Kishore Semalla

Horror Thriller Others

4.5  

Kishore Semalla

Horror Thriller Others

అర్ధరాత్రి ఆడపిల్ల

అర్ధరాత్రి ఆడపిల్ల

4 mins
710


రోజు రాత్రి సుమ లేట్ గా ఇంటికి వెళ్తుంది..భర్త దుబాయ్ లో ఉంటాడు..సుమ చేసే పని సిమెంట్ ఫ్యాక్టరీలో గుమస్తా..రోజు లెక్కలు చూసి అన్ని సవ్యంగా ఉన్నాయని అనుకున్నాకే ఇంటికి బయల్దేరుతుంది. రోజువారీ లెక్కలు చూడకపోతే మళ్ళీ తేడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని ఆమె భయం..తనది పలాస దగ్గర ఉన్న టెక్కలిపట్నం..ఫ్యాక్టరీ టెక్కలి లో ఉంటుంది..రెండు ఊర్ల పేరులో టెక్కలి ఉన్న రెండు ఊర్లకి దూరం పది కిలోమీటర్లు ఉంటుంది..భర్త ఎంత సంపాదించి ఇంటికి పంపించిన తనకి ఇంటిపట్టున కూర్చోవడం ఇష్టం ఉండదు.అందుకే ఉద్యోగం చేస్తుంది..పైగా పిల్లలు కూడా లేరు ఇంకా..ఇంటికి ఆలస్యంగా వచ్చినా పెద్దగా కంగారు పడటానికి లేదు. అత్తమామలు ఉంటారు..ఇంత కష్టపడటం ఎందుకు ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా అని వాళ్ళ గోల..ఎవరు ఎన్ని చెప్పినా సుమ అనుకున్నదే చేస్తుంది..

సుమ వాళ్ళ ఊరు బాగా వెనుకబడిన గ్రామం..ఊరంతా తిప్పికొడితే ఒక వంద ఇల్లు కూడా ఉండవు..ప్రతీ ఊరిలో ఉన్నట్టే ఆ ఊరిలో కూడా ఉద్యోగాలు లేక ఖాళీగా తిరిగే వాళ్ళు చాలా మందే ఉన్నారు.. అందులో ఇద్దరు ఎప్పుడు సుమ ఆఫీస్ కి వెళ్తున్నా తన వంక వేరే విధంగా చూసే వారు..

సుమ భర్త దుబాయి లో ఉన్నాడు కదా! అనే ధైర్యం వీళ్ళది..కానీ ఇలాంటి వాళ్ళకి భయపడదు సుమ..ఎవడైనా ఎక్కువ చేస్తే అక్కడే చెడమెడ వాయించేస్తాది..

సుమ ఇంటి నుంచి బయలుదేరిన ప్రతీసారి వాళ్ళు వెనుక వస్తుంటారు. తిరిగి సుమ ఇంటికి వచ్చినప్పుడు ఊరు బయటే కనిపిస్తారు..సుమ వాళ్ళని చూసి లోపల భయం ఉన్నా బయటకి కనపడకుండా చూసుకుంటుంది..

ఆఫీస్ లో కూడా సుమకి అభిమానులు ఎక్కువే..ఎవరి ప్రయత్నం వాళ్లు చేస్తుంటారు తనతో మాట్లాడటానికి, తనతో స్నేహం చేయడానికి..కానీ సుమ ఎవరిని ఎక్కడ పెట్టాలో బాగా తెలిసిన ఆడది..అందరితో స్నేహంగానే ఉంటుంది కానీ ఎవరికి మితిమీరిన చనువు ఐతే ఇవ్వదు..

ఒకరోజు సుమ వాళ్ళ తోడికోడలు శ్రీమంతం ఉంటే వాళ్ళ అత్త మావయ్య వెళ్లారు. పుస్తకాల్లో తేడాలు వచ్చాయని ఆడిటర్ ఫ్యాక్టరీలోనే ఉన్నాడు. సుమ వదిలి రాలేదు అక్కడ నుంచి. సాయంత్రం కాస్త రాత్రి అయ్యింది.

