raparthi anuradha

Romance Fantasy Thriller

4.6  

raparthi anuradha

Romance Fantasy Thriller

శక్తి ఆగమనం 13 క్లైమాక్స్

శక్తి ఆగమనం 13 క్లైమాక్స్

18 mins
456


ఆ జంట ఒక్కటయ్యారు

వారి హృదయాలు కలిశాయి

ఇంక వారి మధ్య యడబాటు లేదు రాదు అని సంతోషం గా

కాళీ ఆలయం చేరుకుని

అమ్మకు నమస్కరించి

మమ్మల్ని నువ్వే కలిపావు

తల్లి ఎప్పటికీ మమ్మల్నివేరు చేయకు అంటూ వేడుకున్నారు...!!

సిద్దు ఆ తల్లి ముందు ఉన్న కుంకుమ ఇందు నుదిటిన

పెడుతూ ఇంక మనల్ని ఎవరు

వేరు చేయరు మన తండ్రుల

మధ్య తగాదాలు ఉన్నాయి

వారి మధ్య శతృత్వం మనం ఒక్కటై దూరం చేయాలి అందుకు

ఓపిక పట్టాలి

నువ్వు ధైర్యం గా ఉండు

అంతా నేను చూసుకుంటాను

అని చెప్పాడు

ఆమె చిన్నగా నవ్వి ఎది

ఏమైనా కానీ

సిద్దు ముందు మనం మన చదువు పూర్తి చేయాలి

 చదువు పూర్తి చేశాక

ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళు ఒప్పుకుంటే సరే

లేదు అంటే రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుందాం

అంత వరకు నువ్వు అల్లరి చేయకుండా

నన్ను ఇబ్బంది పెట్టకుండా

చదువు పై శ్రద్ధ పెట్టాలి సరేనా

అని అతడికి నచ్చచెప్పి ఒప్పించింది.

సిద్దు సరే అని

మన చదువు పూర్తి అయ్యే వరకు మన ప్రేమ విషయం బైట పెట్టకుండా ఉందాం కానీ నాదో కండీషన్

నేను అడిగినప్పుడు

నో చెప్పకుండా నువ్వు కిస్ ఇవ్వాలి ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది లాంగ్ డ్రైవ్ షికారు అలాంటి వాటికి నువ్వు నో చెప్పకుండా ఉంటే

నేను మీ ఇంటి పైప్ లైన్ పట్టుకుని వేలాడే పని పెట్టుకోను

తెలుసుగా జగ మొండి వీడు

అని నవ్వాడు

ఇందు సిగ్గు పడుతు ఎంటి అల్లరి అని మొహం దాచుకుంటూ

ఉంటే అతడు ఆమె పెదవులు అందుకుని ఆమెలో కలిగిన సిగ్గుని తొలగించి ధైర్యం నింపాడు...

కొంత సమయం గడిచింది

ఎవరో వాళ్ళని పిలిచినట్టు అనిపించింది

అటుగా చూసారు అమరావతి

ఆ జంట నీ చూసి మురిసి పోతు అబ్బో నా దిష్టే తగిలేలా ఉన్నారు మీ జంట కానీ ఆలస్యం అవుతుంది మన్నించాలి అని ఇందు చేయి పట్టుకుని ఆమె గదిలోకి లాగింది సిద్దు అర్థం చేసుకుని థాంక్స్ అమరావతి అని అతడి బైక్ చేరుకుని నెమ్మది గా ఇల్లు చేరుకున్నాడు

వాళ్ళు ఒక్కటి అవ్వడం

వారిని వెంటాడు తున్న దుష్ట శక్తికి తెలియదు కారణం వారి చేతికి ఉన్న రక్ష అమరావతి సహాయం

అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ జంట ఆనందం గా ఎవరి

గదిలోకి వారు చేరుకున్నారు

ఇప్పుడు ఇరువురి మనసులో ఎలాంటి బాధ లేదు

ఆనందం మాత్రమే ఉంది

అందుకే ఆరోగ్యంగా ఉన్నారు అమరావతి అనుకున్న

పని పూర్తి చేశాను

అని అక్కడి నుండి వెళ్ళిపోయి

వారి రాక కోసం ఎదురు

చూస్తూ ఉంది.

ఆ ఇరువురు మరునాడు

కాలేజ్ కి చేరుకున్నారు

శ్రీరామ్ శ్రావణి టెన్షన్ గా ఉన్నారు వారికి నమ్మలేని వార్త వచ్చింది

సిద్దు ఇందు నీ గెలిచాడు

ఆమె అతడి లవ్ ఓకే చెప్పింది ఇద్దరు సంతోషంగా వారి ప్రేమ

కోసం అలాగే వాళ్ళ పెళ్లి కోసం చేసుకున్న ప్లానింగ్ అంతా చెప్పారు కాని అమరావతి కోసం చెప్పలేదు చెప్పినా ఎవరూ నమ్మరు అని ఊరుకున్నారు

వాల్ల మాటలు శ్రీరామ్ నమ్మలేక పోయాడు

శ్రావణి అయితే ఇంకా షాక్ లో

ఉంది ఇలా రోజులు గడుస్తున్నాయి,

అదే క్రమం లో శ్రీరామ్ మనసుని శ్రావణి అర్థం చేసుకుని

అతడికి ఓకే చెప్పింది.

ఆ రెండు ఫ్యామిలీ వాళ్ళు

ఆనంద పడ్డారు చదువు

పూర్తి అవ్వగానే పెళ్లి చేయాలి అనుకుంటున్నారు

అంత వరకు శ్రావణి శ్రీరామ్ నీ దూరం పెట్టింది

కేవలం ఫ్రెండ్స్ లా ఉండాల అని కండీషన్ పెట్టింది

ఆమె ఓకే చెప్పడమే తనకి

అవార్డ్ దక్కినంత సంతోషం ఇంక ఎలాంటి కండీషన్స్ కి అయినా నో అబ్జెక్షన్ ఇక్కడ ఇలా ఉంటే

అటు భూషణ్ శివరాం రాజకియ రంగం లో పోటీ పడుతూ ఉన్నారు శివరాం ఎక్స్పర్ట్ చేయని

విధంగా భూషణ్ రాజికియంలో ఎంట్రీ ఇచ్చి శివరాం స్నేహితుడ్ని ఓడించి అతడు గెలిచాడు.

అనుకున్నది సాధించాడు

అంతే ఇంకాస్త రెచ్చిపోతూ

శివరాం పోగొట్టిన కాంట్రాక్ట్స్ తో పాటు రాబోయే కాంట్రాక్ట్స్ కూడా అతడి సొంతం చేసుకుంటు

శివరాం నీ దెబ్బతీస్తు మరింత శతృత్వం పెంచుకున్నాడు.

ఇప్పుడు వారి మధ్య ఇంకాస్త అగాధం ఏర్పడింది

ఆ విషయాలు తెలుసుకుని

సిద్దు ఇందు చాలా భాధ పడుతున్నారు

ఇలా పాము ముంగిస లా కొట్టుకుంటున్న తమ తండ్రులు

తమ ప్రేమ విషయం లో చస్తే ఒప్పుకోరు అని విచార పడుతూ అనుకున్న చదువు పూర్తి అవ్వగానే పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ.... ఉన్నారు....

