SATYA PAVAN GANDHAM

Horror Tragedy Thriller

2.5  

SATYA PAVAN GANDHAM

Horror Tragedy Thriller

"యోధ (ఓ ఆత్మ ఘోష) - 15"

"యోధ (ఓ ఆత్మ ఘోష) - 15"

11 mins
2.1K


"యోధ (ఓ ఆత్మ ఘోష) - 14" కి

కొనసాగింపు...

"యోధ (ఓ ఆత్మ ఘోష) - 15"

అలా తనలో తానే అనేక ప్రశ్నలు సంధించుకుంటున్న పార్ధు,

తేరుకుని

"ఛీ.. ఛీ... అయినా నేనిలా ఆలోచిస్తున్నాను ఏంటి..!" అని అనుకుంటూ

తన ఫ్రెండ్స్ లో ఒకరైనా అవేశ్ కి కాల్ చేసి

"తను ఒకప్పుడు ప్రేమించిన ఆ అమ్మాయి గురించి, వారి లవ్ బ్రేకప్ టాపిక్ తీస్తూ...

కాస్త జాగ్రత్తగా ఉండరా? " అంటూ హెచ్చరిస్తాడు పార్ధు...

"అసలేమైంది రా నీకు ..?

ఎందుకిలా మాట్లాడుతున్నావ్..?" అంటూ అవేష్ అడగగా.

రాత్రి తనకొచ్చిన ఆ కల గురించి వివరించి చెప్తాడు పార్ధు..!

పార్ధు చెప్పినదానికి పగల బడి నవ్వుతాడు అవేశ్...

"నేనింత సీరియస్ గా చెప్తుంటే, నీకు జోక్ గా ఉందా..?" అంటూ కోపంగా కసురుకుంటాడు పార్ధు.

"జోక్ కాకపోతే ఏంటి మరి!

పద్మను నేను మోసం చేయడం ఏంటి?

తను చనిపోవడం ఏంటి?

ఆత్మగా మారి నన్ను చంపడమేంటి..?

అసలు పద్మతో లవ్ ట్రాక్ గురించి నేను చెప్తేనే కదా!, నీకు మా గురించి తెలిసింది. ఇద్దరం ఒక అండర్ స్టాండ్ కి వచ్చే విడిపోయామని కూడా నీకు తెలుసు!

ఇప్పటికీ తను నా కాంటాక్ట్ లో కూడా ఉంది..!

మార్నింగ్ యే మెసేజ్ కూడా చేసింది.

ఆ రోజు అలా విడిపోయినందుకు ఇప్పటివరకూ మా మధ్య ఎలాంటి విద్వేషాలు రాలేదు.

అయినా నిన్నటి నుండి నువ్వేవో అతిగా ఆలోచిస్తూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నట్లు ఉన్నవ్, కాసేపు రెస్ట్ తీసుకో...!

తర్వాత మాట్లాడదాం!" అంటూ అవేశ్... పార్ధుకి సర్ది చెప్పి ఆ కాల్ కట్ చేసాడు.

మిగిలిన వారందరికీ కూడా వరుసగా గోపాల్, విశాల్, ప్రియ, కృతి, గౌతమి ఒక్కొక్కరికి కాల్ చేసి జరిగిందంతా చెప్పి,

వాళ్ళు గతంలో ప్రేమించిన వాళ్ల గురించి ఆరాతీస్తే, వాళ్ల దగ్గర నుండి కూడా అవేశ్ నుండి వచ్చిన రియాక్షనే..

అసలు వాళ్ళు చనిపోవడం ఏంటి?,

వాళ్లంతా ఇప్పుడు బాగానే ఉన్నారు,

పైగా తమతో కాంటాక్ట్ లో కూడా ఉన్నారంటూ....

మేమలా విడిపోయింది కూడా ఒకరికొకరి అంగీకారంతోనే,

అయినా నీకీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏంటి..?

అసలు మాకు మేమే నీకు ఈ స్టోరీస్ అన్ని చెప్పాం..!" అంటూ పార్ధుని తిడతారు వారంతా..

వాళ్ళందరి మాటలు విన్న పార్ధుకి, నిజంగానే పిచ్చి పట్టినంత పనైంది.

అసలేం జరుగుతుందో, తనకి అర్ధం కావడం లేదు.

కలలో తనకొచ్చిన ఆ క్రైమ్స్ గురించి, ఆ న్యూస్ ల గురించి తను అలా గూగుల్ మరియు యూ ట్యూబ్ లలో సెర్చ్ చేస్తూనే ఉంటాడు.

