raparthi anuradha

Horror Romance Fantasy

4.7  

raparthi anuradha

Horror Romance Fantasy

శక్తి ఆగమనం..3

శక్తి ఆగమనం..3

11 mins
810


*"" ఇందు...క్లాస్ రూం లో

ఉంది క్లాస్ అవుతుంది 

కానీ ఆమె చాలా భయ

పడిపోతూ

ఉంది


క్లాస్ పూర్తి కాగానే బైటకు 

వస్తూ ఇందు..... మళ్లీ అడిగింది 

 హేయ్ శ్రావణి... 

ఆ అబ్బాయి ఎవరే.... 

ఎందుకు నాకు అడ్డం వచ్చాడు

మళ్లీ వస్తాడా.... 

ఓహ్ నో పెద్ద గొడవ అవుతుంది ఇంకాసేపట్లో నాన్న గారు మనుషులతో వస్తారు 

ఆయన కంట ఆ అబ్బాయి

పడ్డాడే అనుకో చంపేస్తారు....


అసలు ఎవరే అతడు

కొంప తీసి ఆ శివరాం గారి అబ్బాయి అయితే కాదు గా

అతడే అయితే నాన్న గారు

అస్సలు ఊరుకోరు అని

ఆమె మట్టుకు ఎవేవేవో 

మాట్లాడేస్తు ఉంటే...??? 


*""శ్రావణి ఆమెను కంట్రోల్ చేస్తూ 

ఎం లేదు ఇందు ఇంక ఆ అబ్బాయి మన మధ్యకి రాడు చూడు

ఇక్కడ ఎక్కడ అతడు లేడు

గట్టిగా వార్నింగ్ ఇచ్చాను కదా.... అయినా నువ్వు ఇలా భయపడుతూ ఉంటే 

ఎలా నాలుగేళ్లు కాలేజ్ లో

ఉండాలి అబ్బాయిలు

అన్నాక అల్లరి చేస్తారు మనం ఇజిగా తీసుకోవాలి..... తెలిసిందా..??


*" అయినా నేను విన్నాను మీ ఫాదర్ పెద్ద పారిశ్రామిక వేత్త అని పొలిటీషియన్స్ తో చాలా క్లోజ్ గా ఉంటారు అని సిటీ లో చాలా

మంది మీ నాన్నగారికి భయపడతారు అని.....  

అలాంటి వారి అమ్మాయి

నువ్వు ఎంత స్ట్రాంగ్ గా 

ఉండాలి.... 

అది మానేసి ఎవడో కుర్రాడు 

వచ్చి టీజ్ చేశాడు అని భయ పడుతున్నావు ఇంక నీ మూడ్ మార్చుకో అని నచ్చచెప్పింది.....


*"" ఇందు ఆమె మాటలు విని దిగులుగా నువ్వన్నట్టు

నాకు భయం ఎక్కువే కానీ నా కారణం గా వెరవరికైన కష్టం 

జరిగితే భయం కంటే 

భాదే ఎక్కువ పడతాను

అందుకే అంటున్న ఆ అబ్బాయి మళ్లీ నాకు ఎదురు పడకూడదు అని నిట్టూరుస్తూ చెప్పింది


*"" ఇందు మనసు శ్రావణి కి అర్ధం అయింది అలాగే ఆమె కేరక్టర్ శ్రావణి కు బాగా నచ్చింది

ఒక్కరోజు లోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళు

అంతలో ఇందు కార్ వచ్చింది అందులో విచిత్రం గా ఇందు నాన్నగారు లేరు అతడి

మనుషులు లేరు కేవలం డ్రైవర్ మాత్రమే ఉన్నాడు.


ఇలా జరగడం ఫస్ట్ టైం...

ఆమె కోసం నాన్నగారు రాలేక

పోతే మనుషులని ఏర్పాటు చేస్తారు ఇలా వంటరిగా డ్రైవర్ నీ పంపరు ఆమె ఆశ్చర్యం గా

చూస్తూ ఉంటే శ్రావణి ఓకే

ఇందు రేపు కలుద్దాం బై

అంటూ వెళ్లిపోయింది.


*"" ఇందు కార్ దగ్గరకు 

కంగారుగా వచ్చి యాధి ఏమైంది నువ్వు ఒక్కడివే వచ్చావ్ నాన్నగారు ఏరీ... 

వెంట మనుషులు కూడా లేరు

అని కంగారుగా

అడుగుతుంటే... 


"""యాది కార్ దిగి ఆమెకోసం

డోర్ ఓపెన్ చేసి.. 

అన్న మేయర్ కాడ ఉండారు ఇందమ్మ.... మీరు రండి ఆలస్యం అవుతాంది అని చెప్పి కార్ ఎక్కించాడు


ఇందు ఎదో గందరగోళం ఊహిస్తూ...నే కార్....ఎక్కి కూర్చుంది. 


అతడు ఆమెను ఇంటికి తిరిగి తీసుకు వెళుతున్నాడు.


*"" సిద్దు దూరం నుండి చూసాడు ఇందు కార్ లో వెళ్ళడం...

అతడి ఫ్రెండ్స్ ఆమె డీటెయిల్స్ తీసుకు వచ్చే లోగా తానే తెలుసుకుంటే పోలా.....

అనుకుని

ఆమెనే ఫాలో చేస్తూ వెళ్లి ఆమె ఎవరో తెలుసుకుంటే బెటర్ అనుకుని ఆ కార్ వెనకే

అతడు కదిలాడు.

*"""

*"" కొన్ని గంటల ముందు

భూషణ్ మేయర్ సరోజ నీ కలిశాడు

అమే చెప్పిన మాటలు 

విని షాక్ అయ్యాడు


అతడు అడిగిన కాంట్రాక్ట్

శివరాం కి ఇవ్వాల్సి వచ్చింది

అని అందుకు తను ఎం 

చేయలేక పోయాను అని 

చెప్పడం తో

భూషణ్ సీరియస్ అవతు

అదేంటి మేయరమ్మ..... 