నెమ్మదిగా వారి చదువు పూర్తి కావచ్చింది

ఇప్పుడు లార్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ మొదలు కానున్నాయి

ఆలోగా ఒక రోజు అంతా బైట షికారు వెళ్ళాలి అని ఇందు కి ఒప్పించి సిద్దు బైటకు తీసుకు వెళ్ళాడు....

వాళ్ళు సరదాగా రోజంతా

గడిపారు ఎంతో సంతోషం గా

సిద్దు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతా థాంక్స్ ఇందు నాకోసం నువ్వు టైం ఇచ్చావు అంటూ ఆమెను కౌగిలిలో దాచుకుంటూ ఉన్నాడు

ఆమె కూడా అతడి కౌగిలిలో

కరిగి పోయింది

ఆ క్రమం లో ఇందు తాయత్తు ఊడి పడిపోయింది

అంతే ఒక్కసారిగా గాలి ధూళి రేపుతూ వాతావరణం మారింది ఇంక లేట్ చేయొద్దు కాలేజ్

 విడిచి పెట్టే లోగా మనం వెళ్ళాలి లేదా నాన్నగారు చూస్తారు పెద్ద గొడవ అవుతుంది అని

అతడ్ని ఒప్పించి బైక్ ఎక్కింది

అదేం విచిత్రమో తెలియదు

ట్రాఫిక్ మధ్య ఆ బైక్ మీద కొండ వచ్చి కూర్చున్నట్టు బైక్ రోడ్ కి అడ్డం గా అతుక్కు పోయి చాలా సమయం కదల్లేదు ఎంతో మంది నెట్టిన ఆ బైక్ కదిలే ఛాన్స్ లేకుండా పోయింది అనుకున్నట్టే చాలా లేట్ అయ్యింది

కొంత సమయం గడిచింది అదేమిటో విచిత్రం బైక్ ఎంతో

నార్మల్ గా ముందుకు దూసుకు పోయింది

అంతా షాక్ అయ్యారు

అలాగే వాళ్ళకి ఆలస్యం అయ్యింది భయ పడుతూనే కాలేజ్ కి చేరుకుంది ఆ జంట

అనుకున్నట్టే ఇందు నీ ఆమె తండ్రి చూసాడు అది కూడా సిద్దు తో కలిసి రావడం

అప్పటికే అతడికి కొన్ని కంప్లైంట్ వచ్చాయి వారి మధ్య ఎదో ఎఫైర్ నడుస్తుంది. అని

అందుకే ఆయనే స్వయంగా

కాలేజ్ కి తీసుకు వెళ్ళడం

తీసుకు రావడం చేస్తున్నారు ఇప్పుడు ఆయన కళ్ళతో స్వయం గా చూసారు

అంతే సిద్దు చూస్తుండగా ఇందు చెంప పగుల కొట్టి

నీకు ప్రేమించ డానికి వీడు

తప్ప వెరేవరు దొరక లేదటే

అని ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే

సిద్దు అడ్డు వెళ్లి అంకుల్ ఆగండి ప్లీజ్ తనని ఏమి అనకండి మేము ఎగ్జామ్స్ అయ్యాక మీతో మాట్లాడాలి అనుకున్నాం

అవేశం వద్దు మీ పెద్దల మధ్య ఉన్న గొడవలకి మమ్మల్ని దూరం చేయకండి అని రిక్వెస్ట్ చేసాడు

ఆయన అతడి మాటలు వినిపించు కోలేదు అరే చి నోరుముయ్ మీ నాన్న నన్ను ఓడించడం చేత కాక నిన్ను అడ్డం పెట్టుకొని

డ్రామా చేస్తున్నాడా చేతకాని

వెధవ లా చి ఇలా ఆడపిల్లని అడ్డం పెట్టుకోవటానికి సిగ్గు లేదా

వాడికి చెప్పు నా ఖంటం లో ప్రాణం ఉండగా మీ పెళ్లి కి నేను ఒప్పుకోను

నిన్ను నా కూతురి మీదికి ఉసి గొలిపి నా ఆస్తి అంతా సొంతం చేసుకోవాలి అని నీచమైన పథకం పన్నాడు అంటూ దారుణం గా మాట్లాడుతూ ఉన్నాడు

సిద్దు అడ్డు చెప్పాలి అనుకుంటే అతడ్ని కూడా కొట్టాడు భూషణ్

సరిగ్గా అప్పుడే శివరాం అక్కడికి వచ్చాడు అతడి మాటలు విన్నాడు కొడుకు పై చేయి చేసుకోవడం చూసాడు ఇంక మరింత గొడవ పెరిగింది

ఆ ఇద్దరు తమ హోదా మర్యాద మరచి పోయి రోడ్ మీదే ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని గొడవ పడ్డారు ఇందు భయ పడిపోతూ సిద్దు ఎదొకటి చెయ్యి అని అడుగుతుంది

సిద్దు తన తండ్రిని ఆపలేక పోతున్నాడు

ఇందు ఆమె తండ్రిని ఆపలేక

అవస్థ పడుతుంటే చుట్టు జనం మూగారు

ఇరు వర్గాల మనుషులు

పరువూ పోతుంది

అన్న ఇలా రోడ్ల పై ఎంటి గొడవ అని విడిపించి ఇంటికి తీసుకు వెళ్లారు

వాళ్ళు ఆవేశం గా ఇల్లు చేరుకున్నారు

ఇంక అక్కడ తమ బిడ్డలతో పెద్ద గొడవ జరుగుతుంది

వీల్లేదు మీరు ప్రేమించు కోవడం

పెళ్లి చేసుకోవడం ఎదీ ఒప్పుకోము ఇంక కాలేజ్ చదువు ఏమీ వద్దు ఇంట్లోనే పడి ఉండండి అని

తేల్చి చెప్పారు

ఇంక ఎంత చెప్పిన వాళ్ళు తమ పెళ్లికి ఒప్పుకోరు అని అర్థం చేసుకుని

సరే మా చదువు పూర్తి చేయనివ్వండి ఈ ఎగ్జామ్స్ మిస్ అయితే ఇన్నేళ్ల మా చదువు వృధా అని వేడుకున్నారు

అందుకు వాళ్ళు నో చెప్పారు

ఇన్నేళ్ల మా పరువూ గంగలో కలిపారు ఎవరైతే నచ్చరో వాల్ల ఇంట్లో మనిషిని ప్రేమించారు చాలు ఇంకే ఎగ్జామ్స్ వద్దు వెంటనే మీ పెళ్లి అని తేల్చి చెప్పారు

సిద్దు కోపం గా డాడ్ నేను ఎగ్జామ్స్ అయ్యే వరకు పెళ్లి చేసుకోను

ఎగ్జస్ అయ్యాకే పెళ్లి అని తేల్చి చెప్పాడు

ఇందు కూడా అలాగే అనింది

ఆ తండ్రులు ఆలోచించారు

అంటే ఎగ్జామ్స్ రాయనిస్తే పెళ్లికి ఒప్పుకుంటారు అని సరే అని పూర్తి సెక్యూరిటీ తో ఒకర్ని ఒకరు కలుసుకునే అవకాశం ఇవ్వకుండా కాలేజ్ ఎండీ తో మాట్లాడి ఎగ్జామ్స్ కి వెల్లనిచ్చారు