ఇదిలా ఉండగా సరిగ్గా రెండ్రోజుల తర్వాత,

ఆ అన్నా చెల్లెళ్ళ మిస్టరీ వీడిందనే న్యూస్ పార్ధుకి తెలుస్తుంది. అది చేధించిన ఆఫీసర్ పేరు సీపీ మణి చందన్ మరియు అతని బృందం.

దాంతో మళ్ళీ ఆ కేసు గురించి ఇంటర్నెట్ లో వెతికిన పార్ధు కి విస్తుపోయే నిజాలు తెలుస్తాయి.

అవి ఏంటంటే..?,

యోధ పార్ధు కలలో కనిపించి, ఏదైతే తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పిందో?

సరిగ్గా అదే యోధ నిజ జీవితంలో కూడా జరిగి, యోధ మరియు యోగి అతి దారుణంగా హత్య చేయబడడంతో పాటు, వాళ్ళు ఏమయ్యారో తెలియక

వాళ్ల తల్లిదండ్రులు కూడా నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారు.  

నిజానికి ఏం జరిగిందంటే,

ఆ అన్నా చెల్లెళ్ళు (యోధ, యోగి) కనిపించకుండా పోయిన కొద్ది రోజులకే ... సీపీ మణి చందన్ నేతృత్వంలోని బృందం ఆ కేసు నీ టేక్ అప్ తీసుకుంది. ఒక్కొక్క అంశాన్ని చాలా లోతుగా పరిశీలిస్తూ, ఆ కేసుని చేధిస్తూ... వారి బృందం వాళ్ళు హత్య చేయబడ్డారని, దానికి కారణం ఓ ఎమ్మెల్యే(అదే విక్కి ఫ్రండ్ రాహుల్ వాళ్ల నాన్న), అతని కొడుకు మరియు స్నేహితులనీ, వివరణ ఇవ్వడానికి ప్రయత్నించింది..

అలాగే, వాళ్ల చావుకు కారణమైన ఘటనలు పోలీసులు అణువణువునా అన్వేషించడం, వాటిని కళ్ళకు కట్టినట్లు ఆ న్యూస్ చానల్స్ లో పదే పదే చూపిస్తారు...

(ఇదంతా పార్జుకు యూట్యూబ్ లో దొరికిన కంటెంట్)

ఇక దాంతో, ఎక్కడ తన పేరు ప్రఖ్యాతలు దెబ్బలు తింటాయోనని భయపడి, అప్పటికే అధికారంలో ఉన్న తన పార్టీ బలాన్ని అడ్డుపెట్టుకుని ఆ సీపీ మణి చందన్ నీ వేరొక చోటుకి ట్రాన్స్ఫర్ చేయించాడు ఆ ఎమ్మెల్యే.

కానీ, తప్పు చేసినోడు తప్పించుకోగలుగుతాడా...?

ఎప్పటికైనా శిక్షార్హుడే..!

ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్స్ లో ఆ ఎమ్మెల్యే గెలిచినప్పటికి, ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో తమ పార్టీ ఓడిపోవడంతో...

ఈ సారి అధికార పక్షంలోకొచ్చిన అప్పటి ప్రతిపక్ష పార్టీ ,

బదిలీ అయిన ఆ సీపీ మణి చందన్ ను మళ్ళీ రప్పించి, అతనికే ఆ కేసు నీ అప్పగించి దాని మూలాలు వెలికితీయించింది.

అలా మళ్ళీ బయట పడింది ఈ కేసు.

అప్పుడే దీని గురించి చర్చలు, సమావేశాలు న్యూస్ చానల్స్ లో మళ్ళీ నడవడం మొదలయ్యాయి.

కొన్ని రోజులకు...

ఆ అన్నాచెల్లెళ్ల మర్డర్ మిస్టరీని చేధించడం మాత్రమే కాకుండా, ఆ ఎమ్మెల్యే అతని కొడుకులు ఆ గెస్ట్ హౌజ్ లో పాల్పడిన దురాగతాలను అన్నింటిని ఒక్కొక్కటిగా బయట పెట్టాడు ఆ సీపీ మణి చందన్.

దీంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు కట్టెలు తెంచుకున్నాయి. ఆడపిల్లల పై జరుగుతున్న అఘాయిత్యాలకు, అన్యాయాలకు నిరసనగా ప్రజల నుండి బంద్లు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు మిన్నంటాయి. ఆ ఎమ్మెల్యే కి మరణ శిక్ష పడాలని ప్రజలందరూ ముక్త కంఠంతో రోడ్ల పైకి వచ్చి తమ తమ వ్యతిరేకతను, తమ తమ ఆవేశాన్ని చూపుతున్నారు.

