STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy Classics

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy Classics

కరుణించవా ప్రియా!

కరుణించవా ప్రియా!

2 mins
437


ప్రియమైన నీకు...,

 ప్రతి ఉదయం ఇలా నీ ఆలోచనల అలల్లో కొట్టుకుపోతున్న నన్ను నీ ప్రేమ వలలో బందించి ఒడ్డుకు చేర్చవా... నేస్తం...

ప్రతి రోజు నాకో కొత్త అనుభవం... నీ ఆలోచనల్లో...

ఈ రోజు ఏంటి కొత్త నా గొంతు తడి ఆరి పోతున్నట్టు..

హృదయంలో కొత్తగా ప్రకంపనలు.. ఎదో జరిగిపోతున్నట్టు...

ఇది బాధ నా... భయమా... ఇంకేదైనా నా...

ఇంట్లో నాకు నేనే కొత్తగా.. గమ్మత్తుగా అనిపిస్తున్న..

ఎదో లోకంలో ఉన్నట్టు ఉంది .. ఎం మాట్లాడుతున్నానో...

ఎం చేస్తున్నానో... తెలియని... పరధ్యానం..

లైటర్ ని రిమోట్ అంటున్న..... పెన్ ని లైటర్ అనుకొని స్టవ్ వెలిగిస్తున్న. ..

ఇలా ఒకటేమిటి.. ఎన్నో... వింత అనుభవాలు...

ఇలా నాకేనా... నీకు అనిపిస్తుందా..?

మదిలో ఎన్నో భావాలు ఉన్నాయి నీతో పంచుకోవాలని.. కాని ఎలా చెప్పాలి...

ప్రతి ఉదయం నీ చిరునవ్వు చూస్తూ... కొత్త ఆశలకు స్వాగతం పలకాలని...

సాయంత్రపు చల్ల గాలికి పచ్చిక బయళ్లపై.. నీతో కలిసి నడవాలని...

పండువెన్నెల చల్లదనంలో నీతో కలిసి కలువ పువ్వుల అందాన్ని ఆస్వాదించాలని....

ఇలా ఎన్నో.... ఆశలు నా మదిని తాకుతుంటే... ఎలా నీకు చేరాలి నా భావాలు...

ఇవన్నీ చదువుతుంటే నీకు నవ్వు వస్తుంది కదా నేస్తం...

ఎక్కడో నీవు... మరెక్కడో నేను...

అసలు ఒకరినొకరం చూసుకుంటామో లేదో కూడా తెలియదు.. అలాంటి అప్పుడు ఇవన్నీ ఎలా సాధ్యం అసాధ్యం కదా.. !

అందుకే ఊహల్లో అయినా నీతో కలిసి బతికేస్తా..

నువు ఎప్పుడు ఒక మాట అంటావ్ నేను నీ వాన్ని అని..

నా వాడు నాతో లేకున్నా... తన మనసైనా నాతో ఉండాలి కదా... !

ఏది మరి... ఎంత దూరం నా మనసు వెతికినా...

నీ మనసు జాడ కానరాదే...

ఇంకా ఎంత కాలం ఇలా...

నాలో నా మనసు లేక...

నీ మనసు లేక....

నన్ను మనసు లేని మనిషిని చేయకు ...

ఇకనైనా కరుణించవా ప్రియా... !

నాలో లేని నా మనసును నా దరి చేర్చవా...

ఇట్లు..,

నీలో నన్ను వెతుక్కుంటూ..

ఇలా... నీ... నా... లా.. నేను..

శ్రీ.....

హృదయ స్పందన..



ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar telugu story from Romance