వాల్ల కోసం బైట కాపలా కాస్తున్నారు శ్రావణి ఇందు నీ ఒదారుస్తు మీరు ముందే నిర్ణయం తీసుకున్నారు కనుక ఎగ్జామ్స్ అయ్యే వరకు ఎలాంటి ఆలోచన పెట్టకుండా చదువు పై శ్రద్ద పెట్టండి

అని చెప్పిందీ

ఇందు అవును అని చెప్పి చదువుకుంటూ ఎగ్జామ్స్ రాస్తుంది

సిద్దు కూడా శ్రీరామ్ కి తన మనసులో మాట చెప్పి

ఎగ్జామ్స్ రాస్తున్నాడు

వాల్ల ఆఖరి ఎగ్జామ్ పూర్తి కాగానే అక్కడి నుండి పారిపోయి పెళ్లి చేసుకుని కొద్ది రోజుల తరువాత తిరిగి రావాలి అని ఇంట్లో తమ తల్లులకి చెప్పుకున్నారు

కన్న బిడ్డల సంతోషం కోసం

వాళ్ళు సరే అని ఒప్పుకుని

ఏమీ తెలియనట్టు ఊరుకున్నారు,

వారిని వెంటాడుతున్న

దుష్ట శక్తి చేయాలి అనుకున్నది చేశాను ఇంక ఆ జంట కలవరు అనుకుంటుంది అందుకే ఆరోజు వాళ్ళు కాలేజ్ కి చేరడానికి ఆలస్యం అయ్యేలా బైక్ అక్కడే ఆగిపోయే లా చేసింది కానీ వారీ ఉద్దేశం

వేరు గా ఉంది.

భూషణ్ శివరాం తమ పిల్లలకి వేరే సంభంధాలు చూసారు

ఈ పరీక్ష పూర్తి కాగానే పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు

కోయ దొర చెప్పిన మాటలు నిజం అయ్యాయి అని వారి ఆంతరాత్మలు గుర్తు చేస్తున్న మొండిగా పంతానికి పోతూ ఆ జంట నీ విడతీయాలని చూస్తున్నారు....!!

ఆరోజు ఆఖరి పరీక్ష

అనుకున్నట్టే ఇందు సిద్దు సిద్ధం గా ఉన్నారు సిద్దు తల్లి తన కోడలు మెడలో కట్టమని మంగళసూత్రం నల్లపూసలు కొడుకు చేతిలో ఉంచి మీరు ఎక్కడ ఉన్నది నాకు ఎదో ఒక విధం గా తెలియ చేయండి అని చెప్పి పంపింది

కొడుకు తల్లి ఆశీర్వాదం అందుకుని కాలేజ్ కి చేరుకున్నాడు

ఇందు తల్లి కూడా పుట్టింటి పట్టుచీర కూతురి కాలేజ్ బ్యాగులో పెట్టీ అబ్బాయి తాళి కట్టే సమయం లో దీన్ని కట్టుకో బంగారం మీరు క్షేమం గా ఉన్నారు అన్న వార్త నాకు తెలియ చేయండి అని ఆశీర్వదించి పంపింది.

మరో వైపు అమరావతి వారి రాక కోసం చూస్తుంది

అక్కడ జరుగుతున్న గొడవలు ఆ దుష్ట శక్తి చేసిన దుర్మార్గం అంతా ఆమెకు తెలుస్తుంది

ఎలా అయిన వారికి సహాయం చేయాలి అని అక్కడికి చేరుకుంటుంది

సిద్దు ఇందు ఎగ్జామ్ పూర్తి చేశారు వారీ చదువుకి న్యాయం చేశారు ఇంక వారి ప్రేమ నీ గెలిపించు కోవాలి అని ఆలోచిస్తూ క్లాస్ రూం దాటి బైటకు వస్తు ఎదురుగా

తమ తండ్రులు ఏర్పాటు చేసిన వస్తాదులని చూసి కంగారు పడ్డారు వీళ్ళు అడ్డం గా ఉంటే

మెం ఎలా కలుసుకునేదీ అని భాధ పడుతు ఉంటే

శ్రీరామ్ శ్రావణి ముందుగా స్టూడెంట్స్ నీ అలెర్ట్ చేసి

ఉంచడం తో ఆ ఇరువురి

మధ్యకు మొత్తం స్టూడెంట్స్ వచ్చేశారు

చీమల పుట్టలా మొత్తం

స్టూడెంట్స్ అంతా ఒకేసారి

అక్కడికి రావడం తో

సిద్దు ఇందు కనిపించ లేదు

శ్రావణి శ్రీరామ్ వాళ్ళని తీసుకుని కాలేజ్ బ్యాక్ సైడ్ కి వచ్చేశారు ,

భూషణ్ శివరాం మనుషులు ఆ స్టూడెంట్స్ లో ఇందు సిద్దు కోసం చూస్తున్నారు...

ఎక్కడ వాళ్ళు కనిపించ లేదు

అంతే కాకుండా వాల్ల ఫ్రెండ్స్ కూడా లేరు అంటే ప్లాన్ చేసి తప్పించు కున్నారూ అని స్టూడెంట్స్ నీ తోసుకుంటు ముందుకు వస్తున్నారు ఇందు వాళ్ళు వెనుక నుంచి పారిపోవాలని చూసారు

కానీ భూషణ్ తెలివిగా వెనుక వైపు కాచుకుని ఉన్నాడు

అని శ్రీరామ్ గమనించి రేయ్

సిద్దు భూషణ్ అంకుల్ అక్కడ ఉన్నారు మీరు అటు వెళ్ళడం కుదరదు అన్నాడు

ఇంకో వైపు పరుగు తీశారు

అక్కడ శివరాం కాచుకుని వాళ్ళని అడ్డుకుంటూ ఉన్నాడు

ఇందు కన్నీళ్లు పెట్టుకుంటు

సిద్దు మన పెద్దవాళ్ళకి మన సంతోషం కంటే వాల్ల పట్టింపే ఎక్కువ అయ్యింది ఇంక మనం ఒక్కటి కాలేము ఈ పెళ్లి జరగదు అని ఏడుస్తుంటే సిద్దు తల్లి ఇచ్చిన తాళి అమే మెడలో కట్టేస్తాను ఇంకే దిగులు లేదు ఎందుకు మన పెళ్లి జరగదు అన్నాడు

ఆమె ఎదో చెప్పాలి అనుకుంది

అంతలో నాలుగు వైపుల నుంచి వాల్ల వాల్లు వచ్చేస్తూ ఉన్నారు శ్రావణి భయ పడుతూ ఎదో ఒకటి చేయాలి ఆలస్యం అవుతుంది అని అరిచింది

శ్రీరామ్ కూడా అవును ఆలస్యం అయ్యింది అన్నాడు,

ఇందు సిద్దు తమకీ సహాయ పడేది ఒక్కరే అని అమరావతి ప్లీజ్ హెల్ప్ మీ అంటూ వేడుకున్నారు

అక్కడ ఉన్న వాళ్ళు ఎవరీ అమరావతి అన్నట్టు చూస్తుంటే మరో వైపు

అమరావతి వచ్చి సహాయం చేయకుండా దుష్ట భందనం

వేస్తుంది అంతా గాలి దుమారం సుడిగాలి రేగి చెల్లా చెదురు చేస్తుంటే.....

