Kishore Semalla

Drama Crime Thriller

4.8  

Kishore Semalla

Drama Crime Thriller

ఫింగర్ ప్రింట్స్- ఎపిసోడ్-4

ఫింగర్ ప్రింట్స్- ఎపిసోడ్-4

4 mins
2.2K



కార్ ఇంటి దగ్గరికి వచ్చి ఆగింది. కాసేపు ఏం జరగట్లేదు అనే అనుకోండి. అప్పుడు తెరుచుకుంది డోర్.... బయటకి నవ్వుకుని అడుగుపెట్టింది శ్వేత.. 

అటు వైపు నుంచి కిందకి దిగాడు ఆనంద్...


ఆనంద్ శ్వేతా బాయ్ఫ్రెండ్...ఇద్దరు ఇంటిలోపలికి వెళ్లారు.



ఇంటిలోనికి చేరుకోగానే డోర్ లాక్ వేసి శ్వేత ని వెనక నుంచి గట్టిగా వాటేసుకున్నాడు. ఏంటి??? ఇందుకేనా బెంగళూరు నుంచి వచ్చేసావు.. ఆగలేక పోయాడు అబ్బాయి, లోక్డౌన్ లో కూడా ఇంత దూరం వచ్చాడు నాకోసం అనుకుని మురిసిపోయింది.



అంతలేదులే!!!! ఇలాంటి అవకాశం మళ్ళీ దొరుకుతుందా??? నువ్వు నేను ఒక ఇంట్లో ఇలా కొన్ని రోజులు... అబ్బా!! ఈ అవకాశం ఎందుకు వదులుకోవాలి అని వచ్చేసానే తింగరి బుచ్చి అని తన మెత్తని బుగ్గలని కొరుకుతాడు...



తన కౌగిలిని వదిలించుకుని...అంటే నా మీద ప్రేమ తో రాలేదు... ఇద్దరం కలిసి కొన్ని రోజులు కలిసివుండొచ్చు అని వచ్చావ్.... పో! నువ్వు నీ బెంగళూర్ వెళ్లిపో అని తోసి పక్కకి తిరిగి బుంగమూతి పెట్టుకుంది...



మళ్ళీ తనని దగ్గరకి లాక్కుని... బుజ్జి బంగారం!! సరదాగా అన్నానురా... ఇన్ని రోజులు నిన్ను కలవాలి అని ఎంత అనుకున్నా నా జాబ్ వల్ల కుదిరేదే కాదు.. ఇప్పుడు 'వర్క్ ఫ్రొం హోమ్' ఉంది గా ఇక్కడ ఎన్ని రోజులు వున్నా పర్లేదు.. పగలంతా పని చేసుకుంటూ రాత్రైతే నీతో అని అనేలోపే శ్వేత కలగజేసుకుంది..



ఆపు!!! ఇప్పుడు ఆ పప్పులు ఏమి ఉడకవు.. నువ్వు ఆ గదిలో నేను ఈ గదిలో పడుకుంటున్నాం. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని బుద్ధిగా మంచి పిల్లోడీలా వుండు అని వంట గదిలోపలికి వెళ్ళిపోయింది.



మాంచి హాట్ కాఫీ పెడతా అది తాగి కూల్ అవ్వు అని చెప్పి నవ్వుకుంది తనలో తానే. ఇంకేముంది అయ్యగారి మూడ్ డల్ అయిపోయింది. ఫ్రెషప్ అయ్యి వస్తా అని చెప్పి బాత్రూం లోపలికి వెళ్ళిపోయాడు.



స్నానం చేసి వచ్చిన ఆనంద్ కి వెంటనే హాట్ కాఫీ వాసన తగిలింది. గట్టిగా పీల్చాడు..



ఏంటి సర్!!! ఏమైనా గుర్తు వస్తున్నాయా కాఫీ ని చూస్తుంటే అని అడిగింది శ్వేతా...



టవల్ మీద వున్నాడు ఆనంద్. తడిచిన జుత్తు, సిక్స్ ప్యాక్ దేహం తో బాలీవుడ్ హీరో లా కనిపిస్తున్నాడు శ్వేతా కి.... 



హాల్ లో సోఫా లో కూర్చుని వుంది శ్వేత. దగ్గరకి వచ్చాడు, టీ పాయ్ మీద వున్న కాఫీ ని చేత్తో తీసుకుని తన పెదాలతో ఒక సిప్ వేసాడు... సుగర్ తక్కువ అయినట్టు ఉంది అని చెప్పాడు... దానికి శ్వేతా ఏది నన్ను చూడని అని తన పెదాలతో సిప్ వేసింది. 



సరిపోయింది కదా!! ఎందుకు అబద్ధాలు చెప్తావు అని అలిగింది. 



అవునా!!! ఏది ఇటు ఇవ్వు అని కాఫీ ని ఈసారి మళ్ళీ తీసుకుని సిప్ చేసాడు. అవును ఇప్పుడు ఇంకా తియ్యగా అమృతం లా వుంది అని చెప్పేసరికి శ్వేత కి సిగ్గు మొగ్గలేసింది. బేబీ "ఐ లవ్ యు" అని హగ్ చేసుకుంటుంది.



నీ చేతి కాఫీ తాగి చచ్చిపోవచ్చు తెలుసా??? అని చెప్తాడు ఆనంద్ శ్వేత మెడ పైన ఉన్న కురులను వెనక్కి జరిపి. వెంటనే కాలింగ్ బెల్ మొగుతుంది..



ఇప్పుడు ఎవడు వచ్చాడు.. మంచి అవకాశం మిస్ అయ్యింది అనుకుని నిరాశ పడతాడు ఆనంద్..