ముందు నుంచి ఈ కాంట్రాక్ట్ పై ఆ శివరాం కంటే నేనే ముందు

ఉన్నాను గా ..


పైగా వాడు ఈ కాంట్రాక్ట్ పై

ఇంట్రస్ట్ పెట్టలేదు గా

మరీ 

మధ్యలో ఎక్కడి నుండి వచ్చాడు మీరెలా వాడికి కంట్రెక్ట్ 

ఇస్తున్నారు అని నిలదీశాడు....!!


*""""ఆవిడ భూషణ్ అంత సీరియస్ గా అడుగుతున్నా ఎంతో

తేలిక గా ఆన్సర్ చేసింది 

చూడండి ఫణి భూషణ్ గారు 

మీరు నాకు డబ్బులు

ఇచ్చారు అలాగే ఎంతో

రిక్వెస్ట్ చేశారు.......

నేను మీకు మాట ఇచ్చాను 

కానీ మధ్యలో శివరాం

ఎంట్రీ ఇవ్వడం జరిగింది


అంటే అందుకు

కారణం

మినిష్టర్... హరిబాబు....

అంతా ఆయన వలనే జరిగింది.... నిజానికి నేను ఎమ్మెల్యే ఎంపి లకి ఈ మినిష్టర్ లకి 

భయపడను... 

వాళ్ళ కంటే నేను తక్కువేం 

కాదు కానీ వీళ్ళకి

సపోర్ట్ సీఎం గారు ఉన్నారు.


*""మినిష్టర్ తో నేను వైరం పెట్టుకుంటే అతడికి 

సన్నిహితుడు అయిన

సీఎం తో కోరి తగాదా పెత్తుకున్నట్టే.... 


మీరే చెప్పండి ఓ పాతిక కోట్ల కాంట్రాక్ట్ కోసం నేను అందులోనూ మహిళను సీఎం తో వైరం పెట్టుకోవడం అవసరం అంటారా.... త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి అందుకే మినిష్టర్ కి ఎదురు

వెళ్ళలేక పోయాను

ఈ కాంట్రాక్ట్ శివరాం కి

ఇచ్చేయాల్సి వచ్చింది

అందు వలన నాకు మినిష్టర్ తో అతడి ద్వారా సీఎం తో ప్లస్

శివరాం తో ఎలాంటి గొడవ ఉండదు..... 

కాకుంటే మీకు ఇచ్చిన మాట నిలపెట్టుకో లేక పోయాను మన్నించాలి నెక్స్ట్ టైం

మీకు అవకాశం ఇస్తాను

అర్థం చేసుకుంటారు 

అనుకుంటున్న 

ఇదిగోండి మీరిచ్చిన డబ్బు 

అని అతడి డబ్బు అతడి

మొహాన కొట్టినట్టు ఇచ్చి

అంతా చెప్పింది.


*"" అంతే భూషణ్ రగిలి పోతు ఎంటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావ్

సీఎం మినిష్టర్ ఆ శివరాం వీళ్లకే నువ్వు భయ పడతావా.... 

అంటె ఈ భూషణ్ అంటే భయం లేదు అనేగా నేనేం చేయలేను అనేగా.... 

చేస్తా నేనేంటో నీకు అలాగే ఆ శివరాం కి తెలిసేలా

చేస్తా అని అక్కడి నుండి 

వెనుతిరిగి వస్తుంటే....


*""అతడి మనుషులు మేయర్ కి 

కోపం రాకుండా అన్న 

పరేషాన్ లో ఉన్నాడు మాఫ్ చేయమని చెప్పి ముందుకు కదిలారు.


ఆవిడ వుష్ ఈ శివరాం టెన్షన్ తప్పింది అనుకుంటే 

ఈ భూషణ్ టెన్షన్ స్టార్ట్

అయ్యింది అయినా

ఇతడెం చేయలేడు లే 

అని ఊపిరి తీసుకుని

హమ్మయ్య అనుకుంది.


*"" నిజానికి 

గవర్న్ మెంట్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయ్యింది.....అందు కోసం

 ఒక స్థలం చూస్తున్నారు 

ప్రభుత్వం వారు.....

అంతా సక్రమం గా ఉంటే 

కాంట్రాక్ట్ ఇస్తారు మంచి

ఉపయోగం ఉండే కాంట్రాక్ట్

కావడం తో

భూషణ్ ఆశ పడ్డాడు. 

ఆ కాంట్రాక్ట్ మేయర్ చేతుల్లో

ఉంది.


భూషణ్ కి కొన్ని ఎకరాల 

భూమి ఉంది దాన్ని

చూపించి 

ఆ కాంట్రాక్ట్ తనకి ఇమ్మని 

అడిగాడు కావలసినంత డబ్బు ఇస్తాను అని అడ్వాన్స్ కూడా ఆవిడకి ఇచ్చాడు


*""" ఆవిడ ముందు

నుండి ఈ కాంట్రాక్ట్ మీకు 

ఇప్పిస్తా అని చెప్పి చివరిలో

శివరాం కి ఇచ్చింది

తనని 

యదవ నీ

చేసింది అని కాదూ వాడు ఆ శివరాం తాను యదవ అయ్యేలా చేశాడు అని రగిలిపోతూ

ఉన్నాడు.


