raparthi anuradha

Horror Fantasy Thriller

4.7  

raparthi anuradha

Horror Fantasy Thriller

శక్తి ఆగమనం..7

శక్తి ఆగమనం..7

5 mins
451


ఇందు సిద్దు ఇరిటేట్ చేస్తున్నాడు అని తిట్టుకుంటూ 

ఆమె క్లాస్ రూం వైపు వెళ్ళింది

ఆమె వెనుకే శ్రావణి నడుచుకుంటూ వెళ్లి ఫ్రెండ్ కోపం తగ్గిస్తూ ఏంటిది

ఇందు ఫ్రెండ్స్ అనుకున్నాం గా

సిద్దు పై ఇంకా కోపం దేనికి

వాడు అల్లరి చేస్తూ ఉంటే

సరదాగా ఎంజాయ్ చేయాలి 

గాని ఎంతైనా వాడు మంచి వాడెనే నన్ను సిస్టర్ అంటున్నాడు గా

అని నవ్వుతూ చెప్పింది. 


అంతే ఇందు చిరాగ్గా ఓహ్ అందుకా ఆ అబ్బాయిని వెనకేసుకు వస్తున్నావు వాడు నిన్ను

సిస్టర్ అంటున్నాడు కానీ నన్ను అనడం లేదే పైగా ఇప్పుడు

ఫిక్స్ చేశాడు నేను వాడి మరదలు అంట వాడు నాకు బావ అంట

నిన్న ఎంత గొడవ చేశాడో తెలుసా నాన్నగారికి విషయం తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుంది

నేను ఎంత భయపడ్డానో 

ఇలాగే వదిలేస్తే ఆ అబ్బాయి మళ్లీ ఇంటికి కాల్ చేసి ఎదోకటి మాట్లాడి నన్ను ఇబ్బంది పెడతాడు 

అని అంటూ ఉంటే 


సిద్దు అక్కడ ప్రత్యక్షం అయ్యి హు.... అలా అయితే ఇంటికి కాల్ చేయను అన్నాడు 


అంతే ఇందు షాక్ అయ్యి 

నిజం గానా థాంక్స్ అనింది. 


సిద్దు నవ్వుతూ నీ మొబైల్ కి చేస్తాను అన్నాడు


అంతే ఆమె ఇరిటేట్ అవుతు

ఏయ్ ఎంటి నువ్వు నా మొబైల్ కి ఎందుకు చేయాలి అసలు నీ

ఉద్దేశం ఎంటి అని కాస్త గొంతు పెంచి ఆమె అడుగుతుంటే 


సిద్దు గొప్పగా ఫీల్ అవుతూ

అరే నా అమూల్ బేబీ సౌండ్ పెంచిందే వావ్ సూపర్ బాగుంది అని మెచ్చుకుంటూ ఆమెకు 

దగ్గరగా వచ్చి ఇందాకా ఏమన్నావ్ అబ్బాయి అనా నీకు నేను 

ఏమని చెప్పాను బావా అని పిలవాలి అనేగా మరేంటి 

అబ్బాయి చిరాగ్గా అందుకే నీ మొబైల్ కి ఫోన్ చేసి అడుగుతాను అని అంటుంటే 


ఆమె కంగారుగా అమ్మో అని

గుండె పట్టుకునీ వద్దు ప్లీజ్ మా నాన్నగారి కి కోపం ఎక్కువ నిన్ను చంపేస్తారు అని అతడ్ని కొప్పడుతు వారించే ప్రయత్నం చేస్తుంటే


సిద్దు ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అయితే నన్ను 

బావా అని పిలువు అంటూ అడిగాడు ఎక్కడ సిద్దు ఇంటి 

వరకు విషయం తీసుకు వస్తాడో అని కంగారుగా హా అలాగే బావా అని పిలిచింది. 


సిద్దు తెలివిగా ఆమెకు దగ్గరగా

మైక్ పెట్టీ హు ఇప్పుడు పిలువ్

ఉత్తి బావా అని కాదు సిద్దు బావా అని పిలవాలి అని అడిగాడు


ఇందు కి ఇబ్బందిగా ఉన్నా ఇక్కడితో అతడి గొడవ వదిలించు కోవాలి అని సిద్దు బావా అంటూ గట్టిగ పిలిచింది.


