నా హృదయేశ్వరునికి!
నా హృదయేశ్వరునికి!
నా హృదయేశ్వరునికి ..!
ఏంటి కొత్తగా పిలుస్తుంది అనుకుంటున్నావా . అవును నిన్ను ఎలా పిలవాలి అన్న నేనే పిలవాలి .ఇంకెవరికి అవకాశం .హక్కు లేదు .
నువ్వు ...నేను ...మనల్ని కలిపింది ప్రేమ ..
ఈ రాత్రి ఈ గదిలో నాలుగు గోడల మధ్యలో నాలోని ఈ అనంతమైన భావాలను ఒంటరిగా నేను అనుభవించలేక ఎవరితో పంచుకోలేక ..కదిలే కాలాన్ని ఆపలేక . కరిగే కన్నీటిని ఆపే ప్రయత్నం లో ఇంకో లేఖ తో నీ ముందు నా అంతరంగ ఆవిష్కరణ .
ఇప్పుడు నాకు నేనే నచ్చటం లేదు. నాది కాని దాన్ని కోరుకోవడం . నాలో కలుపుకోవాలి అనుకోవడం .
దీనికి కారణం కూడా నువ్వే . నువ్వు నాకు పరిచయం కాకుంటే .నాలో ఈ ప్రేమ భావాలు ఉదయించకుంటే
నాకు ఇంత బాధ ..భయం ఉండేవి కావు .
నువు రావని తెలిసి ప్రతి రోజు అడుగుతాను. ఎప్పుడు వస్తావని . ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్న కదా. ఈ రోజు ఆకాశంలో కదులుతున్న మబ్బుల్ని చూస్తూ అందులో ఎక్కడైనా నీ రూపం కనిపిస్తుందేమో అని అలా రోజంతా చూస్తూ కూర్చున్న ..
ప్రతి రోజు సూర్య నమస్కారం తో ప్రారంభం అయ్యే నా దినచర్య ఇప్పుడు నీ ఆలోచనలతో మొదలవుతుంది. అందుకే ఏమో సూర్యుడు అలిగి వెళ్ళిపోయాడు . రెండు రోజుల నుండి కనిపించడం లేదు ..ఈ సాయంత్రం ఎందుకో నా మీద జాలి వేసినట్టు ఉంది ..బెంగ పెట్టుకున్న అని కొన్ని క్షణాలు నన్ను పలకరించి వెళ్ళాడు ..
చూసావా నా ప్రేమ కు పంచభూతాలు సైతం కరిగి నన్ను కరుణిస్తున్నాయి .మరి నీ హృదయం ఎందుకు కరగటం లేదు .
హార్ట్ ఫుల్ గా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది.. నేను కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాను.. ఇప్పుడు కూడా కోరుకుంటున్నాను నా చివరి శ్వాస లోపు నిన్ను కలవాలి అని.
రోజులో ఎన్ని సార్లు నీ రూపాన్ని తలచుకుని . నీతో మాట్లాడతానో... ఇంతకు ముందు ఉన్న నా ప్రపంచం మార్చేసావ్.. ఇప్పుడు నా లోకం మొత్తం నువ్వే అయ్యావు..
నిన్ను తలుచుకుంటే కలిగే ఆనందాన్ని ,అనుభూతి ని , అప్పుడప్పుడు నువ్వు రావని నా మనసు పడే బాధ ని ,
వీటన్నిటిని ఇలా ఈ పిచ్చి రాతలతో ఎలా తెలిపేది నీకు .
నేను రాసుకున్న లేఖలలో ఎంత అనుభూతి ,ఆనందం ,
విరహం,బాధ ,కన్నీళ్లు ..ఉన్నాయో అవన్నీ నా హృదయ స్పందనలే అని ని హృయానికి తెలియడం లేదా .
నా హృదయాన్ని వెలిగించే నీ ప్రేమ జ్యోతి కోసం...
నీ చూపుల తన్మయత్వం కోసం..
నీ మాటల మాధుర్యం కోసం..
నీ చేతి స్పర్శ కోసం.. నిరంతరం తపించే నా హృదయం లో ఈ విరహపు జ్వాలలు రగిల్చి చలిమంట కాచుకుంటావు..
నీకిది న్యాయమా ప్రియా.
ఇంకెన్నాళ్లు నీ రాక కోసం కనులకు ఈ ఎదురుచూపు .
నీ ప్రేమ కోసం మనసుకు ఈ నిరీక్షణ ..
నిన్ను ..నన్ను ..మనల్ని చేసే ఆ ప్రేమ కోసం ఎన్నాళ్ళు అయినా ఇలాగే ఎదురుచూస్తూ ఉంటాను ..
ఇట్లు ,
నన్ను నన్నుగా నీ ప్రేమ లో
నిలబెట్టుకోలేని నేను .
శ్రీ ....
హృదయ స్పందన .