అమరావతి అక్కడ ప్రత్యక్షం అయ్యి అంత తొందర ఎందుకు ఆగు అంటు అంతా స్తంభించి పోయేలా చేసి వాళ్ళ ముందుకు నవ్వుతూ

వచ్చి నేను వచ్చాను గా నన్ను నమ్మారు గా నేను చూసుకుంటాను రండి మీకు సహాయ పడే ఈ స్నేహితులు కూడా మనతో వస్తారు లే అని అందర్నీ తీసుకుని మాయం అయ్యింది.

క్షణాల వ్యవధి లో అక్కడ ఉన్న నలుగురు మాయం అయ్యారు ఎం జరిగింది వాళ్ళు ఎటు పోయారు ఎవరికి అర్థం కాలేదు వాళ్ళని వెతుకుతూ ఇరు వర్గాలు కత్తులు నూరుతు ఉన్నారు....!!

*"కాల ప్రయాణం చేస్తూ

అమరావతి వారిని ఒక ఆలయానికి చేర్చే ప్రయత్నం చేస్తుంటే వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ విచిత్ర అరుపులు అరుస్తూ వారిని అడ్డుకునే దిశగా దూసుకు వస్తుంది ఓ దుష్ట శక్తి

అదంతా చూస్తున్న సిద్దు ఇందు భయం గా అమరావతి చేయి పట్టుకుని ఉన్నారు

గాల్లో ప్రయాణం చేస్తున్న

శ్రావణి శ్రీరామ్ ఒకరిని ఒకరు పట్టుకుని రేయ్ ఏంట్రా ఇదందా

ఎదో హార్రర్ సినిమ చూస్తున్నట్టు ఉంది ఎవరీమ మనల్ని వెంటాడుతున్న ఆ దుష్ట శక్తి ఎవరు చూడటానికి భయంకరం గా ఉంది అని అడిగారు

ఆ ప్రశ్నకి వాల్ల దగ్గర సమాధానం లేదు,

అందుకే భయం నిండిన చూపులు చూస్తూ అమవరవతి నీ అడిగినట్టు చూసారు ఆమె నిట్టూరుస్తూ

నేను చెప్తాను జరిగిన దారుణం మరువలేని గతం నేను చెప్తాను

అని కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది

ఓ ఘోరం సిద్దు ఇందు గా పిలువ బడుతున్న మీరు

జేయదవు దేవకీ గా జన్మించారు

మీ మధ్య ప్రేమ చిగురించింది

కానీ మీ మధ్య ఉన్న కులం అనే తారతమ్యం వలన మీ ప్రేమని ప్రేమించిన ఒకరితో ఒకరు చెప్పుకోలేదు

కళ్ళతో చూసి మనసుతో ప్రేమించు కునే మీ జంట ఓ అద్భుతం

దూరం నుండి ఒకరిని ఒకరు చూసుకుని మురిసిపోతూ మనసులో మాట బైట పెట్టకుండా కాలం గడుపుతున్నారు

అదే సమయంలో చిన్ననాటి

నుండి అవమానాన్ని అలంకారం గా మోస్తూ అడా మగా కానీ జన్మ ఎత్తిన నేను అమరావతి నీ

జేయదేవు నీ ఇష్ట పడ్డాను ప్రేమించాను జయదేవు

నన్ను స్నేహితురాలిగా ఆదరించాడు ఎంత మంది అవమానిస్తూ మాట్లాడిన నన్ను ఒక స్నేహితురాలు గా అర్థం చేసుకుని ప్రేమగా మాట్లాడే వాడు ఆ ఆప్యాయత నాకు చాలు అని మురిసి పోతు జయదేవు నీ బావ అని పిలుచుకుని

అతడే నా సర్వస్వం గా భావించి అతడికోసమే బ్రతుకుతూ ఉన్నాను.

*""దేవకీ కుటుంబం ఆమెకు వివాహం చేయాలి అని మార్తాండ వర్మ తో సంబంధం కుదుర్చుకున్నారు

ఆ వార్త తెలుసుకున్న జేయదేవు తట్టుకోలేక పోయాడు

నావకుడు అయిన అతడు జేమిందారి బిడ్డని ఆశ పడ్డాడు

కానీ తన ప్రేమ చెప్పుకోలేదు కానీ ఆమె తెలుసుకుంది

అలాగే అరాధించింది

ఆ ఇరువురికి తెలుసు ఒకరంటే ఒకరికి ఇష్టం అని

పరిస్థితులు వేరుగా ఉన్నాయి, త్వరలో వివాహం అని తెలిసిన దేవకీ దేవనాగ నదీ దాటుకుని

వచ్చి ధైర్యం చేసి తన ప్రేమని వ్యక్త పరిచింది

జేయదేవు సంతోషం గా ఆమె మాట తో ఆమెను హక్కున చేర్చుకున్నాడు

అది చూసి నేను భరించ లేక పోయాను

జీవితాంతం నాకు తోడుగా ఉంటాడు అనుకున్న బావ నాకు కాకుండా నాకు దక్కిన ఆదరణ దూరం చేయడానికి దేవకీ ప్రయత్నం చేస్తుంది అని ఉక్రోషం తెచ్చుకుని

ఆ జంట ప్రేమగా ఒక్కటి కావడం భరించ లేక విషయం మార్తాండ వర్మ కి తెలియ చేశాను....

అతడు మహా కృరుడు

స్త్రీ లోలుడు అతడి కన్ను పడిన ఆడదాన్ని అనుభవించ కుండా విడిచి పెట్టడు అదే క్రమం లో దేవకీ పై మోహం పెంచుకుని

ఆమెను అందుకునే ప్రయత్నం చేస్తుంటే

ఆమె తల్లి తండ్రి వేడుకుని

ఆమెను కావాలి అనుకుంటే

అర్ధాంగి గా చేసుకుని పొందమని తమ వంశ గౌరవం పాడు చేయవద్దు అనడం తో పెళ్లికి సరే అన్నాడు

అలాంటి నీచుడి కి ప్రేమ విలువ తెలియదు అని తెలుసుకోలేక

దేవకీ నీ బావ కి దూరం చేయమని వార్త చేరవేశాను

వాడు రగిలిపోతూ ఆ జంట నీ విడదీసే పనిలో ఊరి జనాన్ని బెదిరిస్తూ అందరినీ రెచ్చ కొట్టి

పడవ నడుపుకు నే వాడికి జెమిందారి బిడ్డ కావలసి వచ్చింది వెంటనే వాడ్ని వెలి వేయాలి

లేదా చంపేయాలని ఆజ్ఞ వేశాడు

అంతే నా గుండె ఆగినట్లైంది

బావ నాకు కావాలి అనుకున్నాను కానీ అతడ్ని చంపాలి అనుకో లేదు ఊరి జనం అంతా జేయదేవూ నీ రాళ్లతో కొట్టి ఊరి నుండి వెలివేశారు గాయాలు పాలు అయిన

బావని కాళి ఆలయం వెనుక వైపు తీసుకు పోయి పసరు వైద్యం చేస్తూ కాచుకుని కన్నీళ్లు పెట్టుకుంటు ఉన్నాను.

