ఫింగర్ ప్రింట్స్- ఎపిసోడ్-5
ఫింగర్ ప్రింట్స్- ఎపిసోడ్-5


రాత్రి 9 అవుతుంది......
డిన్నర్ రెడీ సర్.. మీ పని పూర్తయితే రావొచ్చు, నాకు బాగా ఆకలి వేస్తుంది... త్వరగా రావొచ్చు కదా!!! అని అడిగింది శ్వేత.
రెండే నిమిషాలు వచ్చేస్తున్నా..మెయిల్ పంపిస్తూ ఆనంద్...
త్వరగా రా.... ఆకలి బాబు ఆకలి..నీకేం సాయంత్రం బానే మెక్కావ్ ఇంట్లో ఉన్న బూందీ మిక్స్చర్ ని. విసుగ్గా శ్వేత...
ఓకే!!! మెయిల్ సెంట్ అని ఎంటర్ నొక్కి లాప్టాప్ మూసేసాడు ఆనంద్..
వావ్!!! మున్నకాడ సాంబార్, పొటాటో ఫ్రై...నాకోసమేనా ఇదంతా... అని టేస్ట్ చూసాడు సాంబార్ ది...
శ్వేత ఇంట్లో పసుపు తాడు ఏమైనా ఉందా??? కనీషం చిన్న దారం వున్నా పర్లేదు అడ్జస్ట్ చేసుకుంటా... ఇప్పుడే నీకు తాళి కట్టాలని ఉంది.. అదిరిపోయింది సాంబార్ అని పొగడతలతో ముంచెత్తాడు శ్వేతా ని..
సర్!!దానికి చాలా టైం వుంది. ముందు ఇది మెక్కండి అని ఎగతాళి చేసింది ఆనంద్ ని.
భోజనం పూర్తి చేసుకుని మరి నెక్స్ట్ ఏంటి మేడమ్ అంటూ ఆనంద్ కొంటె గా శ్వేత వైపు చూసాడు.
ఏముంది!!! మంచి భోజనం చేసాం కదా... నువ్వు వెళ్లి ఆ గదిలో పడుకో నేను ఈ గదిలో పడుకుంటాను అనమాట అని నవ్వుకుంది సరదాగా...
నాకు దెయ్యాలు అంటే భయం... చీకటిలో ఒక్కడిని ఎప్పుడూ పడుకోలేదు... నువ్వు కూడా ఇక్కడే పడుకోవచ్చు కదా!!! అని అడిగాడు ఆనంద్ ఆశ గా...
చీకటిలో భయం ఐతే లైట్ వేసుకుని పడుకో... దానికి నా తోడు ఎందుకు సర్ మీకు... ఆ!!! ఏంటి సంగతి అని కన్నెగరేసింది శ్వేత...
నువ్వు ఆ గదిలో నేను ఈ గదిలో పడుకోడానికా బెంగళూరు నుంచి వచ్చింది అని అలిగాడు ఆనంద్.
అవును!! అని చెప్పి ఆనంద్ ని కిస్ చేసి తన గదిలోపలికి పరిగెత్తి వెళ్ళిపోయింది..
గుడ్ నైట్!! బ్యాడ్ డ్రీమ్స్ అని తలుపు గడి పెట్టి బెడ్ మీద కి పరిగెత్తింది.
పాపం ఆనంద్ పెట్టుకున్న ఆశలన్నీ నిరుగారిపోయాయి..ఇంకేం చేస్తాడు వెళ్లి దుప్పటి కప్పుకుని పడుకున్నాడు.
కిక్ కిక్.... అని వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చింది శ్వేత నుంచి..
ఏం చేస్తున్నారు సర్??? నిద్రపోయారా??? అని అడిగింది.
నువ్వు కిస్ ఇచ్చి పారిపోయావ్... ఇంక నిద్ర ఎలా పడుతుంది చెప్పు.. ఈరోజు నాకు జాగారమే అంటాడు ఆనంద్..
సరే ఐతే తలుపు తియ్యు మరి అని శ్వేత మెసేజ్..
ఒక్కసారి కట్టేసిన గుర్రం తాడు తెంచుకున్నట్టు హుషారు వచ్చింది ఆనంద్ కి శ్వేత మెసేజ్ చూసి..
తలదువ్వుకున్నాడు... పెర్ఫ్యూమ్ కొట్టుకున్నాడు... మౌత్ జెల్ వేసుకుని స్మెల్ చూసుకున్నాడు... అవకాశం ఆనంద్ ఆవేశ పడకు... తొందరపడి చిందర వందర చెయ్యకు.. లేకుంటే అసలకే ముప్పు వస్తుంది.. అనుకున్నాడు తనలో తానే..
