శ్రీలత "హృదయ స్పందన"

Romance Classics

5  

శ్రీలత "హృదయ స్పందన"

Romance Classics

నా ఆత్మ సహచరికి

నా ఆత్మ సహచరికి

1 min
581నా ఆత్మ సహచరికి.., 


  కొత్తగా ఉంది సంబోధన అని చూస్తున్నావా.. అవును ఇన్నాళ్లు.. ఇన్నేళ్లు... నేను ఎదురు చూసిన నా ఆత్మ సహచరివి నువ్వే అని అనిపించింది అందుకే ఇలా... 


నా ఆత్మ ను.నీ ఆత్మతో ఏకం చేయటం కోసమే.. ఈ లేఖ.. 

ఇది చదువుతున్నప్పుడు నేను నీ పక్కనే.... నీతోనే ఉన్నాననే అనుభూతి కలగాలని నా ఆశ... 


 నా గుండె గోదారిలో నువ్వొక స్వచ్ఛమైన స్వాతి ముత్యం.. 

నీ ప్రేమ నాకు ఎన్నో జన్మల జ్ఞాపకం.. మరెన్నో జన్మలకు ప్రయాణం..

  

రోజు రోజు కి నీ మీద నాకు ప్రేమ ఎక్కువ అవుతుంది.

ప్రతి ఉదయం నీ నుదిటి మీద స్వచ్ఛమైన ముద్దుతో నిన్ను నిద్రలేపాలని.. ఆకలితో నువ్వు ఉంటే కమ్మని గోరుముద్దలు తినిపించాలని.. సాయంత్రం చల్లగాలిలో నీకు కబుర్లు చెప్తూ నీతో ఒంటరిగా నడవాలని... పండువెన్నెలలో నీ ఒడిలో తలవాల్చి నీ హృదయ స్పందన వింటూ.. నన్ను నేను మర్చిపోవాలని.. 


నువ్వు నాతో మాట్లాడవు..కానీ ప్రతి ఉదయం నీ చూపులు నన్ను పలకరిస్తాయి.. నీ భావాలను నాతో పంచుకోవు.. కానీ నీ మనసు.. నా మనసుతో మాట్లాడుతుంది.. 

నువ్వు.. నీ భావాలు.. నీ భాద్యతలు.. అన్ని నన్ను నీ వైవు నడిపిస్తున్నాయి.. నువ్వు అంటే ఎందుకు ఇంత ఇష్టం అంటే చెప్పలేను కానీ.. నీలా నేను ప్రేమించలేను.. అనిపిస్తుంది.. 

  

నీ ప్రేమను పొందటం కోసం ఎన్ని జన్మలు అయినా ఎదురు చూస్తాను... నీ ప్రేమ కోసం మళ్ళీ మళ్ళీ జన్మిస్తాను.. 

ఒక్కో జన్మలో ఒక్కో బంధం కావాలి నీతో.. ప్రేయసిగా.. భార్యగా... కూతురి గా.. నీ ప్రేమను పొందాలని ఆశ... ఆరాటం.. 

నువ్వు కళ్ళు తెరవగానే కలిగే మొదటి ఆలోచన.. నిద్రపోయేముందు కలిగే చివరి ఆలోచన నేనే అవ్వాలి.. 

నువ్వు .. నేను.. మనం అవ్వాలి..

నీ ప్రేమను ఆస్వాదిస్తూ.. నీలో ఉండిపోవాలి.. 

ఇద్దరి ఊపిరి కలిసి పోవాలి... 

ఇద్దరి ప్రాణం ఒకటవ్వాలి.... 


నా ఆత్మ సహచరికి... 

నా ప్రాణ సఖునికి... నేను ఎం ఇవ్వగలను... నా ప్రేమ కన్నా.. ప్రాణం కన్నా విలువ అయినది ఏది లేదు నా దగ్గర... 

అందుకే నా ప్రేమతో....పాటు... ప్రాణం కూడా నీదే... 


ఇట్లు... 


నీ ప్రియసఖి.. 


శ్రీ.... 

హృదయ స్పందన.. Rate this content
Log in

Similar telugu story from Romance