అక్కడ దేవకీ పరిస్తితి దారుణం గా ఉంది దుష్ట గుణం గల మార్తాండ ఆమెను చిత్ర హింసలు పెడుతూ పెళ్లికి ఒప్పుకోమని అడుగుతుంటే ఆమె తల్లి తండ్రి కూతురు బాధ చూడలేక మెం ఒప్పిస్తాం వారం రోజుల గడువు ఇమ్మని వేడుకున్నారు

అతడు వారం రోజులు లో తిరిగి వస్తాను దేవకీ పెళ్లి కూతురు లా కనిపించాలి లేదా ఊరు మొత్తాన్ని వల్లకాడు చేసి పోతాను అలాగే దేవకీనీ నా ఆలి కాకుండానే అనుభవిస్తాను అని అరిచి వెల్లాడు....

నా స్వార్థం వలన ఎన్ని దారుణాలు జరిగాయో నాకు అర్ధం అయ్యింది బావ దేవకీ నీ కలవరిస్తూ ఉన్నాడు అతడి మనసు నిండా ఆమె ఉంది అని అర్థం అవుతుంది

నన్ను చేరదీసి నాకు మనసు ఉంది అని తెలియ చెప్పిన బావ ప్రేమ ఓడిపోకూడదు అందుకు నేను కారణం కాకూడదు అని

దైవారాధన చేసి కాళీ ఆశీర్వాదం తో దేవకీ ఉన్న చోటుకు చేరుకున్నాను

ఎవరు చూడకుండా కన్నీటి పర్యంతమవుతున్న ఆమెను

వెంట పెట్టుకుని బావ దగ్గరకు చేరుకున్నాను

గాయాలు పాలు అయ్యి ఎంతో ధిన స్థితిలో ఉన్న బావని చూసి ఆమె తల్లడిల్లి పోయింది

ఒకరిని ఒకరు చూసుకుని ఎంతో ఆవేదన గా హత్తుకున్నారు...

ఆ జంట ఒక్కటి కావడం చూసి నాకు ఎంతో సంతోషం కలిగింది... తెల్లారితే మార్తాండ వర్మ వచ్చేస్తాడు అని ఇరువురికి కాళి ఆలయం లో వివాహం చేయిస్తాను అని ఇరువురిని గుడిలోకి తీసుకు వెళుతుంటే వాళ్ళు నాకు చేతులు జోడించి మమ్మల్ని ఒక్కటి చేసే మా దైవం నువ్వు మా ప్రేమని అర్థం చేసుకున్న నీ పాదాలకి మ్రొక్కుతాము అని వేడుకున్నారు

ఆ క్షణం నాకు అర్ధం అయ్యింది ఎంత పెద్ద తప్పు చేశానో ఇంక ఒక్కటే ఆలోచన వెంటనే వారి వివాహం జరిపించాలి అని ఆలయం లోకి ప్రవేశించాను

అక్కడి కుంకుమ దేవకీ నుదుట జేయధేవు పెట్టాడు తాళి కట్టమని పసుపు తాడు అతడికి అందించి ఆశీర్వదిస్తూ ఉంటే

బావ దేవకీ మెడలో తాళి కట్ట బోయాడు అంతలో ఊరి జనం కాగడాలు చేత పుచ్చుకుని ఆలయం చుట్టూ చేరుకుని బావ చేతిలో తాళి లాక్కుని విసిరేశారు

ఒక్కసారిగా అంతా గందరగోళం నెలకొంది

ఆ జంటని విడతియ వద్దు అని ఎంతో వేడుకున్నాను

ఎవ్వరూ నా మాట వినలేదు

నన్ను కొట్టి పక్కకు నెట్టేసి

దేవకీ జుట్టు పట్టుకుని ఆలయం బైటకు లాక్కుని పోయారు.

జేయదేవు అడ్డుకుంటూ ఉంటే అతడ్ని దారుణం గా కొట్టారు

ఊరి ప్రజలు అంతా దేవకీ నీ నిందిస్తూ నువ్వు మార్తాండ వర్మ నీ చేసుకోక పోతే మా అందర్నీ వాడు చంపేస్తాడు అయినా నీకు జాతి హీనుడు నచ్చాడా వాడ్ని వెలేస్తే నువ్వు వాడ్ని వెతుక్కుంటూ వస్తావా ఇంక వాడ్ని వదిలేస్తే ప్రమాదం వెంటనే బావని చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు

దేవకీ గట్టిగా ఏడుస్తూ వద్దు అయన్ని ఏమి చేయవద్దు మమ్మల్ని వేరు చేయొద్దు అని వేడుకుంటూ ఉంది నేను భయం గా అందర్నీ వేడుకున్నాను ఎవ్వరూ వినలేదు అంతలో మార్తాండ అక్కడికి చేరుకుని జరిగింది తెలుసుకుని అతడి బలం బలగం చూపించి బావని దేవకీ చూస్తుండగా చిత్ర హింసలు పెడుతూ తల నరికి చంపేశాడు

బావ రక్తం తో ఒళ్లంతా తడుపుకుని ఆమెను పట్టుకున్నాడు

ఊరి జనం చూస్తూ ఉన్నారే తప్ప ఎవ్వరూ అతడికి అడ్డు చెప్పలేదు దేవకీ ఎంతో బాధగా

జేయదేవా అని అరిచి గోల పెట్టింది అతడి ప్రాణం పోయింది

అన్యాయం గా అతడి ప్రాణం తీసిన మార్తాండ మీద విరుచుకు పడింది నా ప్రాణానికి ప్రాణం అయిన నా వాడిని చంపావు నీ అంతు చూస్తాను అని అక్కడి రాయిని తీసి మార్తాండ మొహం మీదికి విసిరింది అంతే అతడి దవడ వెరై పక్కకి చీలింది నెత్తురు చిమ్ముతూ భయంకరంగా ఉంది అతడి రూపం

ఊరి జనం భయం గా అరిచారు

అన్యాయంగా తమని వేరు చేసిన ఈ ఊరిని ఊరి ప్రజలనీ నేను శపిస్తున్నాను మా కన్నీళ్ళతో కలిసి కురిసిన నెత్తురు మీకు త్రాగు నీరు లేకుండా చేస్తుంది

నదులు బావులు ఎండిపోయి పచ్చటి మొక్క కూడా ఇక్కడ మొలవదు అల్లాడిపోయి జనులు భీతిల్లి ఆకలి చావులు చస్తారు పవిత్ర ప్రేమ విలువ తెలుసుకోలేని మీకు సంతోషం అనేదే ఉండదు కన్నీళ్ళతో కాలం గడుపుతారు ఇదే నా శాపం

అని శాపం పెట్టింది

గాయ పడ్డ మార్తాండ ఎంటే నువ్వు శపించేది నన్నే గాయ పరుస్తావా నిన్ను అందరి సమక్షం లో అనుభవించి నీకు మరచిపోలేని

శిక్ష వేస్తాను అని పశువు లా ఆమె మీద పడబొయాడు

తానే సర్వస్వం అనుకున్న

నా బావ విగత జివి అయ్యాడు అతడి నెత్తురు నేల మీద ప్రవహిస్తూ ఉంది భరించ లేక పోయాను

దేవకీ మీదికి వెళుతున్న

రాక్షసుడ్ని అడ్డుకోవాలి అని అమ్మవారు ఎదురుగా ఉన్న త్రిశూలం తీసుకుని వాడి వెన్నులో పొడిచాను.....

