STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Classics Inspirational

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Classics Inspirational

నువ్వే నా.. ప్రపంచం💗

నువ్వే నా.. ప్రపంచం💗

2 mins
1.3K


ప్రియతమా నీకోసం,

 ప్రతి రోజు ఎన్నిసార్లు తలుచుకుంటానో. నా ఆలోచనలు నీ హృదయాన్ని తాకుతున్నాయి అనిపిస్తుంది.

నా ఊహల్లో ఎప్పుడు నీతోనే విహరిస్తుంటాను.

నా ఊహలకు ఊపిరిపోసి ఎప్పుడు నువ్వు నా ముందు ప్రత్యక్షం అవుతావా అని కళ్ళు రెప్పవేయకుండా చూస్తూనేఉంటాయి..

ప్రతీ రోజు ఇలా  మెస్సేజ్ లో ఎన్ని మాట్లాడిన..అవి కేవలం ఊహల్లో ఉన్న ఆనందం మాత్రమే.

నీ చేతి స్పర్శ లోని నమ్మకం ,నీ చూపులోని అనురాగం, నీ పిలుపులోని ఆప్యాయత, నీ కౌగిలిలోని భరోసా దొరకవు కదా..

నేను నీకు ఎన్ని లేఖలు రాసినా, ఎన్ని చెప్పినా ఇంకా ఏవో మిగిలే ఉంటాయి. నీ ఎద పానుపు పైన నేను పవలించినప్పుడు నా ప్రేమ ను నీకు అర్పిస్తూ చెప్పే ఊహల ఊసులు ఎన్నో నా హృదయాంతరాలలో నిక్షిప్తం చేసుకున్నాను.

నీలాంటి ఉన్నతమైన వ్యక్తి ప్రేమను పొందటం నా అదృష్టం. ప్రేమించటం అంటే ఇవ్వటమే.. తీసుకోవటం కాదు అని నువ్వు చెప్పే మాటలు ఇప్పుడు నాకు అర్థం అవుతున్నాయి.. నిజమే ఇవ్వటం లో ఉన్న ఆనందం ఆశించటంలో ఉండదు. నేను ప్రేమించే నువు నా దగ్గర లేకపోయినా నా మనసులో ఎప్పుడు నీ స్థానం ఆకాశం అంత ఉన్నంతంగా ఉంటుంది. నా జ్ఞాపకాల్లో ఎప్పుడు నువు పదిలంగా ఉంటావు..

 ఎన్నో సార్లు ఏవో పిచ్చి ఆలోచనలతో ఎన్నో ప్రశ్నలు వేసి నిన్ను విసిగించి ఉంటాను. నేనొక కల్లోల కెరటాన్ని కానీ నువు నిశ్శబ్ద తీరానివై నన్ను నీ మనసులో బందించేస్తావు.

ఇప్పుడు ఒకరి మీద ఒకరికి నమ్మకం, ప్రేమ బలపడి.. కోపం, బాధ వీటన్నిటికీ అతీతమైన బంధం మనది అనిపిస్తుంది. మన ప్రేమ లో ఒకరికోసం ఒకరం ఏదైనా చేసే స్వేచ్చ ఉందని అనిపిస్తుంది. అవునో కాదో నువ్వు నీ మాటల్లో చెప్తేనే నాకు ఆనందంగా, నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.

 నా చుట్టూ ఎంతమంది ఉన్నా ప్రపంచం అంతా కోరికల పుట్టలు.. ఆశల తీరాన్ని అందుకోవాలని ఆరాటపడేవాళ్ళు. అంత విరక్తిలో నేను సేదతీరే ప్రేమసాగరం నీ హృదయం. నేను కనే అందమైన కలలు నీతో సహవాసం. అందుకే ప్రియతమా నువ్వే నా ప్రపంచం.

 నీ మాట కోసం. నీ చూపు కోసం, నీ స్పర్శ కోసం ఆరాటపడే నా మనసుని నిద్రపోమ్మని జోకొట్టలేక..

నువ్వు వస్తావని మభ్యపెట్టలేక, మర్చిపొమ్మని

మందలించలేక.. నాలో నేనే.. మానసిక సంఘర్షణ అనుభవిస్తున్న..

ఇట్లు,

ఎన్నాళ్ళు..

ఎన్నేళ్లు...అయినా...

కాలం కరిగిపోయిన, కన్నీళ్లు ఇంకిపోయిన,

మనసు మూగవోయినా, కలం ఆగిపోయినా..

ఊపిరి ఆగిపోయేక్షణం వరకు..

నీ నేను గానే... ఉంటాను..

ఈ హృదయ స్పందన నీకోసమే..

ప్రియతమా..

శ్రీ...

హృదయ స్పందన.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Romance