చేసేదేమీ లేక, ఆ ఎమ్మెల్యే నీ బర్త్ రఫ్ చేసి, అరెస్ట్ చేయించి కోర్టులో హాజరు పరిచింది ప్రభుత్వం. కోర్టు ఆ ఎమ్మెల్యే, అతని కొడుకు మరియు ఆ దారుణాలకు ఒడిగట్టిన అతని స్నేహితులకి జీవిత ఖైదు విధించింది.

అయినా ప్రజల్లో కోపం చల్లారలేదు. అతనికి ఈ శిక్ష సరిపోదు, ఉరిశిక్ష విధించాలని అన్ని రంగాల నుండి ప్రజలందరూ ఏకమై రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలియచేశారు.

ఎంతో మంది అభాగ్యులను, అమాయుకులైన వాళ్ల కుటుంబాలను (అందులో యోధ, యోగి కుటుంబంతో పాటు మరెందరివో జీవితాలు) బలితీసుకున్న ఆ ఎమ్మెల్యే, అతని కొడుకు మరియు అతని స్నేహితులను ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు అనుకున్నాడో ఏమో?

వాళ్లందరినీ ఎన్కౌంటర్ పేరుతో పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపడేసాడు ఆ సీపీ మణి చందన్.

దీంతో ఆ ప్రజలతో పాటు, యోధ కుటుంబ మరియు ఆ నీచులు వల్ల బలైపోయిన ఎందరో ఆత్మలు శాంతించి ఉంటాయి.

"తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు."

ఇక్కడితో ఈ కథకి ముగింపు.

ఆగండి...!

ఆగండి...!

ఇక్కడ చాలా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా ఈ కథకి ఎలా ముగింపు చెప్తావ్ అనొద్దు.

అందుకే,

ఇదిగో...

రచయితగా నా ఈ విశ్లేషణ:

యోధాకి, పార్ధుకి మధ్య సంబంధమేమి లేకపోయినా

యోధ జీవితంలో జరిగిన యధార్థ కథ, పార్ధు కలలో కనిపించడం.

నిజానికి మనం ఒక విషయం మీద ఎక్కువగా దృష్టిపెట్టి,

పడుకునే ముందు పదే పదే దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల,

మనకు... దానికి సంభందించిన కలలు వస్తాయనేది ఒక నిజం. అంటే దాన్నే ఎక్కువగా మన ఊహల్లోకి తెచ్చుకోవడం అన్న మాట!

పార్ధు విషయంలో జరిగింది కూడా అదే, అప్పటికే కొన్ని రోజుల క్రితం యోధ క్రైమ్ న్యూస్ ను ఎక్కువగా విన్నాడు.

(ఆ వీడియోస్ తన యూట్యూబ్ ప్లేలిస్ట్ లో సేవ్ అయ్యి ఉండడం)

కానీ, సీపీ బదిలీ వల్ల ఆ కేసు ఆగిపోయి, అది ఎటు తేలడం లేదని, అప్పుడే పక్కన పెట్టేశాడు.

ఇక విక్కి ఆ గెస్ట్ హౌస్ , ఎమ్మెల్యే, దెయ్యాలు అని ఆ క్రైమ్ న్యూస్కి సంబందించిన వాటిని కదపగనే, అప్పటికే వాటిని ఒకప్పుడు బ్రెయిన్ లో స్టోర్ చేసుకున్న పార్ధు, మళ్ళీ ఆ రోజు నైట్ అంతా వాటి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు.

పైగా అంతకుముందు తను నిద్ర లేచింది కూడా ఆ వార్తతోనే,

(మీకు గుర్తుందా?

కథ మొదట్లో...

"నగరంలో పెరిగిపోతున్న నేరాలు,

ఆ అన్నా చెల్లెళ్ల మిస్టరీ వీడేనా..?" అంటూ వాళ్ల నాన్న పెట్టిన న్యూస్ ఛానల్ లో ఆ న్యూస్ వచ్చినట్టు స్టార్ట్ చేశాను ఈ కథను. లేదంటే ఒకసారి మళ్ళీ వెనకకు వెళ్లి, పార్ట్ 1 స్టార్టింగ్ లైన్స్ చూడండి.)

పార్ధు... అలా ఆ కథకు అడిక్ట్ అవ్వడం వల్ల,

(మన న్యూస్ ఛానల్స్ వారు సీన్ రిక్రియేషన్ పేరుతో టీవీ లో ఎంత రియల్ గా చూపిస్తారో మీకు తెలుసు కదా..!)

దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ.. అతిగా ఊహించుకోవడం వల్ల అలా వాస్తవంగా జరిగిన కథే, తన కలలో వచ్చిందన్న మాట.

(ఇప్పటివరకూ మీకిన్ని ఆశలు కలిగించి, ఇది కలంటూ కథపై మీకు పెరుగుతున్న ఆతృతను, ఆసక్తిని ఆకాశానికెత్తి

ఒకేసారి అలా కింద పడేసానని తప్పుగా అనుకోకండి..

నా కథలు ఎప్పుడూ వాస్తవాలకు దగ్గరగా ఉంటాయి. కథలో కొత్తదనం కోసం, మీ మెప్పు కోసం నా కథను వాస్తవానికి దూరంగా తీర్చిదిద్దుతూ నా ఆలోచనలకు కళ్లెం వేయలేను, నా వివరణకు ద్రోహం చేయలేను. దయచేసి పాఠకులు అర్థం చేసుకోగలరు)

ఇక పోతే,

పార్ధు ఫ్రెండ్స్...

తన కలలో చనిపోవడానికి కారణం.

గతంలో జరిగిన వాళ్ల వాళ్ల లవ్ స్టోరీస్ గురించి పార్ధుకి చెప్పారు వాళ్ళు. కానీ, అప్పటికే ప్రేమంటే ఒక మంచి అభిప్రాయం ఉన్న పార్ధు, వాళ్ళు చేసిందాన్ని తప్పు బట్టాడు.

(అంటే, ప్రేమ పేరుతో కొంతకాలం రిలేషన్ షిప్ మెయింటైన్ చేయడం, చివరికి ఎవరి అవసరాలు వారికి తీరాక...

ఏదో ఒక వంకతో విడిపోవడం, మళ్ళీ కొత్త వాళ్ళని తగులుకోవడం. కొంతమందైతే, ఒకరితో రిలేషన్ లో వుండగానే ఇంకొకరితో రిలేషన్ మెయింటైన్ చేయడం)

వాళ్ళతో విడిపోయిన వాళ్ళను శారీరక అవసరాలు కోసం వాడుకోవడం, ఆ తర్వాత ప్రాణాలు తీసుకునేంత సాహసం చేసుండకపోవచ్చు కానీ, అలా వాళ్ల వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం స్వచ్ఛమైన ఆ "ప్రేమ" అనే పేరుని వాడుకోని అమాయుకుల మనసులతో, వాళ్ల జీవితాలతో ఆడుకోవడం ఎంత వరకూ కరెక్ట్..!

అంటే అక్కడ,

వాళ్ళందరూ తప్పులు చేసినట్టే కదా...!

అందుకే, ఆ తప్పులకి శిక్ష !

మరణమే అన్నట్టుగా

పార్ధు తన కలలో ఊహించుకున్నాడు,

లేదు.... లేదు... విధించాడు అన్నమాట.

అసలు ఈ దెయ్యాలు, దేవుళ్ళు ఉన్నరంటారా అంటే ?

ఉన్నారు...

అవును, మనలో ఉన్న ధైర్యమే దేవుడు,

అలాగే, మనలో ఉన్న భయమే భూతం.

తప్పు చేసిన వాడు తన తప్పు ఎక్కడ బయట పడుతుందోనని ఎక్కువగా ఆలోచించడం వల్ల తనలో తనకి కలిగే మనోవేదనే భయం. ఆ భయన్నే మనం దెయ్యంగా భావిస్తాం. తప్పు చేయకుండా ఎప్పుడూ దైర్యంగా ఉండేవాడిని కలిగే ఆనందమే దేవుడు.

ఇంత చదువుకుని, ఇంత తెలివి ఉండి, ఆఖరికి టెక్నాలజీ ఇంత అభివృధి చెంది కూడా మనం ఇలా ఇంకా దెయ్యం వస్తుంది, దేవుడు చూస్తాడు అంటూ మూఢ నమ్మకాలతో సతమవతమవడం ఎంత వరకూ కరెక్ట్..?

మీకు మీరే ప్రశ్నించుకోండి.

అంటే, ఇక్కడ నేను ఎవరి అభిప్రాయాలను తప్పు పట్టడం లేదు. ఎవరు నమ్మకం వాళ్ళది. కానీ, అది మూఢ నమ్మకం గా మారితెనే ఇబ్బంది అని అంటున్నా...

దేవుడు దెయ్యాలు ఉన్నాయి అని చెప్పడం ఒక నమ్మకం.

దేవుడు దెయ్యాలు నిజంగానే ఉన్నాయి, అవి నాకు కనిపించాయి అని ఇతరులను మోసగించడం ఓ మూఢ నమ్మకం.