మెల్లగా డోర్ దగ్గరకి వెళ్లి శ్వేత మై డియర్...అని డోర్ తెరిచాడు... అక్కడ ఎవరు లేరు..
మళ్ళీ మెసేజ్... ఏంటి అక్కడ వెతుకుతున్నావ్ కాస్త ముందుకు రా అని..
ఏంటి!! ఆటలు ఆడుతున్నావా నాతో.. పట్టుకోలేను అనుకుంటున్నవా నిన్ను అని సోఫా దగ్గరకి చేరుకున్నాడు ఆనంద్.
ఏది పట్టుకో చూద్దాం...నేను ఇక్కడ బయట వున్నా కదా!!! వచ్చి పట్టుకుంటావా??? ఏది రా అంటూ మళ్ళీ మెసేజ్ తన ఫోన్ నుంచే...
మెసేజ్ లు వస్తున్నాయి కానీ మనిషి మాత్రం కనిపించడం లేదు.. ఏంటి??? నేను విసిగిపోయాను.. పో నేను ఇంక పడుకుంటాను.. కావాలనే ఆటపట్టిస్తున్నావ్ నన్ను అని వెనక్కి బయల్దేరాడు..
సరే మెట్లెక్కి పైకి రా ఇక్కడ వున్నాను అని మెసేజ్ వచ్చింది శ్వేత నుంచి..
ఈసారి నిన్ను వదలను ఇంకా అని గబా గబా మెట్లెక్కి పైకి చేరుకున్నాడు..
పైన తను లేదు.. కానీ ఆ చీకటి లో వేరే ఎవరో వున్నారు అక్కడ... హేయ్!! ఎవరు నువ్వు?? ఇక్కడ ఏం పని నీకు?? అడుగుతుంటే సమాధానం చెప్పవు ఏంటి??? అని గట్టిగా ప్రశ్నించాడు...
ఆ అరుపుకి శ్వేత నిద్దట్లోంచి లేచింది... చుట్టూ చూసుకుంది తన ఫోన్ లేదు అక్కడ.. తొందరగా లేచి బయటకి వచ్చింది.. రూమ్ లో ఆనంద్ లేడు.. మళ్ళీ ఆనంద్ గట్టిగా అడిగాడు ఎవరు నువ్వు ఇక్కడ అని..మేడ పైనుంచి వస్తున్నాయి మాటలు అనుకుని అక్కడికి పరిగెత్తింది..
ఆనంద్ ఫోన్ కి మెసేజ్ వచ్చింది... "యు విల్ డై నౌ" అని...
అప్పుడే శ్వేత పైకి చేరింది..
సైకో తన చేతిలో గొడ్డలి తీసుకుని ఆనంద్ ని ఒక్క వేటు తో తల ని నరికేసాడు... తల వెళ్లి పక్కన పూల తొట్టిలో పడింది...
శ్వేత ఒక్కసారి నిద్దట్లో నుంచి లేచింది...
గుండె "లబ్ డబ్ లబ్ డబ్" అని కొట్టుకుంటుంది గట్టిగా... నీళ్లు తాగింది... ఫోన్, నా ఫోన్ ఎక్కడ అనుకుని వెతకడం మొదలుపెట్టింది... ఫోన్ లేదు తన గదిలో..
ఆనంద్ అక్కడ!!!... అంటూ "ఆనంద్, ఆనంద్" అనుకుని తన గది దగ్గరకి చేరింది.. డోర్ తెరచి ఉంది కాని ఆనంద్ లేడు అక్కడ..
మెయిన్ డోర్ కూడా తెరిచే ఉంది.. నాకు వచ్చిన కల నిజం అయిపోయిందా అనుకుంది...ఏం చెయ్యాలో తోచట్లేదు.. మైండ్ పని చేయట్లేదు.. తనకున్న యాంగ్జైటీ డిసార్డర్ ప్రాబ్లెమ్ వల్ల చెస్ట్ పెయిన్ మొదలయ్యింది.. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది ఒక్కసారి..
బయట మెట్ల దగ్గర పూల తొట్టి లో చూసింది తల ఉందేమో అని...లేదు అక్కడ
మెల్లగా మెట్ల ని అనుసరిస్తూ పోతుంది భయం భయం తో.....
ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం...
**********************************