శ్రీలత "హృదయ స్పందన "

Romance Inspirational

4  

శ్రీలత "హృదయ స్పందన "

Romance Inspirational

మన ప్రేమ అమరం 💞

మన ప్రేమ అమరం 💞

2 mins
539



 ప్రియాతి ప్రియమైన శ్రీవారికి,


మీరు రాసిన లేఖ చదివాను. నన్ను ఎంతగానో ఆలోచింపచేసే, నాలో ప్రతీరోజు కొత్త ఉత్సాహన్ని నింపే మీ మాటలు వినకపోతే 3 రోజులుగా నాకు జీవితం భారంగా గడుస్తుంది.


ఇదిగో ఇంతలో మీ లేఖ మళ్ళీ నా ఆలోచనలకు, మీ ఆశయయాలకు ఊపిరి పొసే జీవ వాయువులా నా ముందు ప్రత్యక్షం అయింది.


 మీ జీవనపయనంలో నేనొక మధుర కావ్యం అయితే ఆ కావ్యానికి ఉపిరిపొసే అక్షరం మీరేకదా. మరి అక్షరం లేకుండా కావ్యానికి మనుగడ లేదు. అలాగే మీరు లేకుండా నా జీవితానికి అర్థం లేదు. నా ప్రేమ కాదు మిమ్మల్ని ఇంకా బతికేలా చేస్తుంది. నా మీద మీకున్న ప్రేమ ఎప్పటికి నన్నువిడిచి మిమల్ని దూరంగా పోనివ్వదు. మీరు తొందరగా నా దగ్గరికి వచ్చేస్తారు.


 ఇక మిమల్ని అంతలా బాధపెడుతున్న విషయం. ఆవును ఒకప్పుడు డాక్టర్ అంటే ప్రాణం పొసే దేవుడు. ఇప్పుడు ప్రాణం తో వ్యాపారం చేసే వ్యాపారవేత్త. మీరు చెప్పింది నిజమే ఎంత సంపాదించినా అది మనతోపాటు రాదు. ఆ నిజాన్ని తెలుసుకోలేక మానవుడు మానవత్వం మరిచి, ప్రేమను, విడిచి తాను బాగుంటే చాలు అనే స్వార్థంతో జీవిస్తున్నాడు.


కానీ తాను బాగుండాలి అంటే తన చుట్టూ ఉన్న ప్రకృతి, జీవజాతి, తోటి మానవుడు బాగుండాలి అనే ఆలోచన మరిచిపోయాడు. అది గుర్తు చేయటానికి ఇలాంటి ఉత్పాతాలు ఎన్ని వచ్చినా ఇంకా మనిషి 

తన బాధ్యత మరిచి జీవిస్తున్నాడు.


సుఖమయ జీవితపు వ్యామోహం లో పడి ప్రకృతి శక్తుల బలాన్ని మరిచాడు.

ఒకప్పుడు నేలను.. నీళ్లను.. ఇప్పుడు బతకటానికి ఊపిరి పొసే గాలిని కొంటున్నాడు.


ఇప్పటికి అయినా మనిషి ఆలోచన విధానం మారి ప్రకృతి పట్ల. తోటి జీవరాసి పట్ల, మానవుని పట్ల ప్రేమతో వ్యవహరించేలా

తన బాధ్యత తెలుసుకునేలా మీ ఆశయాలను సాధించే దిశగా నేను వేసే నా తొలి అడుగుల్లో మీరు నా వెంటే ఉంటూ నన్ను ముందుకు నడిపించటానికి తొందరగా ఒచ్చేస్తారనే ఆశతో.. నమ్మకం తో మీకోసం వేచి చూస్తున్న.


 మీరు కోరుకున్న ప్రేమ కానుక మీకోసం.. మీ స్ఫూర్తితోనే

మీ అడుగుజాడల్లోనే నెరవేరుస్తాను అని మీకు మాట ఇస్తున్న ప్రియా..


మన మధ్యలో ఉన్న ప్రేమ కు మరణం లేదు ప్రియా. 

 మన ప్రేమ శాశ్వతం.. అమరం.. నువు లేకపోతే నేను లేను.. నువు ఎక్కడ ఉంటే నీతోపాటే నేను..

అది ఈ భూమి మీద ప్రాణంతో అయినా...

ఆ ఆకాశంలో.. ఆత్మసహచరిగా అయినా. 


ఇట్లు,


మీలో సగం. 



 



Rate this content
Log in

Similar telugu story from Romance