కానీ, ఈ సృష్టిని ఏదో శక్తి నడిపిస్తుంది...

ఆ శక్తి, పైకి కనిపించని మనలో ఉన్న భయాన్ని, దైర్యాన్ని, ప్రేమను, ద్వేషాన్ని ను అన్నింటినీ కూడగట్టి ఒకే తాటిపైకి తెస్తూ వాటన్నింటినీ ఎప్పటికప్పుడు అదుపు చేస్తుందని నా నమ్మకం.

ఆ శక్తి వల్ల మంచి జరిగితే దేవుడంటూ.., చెడు జరిగితే దెయ్యమంటూ... నమ్ముతారు. నిజానికి ఆ శక్తిలో ఉన్నవి మనలో ఏర్పడుతున్న కనిపించనీ ఆ ఎమోషన్సే!

అంటే మంచి జరిగినా... చెడు జరిగినా... మనలో జరిగే ఆ కనిపించని ఎమోషన్స్ వల్ల జరిగే ఆ మార్పులే కారణం, దానికి మనమే కారణం అని నేనంటాను.

"అదిగో..!

దైవాన్ని నమ్మే భక్తులను, వారి మనోభావాలను దెబ్బతీస్తున్నావంటూ నన్ను అపార్థం చేసుకోవధ్దు!"

దానికి కూడా వివరణ ఇస్తాను.

ఉదాహరణకి...

రామాయణం, మహాభారతం జరిగాయనడానికి ఆధారాలు ఉన్నాయి.

అవి జరిగాయని నేను నమ్ముతాను, నేనే కాదు ఎవరైనా నమ్మల్సిందే!

రాముడు, కృష్ణుడు మొ..లైన వాళ్ళు ఒకప్పుడు ఉన్నారంటే కచ్చితంగా నమ్మాల్సిందే. అది ఒక నమ్మకం.

కానీ, వాళ్ళు ఇప్పటికీ ఉండి... మన కంటికి కనిపించకుండా, వాళ్లకున్న అతీత శక్తులతో మనల్ని ఇంకా పాలిస్తున్నారు, నడిపిస్తున్నారు అనేది మాత్రం ఓ మూఢ నమ్మకం.

పోనీ, అంతగా విశ్వసిస్తున్నారు అనుకోండి...

రామాయణంలో ...

స్త్రీ వ్యామోహం వల్లే కదా..

కైకేయి ఉచ్చులో పడి దశరథుడు తనకిష్టమైన తన కొడుకు శ్రీ రాముడిని కూడా అడువుల పాలు చేశాడు. అలా తను దూరమయ్యాడనే వేదనతో చివరికి తను కూడా అసువులు బాసాడు.

ఆకరికి, శివుడికి అంత పరమ భక్తుడైన రావణాసురుడు కూడా స్త్రీ వ్యామోహం వల్లే రాముడి చేత అంతం చేయబడ్డాడు. అందుకే కదా, చివరికి అతన్ని ఆ పరమ శివుడు కూడా రక్షించలేకపోయాడు.

కానీ ఈ రోజు ఆడపిల్లల, యువతుల, వివాహితులు ఆకరికి వృద్ధల మీద జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు, హింసాకాండకి ఎందుకు తెరలేపుతున్నారు కొంతమంది పురుషులు ?

అలా అని కొంతమంది ఆడవాళ్ళు ఏం తక్కువ కాదు,

కొంతమంది స్త్రీలు కూడా వ్యామోహంతో తమ సొత్తు కానీ మగవారిని లొంగదీసుకుని వినాశాలకి ఎందుకు కారణం అవుతున్నారు?

అంటే, మనం రామయణం నుండి ఏం నేర్చుకున్నాం.?

దైవం మీద అంత భక్తి, భయం, భాధ్యత ఉంటే ఇన్ని తప్పులు ఎందుకు జరుగుతున్నాయి..?

భగవద్గీతలో...

శ్రీ కృష్ణుడు చెప్పిన మాట

"మానవ సేవయే, మాధవ సేవ!"

అంటే, సాటి మనిషికి సహాయం చేస్తే భగవంతుడి కి సేవ చేసినట్టని ...

కానీ, ఆయన చెప్పిన దానిని ఎంతమంది, ఎంత వరకూ అనుకరిస్తున్నారు?

మనకున్న పిచ్చి, వెర్రి, మూఢ నమ్మకాలతో...

గుడిలో ఉన్న విగ్రహానికి పాలాభిషేకం చేస్తాం, అదే గుడి బయట ఆకలితో అర్ధిస్తున్న చిన్నపిల్ల వాడికి ఒక చుక్క నీరు కూడా పోయం.