*"" భూషణ్ కి శివరాం తీసిన

దెబ్బ భరించ లేనట్టు ఉంది 

అంతా పూర్తి అయ్యింది తన కూతురు

ఇందిరమ్మ పేరు పై పని ప్రారంభించాలి అనుకుంటే

నడిమిట్ల ఆ శివరాం

ఆ కాంట్రాక్ట్ గద్ధలా వచ్చి 

తన్నుకు పోయాడు ఆడ్ని

విడిచి పెట్టేదే లేదు అని 

ఎమ్మెల్యే శ్రీనివాసులుకి 

ఫోన్ 

చేసి ఇక్కడ జరిగిన 

సంఘటన చెప్పాడు


*" అతడు అర్థం చేసుకుని ఆ మినిష్టర్ సపోర్ట్ తో శివరాం రెచ్చిపోతున్నాడు 

భూషణ్ నువ్వు ఆవేశ పడకు ముందు వచ్చి నన్ను కలువు

మనం మాట్లాడుకుందాం....

ఎం చేయాలి ఎలా ఆ శివరాం నీ దెబ్బ తియ్యాలి అన్నది ప్లాన్

చేద్దాం అని అతడ్ని అక్కడి 

నుండి తన గెస్ట్ హౌస్ కి 

పిలిపించి మంతనాలు

చేస్తూ

మందు మీద దృష్టి పెట్టారు 

అంతా శివరాం పై రగిలిపోతూ

ప్లాన్ చేస్తున్నారు...


ప్రస్తుతం భూషణ్ తెలివి

లేనంత తాగాడు అంతలో

అతనికి

  ఇందు విషయం

గుర్తు వచ్చింది.... 

టైం లేదు ఇవ్వాల్టి కి 

డ్రైవర్ యాది నీ వెళ్ళమని

చెప్పి పంపించి. 

అతడితో తన మనుషులని ఉండమని చెప్పాడు....!


*"" భూషణ్ అంటున్నాడు...

శ్రీనివాసులు....

ముందు ఆ హరిబాబు

సంగతి చూడాలి

వాడి పదవి వూడకొడితే

ఈ శివరాం రెక్కలు

రాలిపోతాయి అని అటుగా 

ఎత్తు వేస్తు చెప్పాడు. 


*"శ్రీనివాసులు కూడా 

హరిబాబు పై నిప్పులు చేరుగుతు వీడికి పదవి రావడం 

పట్టలేనట్టు గా ఉంది 

అంతా వాడి ఇష్టానికి 

చేస్తున్నాడు

నా పనులకు కూడా వాడు అడ్డు వస్తున్నాడు.

నిన్న మొన్నటి దాకా నన్ను

అన్నా అన్నా అని అనేవాడు

ఇప్పుడు పేరు పెట్టిపిలుస్తున్నాడు.... 

అంతా పదవి గర్వం.


*"" అందుకే అంటారు.... 

యదవలకి పదవలిచ్చిన 

గుర్రానికి రెక్కలొచ్చి న 

పట్టలెం.....!


అని...

ముందు వాడి పదవి ఊడకొట్టాలి

ఆ పదవి నీకు వచ్చేలా

చేయాలి అందుకు

నువ్వు కాస్త పైకం వదులుకోవాలి

ఎలాగూ ఎన్నికలు 

రాబోతున్నాయ

అక్కడ చూసుకుందాం 

వాళ్ళ సంగతి 

ఏమంటావ్ భూషణ్ అని శ్రీనివాసులు అడిగాడు...?????


*'' భూషణ్ ఇంత వరకు పొలిటీషియన్ సపోర్ట్ తో

బిజినెస్లు రన్ చేస్తు వచ్చాడు 

కానీ ఇప్పుడు

భూషణ్ కి పొలిటీషియన్

అవ్వమని సలహా

ఇచ్చాడు శ్రీనివాసులు.


అంతే తానే ఎమ్మెల్యే అయితే తనకున్న స్టేటస్ తో బ్యగ్రౌండ్ తో మినిస్ట్రీ కొట్టేయడం పెద్ద కష్టం

కాదు అప్పుడు

ఆ శివరాం ఎం 

చేస్తాడో.... చూస్తాను

నన్ను చూసి ఎలా ఎడుస్తాడో 

ఎంత కుల్లిపోతాడో

ఈ మేయరమ్మ నాకు

భయపడదట చూస్తాను

ఎలా భయ పడదో అని

వాళ్ళని తలచి నవ్వుకుంటూ.... శ్రీనివాసులు తో చేతులు

కలిపి నా ఎంత కర్చు అయినా నేను పెడతాను

ఎమ్మెల్యే కి నేను పోటీ చేస్తాను

ఆ హరిబాబు నాకు అడ్డు

వచ్చి శివరాం కి సాయం

చేసినందుకు అనుభవిస్తాడు... 

నేను వాడి పదవి లాక్కుంట

అని అతడికి ఆపోజిట్ గా

పోటీ చేసేందుకు ఆమోదం

తెలిపాడు. 


*"అంతే... శ్రీనివాసులు చక్రం తిప్పుతూ  

పార్టీ అధిష్టానం తో

మీటింగ్ కి ఏర్పాట్లు

చేస్తున్నాడు. 


*'భూషణ్ దగ్గర చాలా డబ్బు

ఉంది సో ఎలా అయినా 

గెలుస్తాడు అందుకే పార్టీ టికెట్

ఈజీ గా వస్తుంది అని ధీమా

వ్యక్తం 

చేశాడు.. 

వాళ్ళ ఆలోచన బైటకు 

వెళ్లకుండా శ్రీనివాసులు

జాగర్తలు తీసుకుంటూ

ఉన్నాడు.


భూషణ్ కూడా సమయం

వచ్చే వరకు విషయం బైట

పెట్టను అని తను

రాజికియ్యాల్లోకి రాబోతున్నాడు అన్న విషయం ఇంట్లో వాళ్ళకి 

కూడా చెప్పకూడదు అని 

నిర్ణయం తీసుకుని అతడి మనుషులు తన మాట

జవదాటరని నమ్మకం తో

ఇంటికి తిరిగి వెళుతున్నాడు.

