలా హుషారుగా వుండేవాడ్ని.. అప్పుడే ప్రిన్సిపాల్ నుంచి నాకు సందేశం వచ్చింది..


"కిషోర్ ఈ సంవత్సరం స్కూల్ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరగాలి"..పూర్తి బాధ్యత నీ మీద వేస్తున్న అంటూ ఆవిడ మొత్తం భారం నాపైన వేశారు...


నాకు తోడు నీడ సావన్ ఎల్లప్పుడూ నాతో ఉండేవాడు..పేరుకి ఇద్దరం లీడర్లు ఐనప్పటికీ ఇద్దరికి "అట్టెంషన్" పలకడం వచ్చేది కాదు.. స్టేజి మీదకి వెళ్ళాలి అంటే వణుకు వచ్చేది.. మా ప్రిన్సిపాల్ అందరి ముందు ఆలోచించకుండా పరువు తీసేసేది...


అలా మేమిద్దరం వార్షికోత్సవ వేడుకకి ప్రతి తరగతి నుంచి ఎవరు పాల్గొంటారు, ఏం ప్రదర్శన చేయబోతున్నారు అని వివరాలు సేకరించాం.. 


ఆధిపత్యమే నా చేతుల్లో ఉండేది.. అందుకే నా ఖాతాలో నాలుగు ప్రదర్శనలు వేసుకున్నాను.. 


డాన్స్ ప్రాక్టీస్ కోసం ఏదో ఒక గది దొరకదా అంటూ పోయాము...


అదే మొదటి సారి తనని నేను చూడటం..


లోపల పాటలు వినిపిస్తున్నాయి... ఇంగ్లీష్ పాట అది కూడా.. నాకు నచ్చని విషయం అదే, తెలుగులో ఊపున్న పాటలు, మెలోడీస్ ఇన్ని పాటలు ఉండగా.. వీళ్ళకి ఇంగ్లీష్ పాట కావాల్సి వచ్చిందా... కోపం తో డోర్ ని తెరిచాను...


అక్కడ ప్రాక్టీస్ చేస్తుంది అమ్మాయిలు.. సడన్ గా పాటని ఆపేశారు.. ఎందుకు లోపలికి వచ్చారు అని అడుగుతున్నారు అక్కడ ఉన్న అమ్మాయిలు.. కానీ నా కళ్ళు మాత్రం తననే చూస్తున్నాయి...


ఏముంది తను.. కళ్ళు తిప్పుకోలేకపోతున్నానే... వచ్చిన విషయం మర్చిపోయాను.. తనే కనిపిస్తుంది నాకు.. ఇంకేం మాటలు కూడా వినిపించట్లేదు.. తనని నేను ఇదే మొదటిసారి చూడటం.. "ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావ్???? నన్ను కలవడానికి ఇన్నేళ్లు పట్టిందా???" అని అడగాలనిపిస్తుంది...


అందర్నీ ఖాళీ చెయ్యమని నా ఫ్రెండ్స్ అక్కడ గొడవ చేస్తున్నారు నేను వున్నా అన్న ధైర్యం తో... 


అప్పుడే నేను షాక్ ఇచ్చా వాళ్ళకి..


పాపం రా!!! అమ్మాయిలు.. అందులో మన జూనియర్లు.. వాళ్ళు కాసేపు మనం కాసేపు ప్రాక్టీస్ చేసుకుందాం అంటూ అవకాశం ఇచ్చాను వాళ్ళకి...


మేము అక్కడే కూర్చుని వాళ్ళ డాన్స్ చూస్తున్నాం..


తను ఆ స్కూల్ గౌను లో డాన్స్ చేస్తుంటే నెమలి పురి విప్పి ఆడుతున్నట్టు అనిపించింది... (కానీ అందరికి అలా అనిపించాలని లేదు..నా లవ్ నా ఇష్టం నేను కొంచెం ఎక్కువగానే చెప్తాను మరి)..


అలా ఆరోజు కాసేపు వాళ్ళు ఇంకాసేపు మేము ఇలా ప్రాక్టీస్ చేస్తూనే టైం అయిపోయింది...


నాకు వాలీబాల్ అంటే చాలా ఇష్టం.. కానీ ఆరోజు నా ఏకాగ్రత అస్సలు ఆట మీద లేదు.. ఇలా ఆడుతున్నడేంటి అనుకున్నారు అందరూ.. ఆట మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయాను.. ట్యూషన్ లో కూడా సరిగ్గా చదవట్లేదు..ఇక అనుమానం నిజమనిపించింది...తను గట్టిగా హత్తుక్కుపోయింది నా గుండెకు.. నిద్ర పట్టదు.. తన కళ్ళు... అయ్యో!!! ఎంత వద్దన్నా కలలో కూడా వచ్చేస్తుంటే ఏం చెయ్యను...