అంటే నువ్వు నమ్మిన దేవుడి మాటనే అనుకరించనీ, లెక్కచేయని నువ్వు, ఆయన అనుగ్రహాన్ని ఎలా పొందుతావు.

అలాగే అదే భగవద్గీతలో...

శ్రీ కృష్ణుడు

మానభంగం అంటే తల్లి, తండ్రి, కూతురు, కొడుకు, చెల్లి, అన్న, బావ , మరదలు, ఇతరులు ఎవరు ఎవరి మనసుకైనా భంగం కలిగించడం అంటూ వివరించాడు.

కానీ, నేటి సమాజం అవి పాటిస్తుందా అంటే,

ప్రేమించిన వాళ్ళు దక్కపోతే చచ్చిపోవడం, లేదా చంపేయడం..

ఆ ప్రేమలో ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుని, ఎవరికి వాళ్ళు విడిపోవడం అసలు అందులో ప్రేమేక్కడుంది.

అక్రమ సంబంధాలు...

అందులో కూడా ఆఖరికి బెదిరించి వేరొకరి భార్య/భర్తను లొంగదీసుకోవడం.

ఇవికాక, ఉద్యోగాలు చేసే దగ్గర వేధింపులు, వావి వరుస లేకుండా విచ్చలవిడిగా రేప్ లు

ఇవన్నీ ఆ శ్రీ కృష్ణుడు చెప్పినట్టు మానభంగం కిందకే వస్తాయి కదా!

మరి ఈ మహా భారతం నుండి మనం ఏం నేర్చుకున్నట్టు?

ఎప్పుడో చిన్నప్పుడు..

మా తాతయ్య గారు నా దగ్గర అన్న ఊసు..

"ఒక ఆడపిల్ల చేయి పట్టుకుంటే,

దాదాపు పెళ్లి అయినట్టేనని

దాన్నే పానిగ్రహం అంటారని

ఆ మాటకు కట్టుబడి ఈ ఇరవై ఏడేళ్లు ఇంకా అలాగే, ఇప్పటికీ ఏ ఆడపిల్లను పొరపాటున కూడా తాకడం కానీ, అసలు మాట్లాడడానికి, చూడడానికి కూడా ఇబ్బంది పడే నాలాంటి వాళ్లు కూడా లేకపోలేదు ఇదే సమాజంలో...

(ఇలా ఉంటే ఈ సమాజానికి నచ్చదు, లేనిపోని నిందలు పడాలి అది వేరే విషయం)

అక్కడ నాది మూఢ నమ్మకం కాదు, ఆడపిల్లకి ఇష్టం లేకుండా అలా చేస్తే అది కూడా ఆ కృష్ణుడు చెప్పినట్టు మానభంగం కిందకి వస్తుందని నాలో ఏర్పడిన భయం!

(నా గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ,

ఇన్ని చెప్తున్నావ్ నువ్వేమైనా నిక్కర్చా అని రేపు మీరు అడగొచ్చు. అందుకే, నా జీవితంలో జరిగిందానినే ఒక చిన్న ఉదాహరణగా ఇచ్చాను మీకు.)

ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే,

కానీ, మన పెద్దవాళ్ళు చెప్పే ప్రతి నమ్మకం వెనుక ఒక సైంటిఫిక్ రీసన్ ఖచ్చితంగా దాగుంది.

సూర్యుడు చుట్టూ తిరుగుతున్న ఉన్న భూమికి దిక్కులంటారు, ఇంటి ముఖ ద్వారం తూర్పున ఉండాలని ఓ విశ్వాసం.

అవును.. తూర్పున ఉదయించే సూర్య కిరణాలు, ఉదయం లేచి లేవగానే అవి మనల్ని తాకి మనలో నింపే ఆ "D విటమిన్" కోసం...

ఇంట్లో ఎవరైనా చనిపోతే వచ్చే మైలుతో గుళ్ళకు, శుభ కార్యాలకు వెళ్ళడం నిషేధించడం!

ఆ చనిపోయిన వ్యక్తి మనింట్లో వాడే కావడం, ఆ సమయంలో అతన్ని అంటి పెట్టుకొని ఉండే మనకి అతన మీద ఉండే సూక్మ క్రిములు(డెడ్ సెల్స్) మనకి చేరి, అవీ మళ్ళీ మన ద్వారా వేరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు..

గుడికి వెళ్ళి రెండు చేతులు జోడించి నమస్కరించడం!

అలా రెండు చేతులను నమస్కరించడం వల్లన, మన చేతులకున్న ఆ పాజిటివ్ ఎనర్జీ శరీరమంతా పాకుతుంది.