*""


*"" వాళ్ళకంటే ఒక అడుగు 

ముందు ఉన్న శివరాం 

కాంట్రాక్ట్ భూషణ్ కి కాకుండా చేశాను అని సంతోష పడుతూ హరిబాబు తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉన్నాడు... 

అలాగే దెబ్బ తిన్న భూషణ్ 

ఇప్పుడు ఎం చేయబోతున్నాడో

అని సందేహ పడుతూ వాడి

నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకునే పనిలో ఉన్నాడు శివరాం.


*"" యాది కార్ డ్రైవ్ చేస్తూ

ఉంటే ఇందు విండో నుంచి 

బైట కి చూస్తూ.... 

త్వరగా ఇంటికి చేరుకుంటే 

చాలు అని లోలోపల భయపడుతూ.... 

కూర్చుని ఉంది.


*""వాళ్ళని సిద్దు... తన కార్ తో ఫాలో చేస్తూ...వస్తున్నాడు... 

కొంత దూరం వెళ్ళాక... ఎప్పటిలా.... సిద్దు... 

ముందు కొన్ని సింటంస్ 

కనిపిస్తూ ఉన్నాయి... 

అతడి చేతులు చమట పడుతుంటే.... 

కాళ్ళు వణుకుతూ 

ఉన్నాయి... అతడికి 

తెలుస్తుంది... ఆ లైట్.....

అతడి ముందుకు రాబోతుంది

అని సిద్దు కంగారుగా....

ఓహ్ నో.... ఇప్పుడా...

వద్దు ప్లీజ్....అని కార్ స్లో చేస్తున్నాడు 

కానీ ఎదో తెలియని శక్తి...అక్కడంతా

అలుముకొని అతడికి

మార్గం కనిపించకుండా కమ్ముకుంది...!!


ఒక్కసారిగా సిద్దు కార్ స్టీరింగ్ వదిలేశాడు...

చివరిగా బ్రేక్ పై కాలు వేసి...

ముందుకు వెళుతున్న కార్ ఆపగలిగాడు 

కానీ ఆ వెలుగు నుండి తప్పించు కోలెక పోయాడు...

కొన్ని క్షణాలు ఆ కాంతి

కిరణాలు సిద్దు నీ కవచం లా

చుట్టేసి..అతడిలో ఉన్న శక్తి

నంతా తీసుకున్నట్టు

చేసి అదృశ్యం అయ్యింది. 


అంతే సిద్దు పూర్తి నిస్సత్తువ ఆవహించి నట్టు అయిపోయి

సొమ్మసిల్లి పడిపోయాడు. *""ఇందు ఉన్న కార్ ముందుకు దూసుకు పోయింది. 

ఒక ప్రదేశం కి చేరుకున్న వెంటనే

కార్ సడన్ గా ఆగిపోయింది.

ఉన్నట్టుండి కార్ ఆగిపోవడం

తో ఇందు భయం గా 

ఉలిక్కి పడి ఏమైంది యాది ఎందుకు కార్ ఆపావ్ అని అడిగింది. 


*""యాది ఏమి అర్ధం కానట్టు

చాలా సార్లు కార్ స్టార్ట్ చేసి

ఆ కార్ స్టార్ట్ అవ్వక ఇందమ్మా నాకు ఎం తెలియడం లేదు... 

ఉండండి చూస్తాను 

అని కార్ దిగాడు


*""ఇందు కి భయం

ఎక్కువయింది త్వరగా

యాది చీకటి పడింది

ఇంటికి వెళ్ళాలి అని 

చెబుతూ ఉంటే 

అతడు ఎంత అమ్మా 

రెండు నిముషాలు అని చెప్తూ 

కార్ బో నెట్ ఓపెన్ చేసాడు చూడబోతే రేడియేటర్ వేడెక్కి ఆవిర్లు వస్తున్నాయి 

విచిత్రం గా కొత్త కారు

అందులోనూ అసలు ఎక్కువ వాడింది లేదు సర్వీసింగ్ చేయాల్సిన సమయం ఇంకా రాలేదు అలాంటిది 

ఉన్నట్టుండి ఇలా పొగలు

రావడం ఎంటి అని చెక్ చేసి 

వాటర్ పోస్తే సరిపోతుంది 

అనుకుని ఇందుఅమ్మ

రెండు నిముషాలు ఇక్కడ

దగ్గర్లో వాటర్ ఉంటే తీసుకు వస్తాను మీరు కార్ లోనే 

ఉండండి అని చెప్పి

ఆమె చెప్తున్న వినిపించు

కొకుండా వెళ్లిపోయాడు.


*" అంతే ఇందు గుండె 

దడదడ కొట్టుకోవడం

మొదలైంది

చూస్తుంటే చుట్టు ప్రక్కల 

ఎవరు లేనట్టు ఉంది 

నిర్మానుష్య 

ప్రదేశంలో ఆ కార్

ఆగింది 

ఆమెకు ప్రాణం 

వణికిపోతుంది.... 

ఎదో ప్రమాదం రాబోతుంది 

అని అర్థం అవుతుంది.... 

ఆమె దేవి మాత స్తోత్రమ్ 

పటించాలి అని ప్రయత్నిస్తూ 

ఉంది కానీ గొంతు పెగలడం 

లేదు... 

నోట మాట రావడం 

లేదు చేతులు

వణుకుతుంటే 

ఆమె పక్కన ఉన్న

బ్యాగ్ లో

 మొబైల్ అందుకుని 

తన

వాళ్ళ కి ఫోన్ చేయాలి

అనుకుంది కానీ

అందుకు 

అవకాశం లేకుండా....

పోయింది.


*"" యాది వాటర్ పట్టుకుని వచ్చాడు అక్కడికి వచ్చి

చూడబోతే కార్ లో 

అమ్మాయిగారు లేరు...

