శ్రీలత "హృదయ స్పందన "

Classics Inspirational

4  

శ్రీలత "హృదయ స్పందన "

Classics Inspirational

నువ్వే నా ప్రపంచం ♥️

నువ్వే నా ప్రపంచం ♥️

1 min
1.2K



ప్రియమైన శ్రీవారికి..


 ఏంటి కొత్తగా శ్రీవారు అంటున్న అని చూస్తున్నారా. అప్పుడప్పుడు ఇలా 🥰🥰 ఎప్పుడు నాలా నేనే ☺️ కొంచం అల్లరి, కొంచెం మొండితనం, కొంచెం మూర్ఖత్వం, ఎక్కువ కోపం అన్నీ కలిస్తే మీ శ్రీమతి.. హృదయస్పందన...


 పెళ్లి తర్వాత మీకు మొదటిసారి రాసిన ఉత్తరం.. మొదటి కవిత మీ మొదటి బహుమతి.. అన్నీ అందమైన జ్ఞాపకాలు.


 చాలా మంది పెళ్లి తర్వాత వారి ఇష్టాలు, అలవాట్లు, ఆలోచనలు, ఆశయాలు , స్వేచ్చ కోల్పోయాం అని అంటారు. నేను మాత్రం మీ సహచర్యంలో అన్నీ పొందాను. నన్ను నేను ఇంకా గొప్పగా నిలబెట్టుకోవటానికి మీరు ఇచ్చిన తోడ్పాటు,ధైర్యం,

నా ప్రతి పనిలో మీసహకారం ఇవేవి లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదు.


  మీ తోడు, మీ ప్రేమ నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం.

బాధపడితే అమ్మలా అక్కున చేర్చుకుంటారు, నిస్సహాయస్థితిలో నాన్నలా ధైర్యాన్ని ఇస్తారు. ఓడిపోతే స్నేహితునిలా వెన్నుతట్టి నిలబెడుతారు. కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో మీ గెలుపు నా గెలుపుగా చూపిస్తారు.


 ఒక ఆడపిల్ల ఇంతకుమించి ఎం కోరుకుంటుంది.

మీ ప్రేమకంటే, మీతో జీవితం కంటే ఎక్కువ ఏది ఉంటుంది అనుకోను నేను ఉండదు కూడా..

నన్ను ఎప్పుడు, ఎక్కడ తక్కువ కాకుండా చూసే మీ గొప్ప మనసుకి, మీ సహనానికి, పాదాభివందనం. 


 నాకు ఈ జన్మలో దొరికిన అమూల్యమైన సంపద మీరు, మీ ప్రేమ, మీ సహచర్యం, తర్వాత ఉమా స్నేహం. ఆమ్మో ఇలా అంటే అది యుద్దానికి వస్తుంది. ముందు పరిచయం తనే కాబట్టి ☺️. నా మనసును మీ ఇద్దరు నేను చెప్పకుండా చదివేస్తారు. నాకేం కావాలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. 


 మీ ఇద్దరు నాకు రెండు కళ్ళు. మీ ప్రేమ, తన స్నేహం ఇంతకంటే గొప్ప సంపద నాకు ఏది లేదు. మీ ఇద్దరికిమించిన ఆత్మీయులు నాకు లేరు , ఒద్దు.


మీరు చూపించే ప్రేమకు నేను దాసోహం

మీ ఇద్దరు నాకిచ్చే గౌరవానికి నా వందనాలు

మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటాను..


ఇట్లు,

శ్రీ(ను)లత.

హృదయస్పందన.


  




  



Rate this content
Log in

Similar telugu story from Classics