susmitha susmitha

Horror

3.6  

susmitha susmitha

Horror

నిశ్శబ్దం

నిశ్శబ్దం

3 mins
2.1K


ఈ తరానికి చెందిన ఒక ఆత్మకథ , పగ తీర్చుకునే ప్రయత్నం కాదు ప్రాణాలు తీసే ప్రేతాత్మ, దానితో చెలగాటం అంటే కొలిమి తో ఆటలే మన పెద్దలు చెప్పే దానికి ఎప్పుడు ఒక అర్థం ఉంటుంది అది కాదని మనం అతిగా ప్రయత్నిస్తే జరిగేవి అనర్థాలే... అలాంటి ఒక ప్రమాదమే ఈ నా కథ. నా వర్ణనల ప్రకారం వర్ణిస్తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి... 

               ఊరికి అవతల ఒక చిన్న ఇల్లు ఉండేది.దానిలో ఒక బామ్మ, ఒక అందమైన అమ్మాయి ఉండేవారు ఆ అమ్మాయి పేరు మోనా .తను ఎప్పుడూ మౌనంగా ఉండేది .తనకి ఎక్కడికి కి వెళ్లడం ఇష్టం లేదు ఎప్పుడు నిర్మానుష్యమైన అడవిలోనే ఉంటుంది .అక్కడికి వెళ్లాలంటేనే పిల్లలు భయపడి పోతారు కానీ తను మాత్రం భయపడదు చివరికి పెద్దలు కూడా తనను చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే అది ఒక శవాల దిబ్బ ఒక్కోసారి తను ఒంటరిగా, ఆ ప్రదేశంలో ఉండే ఒక మర్రిచెట్టు దగ్గర కూర్చుని తనతో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది కానీ అక్కడ ఒక అబ్బాయి తనను రోజూ గమనిస్తూనే ఉంటాడు అతనికి కూడా తనలాగే అచ్చం ఎవరితో మాట్లాడకుండా తన కథను తానే రాసుకుంటూ ఉంటాడు. పాపం ఆ అబ్బాయిని అందరూ ఏడిపించేవారు వాళ్ళిద్దరికీ మంచి పరిచయం ఏర్పడింది .కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయితో కలిసి తను రోజు అడవికి వెళ్ళి ఆడుకునేది. కళ్ళు మూసుకొని చూడు ప్రపంచం చాలా భయంకరంగా కనిపిస్తుంది చెప్పేది, అతను కూడా దానిని అంగీకరించేవారు ఒకరోజు వాళ్ళిద్దరూ రాత్రి పూట కూడా అక్కడే గడపాలి అని అనుకున్నారు దానికోసం ఆహార పదార్థాలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. మంట వేసుకోడానికి ఒక్క చెట్టుని కత్తి తో నరికి మోనా అక్కడికి తీసుకువచ్చింది. వచ్చేలోగా రాక్ అక్కడ లేడు, ఇప్పటికే చీకటిగా ఉంది. తాను ఆ ఎక్కడికి వెళ్లాడు అంటూ ఆ చీకటి లో తన కోసం వెతక సాగింది. ఒక చెట్టు మీద అతను నెత్తురు కక్కుతూ పడి ఉండడం చూసింది తనని ఎవరో పొడిచినట్లు కత్తితో గాట్లు ఉన్నాయి. రాక్ .....అంటూ బాధతో ఆమె అరవసాగింది. అప్పుడు వాళ్ళ బామ్మ వచ్చి ఎందుకు? ఏమైంది ?అలా అరుస్తున్నావ్ అని తనను నిద్ర లేవ కొట్టింది .ఇదంతా కలేనా నేను ఇంకా నిజమే అనుకొని ఎంత భయపడ్డాను. బామ్మమ నేను రాక్ దగ్గరకి వెళ్లి వస్తాను అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఈ సమయంలో అతని దగ్గరికి ఎందుకు అని బామ్మ అరుస్తున్న వినలేదు .అడవికి వెళ్లి రాక్ ని వెతుకుతూ ఉంది అక్కడ ఒక పెట్టెలో నుంచి మోనా నేను ఈ పెట్టె లో ఉన్నాను.నన్ను కాపాడు అని అరుపు వినిపించింది దానితో మోనా భయపడిపోయింది నేను బయటికి రావాలంటే అక్కడ ఉండే అద్దంలో చూస్తూ రాక్ రారా అని పిలువు ,లేదంటే నేను చచ్చి పోతాను ఇలాగే ఈ పెట్ట లోనే ఉండి పోతాను. దయచేసి నన్ను కాపాడు!! అని తనని అడుగుతాడు తను ఏం చేయాలో తెలియక అయోమయంగా ఉంటుంది .అయినా అతను చెప్పినట్టే చేస్తుంది . అక్కడ బామ్మ ఏమో భయపడిపోతూ ఉంటుంది. ఆ పెట్టె నుంచి ఎవరో తీస్తున్నట్టు రాక్ పైకి లేచి హఠాత్తుగా కింద పడిపోతాడు తన వళ్ళంతా రక్తం తో చాలా అసహ్యంగా ఉంటుంది. మోనా గట్టిగా అరుస్తూ ఉంది . అప్పుడు రాక్ వెళ్లి తనను గట్టిగా పట్టుకొని నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి. అందుకనే నేను ఇలా చేశాను నన్ను క్షమించు అని నేను అడగను, ఎందుకంటే నేనంటే కూడా నీకు ఇష్టం కాబట్టి మనిద్దరం కలిసి ఈ అడవిలోనే స్వేచ్ఛగా తిరుగుదాం!! ఎవరైనా ఇటువైపు వస్తే వారి రక్తం తాగి వాళ్లను ఈ ప్రపంచానికి దొరక్కుండా వేరే ప్రపంచం లోకి పంపి చేద్దాం అని చెప్తాడు. అప్పుడు మోనా వెంటనే అక్కడి నుండి పరిగెత్తుతూ..ఇప్పటిదాకా నువ్వు మంచివాడివి అనుకున్నా ఎంత చట్ట వాడివా అంటూ ఏడుస్తూ ఉంది. నువ్వంటే నాకు ఇష్టం లేదు వెళ్ళిపో వెళ్ళిపో అని అర్ధాన్ని పగలగొడుతుంది. ఒక బీ కరమైన శబ్దం వస్తుంది ఆకాశంలో నుంచి రక్తం తో కూడిన వర్షం నేలకు జారుతుంది. మోనా పరిగెత్తే వేగానికి రక్తం ఒంటికి కూడా అంటదు అంత వేగంగా పరిగెత్తి ఒక దేవాలయానికి వెళ్ళింది .నేను చేసిన తప్పును క్షమించు దేవుడా అలాంటి చెడ్డవాడిని ఇంకెప్పుడూ బయటకి రాని వద్దు అని వేడుకుంటుంది. ఇంతదాకా మా బామ్మ చెప్పిన మాట వినకుండా అడవి కి వచ్చాను.దానికి నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు. దేవుడా నేనెలాగో ప్రమాదం నుంచి తప్పించుకున్న ఇంకా పై ఎప్పుడు మా బామ్మ మాట జవదాటను ఒక్కసారికి నన్ను క్షమించు అంటూ రోదిస్తుంది...

                          


Rate this content
Log in

More telugu story from susmitha susmitha

Similar telugu story from Horror