మరుసటి రోజు తనకోసం ఎదురు చూసాను..రానే వచ్చింది...నవ్వుతూ పలకరించి వెళ్ళిపోయింది.. అప్పుడు బాక్గ్రౌండ్ లో వేసుకున్న ఓ సాంగ్ ( ఏమైంది ఈ వేళ.. ఎదలో ఈ సందడేలా... మిల మిల మిల మేఘమాల...) అనుకుంటూ..


మళ్ళీ తనకోసమే వాళ్లు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న చోటికే వెళ్ళేవాడ్ని.. తనతో మాటలు కోసం ఏదో ఒక కారణం వెతికే వాడ్ని...తనతో కలిసి డాన్స్ చెయ్యడం.. తనని ఎప్పుడు నవ్వించాలి అనుకోవడం నాకు అలవాటయిపోయింది..


ఏ చిన్న అవకాశం దొరికినా తనని వెతుక్కుంటూ వెళ్లిపోయేవాడ్ని మాట్లాడాలని.. ఇష్టం రోజు రోజుకి పెరుగుతూ ప్రేమ గా మారిపోతుంది..


తనకి చాక్లేట్లు అంటే చాలా ఇష్టం అని తెలుసుకున్నాను.. రోజుకో చాక్లేట్ తనకోసం తీసుకు వెళ్ళేవాడ్ని... ఇద్దరం ఎక్కువగా కలుసుకుని మాట్లాడుకున్న చోటు వాళ్ళ చెల్లి క్లాసురూమ్... టైం తెలిసేది కాదు తనతో మాట్లాడుతుంటే..


రోజు ఇంటికి వెళ్ళాక.. మళ్ళీ పగలు ఎప్పుడు అవుతుంది తనని మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాను అనే ఆలోచనతోనే పడుకునే వాడ్ని...


అలా మా వార్షికోత్సవ వేడుక రానే వచ్చింది.. తను రోజూ లా కాదు ఆరోజు చాలా కలర్ఫుల్ డ్రెస్ లో ఉంటుంది.. తనని చూడాలని అన్ని గదులు వెతుక్కుంటూ వెళ్లి చూసాను..


"దివి పైకి దిగిన ఏంజెల్ లా వుంది తను... బుగ్గన చిమ్కి మెరుస్తూ వుంటే ఆకాశం లో తారక లా కనిపిస్తుంది... అందం అంటే తనదే అన్నట్టు ఉంది.."


తనని చూసిన ఆరోజు ఇంకా గుర్తుంది నాకు.. తను నాకు మేకప్ చేస్తా అంటూ ఆరోజు చేసిన అల్లరి ఇప్పటికి నేను మర్చిపోలేను...


అలా స్కూల్ ఆఖరి రోజులు రానే వచ్చేస్తున్నాయి.. మళ్ళీ తనని చూడాలి అంటే రెండు నెలలు ఎదురుచూడాలి.. నా వల్ల కాదు.. తన మాటలు అలవాటు అయిపోయాయి నాకు.. ఎలా అనుకుంటూ నేను ఆలోచిస్తున్న...


ఆరోజు ఎప్పటిలానే మైక్ సెట్ చెయ్యడానికి నేను స్టేజి మీద నా హడావిడి లో నేను వున్నాను...అప్పుడే తను వచ్చింది అక్కడికి...


తన మాటలు :


ఇంకో వారం తరువాత నువ్వు నేను కలుసుకోము కదా!!! మరి నాతో మాట్లాడకుండా నువ్వు ఉండగలవా??? నన్ను చూడకుండా రెండు నెలలు ఎలా గడుపుతావు?? 


నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అప్పుడు తన మాటలకి..


సరే!!! నీ చెయ్యి ఇటు ఇవ్వు అంటూ నా చేతిని లాక్కుంది.. నా చేతిలో వాళ్ళ నాన్నగారి నెంబర్ రాసి..మాట్లాడాలి అనిపించినప్పుడు ఈ నెంబర్ కి కాల్ చెయ్యి అని చెప్పింది నవ్వుతూ...


ఇదంతా మా సీనా సిస్టర్ చూసేసారు.. వెనక నుంచి తలపైన ఒక్కటి ఇచ్చి.."ఏంటి రా?? అమ్మాయిల దగ్గరి నుంచి నంబర్లు కొట్టేస్తున్నావా?? అంటూ...


అది చూసి సిగ్గు పడుతూ తను అక్కడ నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది..


ఇప్పటికీ ఆ సందర్భం గుర్తు వస్తే నవ్వొస్తూ ఉంటుంది. అంత మంచి అనుభూతి అది..


