Kishore Semalla

Drama Horror Thriller

4.6  

Kishore Semalla

Drama Horror Thriller

ఫింగర్ ప్రింట్స్- ఎపిసోడ్-3

ఫింగర్ ప్రింట్స్- ఎపిసోడ్-3

3 mins
1.0K


నల్ల జాకెట్ వేసుకున్న వ్యక్తి వెనుకనే ఫాలో అవ్వడం మొదలుపెట్టింది శ్వేత. తను కాయగూరలు కొనే చోటే తాను కొంటుంది. కానీ తన ముఖం కనపడడం లేదు. 


అమ్మోయ్!!! ఏంది కాయగూరలు నేలపాలు చేస్తున్నావ్. ఇక్కడ చూసి వేసుకో అక్కడ ఏముంది అంటూ కసిరింది. అంతే మళ్ళీ దైవర్ట్ అయిపోయింది శ్వేత.



నా ఇష్టం అమ్మ. నేను బ్యాగ్ లో వేసుకుంటా లేదంటే కింద పడినవి మళ్ళీ ఏరుకుంటా... నీకెందుకు అంటా!!!! నా గురించి. ఓ ఏదైనా డబ్బులు ఇవ్వకుండా పారిపోతానా??? మాట్లాడుతుంది అనుకుని వాడికోసం తల ని అటువైపు తిప్పింది.



అక్కడ వాడు లేడు. నీ మొఖం లా వుంది, నేను ఎటు చూస్తే నీకెందుకు అమ్మ నీ పని నువ్వు చూసుకోకుండా అని ఆమెని తిట్టి కూరగాయలు కి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ నల్ల జాకెట్ వేసుకున్న వాడికోసం వెతుకులాట మొదలుపెట్టింది...



ఎక్కడా కనిపించలేదు తనకి. ఛ!!! మొఖం చూసి వుంటే బాగుండేది,మిస్ అయిపోయాడు అని బాధపడింది శ్వేత.



మార్కెట్ బయట నీలం రంగు మారుతి సుజుకి కార్ దగ్గర కనిపించాడు. మొఖం చూడడానికి ప్రయత్నించింది, కానీ కనిపించలేదు... అటు తిరిగి సిగరెట్ తాగుతున్నాడు. మెల్లగా మొఖం చూడాలని కావాలనే అటు వైపు నడుచుకుంటూ వెళ్ళింది తను. మొఖం కనిపించే టైమ్ కి తను సిగరెట్ పడేసి కిందకి తల వంచి కాళ్లతో సిగరెట్ ని నలిపేసి వెంటనే కార్ వైపు తిరిగాడు.



చిటికెలో మిస్ అయిపోయింది మళ్ళీ శ్వేత తన మొఖం చూడడం. ఇంకేముంది నిరాశ పడి ఇంటికి బయల్దేరింది. కొంచెం దూరం వెళ్ళాక తనని ఆ కార్ ఫాలో అవుతుంది. ఇదేది శ్వేత పట్టించుకోవట్లేదు. తన పని తనది అన్నట్టు పోతుంది. ఇంతలో కార్ తన పక్కనుంచి పోయి ముందు గల్లీలో ఆగింది. అదే నీలం రంగు కార్. తను నన్ను ఫాలో అవుతున్నాడా??? ప్రతీ దాన్ని నేనే లింక్ చేసుకుంటున్నానా??? అర్థం కానప్పటికీ తను ఎవరు శ్వేత అక్కడ.....😄



ఏముందిలే!!!! చూద్దాం అనుకుని కార్ దగ్గరకి వెళ్ళింది. ఎవరైనా ఉన్నరేమో అని తొంగి చూసింది కార్ అద్దం లో నుంచి. ఇంతలో కార్ డోర్ ఓపెన్ అయ్యి తనని లోపలికి లాగేసాడు తను. కార్ కదిలింది....



అలా వెళ్తూ కార్ శ్వేత ఇంటి ముందు ఆగింది. కాసేపు కార్ లో కదలిక లేదు అప్పటి వరకు అరచిన శ్వేత గొంతు మూగబోయింది. కార్ డోర్ తెరుచుకుంది. కార్ నుంచి శ్వేత శవాన్ని బయటకి పడేసాడు ఆ సైకో...



ఒక్కసారి నిద్ర లేచింది శ్వేత మళ్ళీ. వామ్మో!!! ఈ భయం తోనే పోయేటట్టు వున్నాను నేను...

రోజూ వాడే కలలోకి వస్తున్నాడు.

చంపేస్తున్నాడు. ఒకరోజు నిజంగా జరిగిన కలలానే మిగిలిపోతుంది నా జీవితం అనుకుని లేచింది. టైం చూస్తే పొద్దున్న ఏడు అవుతుంది.



కలలో జరిగినది అంతా కళ్ళ ముందు కనిపిస్తుంటే భయపడక ఇంకేముంటుంది. తన బాధ వర్ణనాతీతం అనుకుంటూ లేచి మార్కెట్ కి రెడీ అయ్యింది. (శ్వేత ప్రాబ్లెమ్ ఏ అది. దేనికైనా భయపెడితే అది కలల మారిపోయి తనని భయపెడుతుంది. కానీ ఇక్కడే గమ్మత్తు వుంది. ఈసారి కలలో జరిగినది నిజ జీవితంలో జరుగుతుంది)



రెడీ అయ్యి మార్కెట్ కి బయల్దేరింది. కలలో మాస్క్ మర్చిపోయి వెయ్య రూపాయిలు జరిమానా కట్టిన విషయం గుర్తుకు వచ్చింది. అమ్మో!!! ఎందుకు లేని పోనీ వృధా ఖర్చు లు తీసుకుపోతే సరిపోద్ది అని మాస్క్ పెట్టుకుని బయల్దేరింది.