శ్వేతా డోర్ తీస్తుంది...



బయట ఒక బొకే ఉంటుంది.. చూస్తే ఎవరూ ఉండరు అక్కడ. ఏంటి ఈ బొకే ఎవరు వచ్చారు అని ఆనంద్ అడుగుతాడు..



ఎవరు లేరు కానీ బొకే వుంది ఇక్కడ చూస్తే అని శ్వేతా బదులిస్తుంది.



ఆగు!!! ఇందులో ఏదో లెటర్ కూడా వుంది. నాకే ఈ బొకే వచ్చింది. తెరచి చూసాడు ఆనంద్. 



"You will die soon" అని రాసి పెట్టి ఉంది అందులో. 



శ్వేత కి భయం మొదలయ్యింది. అయ్యో!!! ఏంటిది??? ఎవరు పెట్టి వుంటారు??? నాకు భయం వేస్తుంది ఆనంద్ అని చెప్పింది శ్వేత.



భయపడకు... నాకు ఏం కాదు. ఎవడో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు అని ధైర్యం చెప్పాడు.


        

      ********************************


రీనా జోసెఫ్ హాస్టల్లో రంజిత్ : 


రంజిత్ రీనా జోసెఫ్ రూమ్ లో మళ్ళీ వెతకాలని నిర్ణహించుకున్నాడు. అందుకు హాస్టల్ వార్డెన్ దగ్గర నుంచి తాళాలు తీసుకున్నాడు. 



రీనా చనిపోయిన రోజు ఎక్కడికి వెళ్ళింది. తనకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ వున్నారా??? నీకు ఏమైనా తెలుసా??? అని వార్డెన్ ని అడిగాడు.



అయ్యో!!! ఆ అమ్మాయి చాలా మంచిది సర్.. దేవుడు అంటే చాలా పిచ్చి. ప్రతి ఆదివారం చర్చ్ లోనే రోజంతా గడుపుతుంది. అసలు హాస్టల్లో పిల్లలు అందరూ ఇళ్ళకి వెళ్లిపోతుంటే లోక్డౌన్ వల్ల ఈ అమ్మాయి మాత్రం ఇక్కడే ఉండిపోయింది. తను ఒక అనాధ సర్. పాపం నేను కూడా ఆరోజు ఇక్కడ లేను. పొద్దునే చూస్తే తను ఇలా దారుణంగా చంపబడింది అని బోరున ఏడవడం మొదలుపెట్టింది..



కూల్ డౌన్... ఆమెకి నీళ్లు ఇవ్వండి అని కాంస్టేబుల్ కి చెప్పాడు.



రూమ్ మొత్తం మళ్ళీ ఇంకోసారి శోధించాడు... ఏం దొరకలేదు అక్కడ. సరే అని బయటకి వచ్చేస్తున్నాడు. తనకి ఈగలు ఎక్కువగా అక్కడ ఉండడం గమనించాడు...



ఎక్కడ నుంచి ఈగలు వస్తున్నాయి అంటూ అలా ముందుకు కదిలాడు. పైకి మెట్లని ఎక్కుతూ పరిసరాలు గమనిస్తున్నాడు.. అక్కడ అక్కడ పడిన రక్తం మరకలు, మెట్ల పై పడిన సగం బూటు గుర్తులు పూర్తిగా విషయం తెలిసేలా అనిపించడం లేదు.



హంతకుడు తనని చంపి పారిపోయే క్రమం లో తన కాలి కి అంటుకున్న రక్తం మరకలని మర్చిపోయాడు. తన బూటు సైజ్ 11, అంటే మనిషి ఎతైనవాడు. నల్ల జాకెట్ మొత్తం ముసుగు తో వస్తున్నాడు. ఈ గుర్తులతో ఛాయా చిత్రం గీయమని చెప్పాడు రంజిత్.. 



ఇంత తెలివైన వాడు ఫింగర్ ప్రింట్స్ కావాలనే ఎందుకు వదులుతున్నాడు.... అసలు తనవేనా ఆ ఫింగర్ ప్రింట్స్..... మమ్మల్ని దైవర్ట్ చెయ్యడానికి వాడుతున్నాడా????



వెంటనే ఫోన్ తీసి తన ఫ్రెండ్ సుష్మా కి కాల్ చేసాడు. "do me a favour" అని అడిగాడు. తప్పకుండా అని బదులిచ్చింది తను.



ఏం లేదు... ఇప్పటివరకు హాంతకుడి ఫింగర్ ప్రింట్స్ మా దగ్గర ఉన్న క్రిమినల్ రికార్డ్స్ తో మత్గ్రామే మ్యాచ్ చేసాము. కానీ నాకు అనుమానం ఇది ఎవరో సామాన్యుడే చేస్తున్నాడు. నాకు ఆ ఫింగర్ ప్రింట్స్ కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరి తో మ్యాచ్ చెయ్యాలి... ఐ గెస్ మనకి అప్పుడే క్లూ దొరకొచ్చు... అని రంజిత్ వేరే కోణం నుంచి ఆలోచించడం మొదలుపెట్టాడు.



రంజిత్ ఇది చాలా సెన్సిటివ్ మేటర్. ఇక్కడ ఎవరికి తెలిసినా నా పని అంతే, కానీ నీకోసం చేస్తాను... అని సుష్మా చెప్పింది.



"థాంక్ యు వెరీ మచ్" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. ఇంకో 48 గంటల్లో నిన్ను పట్టుకుంటా క్రిమినల్ అని రంజిత్ చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు.



       ******************************


మిగతా కథ తరువాయి భాగం లో..


Rate this content
Log in

Similar telugu story from Drama