వాడి నెత్తురు అక్కడంతా చిమ్మింది అయినా వాడు దేవకీ నీ విడిచి పెట్టకుండా పట్టుకున్నాడు

ఆమె పవిత్రత కోల్పోకుండా ఉండేందుకు ఎంతో శక్తిని కూడబెట్టుకునీ మార్తాండ వర్మ నీ అక్కడ మండుతున్న మంటల్లోకి నెట్టింది

ఒళ్లంతా మంటలు అంటుకుని వాడు భయంకర ఆర్త నాదాలు చేస్తున్నాడు

ఊరి జనం భయంగా చూస్తూ ఉన్నారు ఆమె ప్రేమించిన వాడి శరీరం శిరస్సు ఒక్కటిగా చేర్చి పట్టుకుని  నా చేతిలో

త్రిశూలం తీసుకుని బలం గా పొడుచుకుని అతడి గుండెలపై పడిపోయి ప్రాణాలు విడిచింది.

ఆ జంట ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి అది చూసి తట్టుకోలేక పోయాను ఆ ఆత్మలకి మాట ఇస్తు గట్టిగా అరిచి చెప్పాను

మీ ప్రేమ గెలిపించే బాధ్యత నాది మీ ప్రేమ కోసం మీరు మళ్లీ పుడతారు మిమ్మల్ని ఒక్కటి చేసి ఈ ఊరు చేసిన పాపాన్ని కడుగుతాను అంత వరకు నేను అంతం అవ్వను అమ్మ మీద ఆన.

దేవకీ ఇచ్చిన శాపం ఈ ఊరికి తప్పదు అని ఆవేదనగా చెప్పుకుంటూ ఉంటే మంటల్లో పడి చచ్చిన మార్తాండ ఆత్మ అహకారం చేస్తూ నేను ఆ జంట నీ ఎప్పటికీ ఒక్కటి కానివ్వను నీ ఆశ నెరవేరదు వాళ్ళు మళ్లీ జన్మించిన నేను వాళ్ళని వేరు చేస్తాను దేవకీ నీ అనుభవిస్తాను అనీ పిశాచి గా మారిపోయాడు

తొంబై ఏళ్లు దాటిన మీరు మళ్లీ జన్మించిన మీ జంటని వేరు చేయాలి అని మీ కుటుంబాల మధ్య అగాధం మీ తండ్రుల మధ్య అపార్థాలు ఏర్పాటు చేసి అను

నిత్యం మిమ్మల్ని వెంటాడుతు వస్తున్నాడు

నేను చేసిన తప్పుకి శిక్ష గా

మరణం అనేది లేకుండా కాళి ఆశీర్వాదం తో మీరు మరల జన్మించి మీ వివాహం జరిపించే వరకు విముక్తి అనేదే లేకుండా జీవించి మరణిస్తున్న ఈ అమరావతి కోరిక మీరు భార్యాభర్తలు కావాలి

తిరిగి ఆ ఊరిలో అడుగు పెట్టాలి శాపం విమోచనం కావాలి

అందుకే మీ వెన్నంటే ఉండి మీకు సహాయ పడుతుంది

ఈ అమరావతి మీ ప్రేమ

గెలిపించే బాధ్యత నాది ధైర్యం గా ఉండాలి అని జరిగిన విషయం అంతా చెప్పింది ఆమె....!!!

ఒక్కసారిగా ఇందు సిద్దు ఒకరిని ఒకరు చూసుకున్నారు

వారికి గత జన్మ జ్ఞాపకం జరిగిన సంఘటనలు అన్ని కళ్లముందు కదిలాయి

అంతే ఎంతో ఎమోషన్ అవుతూ ఒకరిని ఒకరు హత్తుకుని అమరావతి వైపు చూసారు

వాళ్ళకి గతం గుర్తుకు వచ్చింది

అని మార్తాండ తెలుసుకుని

ఇంకాస్త రాక్షసత్వం గా మారి వాళ్ళని కబలించే ప్రయత్నం చేస్తున్నాడు

శ్రీరామ్ శ్రావణి భయం భయం గా కళ్ళు మూసుకుని ఉన్నారు

అమరావతి కాళి నామ స్మరణం చేస్తూ ఉంది అక్కడి ఊరి ప్రజలు అమ్మవారి ఆలయం లో జ్యోతులు వెలిగించి తమ పూర్వీకులు చేసిన తప్పు కి పరిహారం గా ఇన్నేళ్ళు శాపం బారిన పడిన ఊరు బాగు పడాలి అని ఆ జంట ఒక్కటి కావాలి అని వేడుకుంటూ అమ్మకి హారతులు ఇస్తు శక్తిని పిలుస్తున్నారు.....

ఈ క్రమం లో సుడిగాలి వేగం తో ఆ జంటని ఊరిలోకి చేర్చింది అమరావతి,

సిద్దు ఇందు చేయి పట్టుకుని ఉన్నాడు వారిని అమరావతి ఆలయం లోకి విసిరింది వాళ్ళు ఆలయం లోకి చేరుకోకుండ మార్తాండ పిశాచ రూపం లో అడ్డుకుని

ఆలయానికి కొన్ని అడుగులు

దూరం లో పడేశాడు

ఒక వైపు అమరావతి

ఒకవైపు మార్తాండ నడుమ ఆ జంట భయంగా చూస్తూ ఉన్నారు

శ్రావణి శ్రీరామ్ ఆలయం లో పడ్డారు

వాళ్ళకి ఎం జరిగిందో అర్థం కాలేదు ఇందు సిద్దు కోసం చూస్తున్నారు... అంతా ధూళి కణాలు రేగి ఏమి కనిపించడం లేదు

సుడిగాలి దెయ్యం లా అలుముకుంటు ఉంది

ఊరి ప్రజలు అమ్మవారిని వేడుకోవడం చూసి ఆ ఇరువురు అమ్మనే వేడుకుని తమ స్నేహితుల ప్రేమ గెలవాలి అని పూజిస్తున్నారు....

అక్కడి వాళ్ళు ఎవరూ మార్తాండ అమరావతి నీ చూడలేదు అంతా దేవి ఆరాధన లో ఉన్నారు.....