అంతే ఆ పిలుపు అక్కడి కాలేజ్ అంతా వినిపించింది

ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు ఇందు అతడి వైపు కోపం గా చూస్తూ ఇప్పుడు నీకు సంతోషమే గా ఇంక నన్ను వదిలేయ్


నేను ఇన్ని సార్లు నిన్ను బావా అని పిలిచింది నీ మంచి కోసమే మా నాన్నగారికి నీ విషయం తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది 

అర్థం చేసుకో ఇంక నన్ను విసిగించకు అంటూ కంట తడి చేసుకుంటూ వెళ్లిపోయింది 


శ్రావణి సిద్దు వైపు కోపం గా

చూస్తూ రేయ్ ఏంట్రా ఇదంతా

ఊరికే ఉండలేవా

చూడు అది ఎంత ఏడుస్తోంది 

నీ గొడవ మన కాలేజ్ అంతా విన్నారు ఎలా అయినా

ఈ విషయం వాల్ల నాన్నకి తెలుస్తుంది నీ తోలు వలిచేస్తారు అని వార్నింగ్ ఇస్తుంటే


సిద్దు స్థిరం గా చూస్తూ శ్రావణి 

నాకు ఇందు అంటే ఇష్టం 

అందుకే ఆమెలో భయం 

పోగొట్టి నా పై ఇష్టం కలిగేలా చేయాలి అనుకుంటున్న

నీకో విషయం చెప్పనా

ఆమెను చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాను ఇందు ప్రేమ పొందడం కోసమే ఈ ప్రయత్నం ఆమె నన్ను మనస్పూర్తిగా బావా అని అనుకోవాలి 

ఆ తరువాత మా ఇంట్లో వాళ్ళకి తెలిసిన సమస్య ఉండదు

అంటూ క్లారిటీ ఇచ్చాడు


అంతే శ్రావణి ఇంకా శ్రీరామ్ షాక్ అయ్యారు అంటే నువ్వు సిన్సియర్ ఆనమాట కానీ దానికి ఈ లవ్ ఎమోషన్స్ లాంటి పై ఇంట్రస్ట్ లేదే అసలు నీపై మంచి అభిప్రాయమే లేదు మరి ఎలా దాని మనసు లో చోటు సంపాదించుకుంటావ్

అని అడిగింది శ్రావణి. 


సిద్దు నవ్వుతూ తన మనసులో నేను లేకపోతే నన్ను

వాల్ల నాన్న దగ్గర కాపాడాల్సిన అవసరం లేదు గా 

అని కన్ను కొట్టి అక్కడి నుండి నవ్వుతూ వెళ్ళాడు

జరిగిన గొడవ ప్రిన్సిపల్ వరకు వెళ్లింది 

ఇద్దర్నీ ఆఫిస్ రూం కి పిలిచి

ఎంటి గొడవ అని అడిగారు


ఇందు ఎందుకు ఎనౌన్స్ మెంట్

మైక్ లో సిద్దు నీ బావా అంటూ పీలిచావు మీ నాన్నగారికి తెలిస్తే ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో తెలుసా అని ఆమెనే మంధలిస్తు ఉంటే ఆమె ఇబ్బందిగా తల దించుకుని మౌనం గా ఉండిపోయింది.


సిద్దు కలుగు చేసుకుని సారి సార్ నేనే తనని అలా పిలవమని అడిగాను ఇందులో ఇందు తప్పేం లేదు అని నేరం ఒప్పుకున్నాడు


ఆయన సిద్దు ఫాదర్ ఇచ్చే ఫండ్స్ పై ఎంతో ఆశ పెట్టుకున్నాడు


అందుకే ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కోపం చూపిస్తూ 

వాట్ ఈజ్ దిస్ సిద్ధార్ద్ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావ్

నీపై ఇందిరా కంప్లైంట్ ఇస్తే నిన్ను డిబార్ చేసే అవకాశం ఉంటుంది తెలుసా అన్నాడు


అంతే ఇందు కలుగు చేసుకుని

వద్దు సార్ గొడవ వద్దు నేరం

తనదే అని ఒప్పుకుంటున్నాడు గా అది చాలు ఇంక నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలిపెట్టాలి

అని చెప్పండి చాలు అని 

అడిగింది


అతడు సిద్దు కి అదే మాట 

చెప్పి విన్నావ్ గా ఇంక ఇందు జోలికి పోకుండా నీ చదువు ఎదో నువ్వు చదువు లేదంటే ఊరుకోను 

అని మందలించి ఇంక వెళ్ళండి 

అని పంపారు. 


ఇందు బైటకు వచ్చేసింది

ఆమె వెనకే నడిచాడు సిద్దు.....

