Kishore Semalla

Children Stories Others Children

4.5  

Kishore Semalla

Children Stories Others Children

తియ్యటి జ్ఞాపకాలు (10th Class)

తియ్యటి జ్ఞాపకాలు (10th Class)

5 mins
622


ఇది కథ కాదు సుమా!!! నా 10థ్ బ్యాచ్ గుర్తొచ్చి రాస్తున్న.. 11 ఏళ్ల బంధం ఒక్కసారి గా విడిపోయిన క్షణాలు అన్నీ గుర్తుకు వచ్చి రాస్తున్న.. 11 ఏళ్ల ప్రయాణాన్ని రాయాలి అంటే అది పుస్తకం కాదు, నిఘంటువు అవుతుంది. అంత ఓపిక నాకు లేదు. కేవలం ఒక్క నా పదో తరగతి అనుభవాలు మాత్రమే రాస్తున్న..అందరూ గుర్తు చేసుకోవాలి కాబట్టి ముందు ఒక్కొకరిని పరిచయం చేస్తూ జ్ఞాపలకలని నెమరు వేసుకుందాం…


ఎవరి తో మొదలుపెడదం..అందరికి సమన్యాయం చెయ్యాలి. ఎవడితో మొదలుపెట్టిన ఇంకొకడు హర్ట్ అవుతాడు...అందుకే ఈ ప్రయాణాన్ని ఆధిపత్య పోరు నుంచే మొదలుపెడదాం…


            ఆధిపత్య పోరు


స్కూల్ బెల్ మోగింది. టైం చూస్తే ఇంకా రెండే అవుతుంది. విడిచి పెట్టే టైం కాలేదు ఇంకా.. అందర్నీ మైదానం మీదకి రమ్మని ప్రిన్సిపాల్ ఆదేశం. క్లాస్ లో కూర్చోవాలి అంటే కష్టం కానీ బయట ఎండలో గంటకు పైగా తిరగలన్నా ఎక్కడ లేని ఓపిక వస్తుంది అందరికి.



అర్ధం అయ్యింది అందరికి ఇది ఎలక్షన్ టైం.. ఈ ఎలక్షన్ కి ప్రచారాలు ఉండవు, పంఫ్లేట్లు పంచరు.. బ్యానర్ లు కట్టరు, బ్యాండ్ మేళం పెట్టరు. చేసేది అల్లా ఒక్కటే. ఎవరు కావాలో నిర్ణహించేది స్టూడెంటసే… ఎవరి పేరుకి ఎక్కువ చేతులు లేస్తాయో వాడే స్కూల్ పీపుల్ లీడర్…



ఆధిపత్య పోరుకు సిద్ధంగా ఓ నలుగురు నిల్చున్నారు.. ఊహించని పేర్లన్నీ వినపడ్డాయి నా పేరు తప్ప.. అదేంటో లీడర్ అవుతానని నమ్మకం వున్నా ఎవరైనా నన్ను నియమించాలి పోరుకు."ఇంకా నా పేరు రాదు, ఎలా రా అనుకుంటున్నాను… అప్పటికీ నా ఫ్రెండ్ కిరణ్ గాడిని అడిగాను వెళ్లి నామినాట్ చేయరా'' అని.. వాడికి మొహమాటం ఎక్కువ….ఇంక హోప్స్ లేవు గెలుస్తాను అని.. అప్పుడు లేచింది అండి నారామని… నన్ను గెలిపించడానికి… వేరు ఎవరో కాదు...వన్ అండ్ ఓన్లీ "సంజన." తను లేవడం, నా పేరు చెప్పడం, అంతా ఏదో కం అండ్ గో లా అనిపించింది ఒక్కసారి…(అత్తారింటికి దారేది డైలాగ్ గుర్తు చేసుకోండి)



కానీ ఇంకా టెన్షన్ తగ్గలేదు.. ఎందుకు అంటే నాతో పోటీ కి నిల్చున్నది వేరు ఎవరో కాదు సావణ్ గాడు. అసలే గత సంవత్సరం నా పైన స్పోర్ట్స్ లీడర్ గెలిచి నన్ను అసిస్టెంట్ గా చేసుకున్నాడు.. కానీ ఈసారి ముందస్తు చర్య గా నేను ఒక నెల ముందు నుంచే చిన్న క్లాసు లని నా ఆధీనంలోకి తెచుకున్నాను..