ఎర్రటి ఎడారిగా మారిన మట్టి నేల మీద పడ్డ ఆ జంట ఒకరిని ఒకరు పట్టుకుని దుష్ట శక్తి వైపు చూసారు

మార్తాండ పిసచంగా ఉండి కూడా ఇందు గా పుట్టిన దేవకీ నీ అనుభవించి వారిని మళ్లీ వేరు చేయాలి చూస్తున్నాడు

అమరావతి అడ్డం వస్తె ఆమెను ఎంతో బలంగా విసిరి కొట్టాడు

సిద్దు వద్ద రక్ష ఉండటం తో అతడ్ని చంపకుండా మట్టిలో కూరుకు పోయేలా చేసి దేవకీ ( ఇందు ) మీదికి వెళుతున్నాడు

ఆమె కళ్ళకి జరిగిన అన్యాయం ఘోరం కనిపిస్తుంది

అతడు ఆమెను ఈ జన్మలో కూడా నాశనం చేయాలి అని ఆ దుష్ట శక్తి ప్రయత్నం చేస్తుంటే

వాడి నుండి తప్పించుకుని ఆలయం లోకి ప్రవేశించు

అంటుంది అమరావతి....

మార్తాండ అతడి శక్తిని అంతా కలగలిపి కొన్ని నిముషాలు అమరావతిని బంధించాడు

అందుకే అమే ఏమి చేయలేక పోతుంది

ఇందు ఆ దుష్ట శక్తి నీ తప్పించు కుంటు ఆలయం లో ప్రవేశించాలి అని పరుగులు పెడుతూ ఉంటే

మార్తాండ అడ్డుకుని ఆమెను నాశనం చేయడానికి చూస్తూ

హింస పెడుతున్నాడు

మట్టిలో కూరుకు పోయిన సిద్దు తన శక్తి నంతా ఉపయోగించి

బైటకు వచ్చాడు

అతడికి దూరంగా ఇందు అవస్థ పడుతు కనిపించింది

ఆ దుష్ట శక్తి చేస్తున్న దారుణం కనిపించింది

తట్టుకోలేక పోయాడు ఒక్కసారిగా శక్తిని తెచ్చుకుని జై మాతా అంటు అరిచి తాను కూరుకు పోయినా మట్టి అడుగున దొరికిన ఆయుధం అందుకున్నాడు

ఆ ఆయుధం గత జన్మలో తన శిరస్సు కండించింది

ఇప్పుడు తన ప్రేయసి నీ నాశనం చేయాలి అని చూస్తున్న వాడి నీ అంతం చేయాలి అని ఆవేశంగా పరుగులు తీస్తున్నాడు అతడు

కానీ పిశాచి నీ ఆయుధం తో చంపలేడు అతడు ,,

అందుకే ఇందు మీద పడుతున్న ఆ దుష్ట శక్తి నీ ఎన్ని సార్లు పొడిచిన ఏమి కాలేదు సరికదా వాడు వికృతంగా నవ్వుతూ

సిద్దు నీ విసిరి కొట్టాడు

అంతే సిద్దు అమ్మవారు ఆలయం ముందు పడ్డాడు

అతడు దేవి ఆలయం లో అడుగు మోపాడు

అమరావతి అమ్మా కాళీ కాపాడు అంటూ వేడుకుంటుంది

ఊరి ప్రజలు వారి స్నేహితులు

దేవీని ప్రార్ధిస్తున్నారు....

సిద్దు అమ్మ ముందుకు వెళ్లి అమ్మా కాళి కాపాడు నువ్వే మమ్మల్ని కళిపావు నీ దయ చూపు తల్లి అని ఆలయ గంట ఆపకుండా కొడుతూ ఉన్నాడు

పిచాచి చేతిలో నలిగిపోతూ

నరకం చూస్తున్న ఇందు ఇప్పుడు దేవకీ లా మారింది

ఆమెలో భయాన్ని విడిచి ధైర్యం తెచ్చుకుంది

ఓం శక్తి పరా శక్తి ఓం శక్తి పరా శక్తి అంటూ ఆపకుండా అమ్మ నామం జపిస్తూ మార్తాండ గొంతు పట్టుకుని గాల్లోకి విసిరింకొట్టింది

కింద పడ్డ ఆమె లేచి నిలుచునీ ఆలయం దిక్కు చూసి హే మాతా దుష్ట సంహారం జరగాలి

శక్తి ఆగమనం జరిగి తీరాలి

అనతి ఇవ్వు..... రా.....

శక్తి ఆగమనం తక్షణం కావాలి

అంటూ ఉగ్ర రూపం దాల్చిన

ఆది శక్తి లా ఆమె అరిచింది

ఆమె నోటి నుండి శక్తి ఆగమనం అనగానే దుష్ట శక్తి జడిసింది ఏయ్...అంటూ ఆమె మీదికి వెళుతూ ఉంది

ఆలయం లో ఒక్కసారిగా వేయి కాంతుల జ్యోతి వెలిగింది..... ఆ జ్యోతి ప్రకాశం దేవకీ పై ప్రసరించింది.......

అంతే ఆమె అపర కాళి గా మారి చేతులు చాచింది అమ్మ వద్ద ఉన్న త్రిశూలం ఆమెచేతికి వచ్చి చేరుకుంది అమ్మ చేతిలో ఉన్న.. కడ్గం....ఆమె మరో చేతికి వచ్చింది ఆ ఎడారి నెల నిప్పులు చిమ్ముతూ ఉన్నాయి

దేవకీ గా మారిన ఇందిరా....

విలయ తాండవం చేస్తున్న మహంకాళి గా మారి

భయంకర నృత్యం చేస్తూ..... దుర్మార్గపు దుష్ట శక్తి నీ

చేరుకుంది

ఆమె పై తిరగబడే ప్రయత్నం చేస్తున్నాడు మార్తాండ

అందుకు అవకాశమే ఈయక అతడ్ని తిప్పి తిప్పి గాల్లో విసిరి కింద పడకుండా ఆమె చేతిలో ఉన్న త్రిశూలం తో అతడి కడుపులో పొడిచింది

వాడికడుపులో మసి బారిన బూడిద ఉబికి వస్తూ ఆమె పై పడి అభిషేకిస్తూ ఉంటే

మరింత ఆనందంగా ఆగ్రహాన్ని పెంచుకుంటూ

తన వాడి తల నరికిన వాడి శిరస్సు మరో చితిలో ఉన్న కత్తి తో నరికింది

శరీరం నుండి వేరు అయిన

వాడి తల తెగి నెల మీద పడుతుంటే ఆమె ఖడ్గం తో అందుకుని కాళి మాత మెడలో పుర్రెగా పడేలా చేసింది

త్రిశూలాన్ని అంటి పెట్టుకొని ఉన్న వాడి మొండాన్ని గాల్లో ఆడించి బూడిద చేసి అభిషేకించుకుని..... తాండవం చేసింది

శక్తి ఆగమనం దుష్ట సంహారం చేస్తుంటే చేతులు జోడించి చూస్తుంది అమరావతి

ఆలయ లో ఉన్న వారంతా శక్తి ఆగమనం దుష్ట సంహారం కళ్ళారా చూసారు ఆ శక్తి విలయ తాండవం చేస్తూ ఆ దుష్ట శక్తి నీ అంతం చేసి వాడి బూడిద తో తడిసి తాండవం చేయడం చూసి