గుడి గంటలు చేసే ధ్వని, ఉత్తేజాన్ని ఇస్తాయి.

గుడి చుట్టూ చేసే ప్రదక్షిణలు శక్తినిస్తాయి.

గుడి ప్రాంగణం మనశ్శాంతిను ఇస్తుంది.

ఇంటి గేటు దగ్గర నుండి వంటిటి పొయ్యిలో కాలె కట్టే వరకూ...

ఆడపిల్ల ధరించే పాపిడి బిళ్ళ దగ్గర నుండి పెళ్ళైయ్యాక కాలి

వేళ్ళకు ధరించే రింగ్స్(మేము సుట్లు అంటాం) వరకూ...

పూజల దగ్గర నుండి పూనకాల వరకూ...

ఇలా ప్రతి దాంట్లో, ప్రతి నమ్మకంలో, సైన్స్ దాగుంది.

సైన్స్ మాత్రమే ఉందని నేను చెప్పడం లేదు. సైన్స్ కూడా ఉందని చెప్పడం నా ఉద్దేశ్యం.

మనుషులు చేస్తున్న తప్పిదాలను నియంత్రించడానికి...

మన పూర్వీకులు, పైన ఒకడున్నాడు నువ్వు చేసిన తప్పులు వాడికి తెలుస్తాయి. ఆ తప్పులకి శిక్షలు వేస్తాడు అంటూ తప్పులు చేయడానికి భయపడేలా మనలో ఒక నమ్మకాన్ని కలిగించారు. అది కాల క్రమేణా ఒక మూఢ నమ్మకంగా మారింది అనేది నా అభిప్రాయం.

కేవలం, ఇది నా అభిప్రాయం మాత్రమే.

కానీ, అయినా ఈ జనం భయపడుతున్నారా?

పొద్దున్నే లేచి దేవుడికి మొక్కుతారు, ఆ రోజు గడిచే లోపు చెయ్యాల్సిన తప్పులు చేసేస్తారు..

మళ్ళీ ఆ తప్పుల్ని క్షమించాలి అంటూ అదే దేవుడికి మళ్ళీ మళ్ళీ మోక్కుతారు. అలా చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి, మళ్ళీ వాళ్ళు దోచేసిన సొమ్ములనే విరాళంగా ఇస్తారు. అది కూడా లంచమే కదండీ...!

పాపమే కదండీ..!

ఇదంతా ఎందుకు వివరించాను అంటే,

Cherukuri Naga Lakshmi garu ఈ కథలో ఒక పార్ట్ దగ్గర అడిగిన ప్రశ్న

అసలు దెయ్యాలు భూతాలు ఉన్నాయంటారా? అవి మనుషులు మీద ఇలా పగలు తీర్చుకుంటూ పోతే, అసలు ఈ ప్రపంచంలో మనిషన్న వాడు మిగులుతాడా..?" అంటూ

ఆ ప్రశ్నకి సమాధానమే ఇదంతా, ఆమెతో పాటు చదువుతున్న మీ అందరికీ నా అభిప్రాయాన్ని తెలపాలనుకుంటున్నా...

దేవుడు ఉన్నాడని నమ్మితే, దెయ్యం కూడా ఉందని నమ్మాలి.

నాకు మాత్రం నాలో ఉండే

ప్రేమ, దైర్యం, మంచి, ధర్మం, మానవత్వం, జాలి, దయ,కరుణ లాంటివి దేవుళ్ళు

ద్వేషం, భయం, చెడు, తప్పు, స్వార్థం, మూర్ఖం, అసూయ లాంటివి దెయ్యాలు.

అవే ..

అదే మీరు నమ్మే దేవుళ్ళుగా నన్ను ముందుకు నడిపిస్తున్నాయి.

అలా అని ఇంట్లో వాళ్ల నమ్మకాలను ఎప్పుడూ త్యజించలేదు. వాళ్ళతో పాటే గుళ్ళకు వెళ్తాను, వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటాను. అది వాళ్ల సంతోషం కోసం...

నా సహనాన్ని ఎవరైనా రెచ్చగొడితే, వాదనకి కూడా దిగుతాను. గుట్టని వాళ్ళు దాన్ని వితండ వాదం అంటారు.

మరొకసారి చెప్తున్నాను,

ఇదంతా నాకున్న అభిప్రాయం మాత్రమే

ఎవరి నమ్మకాలను కించపరచాలని కాదు,

(నేనొక హిందువుగా నాకు తెలిసిన హిందూ దేవుళ్ళ గురించి ప్రస్తావించాను తప్ప, ఏ మతాన్ని కించపరచాలనే ఉద్దేశ్యం నాకు లేదు.)