అతడు ఆమె కు అడ్డం వచ్చి

ఎటూ కదలినివ్వకుండా 

అక్కడి వాల్ కి అటూ ఇటూ చేతులు అడ్డం పెట్టి ఇందు నీ లాక్ చేసి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఓయ్ ఎంటి నిన్ను

నేను ఇబ్బంది పెడుతున్ననా 

అని అడిగాడు 


ఆమె భయం నిండిన చూపు చూస్తూ అవును నువ్వు ఇప్పుడు చేస్తుంది అదేగా నన్ను పోని 

ఇప్పుడే ప్రిన్సిపల్ సర్ చెప్పారు గా అల్లరి చేయకు ప్లీజ్ నన్ను వెళ్లని అని అడిగింది 


సిద్దు తన మనసులో మాట చెప్పాడు ఇందు ఐ లవ్ యు అంటూ 

అంతే అప్పటి వరకు రిక్వెస్ట్ చేస్తూ వేడుకున్న ఆమె షాక్ అయ్యింది ఎంటి అంటూ ఆశ్చర్యంగా

అడిగింది సిద్దు నవ్వుతూ ఎస్....డియర్ 

లవ్ యూ అంటూ ఆమెకు 

దగ్గరగా వచ్చాడు.... 


అంతే ఇందు భయపడి పోయి నీకేమైనా పిచ్చా మన మధ్య వారం పరిచయం కూడా లేదు 

అంతలోనే లవ్ ఎంటి పిచ్చి వేషాలు వెయ్యకు అని సీరియస్ అయి అంటుంటే

సిద్దు ఏమాత్రం జంక కుండా

ఏమో నాకైతే కొన్ని ఏళ్ల పరిచయం ఉంది అనిపిస్తుంది 

నువ్వు నాకోసం నేను నీకోసం పుట్టాం అనిపిస్తుంది. 


హేయ్.... నా మనసు అర్థం 

చేసుకో నేను చెడ్డ వాడ్ని కాదు కొంచం మంచి వాడినే 

నా లవ్ యాక్సప్ చెయ్ 

నిన్ను ప్రాణం గా చూసుకుంటా 

అని ఎంతో ఎమోషన్ అవుతూ అడుగుతున్నాడు సిద్దు


*"" అతడి కళ్ళలో అమే పై ఎంత ప్రేమ ఉందో

ఇందు కి తెలుస్తుంది. 


బట్ తన తండ్రి భూషణ్ సంగతి తెలిసిన ఆమె ఏమాత్రం చెలించ లేదు సిద్దు ఎంత గా అతడి 

ఫీలింగ్ చెప్పినా ఆమె కరగలేదు అతడ్ని దూరంగా నెట్టి వేసి

ప్లీజ్ నాతో ఇలా మాట్లాడకు అంటూ పరుగులు పెడుతూ వెళ్లిపోయింది. 


అంత వరకు సిద్దు ఆమెను

టచ్ చేయలేదు ఎప్పుడైతే

ఇందు తనని తాకి కింద పడేసిందో అతడికి తెలియని నీరసం వచ్చింది

ఎదో శక్తి అతడి మీద దాడి చేసినట్టుగా అనిపించింది


విసురుగా సిద్దు అక్కడి లాబ్ రూం లో పడ్డాడు

అతడి గొంతు ఎవరో పట్టుకుని నొక్కేస్తున్న భావన కలుగుతుంది ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్న అతడి వల్ల కాలేదు ప్రాణం గిజగిజలాడింది


చూడబోతే ఆ గదిలో ఎవరు లేరు అయినా కూడా ఎవరో తన మీద పడి బలంగా గొంతు నొక్కుతున్న భావన కలుగుతుంది 

సిద్దు ఊపిరి ఆడక అవస్థ పడుతూ అతి కష్టం మీద నిలబడి గొంతు పట్టుకు పోయింది అనుకుని నీళ్లకోసం చూసాడు

అక్కడ ఒక బాటిల్ కనిపించింది నీళ్ళు తాగాలి అని ఆయాస పడుతూ బాటిల్ అందుకున్నాడు


కానీ ఆ నీళ్ళు అతడి నోట్లో 

పడటం లేదు బాటిల్ మూత తీసే ఉంది అయినా నీళ్ళు బైట పడటం లేదూ.... సిద్దు గుండె వేగం తగ్గిపోతూ ఉంది 

ఊపిరి అందటం లేదు....

శరీరం శక్తి లేనట్టు అయిపోయి.....రక్తం చల్లబడిపోతున్న భావన కలుగుతుంది అతడు నేలమీద పడిపోయి చేతిలో బాటిల్ వదిలేశాడు నేల మీద పడ్డా

బాటిల్ నుంచి నీళ్ళు బైటకు వస్తున్నాయి విచిత్రం


కానీ అతడి గొంతు తడపలేదు

ఒక భయంకర రూపాం రెండు రోజులక్రితం అతడి కంట పడింది అది బ్రమా అనుకున్నాడు

ఇప్పుడు అదే రూపం మళ్లీ ఎదురై అతడి మీదికి దూకుతున్నట్టు కనిపించింది..... సిద్దు కళ్ళారా చూస్తున్నాడు కానీ ఏమీ చేయలేక పోతున్నాడు....