భయ పడ్డారు

సిద్దు జేయధేవు గా అక్కడి శక్తిని చూస్తూ మోకరిల్లి చేతులు 

జోడించి వేడుకుంటూ ఉన్నాడు అందరూ అమ్మా...శాంతి శాంతి అని వెడుకో సాగారు

ఆవహించిన శక్తి శాంతించి

చేత ఆయుధాలను విడిచి

నేలపై పడిపోయింది

ఆమెలో శక్తి మాయం అయ్యింది

అలయాన ఉన్న కాళీ మాత మెడలో దుష్ట శిరస్సు చేరుకుని

శిష్ట రక్షణ జరిగింది

ఇన్నేళ్ల తన ప్రార్థన ఫలించింది

ఇంక ఆ జంట నడుమ ఎలాంటి అడ్డంకులు ఉండవు అని అమరావతి ఆ ఇరువురిని అలయాం లోకి చేర్చింది

అమ్మ ఆశీర్వాదం తో వధువు ఒంటికి పట్టుచీర చేరుకుంది

వరుడి చేతిలో తాళి కట్టమని ఊరే వేడుకుని ఆశీర్వదిస్తూ ఉంటే

గుడి గంటలు ఆగకుండా మ్రోగుతుంటే....

వరుడు వధువు మెడలో తాళి కట్టి నల్లపూసలు వేశాడు

అందరూ అక్షింతలు జల్లి చేసిన తప్పు సరిదిద్దుకున్నారు...!!

అంతే ఒక్కసారిగా పూల వాన మొదలైంది నీటి చుక్క కరువైనా ఊరిలో ఉరుముల మెరుపుల

జడి వాన మొదలైంది....ఊరు జనం ఆనంద పర్వసులు అయ్యారు...!!

అమరావతి కోరిక నెరవేరింది

తాను విడతీసిన జంట తానే కలిపింది అన్న తృప్తి దక్కింది

దేవకీ ఇచ్చిన శాపం తొలగింది.....

ఆ జంట ఒకరిని ఒకరు

హత్తుకుని అమరావతి ఆశీర్వాదం అందుకున్నారు

ఆమె వారిని ఆశీర్వదించి

ఆ దేవిలో ఐక్యం అయ్యింది....!!?

శ్రీరామ్ శ్రావణి వారి చేతులు పట్టుకుని ఇంక మీకు ఎవరు అడ్డు చెప్పరు గ్రేట్ లవ్ స్టోరీ మీది జన్మ జన్మల బంధం మీది అంటున్నారు

ఆ జంట అవును అని అమ్మవారికి నమస్కరించారు .

అంతే క్షణం లో వాళ్ళు కాలేజ్ కెంపస్ వెలుపలి భాగంలో ఉన్నారు

వారి చుట్టూ వందల మందీ స్టూడెంట్స్ ఉన్నారు

వారి మెడలో పూల మాలలు ఉన్నాయి అమ్మాయి మెడలో నల్లపూసలు తాళి అందరి ఆశీర్వాదం అందుకుంటూ

ఉన్నారు

శ్రీరామ్ శ్రావణి ఇరువైపులా నిలుచుని ప్రేమా జిందాబాద్ అంటూ ఉంటే మిగిలిన వాళ్ళు వంత పాడారు అక్కడ ఉన్న

ఎవరికి అంత వరకు జరిగింది జ్ఞాపకం లేదు....

వారి చేతుల మీద ఉన్న త్రిశూల ముద్ర మాయం అయ్యి

వారిని పూర్తిగా ఈ జన్మకి పరిమితం చేశాయి ,,

వాళ్ళకి స్టూడెంట్స్ వివాహం చేయడం పోలీసులు ఏమి చేయలేక పోవడం భూషణ్ శివరాం తట్టుకోలేక పోయారు

వాళ్ళని విడదియ్యాలి అని కోపం గా వాల్ల మధ్యకి వెళ్లారు

అంతే ఆ జంట మమ్మల్ని విడతీయ కండి అంటూ చేతులు జోడించి వేడుకుంటూ ఉన్నారు....

ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లలు పసుపు బట్టలతో కనిపించి చేతులు జోడించి వేడుకుంటూ ఉంటే ఆ తండ్రుల హృదయం కరిగి పోయింది ఎంతో భాధగా వాళ్ళని పట్టుకున్నారు

అంతలో పిల్లల తల్లులు అక్కడికి చేరుకుని హమ్మయ్య అనుకున్నారు...

భూషణ్ శివరాం ఒకర్ని ఒకరు పట్టుకుని ఇంక మన మధ్య శతృత్వం వద్దు మన పిల్లలు ఒక్కటై మనల్ని ఒకటి చేశారు

అంటూ స్నేహితులుగా మారారు కోయ దొర అంతా దివ్య దృష్టితో చూసి శుభం అనుకున్నాడు.....!!

*"'వారి కలయిక తో శాప విమోచనం పొంది ఆ ఊరి నదులు బావులు యథాప్రకారం అయిపోయాయి మాయ మర్మం ఏమిటి అన్నది ఊరి ప్రజల జ్ఞాపకాల్లో లేకుండా అమ్మ తొలగించింది

దుష్ట శక్తి సంహారం కోసం శక్తి ఆగమనం జరిగింది

దుష్ట శక్తి అంతం అయ్యింది

అన్నది అమ్మకి మాత్రమే తెలుసు ఆ అమ్మలో కలిసిన అమరావతికి తెలుసు....!!

ప్రేమించి పెళ్లి చేసుకున్న

జంట ఇల్లు చేరుకున్నారు

ఎంతో ఆనందం గా జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకున్నారు అంత కంటే ముందు తాము కలుసుకున్న కాళి మాత ఆలయం కి వెళ్ళాలి అని నిర్మించుకుని అమ్మవారిని కుటుంబ సభ్యులతో వెళ్ళి దర్శించుకుని అమ్మ ఆశీర్వాదం అందుకున్నారు

ఆ జంటకి జరిగిన సంఘటనలు గుర్తు లేవు కానీ వారి మధ్య ప్రేమ అలాగే కలకాలం ఉంటుంది అమ్మవారి లో కలిసిపోయిన అమరావతి ఆ జంటను ఆనందంగా చూసుకుంది....!!!

ఈ జన్మలో దూరం అయిన జంట మరు జన్మ ఎత్తి అయిన తమ ప్రేమని గెలిపించుకున్నారు

దుష్ట శక్తి నీ అంతం చేశారు....!!

అలాగే వారి స్నేహితులు శ్రీరామ్ శ్రావణి ల వివాహం దగ్గరుండి చేశారు అంతా సంతోషం గా జీవిస్తున్నారు.... !!!

శుభం.... శక్తి ఆగమనం

పూర్తి అయ్యింది....

ఫ్రెండ్స్ చాలా ఆలస్యం. గా

కథ పూర్తి చేశాను

మీకు ఈ కథ ఎలా అనిపించింది తెలియ చేయండి అందరికీ ధన్యవాదాలు

తెలుపుకుంటున్నాను

మీ రాపర్తి అనూరాధ...!!!Rate this content
Log in

Similar telugu story from Romance