పుస్తకాలు సరిగ్గానే ఉన్నాయని నమ్మాక అప్పుడు ఆడిటర్ తనని వదిలాడు..రాత్రి ఎనిమిది కే ఆఖరి బస్ వస్తుంది. కానీ ఇప్పుడు సమయం ఎనిమిదిన్నర అయ్యింది.

ఎలా అని అర్ధం కాలేదు తనకి..

సుబ్బారావు అనే తన తోటి ఆఫీసర్ తనతో పాటే ఉన్నాడు ఆఫీస్ లో..ఇద్దరికి ఆలస్యం అయ్యింది ఆరోజు..

సుమ ఎలా వెళ్ళాలి ఇప్పుడు..సమయానికి మావయ్య కూడా ఊరిలో లేరు అని ఆలోచిస్తూ ఉంటుంది..

సుబ్బారావు సుమ ఇబ్బందిని గమనించి..

"మేడం! డ్రాప్ చెయ్యమంటారా? లేట్ అయినట్టుంది మీకు అని అడుగుతాడు.."

పర్లేదు! మీకెందుకు శ్రమ. నేను వెళ్లగలను..మావయ్య కి ఫోన్ చేస్తాను, ఎవరినైనా పంపిస్తారు అని చెప్తుంది సుబ్బారావు తో .

ఇప్పటికే ఆలస్యం అయ్యింది. పైగా మీ ఊరు ఇక్కడేం లేదు.. పది కిలోమీటర్ల దూరం ఉంది..మీ ఊరు నుంచి కార్ వచ్చినంత వరకు ఇక్కడ ఎలా ఒంటరిగా ఉండగలరు.

మరేం పర్లేదు రండి నేను మిమ్మల్ని దిగబెట్టి మా ఇంటికి వెళ్లిపోతాను అని నచ్చజెప్తాడు సుబ్బారావు తనని..

ఒక మనిషిని పైగా మగాడిని నమ్మడం అంత మంచిది కాదని తన అభిప్రాయం కానీ సుబ్బారావు ని చాలా రోజులు నుంచి చూస్తుంది ఆఫీస్ లో..మంచోడే, అన్నిట్లో సాయం చేస్తాడు, పైగా ఎవరి దగ్గర ఆయన గురించి తప్పుగా విన్నది లేదు...ధైర్యం చేసి తనతో పాటే వెళ్తుంది..

ఈ దారి ఏంటి కొత్తగా ఉంది. ఇది మా ఊరికి వెళ్ళదు అని అడుగుతుంది సుబ్బారావు ని సుమ..

మేడం ఇదే షార్ట్కట్ మీ ఊరికి..ఇలా వెళ్తేనే దగ్గర అవుతుంది. నేను రోజూ ఈ దారిలోనే వెళ్తాను మీకు భయం వద్దు నేను చాలా జాగ్రత్తగా తీసుకు వెళ్తాను అని చెప్తాడు సుబ్బారావు..

సుమ కి కొంచెం భయం మొదలవుతుంది కానీ నమ్ముతుంది అతని మాటని..

బైక్ మధ్యలో ఏదో సమస్య వచ్చి ఆగిపోతుంది.. అసలే చీకటి గా ఉంది..ఆ ప్రాంతం కూడా ఎక్కడ ఉందొ సుమకి అర్ధం కావట్లేదు..ఏదైనా తేడాగా ప్రవర్తిస్తే బ్యాగ్ లో ఉన్న పెప్పర్ స్ప్రే కొట్టేద్దాం అని తయారుగా ఉంది సుమ..

ఏమైంది? బైక్ ఎందుకు ఆగింది అని అడుగుతుంది అతనిని..

నాకు తెలీదండి...చూడాలి అని బైక్ దిగుతాడు సుబ్బారావు..

