శ్రీలత "హృదయ స్పందన"

Romance Tragedy Classics


4  

శ్రీలత "హృదయ స్పందన"

Romance Tragedy Classics


💗నా ప్రాణ నేస్తానికి 🌷

💗నా ప్రాణ నేస్తానికి 🌷

2 mins 197 2 mins 197

 ఎన్నో రోజులు అయింది నిన్ను ఇలా నా భావాలతో పలుకరించి. నీ హృదయాన్ని లేపే నా అక్షరాల గిలిగింతలు లేక శిశిరపు చలికి నా జ్ఞాపకాల వెచ్చటి దుప్పటి కప్పుకుని. నా ఆలోచనల కౌగిగిలిలో హాయిగా నిద్రపోతున్నావా.

ఒచ్చెసాగా మళ్ళీ నా కావ్యాల అలారంతో నీ హృదయాన్ని నిద్రలేపటానికి . రాక్షసి అనుకుంటున్నావా 🙂🙂. అంతేగా..

  ఎప్పుడో మూసేసిన నా హృదయపు గవాక్షాన్ని

మళ్ళీ తెరిచి కొత్తగా ఇలా ఇప్పుడు మళ్ళీ నిన్ను ప్రేమిస్తూ..

నీ ప్రేమలో మునిగిపోయాను.

ఎప్పుడు అంటావు కదా నా పేరు ఏది అని.

ఎన్నో రోజులనుండి అనుకున్నాను నిన్ను ఎలా పిలవాలి కానీ ఏవి నాకు సంతృప్తి ఇవ్వలేదు. ఇన్నాళ్లకు నిన్ను ఇలా పిలవాలి అనిపించింది. అదేంటో చెప్పనా.. నీకు పరిచయం అయిన పేరే మరి. అదేంటో చివరలో చెప్తాను.

  ఏంటో కానీ నీకు లేఖ రాయటం మొదలు పెడితే సమయం తెలియదు. నాకు తెలియకుండానే నా కలం నుండి అక్షరాల కుసుమాలు అనంతంగా పూస్తాయి అందంగా.. ఆనందంగా నీ కంఠాన్ని అలంకరించాలని.

 ప్రేమించే వరకు ప్రేమ ఒక అందమైన అనుభూతి. కానీ ప్రేమించాక తెలుస్తుంది ప్రేమ వ్యక్థ - అవ్యఖ్త భావాల మధ్య నలిగిపోయే మానసిక వేదన. అది గుండెలోతుల్లో ఘనీభవించి ఎప్పటికో మేఘాలుగా మారి హృదయం భారమైనప్పుడు ఆ భారాన్ని మోయలేక గుండె వేగం పెరిగినప్పుడు ఆ వేగానికి కరిగి కన్నీటి వర్షం అయి మనసును, తనువును తడిపేస్తుంది.

   నీ ప్రేమ నా మనసు ముంగిలిలో కొలువైఉండి నా ఆనందాన్ని పంచుకుంటూ, నా బాధలో ఓదార్పు ఇస్తూ ఉండాలని.. ఉంటుందని నా నమ్మకం.

నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసా నేస్తం. ఇప్పుడే రెక్కలు కట్టుకొని నీ గుండెగూటికి చేరాలన్నంత.

ఎన్ని చెప్పినా మౌనంగా ఉండే నీ సహనం ఇంకా ఇష్టం.

మనసులో ఒకటే గొడవ ఆ గొడవ బహుశా నీ వల్లనేమో.

  నా అంతరంగంలో దాచుకున్న భావాలు నా పెదవి దాటి బయటకు రాలేకపోతున్నాయి. అవి నాలోనే నిక్షిప్తం చేసుకుంటే.. కొన్ని చెప్పటం కంటే దాచుకోవటంలోనే సంతృప్తి ఉంటుంది కదా నేస్తం.

ఒకరోజు అన్నీ ఉంటాయి కానీ నేను ఉండకపోవచ్చు. నేను లేకపోవటం అంటే కేవలం భౌతికంగా నేను ఉండను. నా జ్ఞాపకాలు.. స్నేహం, ప్రేమ ఎప్పటికి శాశ్వతమే కదా...

నా చివరి శ్వాస ఒదిలేరోజు నీ సమక్షంలో ఉండాలి అని నా కోరిక. అప్పుడు నీ కంటినుండి ఒక్క కన్నీటి చుక్క నేలరాలిన నా స్నేహం.. నీ మీద నా ప్రేమ అమరత్వాన్ని ఆపాదించుకున్నట్టే. అంతకంటే నా జన్మకు ధన్యత ఎం ఉంది నేస్తం.

మన స్నేహంలో... ప్రేమలో నమ్మకానికి తప్ప మోసానికి స్థానం లేదు.. ఉండదు.. ఆ నమ్మకమే కోల్పోయిన రోజు ప్రాణం ఉన్నా లేని శిలనే నేను.. అలాంటి రోజు రాదని ఆశతో... నమ్మకం తో..

ఏంటి ఇంత భావుకత అనిపిస్తుందా నేస్తం. ఒక్కోసారి అంతే మనసు..

నేస్తం!

వాడిపోయే నా మనసు నీ స్నేహపు చిరుజల్లులో

మళ్ళీ చిగురించాలి..

జాబిలై కురిపించే నీ ప్రేమ వెన్నెలలో నేను నిలువెల్లా తడిసిపోవాలి..

నీ జ్ఞాపకాల సంద్రంలో నేను కొట్టుకుపోవాలి..

ఇక ఉండనా కన్నయ్య..

ఇట్లు,

నీలో నన్ను వెతుక్కుంటూ...

ఎప్పటికి నీ నేనుగా...

శ్రీ....

హృదయ స్పందన.


  Rate this content
Log in

More telugu story from శ్రీలత "హృదయ స్పందన"

Similar telugu story from Romance