కానీ మావరకు ఇంకా వోటింగ్ రాలేదు.. మా కన్నా ముందు ఇద్దరు దిగ్గజాలు ఉండడం మాకు కొంచెం కాలి కింద ముళ్ళు లానే అనిపించింది.. అది తీస్తే కానీ ముందుకు వెళ్లలేము, వీళ్ళ ఓటింగ్ జరిగితే కానీ మావరకు రాదు.. మొదటి దిగ్గజం ఐన కుషల్ కి ఓటింగ్.. కంగారు గానే మాకు వుంది ఏం జరుగుతోందో అని…



అంత కంగారు పడొద్దు అన్నట్టే వచ్చాయి ఓట్లు… కుషల్ గాడికి ఒక వోట్… వేసింది రెండో దిగ్గజం ఐన సాయి కాంత్…...ఆవు చేను మేస్తే దూడ గట్టు మేస్తుందా.... సాయి కాంత్ కి ఒక్క ఓటే, వేసింది కుషల్ గాడు..



మా వరకు వచ్చాయి ఓట్లు.. గెలిచే తీరాలి, లేకుంటే మళ్ళీ అసిస్టెంట్ గా నా వల్ల కాదు.. అప్పటికి కింద నాకు లేచిన చేతులే వాడికి లేస్తున్నాయి.. కొంచెం రసవత్తరంగానే జరిగింది పోరు.. కానీ ఈసారి సావన్ తల దించుకోక తప్పలేదు…



స్కూల్ పిపుల్ లీడర్ కిషోర్…. వినడానికి ఎంత బాగుంది ఆ పిలుపు.. కానీ ఏం చేసేవాడినో తెలిస్తే అంత చెండాలంగా ఉంటుంది..



అసెంబ్లీ కి మైక్ సెట్ సిద్ధం చెయ్యాలి.. ఎప్పుడు మూడో బెల్ కొడితే కానీ స్కూల్ కి రాని నేను ఒక అరగంట ముందే రావడం, నిన్న వేసిన పాట ఈరోజు వెయ్యకపోవడం, ఎవరూ రాకపోతే ఆరోజు ప్రేయర్, న్యూస్ రీడింగ్, థాట్ ఫర్ తీ డే, జాతీయ గీతం అన్నీ నేనే చేయాలి…..ఇది మన తలరాత...కావాలని తెచ్చిపెట్టుకున్నది..అలా ఆధిపత్య పోరు ముగిసింది… ఇప్పటికి దిగ్గజాలు ఓట్లు గురించి చర్చలు వస్తూనే ఉంటాయి.. అదొక సరదా జ్ఞాపకం😀


            

            ర్యాంక్ ల జోరు



మేము 10థ్ క్లాస్ కి వచ్చామని.. అసలైన ఘట్టం ఇదేనని.. ఇంట్లో పేరెంట్స్ నుంచి స్కూల్ లో టీచర్లు వరకు ఒకటే మాట మా చెవులకి చిల్లులు పడేలా చెప్పి విసిగించేసారు…ఎంతలా అంటే నాకే ర్యాంక్ తెచ్చుకోవాలన్న కసి పుట్టేంత. 