అతడికి కంగారు అనిపించింది.... ఇదేంటి ఇందమ్మ ఎక్కడికి 

వెళ్లారు అని కంగారుగా 

అక్కడంతా వెతుకుతూ... 

ఉన్నాడు.


*"" స్పృహలో లేనట్టు

అయిపోయి ఉన్న సిద్దు కళ్ళ ముందుకు ఒక ఆకారం

హఠాత్ గా వచ్చి నిలుచుంది.


సిద్దు తుళ్ళి పడి చూసాడు చూడబోతే ఆమె ఒక హిజ్రా.... 


( ఫ్రెండ్స్ ఈ కథలో హిజ్రా గా

ఉన్న ఆమెకు చాలా

ఇంపార్టెన్స్ ఉంది 

నేను వారిని గౌరవిస్తూ

వారికోసం ఒక పాత్రని 

క్రియేట్ చేశాను

అంతా గమనించాలి

అని కోరుకుంటున్న)


*""ఎర్ర చీర కట్టుకుని 

పసుపు పూసుకుని నుదిట సూర్యుని రూపం లో

కుంకుమ పెట్టుకుని 

చూసేందుకు ఆది శక్తి

అవతారం అన్నట్టు

ప్రకాశిస్తూ కనిపిస్తుంది.....

ఆమెను చూసిన సిద్దు.... 

ఓపిక లేనట్టు ఎవరండీ

మీరు ఎం కావాలి అని అడిగాడు. 


*"ఆమె తలపై ఒక కలశం 

పెట్టుకుని ఉంది అక్కడికి 

దగ్గరలో ఉన్న మావారి కి 

అర్చన చేసేందుకు వెళ్తుంది

అని చెప్పి ఎంటి బిడ్డ ఇలా ఉన్నావు ఏమైంది అని 

అతడి తల్లి అడిగినట్టు 

అడిగింది... 


సిద్దు నీరసం గా ఎం లేదు 

అమ్మా ఎం జరిగిందో నాకే తెలియడం లేదు 

ఇంక నీకే మి చేబుతను..... 

అని అనడం తో 


*""ఆమె నవ్వుతూ నువ్వు నాకేం చెప్పనవసరం లేదు

నీకు నువ్వు తెలుసుకుంటే 

చాలు లే కానీ అందుకు

ఇంకా సమయం రాలేదు 

ముందైతే నీ నీరసం

తొలగించుకో అని ఒక మట్టి

ప్రమిద లాంటి దానిలో ఆమె 

తలపై ఉన్న కలశం లోని

పానకం పోసి...హు... 

తాగు అని చెప్పింది.


*"" అస్సలు కదల్లేని పరిస్తితి లో సిద్దు ఉన్నాడు 

ఆమె ఎవరో ఏంటో తెలియదు

కానీ మంచి ఆవిడలా

అనిపించి వద్దు అనకుండా

ఆ పానకం తాగాడు.


*" అంతే పోయిన ఎనర్జీ కి 

వంద రెట్లు ఎక్కువ బలం 

వచ్చినట్టు అనిపించింది

అతడు ఆశ్చర్య పోతూ

అమ్మా మీరెవరో గాని 

సమయానికి ఈ సిరప్ ఇచ్చారు వావ్ నాకు నార్మల్ అయింది

అని అంటూ ఉంటే... 


*"ఆమె నవ్వుతూ నీలో శక్తి కోల్పోవడం అంటే అదీ 

తాత్కాలికం పోవలసింది

పోతేనే రావలసింది రాగలదు.... ఇప్పుడు ఈ శక్తి నీతో పాటు ఇంకొకరికి కూడా అవసరం

అని అర్థం కానట్టు 

మాట్లాడుతూ ఉంటే 


*"సిద్దు విసుగ్గా 

నీ మాటలు నాకు అస్సలు అర్ధం కాలేదు కానీ థాంక్స్

ఇంక నేను వెళ్ళాలి నా బ్యూటీ ఎటుపోయిందో ఎమో అని ముందుకు వెళ్ళబోతూ ఉంటే.


*"" ఆమె కార్ కి అడ్డం వచ్చి 

పొన్ను పోయినా వైపు

పోతున్నావు గాని నీ పయనం అటు కాదు బిడ్డ,

ఇటు మరలు అదే నీకు సరైన మార్గం పో ఇటేపు పో అని

యడమ వైపు చూపించి.

ఆమె చేతిలో ఉన్న కుంకుమ

అతడి నుదిట పెట్టింది.


*"" సిద్దు చాలా లేట్ అయ్యింది ఆమె కార్ వెళ్ళిపోయి 

ఉంటుంది ఇంకెందుకు అటు పోవడం అని ఆవిడ చెప్పిన వైపు వెళ్తే తన ఇంటికి షార్ట్ కట్ అనుకుని అటు తిరిగి వెళుతున్నాడు...!!*""ఆ హిజ్రా.... నవ్వుతూ.... 

నీ దిశ మార్చాలి అని వాడు చూస్తున్నాడు.... 

కానీ నీ కవచం అందుకు 

అడ్డు పడింది.


నీ గమ్యం చేరేందుకు ఈ అమరావతి నీ అడ్డు పెట్టింది

ఆ శక్తి.....

బిడ్డా ఇంక వాడు ఏమి

చేయలేడు అంతా అమ్మ ఆశీర్వాదం అని గట్టిగా

నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.


*"" సిద్దు విసుక్కుంటూ

అసలు నాకేం అవుతుంది

ఎందుకు నేను ఇలా తెలియని ఇమాజ్నేషన్ కి గురై పడిపోతున్నాను

ఒకవేళ షుగర్ లెవెల్స్ పడిపోతుంటే ఇలా జరుగుతుందా ఒకసారి డాక్టర్ నీ మీట్ 

అవుతా అని అనుకుంటూ

కార్ నడుపుతూ ఉంటే 

కొంత దూరం లో ఎవరో

అమ్మాయి పరుగులు పెడుతూ రైల్వే ట్రాక్ వైపు

వెళుతున్నట్టు కనిపించింది.


