శ్రీలత "హృదయ స్పందన"

Romance

4.6  

శ్రీలత "హృదయ స్పందన"

Romance

నా హృదయ నివేదన !💗

నా హృదయ నివేదన !💗

2 mins
5.2Kప్రియమైన నీకు..,

 ఎలా మొదలు పెట్టాలో...

ఏమని సంబోదించాలో.. ఎం చెప్పాలో ఏమి తెలియదు.

అయినా రాస్తున్న.

నా మదిని దాటి ఎన్నో ఆలోచనల ప్రవాహం పరిగెత్తుతుంటే వాటిని ఒడిసి పట్టుకుని ఇలా రాసే ప్రయత్నం చేస్తున్న.

మరి ఆలోచనలు అయితే ఉన్నాయి. నా అంతరంగంలోని భావాలను ఎలా వర్ణించాలో..

నా ఊహలకు ఎలా ప్రాణం పోయాలో తెలియటం లేదు.

ఎన్నో చెప్పాలని ఉన్నా ఏమి చెప్పలేని మౌనం నాది..

అన్నీ తెలిసినా ఇంకా ఎదో చెప్పించాలని ప్రయత్నం నీది.

ప్రతి రోజు మన మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అది నాలో ఆలోచనలకు పునాది అవుతుంది. నన్ను నాకే కొత్తగా పరిచయం చేసినట్టు. నాకే తెలియని అంతరంగాన్ని నా ముందు ఉంచుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఒక క్షణం అనిపిస్తుంది నాలో ఇన్ని భావాలు, ఇంత భావుకత ఉన్నాయా అని.

కాని మళ్ళీ అనుకుంటాను నన్ను మాటలతో కాదు మనసు తో గెలవాలని..

ఈ మధ్య ఎందుకో అర్ద రాత్రి మెలుకువ వస్తుంది.. చుట్టూ ఉన్న చీకటిని చీలుస్తూ వచ్చే కాంతి కిరణంలా నా తలపులలో నువ్వు ఉంటావు. ఒకసారి మాట్లాడాలి అనిపిస్తుంది.. అంతకు ముందు మన మాటలను గుర్తు చేసుకుంటూ... రేపటి కోసం కొత్త ఆశలతో మళ్ళీ నిద్ర లోకి జారుకుంటాను...

ఉదయం కళ్ళు తెరవగానే ఒకటే ఆలోచన నువు ఏదైనా సందేశం పంపావేమో అని ఆత్రుత తో ఫోన్ చెక్ చేస్తాను కాని ఉండదు..

ఏ ఒక్కసారి అయినా నాకంటే ముందే నాకు కొత్త అరుణోదయాలతో శుభోదయ ఆహ్వానం పంపుతావేమో అని...

నాకు అప్పుడపుడు అనిపిస్తుంది గోదారి గట్ల వెంట నడిచే నండూరి ఎంకిలా నీ ఉహల సామ్రాజ్యంలో నేను రాణి ని అయితే బాగుండు అని.. ఎంత అద్భుతం కదా ఊహ.. అదే నిజం ఐతే మరి... ఏమో అవుతుందేమో..

నీ ఉహల రాజ్యానికి రాణి ని అవ్వాలని ఉన్నా మనసులో ఏ మూలనో చిన్న సంశయం మళ్ళీ... నేను మూసేసిన నా మది గది లోకి నీకు ప్రవేశం ఉందా అని?

ప్రేమ పలకటానికి రెండు అక్షరాలే... అయినా దాని సామర్థ్యం కొన్ని జీవితాలు చెల్లించాల్సిన మూల్యం..

ఆ ప్రేమ నీకైనా... నాకైనా... బలం కావాలి కాని..

బలహీనత కాకూడదనే...

నా ఆరాటం... పోరాటం...

ఇంతకన్నా ఎం చెప్పగలను.. నేస్తం..

చివరిగా ఒక చిన్న మాట...

నాఊపిరిలో శ్వాసవై..

నాలోని ప్రాణమై...

నా కలంలో కవితవై..

నేనే నీవుగా కలకాలం ఉండిపోతావా..

నా కలల ప్రపంచంలో విహరిస్తావా...

నన్ను నీ హృదయ కోవెలలో

ఆరాధ్య దేవతలా కొలువుంచుతావా..

నీ కవితా సామ్రాజ్యానికి రాణిని చేస్తావా...

ఇక ఉండనా మరి...

నీ తలపులతో....

ఇట్లు..

నాలోని నేను..

శ్రీ.....

హృదయ స్పందన..Rate this content
Log in

Similar telugu story from Romance