ఇంకో క్షణం లో ఆ దుష్ట శక్తి

అతడి ప్రాణం తీసేసేది కానీ

దైవ శక్తి అతడికి సహాయ పడింది.


ఉన్నట్టుండి

సిద్దు చేతికి ఉన్న వాచ్ కింద పడి అతడి చేతి మీద ఉన్న త్రిశూలం ఆకారం ఆ వికృత రూపం కంట పడింది.


అంతే  అప్పటి వరకు అతడి గొంతు నులిమి పట్టుకున్న శక్తి  వెనక్కి తగ్గింది. ఆ వికృత రూపం మాయం అయ్యింది.

ఒక్కసారిగా ఊపిరి అందే సరికి సిద్దు గిలగిల కొట్టుకుంటూ గట్టిగా ఊపిరి తీసుకుంటూ దారుణమైన స్థితిలో ఉన్నాడు

అప్పుడే అక్కడికి శ్రీరామ్

వచ్చాడు అతడ్ని వెతుక్కుంటూ....


అక్కడ దారుణమైన స్థితిలో సిద్దు శ్రీరామ్ కి కనిపించాడు


అంతే అతడు భయ పడి పోయి రేయ్ సిద్దు ఏమైంది రా అంటూ అతడ్ని పట్టుకున్నాడు

సిద్ధూ ఉక్కిరి బిక్కిరి అవుతు స్నేహితుడికి నీళ్ళు అంటూ సైగ చేసాడు

శ్రీరామ్ అక్కడ పడి ఉన్న

వాటర్ బాటిల్ లో కొంత నీళ్ళు ఉండటం చూసి కంగారుగా

వాటిని సిద్ధూ కి పట్టాడు 


వాటిని సిద్దు గబగబా తాగి 

అలాగే ఎగ ఊపిరి తీసుకుంటూ అక్కడే స్పృహ కోల్పోయాడు...


చూడబోతే ఎవరో అతడి గొంతు నులిమి నట్టు

అతడి గొంతు మీద ఎర్రటి 

చారలు పడి గాయం అయ్యింది.


శ్రీరామ్ భయపడి పోయి కేకలు పెడుతూ ఉన్నాడు 

ఆ చుట్టు పక్కల వాళ్ళు ఏమైందో అనుకుని వచ్చి సిద్ధూ పరిస్తితి చూసి వెంటనే ఆంబులెన్స్ నీ పిలిపించి అతడ్ని హాస్పటిల్ కి తీసుకు పోయారు 


అతడ్ని హాస్పటిల్ చేర్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఈ విషయం శివరాం కి తెలిసింది అంతే ఆయన హడావిడిగా భార్యని వెంట పెట్టుకుని హాస్పటిల్ చేరుకున్నాడు.... 


చాలా సమయం గడిచింది 

సిద్దూలో స్పృహ మాత్రం రాలేదు....!!!


*"" కాలేజ్ లో ఉన్న అందరూ సిద్దూకి ఎం జరిగిందో అని 

కంగారు పడుతున్నారు

కొంత మంది హాస్పటిల్ లో అతడి కోసం భాధ పడుతూ చూస్తున్నారు వాళ్ళలో శ్రీరామ్ ఉన్నాడు. 


ఇక్కడ ఇందు చాలా భయపడి పోతుంది తనకి ఏం జరిగిందో 

ఏమో అని 

ఆమె తో శ్రావణి ఉంది ఇందు కి ధైర్యం చెబుతూ ఏమీ కాదు టెన్షన్ అవ్వకు అంటుంది 

అయినా సరే ఇందు కి భయం వేస్తుంది తను నో చెప్పాను 

అని సిద్ధూ సూసైడ్ ఎటాం చేసుకున్నాడు అని చాలా భాధ పడుతు నా కారణం గా తనకి ఏమీ కాకూడదు నేను వెంటనే తనని చూడాలి అంటూ ఏడుస్తూ

 ఉంది....... అసలు ఆ వికృత రూపం ఎంటి ఎందుకు సిద్దూని చంపాలి అని చూసింది

నెక్స్ట్ ఎం

జరుగుతుందో తెలియాలి అంటే కాస్త వేచి చూడాలి.



Rate this content
Log in

Similar telugu story from Horror