*" అంతే సిద్దు కార్ స్పీడ్ పెంచి అటుగా వెళ్ళాడు

అక్కడ కార్ ఆపేసి అతడు

ఆ ట్రాక్ వైపు పరుగు

తీశాడు.

********"""""""""**********"""""""""""

*"" ఇందు కార్ లో ఉండగా ఆ చీకటి నీడ ఆమెను కమ్ముకుంటు

వచ్చింది అంతే ఇందు భయం తో కేక పెట్టింది...

అక్కడ ఎవరూ లేరు కానీ

ఎదో వింత సభ్ధం

భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి అంతే... 

ఇందు భయం గా కార్ దిగి పరుగులు పెడుతూ ఉంది 

ఆమె పరిస్తితి దారుణం గా

ఉంది చీకటి కంటే నల్లని నీడ

ఆమె ను వెంటాడుతూ

ఉంది ఇందు చుట్టు ప్రక్కల

ఎవరు లేకపోవడం వల్ల

ప్రాణాలు దక్కించు కోవడం 

కోసం రోడ్ పై పరుగులు తీస్తు

ఉంది ఆ నీడ ఇందు నీ 

తాకలేదు కానీ భయపెడుతూ వెంటాడుతూ ఉంది

అందుకే ఇందు పరుగులు

తీస్తూ రైల్వే ట్రాక్ వైపు 

వచ్చింది 


*""'ఆమెకు ఎం జరుగుతుంది

తాను ఎక్కడ ఉంది అర్థం కాలేదు వెంటాడుతున్న నీడ నుండి తప్పించు కోవాలి అదొక్కటే

ఆమె చేస్తుంది ఆ నీడ కూడా ఆమెను తరిమింది కేవలం 

ఆమెను ప్రమాదం లో పడతోయాడానికే... 

అటుగా వస్తున్న ట్రైన్ కింద 

ఆమె పడబోతోంది.....

**""""***""""""**"""'"""***"""""""*****

*"" సిద్దు అనుకుంటూ ఉన్నాడు ఎవరో అమ్మాయి సూసైడ్

చేసుకునే ప్రయత్నం చేస్తుంది అనుకుని ఎంతో వేగం గా

వెళ్లి క్షణం లో ఆమె చేయి అందుకుని పక్కకి లాగేసాడు.


*" అతడు క్షణం ఆలస్యం చేస్తే 

ఆమె ట్రైన్ కింద పడి ముక్కలు ముక్కలు అయిపోయేది.....

అంత వరకు ఆమెను 

వెంటాడిన నీడ అక్కడికి

సిద్దు రావడం తో మాయం అయ్యింది....


*' సిద్దు చేయి అందుకున్న 

ఇందు కెవ్వున కేకే పెట్టీ

స్పృహ కోల్పోయింది.... 


*"అంతే అక్కడి దృశ్యం చూసి సిద్దు షాక్ అయ్యాడు

తాను ఎవరికోసం అయితే 

వెతుకుతూ ఉన్నాడో ఆమె 

తానుగా ట్రైన్ కింద పడబొయింది కాస్త అతడు ఆలస్యం చేసి 

ఉంటే ఓహ్ గాడ్ సిద్దు వళ్లు జలదరించింది.


*"" ఆమె చేయి ఇంకా అతడి

చేతిని బిగించి పట్టుకునే

ఉంది.

ఆమెను అతడు చుట్టుకుని ఉన్నాడు

అమే గుండె వేగం అతడికి తెలుస్తుంది... 

ఎదో తెలియని అనుభూతి

ఎన్నో ఏళ్ల యడబాటు తొలగిపోయిన భావన

కలిగింది.

అలాగే ఆమెలో స్పృహ లేదు.... చాలా భయపడింది

అందుకే వళ్లంతా

చల్లబడి ఉంది

సిద్దు కి ఎలా అర్థం

చేసుకోవాలో తెలియడం

లేదు కాసేపటి క్రితం కాలేజ్ 

నుండి బైలుదేరిన అమ్మాయి

ఇలా సూసైడ్ చేసుకోవాలి

అని ఎందుకు అనుకుంది 

అని ప్రశ్నించుకుంటూ..... 

ఆమెను 

ఎత్తుకుని తన కార్ వరకు

తెచ్చి

కార్ లో పడుకో పెట్టీ 

ఆమెను తడుతు పిలుస్తూ

ఉన్నాడు,,


అతడికి ఆమె పేరు తెలియదు అందుకే హేయ్.... బ్యూటీ...

ఏ బ్యూటీ... కళ్ళు తెరవ

ఏమైంది నీకు

ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నావ్ అని అతడు

ఎంత పిలిచిన ఇందు పలక లేదూ ఆమెకు మెలుకవ

రాకపోయే సరికి అతడికి 

కాస్త భయం వేసింది 

ఎం చేయాలి అని తన 

మనుషులకి కాల్ చేయ

బోయాడు.


*"" అంతలో అటుగా

యాది కార్ తో వచ్చాడు

అతడు సిద్దు కార్ అక్కడ 

ఆగి ఉండటం చూసి సందేహం గా అక్కడికి వచ్చి చూసాడు

చూడబోతే ఆ కార్ లో ఇందుమ్మ ఉంది అతడు సిద్దు తో

గొడవ కి దిగబొయాడు....

సిద్దు ఊరుకుంటాడా.... 

గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆమె

ట్రైన్ కి అడ్డం వెళ్ళబోయింది

అని ఎందుకో భయపడింది 

అని చెప్పాడు


తాను రాకుంటే ఆమె చనిపోయి ఉండేది అని చెప్పడం తో 

యాది కి విషయం అర్ధం

అయింది ఇందమ్మా.... 