ఒకవేళ అలాంటి ఉద్దేశ్యం కనుక ఇక్కడ మీకు కనిపిస్తే, దానికి నన్ను మీరు క్షమించాలి.

పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారనీ ఆశిస్తున్నాను.

కులాలు, మతాలు, ప్రాంతాలు, భక్తి, ముక్తి, దెయ్యం, భూతం, అసూయ, ద్వేషం అంటూ చుట్టూ అల్లుకున్న పంజరంలో బంధించబడిన పక్షిని కాదు నేను...

నా అక్షరాల రెక్కలతో, నా పదాల బలంతో, నా రచనల అంతరిక్షంలో విహరిస్తున్న నేనొక స్వేచ్చా విహంగిని..

నా ఈ మాటలు ఎవరి మనోభావాలనైనా కించపరిచి, ఈ మనసు నొప్పించి ఉంటే నన్ను క్షమించగలరు. నా ఆలోచనలు ప్రపంచానికి చెప్పడమే తప్ప, ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలని చేసినవి కాదు.

ఈ రచనా కుటుంబం లోనే పరిచమయ్యి, పరిచయమయిన ఈ కొద్ది రోజుల్లోనే నేను ఇలాంటి ఈ కథలను కూడా రాయగలనని నన్ను ప్రోత్సహించి, ఇలాంటి ఒక కథను మీకందించడానికి ప్రేరేపించి, తన సమీక్షల ద్వారా నాలో ఈ కథ రాయడానికి ఎప్పటికప్పుడు ఆసక్తి రేకెత్తించిన...

"Cherukuri Naga Lakshmi" గారికి

ప్రత్యేక కృతజ్ఞతలు.

అలాగే తమ తమ అభిప్రాయాలను వారి సమీక్షల రూపంలో అందించి, నన్ను మరింత ప్రోత్సహించిన

Anusha గారికి,

Kumari kanakala గారికి,

Sailaja గారికి,

జూపూడి నాగ వెంకట మణికంఠ గారికి,

Allada suman గారికి,

Lakshith veekshika " lucky" గారికి,

Saiduhussain shaik గారికి,

Suseela గారికి,

సత్య "శ్రీ" గారికి,

Shaik Asif గారికి

Gangadharam y గారికి (school mate)

Jayasubbareddy ambavaram గారికి

Padma munagala గారికి,

B ruksana గారికి,

Kumar (relative),

Velusuri veeraveni గారికి,

Princess sowji గారికి,

Asif గారికి,

Nikhil B గారికి

వీరితో పాటు రేటింగ్స్ ఇచ్చిన వారికి, తమ విలువైన సమయాన్ని వెచ్చించిన ప్రతి పాఠకుడికి పేరు పేరున కృతజ్ఞతుడని.

కథ మొదలుపెట్టినప్పుడు రెండు మూడు భాగాలతో సరిపోడాధాం అనుకున్నా, కానీ ఇది ఇన్ని (15 భాగాలు, సాగదీసి రాయడం నాకూ ఇష్టం ఉండదు) భాగాలుగా తీర్చిదిద్దడానికి ముఖ్య కారణం నా రచన పై మీరందరూ చూపిన చొరవ, శ్రద్ధ. దాని వల్లే, ఇదంతా సాధ్య పడింది.

నా ప్రతి అక్షరం వెనుకున్నది నా తల్లిదండ్రులు మరియు గురువుల ఎనలేని కృషి. నేనోట్టి నిమిత్తమాత్రుడను మాత్రమే.

సామాజిక స్పృహతో రాస్తున్న ఈ రచనలను అందరికీ చేర్చి, తద్వారా వారిలో ఎంతో కొంత మార్పు తీసుకురావాలన్నదే నా ఈ ప్రయత్నం.

అంతేకాని సంపాదన కోసమో, లేక గుర్తింపు కోసమో కాదు.

చదువుతున్న పాఠకులందరికీ ఈ నా రచనలు నచ్చితే అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.

నాకు మీరిచ్చే రేటింగ్స్ కన్నా, అభిప్రాయాలతో కూడిన సమీక్షలు చాలా విలువైనవి. వాటి ద్వారా మీరిచ్చే అభిమానమే నేను సంపాదించే కీర్తి. అది ఎన్ని కోట్లు ధనం ఖర్చుపెట్టిన సంపాదించుకోలేనిది.

మరొక సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.

ఇంతటితో సెలవు🙏🙏🙏

మీ ...

సత్య పవన్ 👇👇👇



Rate this content
Log in

Similar telugu story from Horror