ఫోన్ వస్తుంది ఇంతలో అతనికి..కాల్ లిఫ్ట్ చేస్తాడు..మాట్లాడుకుంటూ కొంచెం దూరం వెళ్తాడు. సుమకి అతను ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు తెలియట్లేదు.. కొంచెం భయం మొదలవుతుంది సుమకి..

ఫోన్ మాట్లాడటం పూర్తవుతుంది..తిరిగొస్తాడు సుబ్బారావు..

లేట్ అవుతుంది అండి..బైక్ కి ఏమైంది? కాస్త చూడండి..ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడతారు అని చెప్తుంది సుమ..

ఏం కాదు! ఆగండి నేను చూస్తాను అని చెప్పి బైక్ పెట్రోల్ ని చెక్ చేస్తాడు..బైక్ ని కాస్త అటుఇటు ఊపుతాడు..కాస్త తోస్తూ పోతే బైక్ అదే మొదలవుతుంది అని సుమతో చెప్తాడు..కాస్త దూరం నడవగలరా నాతో అని అడుగుతాడు తనని..

సరే! పదండి అంటుంది..నడుస్తున్న సుమని గమనిస్తాడు సుబ్బారావు..అందం అంటే తనదే..ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు..ఏదైనా చేసి ఈరోజు తనని సొంతం చేసుకోవాలి అని అనుకుంటాడు..

సుమ ఫోన్ చూస్తూ ఉంటుంది..బైక్ స్టాండ్ వేస్తాడు సుబ్బారావు..వెనుక నుంచి వెళ్లి సుమని గట్టిగా పట్టుకుంటాడు..

వదిలిపెట్టమని అరుస్తుంది..సాయం కోసం గట్టిగా అరుస్తుంది..కానీ సుబ్బారావు తనని లొంగతీసుకోడానికి ప్రయత్నిస్తాడు..పెప్పర్ స్ప్రే తియ్యడానికి బ్యాగ్ లోపలికి చెయ్ పెడుతుంది కానీ పెప్పర్ స్ప్రే చేయి జారి కింద పడిపోతుంది..

సుమ ఏం చెయ్యలేని పరిస్థితికి వచ్చేస్తుంది..సుమని లాక్కుని పోతాడు సుబ్బారావు పక్కనే ఉన్న చెట్ల లోకి..

విడిపించుకోడానికి చాలానే ప్రయత్నం చేస్తుంది సుమ..కానీ ఒక సుబ్బారావు మృగంలా పైన పడుతుంటాడు...

అప్పుడే బైక్ చప్పుడు వినిపిస్తుంది తనకి..సుమ నోటిని మూసేస్తాడు అరవకుండా సుబ్బారావు...

అరవాలని ప్రయత్నించినా కష్టంగా ఉంటుంద తనకి...

బైక్ వెళ్లినట్టు అర్ధం చేసుకుంటాడు సుబ్బారావు..

మేడం! మీరు కాసేపు నోరు మూసుకుంటే నా పని నేను పూర్తి చేసుకుని మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెడతా..ఎవరికి ఏ అనుమానం రాకుండా ఉంటుంది..కాదని మొండి చేస్తే చంపి ఈ అడవుల్లో పడేస్తే అని బెదిరిస్తాడు..

నీకు దండం పెడతా నన్ను వదిలేయ్..మంచోడులా ఉంటూ ఇలాంటి పనులు చెయ్యకు అని రెండు చేతులు జోడిస్తుంది..కానీ ఒక్కసారి మెదడు లోకి ఇలాంటి చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఎవరి మాట వినపడదు అలాంటి మృగాలకి..

సుమని గట్టిగా కొడతాడు దాంతో సుమ కళ్ళు తిరిగి పడిపోతుంది..

మరుసటిరోజు..ఉదయం ఐదు ఆ సమయంలో..ఉషోదయా ఆసుపత్రిలో ఉంటుంది సుమ..