ఇలాంటి ప్రమాదాల్లో చాలా 

సార్లు పడింది అంటే 

ఈ అబ్బాయి నిజమే చెబుతున్నాడు శివరాం కొడుకు ఇంధమ్మ నీ కాపాడాడు

అనుకుని అతడికి

క్షమాపణ చెప్పి అతడి సాయం తో అమ్మాయిగారిని కార్ లో ఎక్కించుకుని 

ముందుకు కదిలాడు.


*" సిద్దు అయోమయం గా 

తన కళ్ళ ముందు అసలు ఎం జరిగిందో అర్థం కాక చూస్తూ ఉండిపోయాడు.

ఇందు కి తనని సిద్దు సేవ్ 

చేశాడు అని తెలియదు 


ఆ డ్రైవర్ కూడా ఇందు కి

జరిగింది చెప్పాలి అనుకొలేదూ.


*"" మార్గం మధ్యలో ఇంటికి మెళుకువ వచ్చింది ఆమె అయోమయం గా చూస్తూ

ఉంటే అంతలో ఆమె ఇల్లు చేరుకుంది.


 *"చూడబోతే తాను కార్ లో

ఉంది అంతా నార్మల్ గా ఉంది. ఆమె కంగారుగా యాది నాకు ఏమైంది నేను కార్లో కి ఎలా వచ్చాను అని కంగారు గా 

అడిగింది..??


*" యాది తడబడకుండా మీరు కార్లోనే ఉన్నారు గా మరీ

ఎలా వచ్చాను అంటారు 

ఎంటి అమ్మ నేను నీళ్లకోసం 

వెళ్లి వచ్చాను చూడబోతే మీరు నిద్రపోతూ ఉన్నారు 

మిమ్మల్ని డిస్ట్రబ్ చేయడం 

ఎందుకు అని నెమ్మదిగా కార్ నడుపుకుంటూ వచ్చాను 

అని అభద్ధం చెప్పాడు.


*""ఇందు కంగారుగా చుట్టు చూసి లేదు నన్ను ఎవరో తరిమారు

నేను భయం తో పరుగులు పెట్టాను అక్కడ

వేగం గా ట్రైన్ వస్తుంది 

అంతలో ఎవరో నా చేయి 

పట్టుకుని లాగారు అని

అంటూ ఉంటే యాది కి అర్థం 

అయ్యింది


అతడు చెప్పింది

అంతా నిజమే అని

కానీ ఆమె భయ పడుతుంది

అని అలాంటిది ఏమి లేదు 

అని మీరు కల కనీ ఉంటారు

అని అబద్ధం చెప్పాడు.


*" అంతే ఇందు షాక్ అయ్యి అవునా నిజంగా నేను కల

కన్నానా యాది నువ్వు అబద్ధం చెప్పడం లేదు గా

నాకు భయం వేస్తుంది

నేను చెబుతుంది నిజం 

అయితే ఇంక కాలేజ్ కి కాదు

కదా ఇంట్లో నుంచి బైటికే

వెళ్ళను అని అనింది


*" అంతే యాది ఫిక్స్ అయిపోయాడు

ఇంధమ్మా నేను జరిగింది అంతా నిజం అని చెబితే 

కాలేజ్ కి వెళ్ళడం మానేస్తారు

అన్న నన్ను చావకొడతాడు అమ్మాయిని వంటరిగా ఎందుకు వదిలేసావు అని


అందుకే ఆలోచించి 

నేను చెప్పింది నిజం అమ్మ

మీరేం కంగారు పడకండి 

అంతా మీ బ్రమ అని

నచ్చచెప్పాడు.


ఇందు యాది అంత కచ్చితం గా చెప్పడం తో మౌనం వహించింది నమ్మలేని దృశ్యం ఇంకా కళ్ళముందు మెదులుతూనే

ఉంది కానీ యాది అది

స్వప్నం అనడం తో ఎటు తేల్చుకోలేక ఇంటిలోపలికి

వెళ్ళింది ఇందూ.


*" ఆమె రావడం చూసి

శారదాంబ హమ్మయ్య

వచ్చేసవా 

ఎందుకు ఇంత ఆలస్యం

అయ్యింది నీతో నాన్నగారు రాలేదా...???

అని అడిగి ఎప్పటిలా 

అమ్మాయికి దిష్టి తీసి

అవతల పడేసి ఫ్రెష్ అయి

రమ్మని చెప్పింది. 


ఇందు గదిలోకి వెళ్లి అక్కడ

ఉన్న దేవి ప్రతిమ కి

నమస్కరించి అమ్మా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది

నేను ఎం పాపం చేశాను 

అంతా కలలా ఉంది

కానీ కాదు అనిపిస్తుంది 

నన్ను తరిమింది ఎంటి

ఎందుకు వెంటాడుతుంది 

నన్ను రక్షించింది ఎవరు...???

ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ 

వేదన పడాలి ఇప్పుడు 

జరిగింది అమ్మకి చెబితే

తను కంగారు పడుతుంది 

అందుకే నేను అమ్మ తో ఏమి చెప్పను అనుకుని.... 


స్నానం చేసేందుకు డ్రెస్ 

రిమూవ్ చేయబోయిన

ఆమె చేతి గాజుల కి చిక్కున్న

ఒక వస్తువు కనిపించింది.


అది త్రిశూలం ఆకారం లో

ఉన్న లాకెట్ అది సిద్దు చేతికి

ఉన్న బ్రెస్లెట్ కి హేంగ్ అయి ఉంటుంది

సిద్దు తనకి వద్దు అని 

ఎంత చెప్పినా దక్ష్యాయిని 

అదే సిద్దు వాళ్ళ అమ్మ కుంకుమార్చన జరిపించి 

ఆ బ్రేస్లెట్ తొడిగింది

ఇప్పుడు ఆ త్రిశూలం ఇందు 

చేతికి చేరింది.....