కలలో అయినట్టే పోలీసులు బైక్ లని ఆపుతున్నారు. మనం సేఫ్ మాస్క్ పెట్టుకున్నాం అని వెళ్తుంది. తన బైక్ ని కూడా పక్కకి ఆపారు. మాస్క్ ఉంది కదా!!! ఇంకెందుకు సర్ ఉండాలి... నేను వెళ్తాను అని స్కూటీ తియ్యబోయింది.



ఆగవమ్మా!!!! లైసెన్స్ ఏది??? హెల్మెట్ ఏది??? కరోనా ఇప్పుడు వచ్చింది. పాత రూల్స్ అలానే ఉన్నాయి... మర్చిపోతే ఎలా??? అని అడిగాడు. ఇంకేముంది మాస్క్ మీద పెట్టిన శ్రద్ద హెల్మెట్, లైసెన్స్ మీద పెట్టలేదు. రెండు వేల జరిమానా కట్టి ఒక హెల్మెట్ గిఫ్ట్ గా తీసుకుంది వాళ్ళ దగ్గర నుంచి.



(అర్ధం అయ్యింది కదా!!! మాస్క్ ఎంత ముఖ్యమో ఈ సమయం లో. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ కూడా అంతే ముఖ్యం).



మార్కెట్ కి చేరుకుంది. ఎదురుగా వస్తున్నాడు ఒకడు మాస్క్ లేకుండా, మొఖానికి చేతిని అడ్డం కూడా పెట్టుకోకుండా... 



తనకి దగ్గర్లోనే తుమ్మాడు. కోపం పట్టరానంత వచ్చింది. నోరు అడుపుతప్పబోయింది. కానీ కలలో వాడు పెట్టిన శాపం గుర్తుకు వచ్చి బూతులు మింగేసింది. వాడి వైపు కోపంగా చూస్తుంది. వాడికి కూడా భయం వేసింది. వాడిని చేయి చాపమంది. సానిటీజర్ వేసింది. నాతో రా అని చెప్పి ఒక మాస్క్ కొనిపెట్టింది. ఇంకెప్పుడు పబ్లిక్ ప్లేస్ లో మాస్క్ పెట్టుకోకుండా తిరగకు, తుమ్ము వచ్చినా దానికో పద్ధతి ఉంది. చేతిని అడ్డం పెట్టుకో తుమ్మెటప్పుడు అని మంచి మాటలు చెప్పింది.



దానికి వాడు ఫిదా అయిపోయాడు. అక్క!!! ఇయాల్టీ నుంచి నేను నీ ఫ్యాన్. అరేయ్ జ్ఞానోదయం చేసినావ్ తియ్. మా బస్తీలో మస్తు పొరగాళ్ల్లు గిట్లనే మాస్క్ లేకుండా జబర్దస్త్ తిరుగుతున్నారు. కొడుకులకి పుంగి భజాహిస్తా పోయి.. అక్కా!!! జాన్ ఇస్తాడు ఈ రాజు...ఎప్పుడు అవసరం వచ్చినా నా నెంబర్ కి కాల్ చెయ్ అని నెంబర్ ఇచ్చాడు. బోరబండ వచ్చి రాకింగ్ రాజు అంటే ఎవరైనా చూపిస్తారు మా ఇల్లు. వస్తా అక్క మల్లా లేట్ ఐతే పోలీసులు నా పుంగి బజాయిస్తారు అని చెప్పి బయల్దేరాడు.



శ్వేత కి చాలా సంతోషంగా అనిపించింది రాజు మాటలకి. కూరగాయలు కొనడానికి వెళ్ళింది ఇంకా. నల్లజాకెట్ వేసుకున్న వ్యక్తి కనిపించాడు కలలో అయినట్టే.



కాసేపు ఆ కూరగాయలు అమ్మే ఆవిడ తో అయిన సంభాషణ, తరువాత బయటకి వెళ్లి కార్ ని చూడడం అన్ని అలానే జరుగుతున్నాయి.



సరిగ్గా తన వీధి చివర ఇంటి దగ్గర మళ్ళీ ఆ కార్ ఆగడం గమనించింది. వెళ్లొద్దు వెళ్లొద్దు అనుకుంటున్నా బుద్ధి ఎక్కడికి పోతుంది...చూద్దాం అనుకుని నిజంగానే అక్కడికి వెళ్ళింది. తొంగి చూసింది... ఒక్కసారి అందులోకి లాగేసాడు కలలో అయినట్టే... కేకలు పెట్టింది.



ఇంటి దగ్గర కి కార్ వచ్చి ఆగింది. డోర్ తెరుచుకుంది. 


ఏం జరుగుతుంది??? అనుకుంటున్నారు.... 


సమీక్ష లో తెలియజేయండి...


Rate this content
Log in

Similar telugu story from Drama