సూర్యకాంతి
సూర్యకాంతి


నేను సూరీడనుకో, నువ్వు పొద్దుతిరుగుడు పువ్వువి అన్నాడతను.
అబ్బా. నేనే సూరీడనుకో. నువ్వు పొద్దుతిరుగుడు పువ్వు అంది ఆమె అతని చెవి మెలిపెడుతూ.
అమ్మాయి గారు కవితావేశంలో ఉన్నట్టున్నారు అన్నాడతను నవ్వుతూ.
ఏమో. అబ్బాయి గారిలా మేము కవులం కాదు. కానీ అగ్గి పుల్లా, సబ్బు బిళ్ళా..
అబ్బా. ఇంక ఆపు అంటూ అతడామెను దగ్గరికి తీసుకున్నాడు. నిజం చెప్పు. నా కవితలు నీకు నచ్చవూ అన్నాడతను గోముగా.
కవిత్వం అర్థం కావాలంటే జీవించాలి. అందుకే అది అందరికీ అర్థం కాదు అంది ఆమె.
ఆమె అధరాల మీద పడుతున్న సూర్యకాంతిని అతడు తనివి తీరా ముద్దాడాడు.