హమ్మయ్య...కలేనా...
హమ్మయ్య...కలేనా...


ఎప్పుడూ మా చెల్లికి నగలు కొనాలి... మా అమ్మకి మందులు కొనాలి... నాన్నకి చెకప్ చేయించాలి... ఇదే గొడవ. భార్య పిల్లలు పట్టరు ఈ మనిషికి.. భర్త మీద విసుగు అంతా అంట్ల గిన్నెల మీద చూపిస్తోంది రాజి." అమ్మా... మీ పాపని స్కూల్ లో వాన్ డ్రైవర్ ఎత్తుకెళ్లి... " ఫోన్ లో అవతలి మనిషి మాట పూర్తి కాకుండానే కుప్పకూలిపోయింది. నిద్ర లోనే వెక్కిళ్లు పెడుతూ ఏడుస్తున్న రాజి ని, "ఏమైంది రా... కలేమైనా వచ్చిందా...." తనని పొదివి పట్టుకుని లేపి అడుగుతున్న భర్త నీ, విభూతి పెట్టుకొమ్మా అని బొట్టు పెడుతున్న అత్తగారిని, ఇవేమీ పట్టనట్టు పక్క గదిలో మామగారి పక్కన పడుకున్న ఏడేళ్ల కూతురిని చూసి కానీ ఇందాక తను భయంకరమైన కల కన్నదని అర్థం కాలేదు రాజి కి. రాజి కి వచ్చింది కల గానే ఉండిపోవాలని అందరమూ కోరుకుందాం...