కళ్ళు తెరచి చూస్తుంది..ఏడుస్తుంది...రాత్రి జరిగింది తలచుకుని చావాలని ప్రయత్నిస్తుంది..వెంటనే నర్స్ ఇది చూసి పరిగెత్తుకు వచ్చి తనని ఆపుతుంది..

ఇంత జరిగాక నన్ను ఇంటికి రానివ్వరు..నన్ను చావనివ్వండి అని నర్స్ ని బ్రతిమాలుతుంది...

మీకు ఏమి కాలేదు! మీరు స్పృహ కోల్పోయారు అంతే..మిమ్మల్ని ఇద్దరు కుర్రాళ్ళు తీసుకు వచ్చి ఇక్కడ చేర్పించారు..అని చెప్తుంది నర్స్..

ఎవరు ఆ ఇద్దరు..అని అడుగుతుంది సుమ..

ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారు..ఇప్పుడే టీ తాగడానికి వెళ్లినట్టున్నారు అని చెప్తుంది నర్స్..

అప్పుడే వస్తారు ఆ ఇద్దరు కుర్రాళ్ళు..సుమ లేచి ఉండటాన్ని గమనిస్తారు..

వీళ్ళే మిమ్మల్ని ఇక్కడికి తీసుకు వచ్చింది అని చెప్తుంది నర్స్..

సుమ భయపడటం మొదలుపెడుతుంది వాళ్ళని చూసి..

మీరు భయపడకండి వదిన..అని అంటారు ఇద్దరు..మీకు రక్షణగా అన్నయ్యే మమ్మల్ని పెట్టాడు ఇక్కడ..

అన్నయ్య దుబాయ్ వెళ్ళినప్పుడు మేము ఖాళీగా ఉన్నాం..మీ అరటి తోటని చూసుకోమని మాకు పని ఇచ్చి మీ బాధ్యత మా చేతుల్లో పెట్టాడు..

రోజూ మీరు ఇంటి నుంచి వెళ్లినప్పుడు ఎవరు మీ వెనుక రాకుండా, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూడటం మా బాధ్యత..

నిన్న రాత్రి మీరు రావడం లేట్ అయ్యింది..అన్నయ్యకి మీరు లైవ్ లొకేషన్ షేర్ చేసారు..అప్పుడే అన్నయ్య మమ్మల్ని వెళ్ళమని చెప్పాడు..దారిలో ఆ బైక్ ఆగి ఉండటాన్ని గమనించాం..అక్కడ ఒక్క పెప్పర్ స్ప్రే సీసా దొరికింది..నీకోసం వెతకడం మొదలుపెట్టాం..

వాడు నిన్ను కొట్టడం వినిపించి అటుగా వచ్చాము..నిన్ను కాపాడుకున్నాం అని చెప్తారు..

మరి సుబ్బారావు పరిస్థితి అని అడుగుతుంది..

కొట్టి అక్కడే పడేసామ్..ఈపాటికి అటు వైపుగా వెళ్లే ఎవడో ఒకడు కాపాడే ఉంటాడు..లేదా రాత్రి తోడేళ్ళు ఈడ్చుకుని పోయుంటాయి..మీరు వాడి గురించి ఆలోచించకండి అన్నయ్యకి ఫోన్ చేసి క్షామమే అని చెప్పండి చాలు అని చెప్తారు..

మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకున్నా అని సొర్ర్య్ చెప్తుంది ఇద్దరికి..తరువాత వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి జరిగినదంతా చెప్పి ఏడుస్తుంది..

"మనం భయపడే వాళ్ళు మన శత్రువులు కాదు..మనం నమ్మే వాళ్ళు అంతా మన మిత్రులు కాదు..జాగ్రత్తగా ఉంటే సరిపోదు ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో కూడా తెలిసి ఉండాలి.."



Rate this content
Log in

Similar telugu story from Horror