10థ్ క్లాస్ కి ఎవరు అవతారో తెలీదు క్లాస్ టీచర్. అందరం ఎదురుచూస్తున్నాం..ఎగ్జామ్ హాల్ లో కూర్చుంటే ఔట్ ఆఫ్ సిలబస్ నుంచి క్వశ్చన్ వచ్చినట్టు అసలు ఊహించనే లేదు….వనిత సిస్టర్ మాకు క్లాస్ టీచర్ గా వస్తుంది అని…


ఆవిడ సరిగ్గా పట్టించుకోలేదు కానీ...ఆరు సబ్జెక్టులు చెప్పమన్నా నేను రెడీ అంటూ సిద్ధంగా వుంటారు…లేకపోతే ఏంటి అండి??? బయాలజీ పుస్తకాన్ని మొత్తం బట్టిపట్టేశారు…మధ్యలో కనీషం అక్షరం కూడా మర్చిపోరు.. ఆవిడ సివిల్స్ కి ప్రిపేర్ కాలేదు కాబట్టి సరిపోయింది… ఆమె ముందు ఆ పుస్తకాలు ఎంత అని అనిపించేది… కానీ ఆవిడ రాకతోనే మేము చాలా కష్టపడ్డాము.. బయాలజీ అనే సబ్జెక్ట్ కోసం నేను అంతలా కష్టపడ్డాను అంటే ఆరోజుల్లో ఆ డెడికేషన్ అలా ఉండేది మరి…


అప్పుడే వచ్చాయి నిఘా వర్గానికి పేర్లు...ఎవరెవరు ర్యాంక్ ల కోసం ప్రయత్నిస్తున్నారు అని… నిఘా వర్గం లో నేను లేను కానీ నా పేరు వుంది వాళ్ళ లిస్ట్ లో… కబురు వచ్చింది, నీకు ఏ ర్యాంక్ కావాలని??? ఆశ్చర్యమే అది మరి... 


ర్యాంక్ లు నిఘా వర్గం డిసైడ్ చెయ్యడం ఏంటి??? అని…ఏదో ఒక ర్యాంక్ ఇవ్వండి... ర్యాంక్ వస్తే చాలు అన్నది నా సంతృప్తి…


వీడికి 3rd ర్యాంక్ ఇచ్చేయండి అంటూ నిఘా వర్గ అధ్యక్షుడు నుంచి ఆదేశం.. మళ్ళీ ఆశ్చర్యం


అసలు తన చేతిలో భూగోలన్నీ తిప్పే శక్తి ఉందా అనిపించింది… 


శక్తి అంటే గుర్తొచ్చింది.. వీడు ఇంకో దిగ్గజం.. ఇప్పటికి వీడ్ని ఎడిపించే ఒకే ఒక ప్రశ్న ౼ "పోతన గురించి రాయుము" ...జవాబు మూడు లైన్ లే ఐనా మనోడికి అది అగ్నిపరీక్ష. ఎన్ని సార్లు అడిగి ఎడిపించమో!!!



వీడ్ని శక్తి అనే కన్నా శక్తి భయ్యా అంటేనే చాలా మంది గుర్తు పడతారు.. రాఖీ పండగ వస్తే నువ్వా???నేనా??? అనేటట్టు ఉండేది మా ఇద్దరికి పోటీ...అప్పట్లో సరదాగా అనిపించినా ఇప్పుడు ఎప్పుడైనా చర్చలు పడితే వాడికి నాకు...అలా ఎలా చేసాం అనుకుంటాం😂😀


అదేంటో బాలీవుడ్ ని ఖాన్లు ఏలుతున్నట్టు...చిన్నప్పటి నుంచి శక్తి ఏ క్లాస్ లీడర్ మాకు.. కుర్చీని ఐతే వదల్లేదు..వేరే పదవి ఆశించడు.. వాడికి శత్రువులు అంటూ ఎవరు లేరు కానీ ఎడిపించే వాళ్ళు మాత్రం వున్నారు..