తను వెళ్లి వాళ్ళ క్లాస్ వాళ్ళ తో నిల్చుంది ప్రేయర్ కోసం... స్టేజి పైన నేను ఎప్పుడు నిల్చున్న నా కళ్ళు తనని వెతుకుతాయి... కానీ తన కళ్ళు ఎప్పుడు నన్నే చూస్తూ ఉండేవి.. అది ప్రేమ లేకుంటే ఒకరి పైన ఒకరికి ఇష్టమా అర్ధం కాని వయసు మాది..


సెలవులు లో తను చాలా గుర్తుకు వచ్చేది.. అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడేవాడ్ని.. కొన్ని రోజుల తరువాత ఫోన్ లు ఎక్కువయ్యాయి.. దానితో ఫోన్ చెయ్యడం ఆపేయమని చెప్పింది...


తనని చూడకుండా ఉండలేక పోయేవాడ్ని.. ఇప్పటి లో 8థ్ 9థ్ అంటే బైకులు ఇచ్చేస్తున్నారు తల్లిదండ్రులు.. మాకు అలా కాదు..ఎంత దూరం వెళ్ళాలి అన్నా... సైకిల్ ఏ దిక్కు మాకు...


సైకిల్ వేసుకుని తనకోసం 6 కిలోమీటర్లు తొక్కుకుంటు వెళ్లి తను ఎప్పుడు ఇంటి నుంచి బయటకి వస్తుంది అని గంటలు గంటలు ఎదురు చూసేవాడ్ని.... తను కనిపించేదే కాదు....


రోజూ వెళ్లి ఎదురుచూసేవాడ్ని....


ఇలానే ఒకరోజు ఎదురు చూసి ఇక తను కనపడదు రోజు నాకు ఇది మాములే అనుకుని తిరిగి వచేస్తున్నా... 


ఆకలి వేస్తుంది పాని పూరి తిందాం అని సైకిల్ ఆపాను అక్కడ... అప్పట్లో ఒక్క రూపాయి కి మూడు పూరీలు.. ఐదు రూపాయిలు వుంటే ఆకలి తిరిపోద్ది మాకు..


తను కనిపించింది అప్పుడే వాళ్ళ నాన్నగారితో.. ఇంకేం వుంది నా మొఖం పైన స్ట్రీట్ లైట్స్ ఒక్కసారి వెలిగాయి.."మానస" అంటూ నోరుతెరిచాను... వాళ్ళ నాన్నగారు అదోలా చూసారు.. నేను అదంతా పట్టించుకోలే...


నా ఆనందం లో నేను వున్నాను....


ఇంతలో వాళ్ళ నాన్నగారు అడిగారు నన్ను... "కిషోర్ అంటే ఈ అబ్బాయేనా" అని...


అప్పటి వరకు ఉన్న ఆనందం కాస్త అనుమానంగా మారింది... మెల్లగా జారుకుందాం అనుకున్నాను అక్కడి నుంచి...


కానీ మానస నే అర్ధం చేసుకుంది నా ఇబ్బంది...


నువ్వు ఇలా రోజు నాకోసం రాకు.. స్కూల్ ఇంకో 20 డేస్ లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది.. మనం అప్పుడు కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయింది..


అలా తనకోసం ఎదురు చూసిన ఆ ఇరవై రోజులు నాకు 365 రోజుల్లా అనిపించింది.. ఎంతకీ రోజులు గడవట్లేదు ఎందుకని అనిపించింది..


మళ్ళీ స్కూల్ రిఓపెనింగ్


మానసా ని చూడాలి.. తను రాబోతుంది.. ఎంత హుషారుగా ఉన్నానో స్కూల్ కి వెళ్ళడానికి..


నా హుషారు చూసి చదువు అంటే ఎంత శ్రద్ద అనుకున్నారు ఇంట్లో.. నేను అలానే కటింగ్ ఇచ్చాను..


తను సెకండ్ బస్ లో వస్తుంది.. త్వరగా వెళ్లి ఎదురుచూస్తున్న తనకోసం... వస్తుంది, కలవాలి అని.. మీరు ఆరోజు నన్ను చూడాలి... నా మొఖం వెలిగిపోతుంది.. ఎంతో కాలం తరువాత తనని కలవబోతున్నా అన్న సంతోషం..


బస్ వచ్చింది ఇంతలో...


ఏం జరిగి ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా??? నాకు సస్పెన్స్ లో పెట్టడం అలవాటు మరి.. ఇంకో ఎపిసోడ్ లో చెప్తా మరి... అది పెద్ద కథ.. ఎమోషన్స్ చాలా ఉంటాయి..


      ******************************

మొదటి లవ్ చాలా స్పెషల్.. మీకు ఉంటాయి, అందరు ఒక్కసారి అలా గుర్తు చేసుకోండి మీ ఫస్ట్ లవ్ ని...


Rate this content
Log in