ఆమె ఆ లాకెట్ ఆశ్చర్యం గా చూస్తూ ఇదెక్కడి నుండి వచ్చింది...

అని ఆలోచిస్తూ అంతలోనే

ఆనంద పడిపోతూ 

ఆ దేవి మాత నాకోసం 

ఇచ్చింది నేను ఎక్కువ 

భయ పడుతున్నా కదా

అందుకని అని  

అనుకుంటూ గబగబా స్నానం 

చేసి బట్టలు వేసుకుని 

ఆ త్రిశూలం లాకెట్ పూజ 

గదిలో ఉన్న అమ్మవారి దగ్గర 

పెట్టి తిరిగి తీసుకుని ఒక 

ఎర్రని దారానికి దాన్ని 

ఎక్కించి మెడలో కట్టుకుంది.


*" ఆమెకు ఎంతో ధైర్యం వచ్చినట్టు అనిపించింది

మనసు ప్రశాంతం గా ఉంది అమ్మవారి కుంకుమ

పెట్టుకుని థాంక్స్ దేవి మాత

అని అనుకుని హుషారు గా

వచ్చి అమ్మ వాళ్ళతో భోజనం చేస్తుంది

అప్పుడు వచ్చారు 

ఆమె తండ్రి

ఆయన కూతురు దగ్గరకు 

ప్రేమగా వచ్చి అమ్మా సారి రా 

నాకు వేరే పనుల వలన నీ 

దగ్గరకు రాలేక పోయాను

నీకేం ఇబ్బంది కలుగ లేదు గా

అని అడుగుతుంటే


ఆమె జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ 

అదంతా నాన్నగారి కి చెప్పడం ఎందుకు అని ఏమి లేదు

నాన్నా నేను ఎంతో ధైర్యం గా ఉన్నాను ఇదిగో ఈ లాకెట్ నాకు దేవి మాత ఇచ్చారు దీన్ని వేసుకున్నాక ఇంకా ధైర్యం 

వచ్చింది అని చెబుతూ

ఉంటే అయన నవ్వుతూ

ఆ లాకెట్ కోసం పెద్దగా పట్టించు కోకుండా

అయన టెన్షన్ ఏవో ఆయన పడుతూ అమ్మాయికి

పాలన్నం కాకుండా కాస్త కారం అలవాటు చేయ్యవే.... 

చూడు నా బిడ్డ ఎంత సుకుమారం గా ఉందో అని చెబుతూ

వెళ్లారు.


ఇందు వైపు ఆవిడ నవ్వుతూ

చూసి నువ్వింకా చిన్న పాపాయి కాదు పాలాన్నం తినడానికి 

కాస్త కారం ఉన్న కూరలు 

తింటూ ఉండు నాన్నగారు

చెప్పారు గా అని మందలించింది.


*" అయినా ఇందు తన వల్ల కాదు అని తప్పదు అంటే ఎప్పుడైనా తింటాలే ఇప్పటికీ ఈ పాలు కలుపుకుని తింటా అని గబగబా తినేసి గదిలోకి వెళ్ళిపోయింది.


దీని బట్టే మీకు అర్థం అయి ఉండాలి ఆమె ఎంత సెన్సిటివ్ గా ఉంటుందో..!


*"" ఇందు రాత్రంతా ఎంతో

ప్రశాంతం గా నిద్రపోయింది.


కానీ సిద్దు కి నిద్ర లేకుండా పోయింది...

తాను ఎదుర్కున్న సన్నివేశం మరచిపోలేక పోతున్నాడు

చేతిలో ఆమె కాలి గొలుసు పట్టుకుని చూసుకుంటూ 

ఉన్నాడు.

ఆమె కావాలి అనుకుని 

ఆమెను చేరుకోవాలి

అనుకున్నాడు అక్కడ

ఆమె చావు అంచులు దాకా వెళ్ళింది ఎందుకు అసలు ఎం జరిగింది అమే ఎవరు... అని ఆలోచిస్తూ ఫుల్ గా బీర్ తాగి పడిపోయాడు 


రాత్రి రెండు గంటల సమయం లో అతడి ఫ్రెండ్స్ కాల్ చేశారు

సిద్దు మత్తుగా ఇప్పుడేవరు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు చూడబోతే అతడి ఫ్రెండ్ ఏంట్రా ఈ టైం లో అని విసుగ్గా అడిగాడు సిద్దు...


వాళ్ళు ఆ అమ్మాయి గురుంచి తెలుసుకున్నాం అని నీతో చెప్పాలి అని కాల్ చేశాం అనడం తో

సిద్ధ అటెన్షన్ లోకి వచ్చి

ఎవరా అమ్మాయి త్వరగా చెప్పండి అని అడిగాడు


వాళ్ళు చెప్పింది వినగానే 

సిద్దు తాగింది మొత్తం దిగిపోయింది.... 

వాట్ అని గట్టిగా అరిచి 

బిగుసుకు పోయాడు....!!! 


మరీ ఇప్పుడు సిద్దు కి అసలు 

నిజం తెలిసిందా అలా అయితే ఇందు నీ దూరం పెడతాడా...???


ఇందు కి తనని సిద్దు కాపాడాడు అని తెలుస్తుందా

తెలిస్తే ఎలా రియాక్షన్ 

ఇస్తుంది అసలు వీళ్ళ జీవితం లో జరుగుతున్న సంఘటనలు వెనుక కారణం ఎంటి తెలియాలి అంటే కాస్త వేచి చూడాలి


ఫ్రెండ్స్ ఈ అప్డేట్ ఎలా అనిపించింది తెలియ

చేయండి నన్ను

ఆదరించే నా వారందరికీ ధన్యవాదాలు.

Rate this content
Log in

Similar telugu story from Horror