ఇంకెవరు మోహిత్రాజు… వాళ్లు ఆటపట్టించటం, వీడికి మండి బోర్డ్ మీద వీళ్ళ పేర్లు రాయడం.. ఇంకా అతి చేస్తే ఆ పేర్ల పక్కన బోర్డ్ సరిపోదు ఏమో అన్నట్టు ఇంటూ లు కొడుతూనే ఉండేవాడు… అప్పటివరకు ఎగిరే వాళ్ళు సరిగ్గా ఎవరైనా సర్ క్లాస్ కి వస్తున్నారంటే కాళ్ళ బేరానికి వస్తారు.. హాహాహా!!! రజినీకాంత్ స్టైల్ లో నవ్వి ఆ పేర్లన్నీ చేరిపేసేవాడు...



శక్తి గురించి చెప్పి తన గురించి చెప్పకపోతే అస్సలు ఊరుకోదు మా ప్రసన్నా..మా ఇద్దరికీ ముద్దుల చెల్లి.. ఇప్పటికి వీడిపోని బంధం మాది..ముగ్గురం కలిసాం అంటే ముచ్చట్లు కి టైం కూడా సరిపోదు.. చాలా కామ్ అంటూ అందర్నీ నమ్మించి బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ దొబ్బేసింది… నిజానికి మేము చాలా అల్లరి చేసేవాళ్ళం.. 



వీళ్ళ అల్లరిని చూసి వనిత సిస్టర్ IIT క్లాస్ లే తీసుకునే వారు… ఏం మాట్లాడారో వాళ్ళతో ఇప్పటికి అది గండికోట రహస్యమే మా అబ్బాయిలకు…



సరే ర్యాంక్ ల కోసం వినపడిన పేర్లు.. కొత్తగా నాది, శ్రావ్య( 10థ్ లో అనుకోకుండా బయటకి వచ్చిన పేర్లు)..పాత వాళ్ళ హావా అలానే కొనసాగేది...

కానీ అప్పుడే అర్ధం అయ్యింది. ర్యాంక్ రావాలి అంటే అంత కష్టపడాలా అని.. మరి అత్యాశ కి పోలేదు.. వచ్చిన దానితో సరిపెట్టుకున్న అప్పటినుంచి.. కొత్తగా లిస్ట్ లో చేరిన అందరు కూడా మెల్లమెల్లగా చల్ల బడ్డారు.. ఒక్క శ్రావ్య తప్ప… ఎక్కువ సార్లు ప్రిన్సిపాల్ నోట్లో వినపడిన పేరు (నా తరువాత)..



తన మీద పెట్టుకున్న నమ్మకానికి స్కూల్ మొత్తం ఎక్కడ మా స్కూల్ పేరు పేపర్ లో పడిపోతుందో… కేశవ రెడ్డి, భాష్యం ముసుకోవాల్సి వస్తుందో అన్నంత భయమే కలిగింది.. కానీ అంత అవకాశం ఇవ్వలేదు శ్రావ్య… తను నా తోటి మిత్రురాలు అన్న విషయం మర్చిపోలేదు… నాకు తెలిసి 10థ్ తరువాత ప్రిన్సిపాల్ని కలిసే ధైర్యం కూడా చెయ్యలేదు అనుకుంటా… కానీ నేను చేసాను😄... 


ఆవిడ తిట్లే నాకు వరాలు అన్నట్టు అనిపించేవి.. ఏదో మంచే జరిగేది ఆవిడ అన్నప్పుడల్లా…


అలా చదువుల్లో కుస్తీలు మొదలయ్యాయి మా మధ్య… ఇది ఎంత రాసిన తరగదు… ఎందుకంటే ఎన్ని పరీక్షలు రాసామో లెక్కేలేదు కాబట్టి… అంతటితో ర్యాంకలు పరంపర ముగిసింది మా మధ్య....


ఎందుకో హాయిగా అనిపించింది ఈరోజు గత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటే... మళ్ళీ నచ్చినప్పుడు, బాగా గుర్తొచ్చినప్పుడు ఇంకో జ్ఞాపకం తో మరింత ఆహ్లాదకరంగా రాస్తా.. నవ్వేవాళ్ళు ఉండాలి.. మీ పాత రోజులు గుర్తు చేసుకోవాలి....


Rate this content
Log in