Siri Kruthika

Classics Inspirational

5.0  

Siri Kruthika

Classics Inspirational

మనసు కథ..!!!

మనసు కథ..!!!

6 mins
529


గతకాలపు వంటరితనం గురించి గుర్తు చేసుకుంటోంది కృష్ణ ప్రియ.. బాల్కనీ నుంచీ కిందకి చూస్తూ..

కృష్ణా.. కృష్ణా.. అని భర్త మురళీధర్ పిలుపుకు వాస్తవం లోకి వస్తుంది..

ఏంటి కృష్ణా.. ఏం ఆలోచిస్తున్నావు? చాలా సేపటి నుండి పిలుస్తున్నాం..

ఏమి లేదు..ఏమైందండి..?

ముందు హల్ లోకి పద..

ఇద్దరూ హాల్ లోకి వస్తారు, అప్పటికే వారి ఇద్దరి పిల్లలూ అక్కడ ఉంటారు.

ఇద్దరూ ప్రేమ గా వచ్చి కృష్ణ ని అల్లుకుపోతారు 5 ఏళ్ళ కూతురు, 8 ఏళ్ల కొడుకు.

ఆ ప్రేమ కి అప్రయత్నం గా జాలువారిన కన్నీటి బొట్టు తుడుచుకుని , ఏంటి నాన్న స్కూల్ నుంచి త్వరగా వచ్చేశారు?

మీరు కూడా ఆఫీస్ నుంచి ఎర్లీ గా వచ్చారు?

ముందు నీ సెంటిమెంట్ ఆపితే చెప్తాను.

అబ్బా పొండి..

ఎన్ని సార్లు చెప్పాను, ప్రతి దానికీ అతిగా స్పందించడం మంచిది కాదు అని. వాళ్ళు కేవలం నీ అక్కున చేరినందుకే కన్నీళ్లా?

కన్నీళ్లు కావు.

మరేంటి?

ఆనంద భాష్పాలు.

ఏవైనా సరే పిల్లలకు గతం గురించి చెప్పాలని లేదు నాకు, నీ వల్ల ఆ పరిస్థితి వచ్చేట్టు ఉంది అంటాడు దగ్గరికొచ్చి మెల్లగా.

కృష్ణ నవ్వుకుని, మీరేమైనా అనుకోండి, ఎవ్వరూ లేని నాకు ఇంత ప్రేమ దొరికితే ప్రతి క్షణం నా గుండె ఇలాగే స్పందిస్తుంది. ఆ ఆనందం మీకర్థం కాదు అంటుంది మరింత మెల్లగా చెవిలో.

మురళీధర్ నిట్టూర్చి, సరే ఎదో ఒకటి చెయ్ అంటాడు.

సరే ఇంతకీ ఏంటో చెప్పండి?

ఏంటంటే.. మనం అందరం కలిసి ఈ వేసవి సెలవులకు Europe trip వెళుతున్నాం అంటాడు మురళీ.

అది విని పిల్లలిద్దరూ వావ్ డాడీ.. థాంక్స్ thank you so much అని ఎక్సైట్ అవుతారు.

కృష్ణ కూడా అమ్మో అంత దూరమే? అంటుంది ఆశ్చర్యం తో.

అవును. పిల్లలూ మీరు ఎగ్జామ్స్ బాగా రాస్తే ఇలాంటి సర్ప్రైజ్ లు చాలా ఇస్తాను. సో ఇంక వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంటాడు.

పిల్లలిద్దరూ బెడ్రూం లోకి వెళ్లి పోతారు.

కృష్ణ వెళ్ళి రిమోట్ తో టీవీ ఆన్ చేసి , మురళీ కి ఇచ్చి చూస్తూ ఉండండి. స్నాక్స్ తెస్తాను అని కిచెన్ లోకి వెళుతుంది.

స్నాక్స్ ని బౌల్స్ లో వేసి, టీ పెడుతూ ఆలోచనల్లోకి జారుకుంటుంది.

                              ***** గతం*****

రామచంద్ర ఆశ్రమం.

అందులో ఎందరో అనాధలని చేరదీసి, ఆశ్రయమిస్తున్నారు. ఆడపిల్లలకు వేరుగా, మగపిల్లలకు వేరుగా ఏర్పరిచిన హాస్టల్స్ లో వుంటూ దాని అనుబంధ సంస్థ రామచంద్ర పబ్లిక్ స్కూల్ లో ఫ్రీ గా చదువుకుంటారు. ఇలా చదువుకుని ఒక స్థాయికి వెళ్ళిన వారంతా తప్పనిసరిగా వారి జీతం లో 15% తిరిగి రామచంద్ర ఆశ్రమానికి విరాళంగా ఇవ్వాలి. దానికి బదులుగా వారి పిల్లలకు అదే స్కూల్ లో చదువు ఫ్రీ గా అందించబడుతుంది. ఇటువంటి అద్భుతమైన ప్రణాళిక రూపొందించిన మహనీయుడు డాక్టర్ కేశవ.

ఏమి లేని స్థాయి నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, డాక్టర్ పట్టా సాధించారు. ఆ సమయంలోనే ఎంతో మంది అనాధలు దిక్కులేని వారై సమాజం లోని దోపిడీ కి దుర్మార్గానికి బలైపోవడం చూసారు.

అప్పుడు పుట్టిన ఆలోచన.. ముందు ఇద్దరికి ఆశ్రయమివ్వడం తో మొదలైనది, అందరూ కలిపి 40 మందికి ఆశ్రయమిచ్చే స్థాయికి ఎదిగింది.

వీరందరినీ చదివించడానికి అయ్యే ఖర్చు ను భరించడం తో పాటు, మంచి విద్యను సమాజానికి అందించాలని పుట్టిన ఆలోచనే స్కూల్. అలా బయట వారు ఫీజ్ ను సహాయం రూపం లో ఆశ్రమానికి అందాచేస్తు చదువుకోవచ్చు.

ఆ విద్య సంస్థ స్టాండర్డ్స్ చూసి చాలా మంది బయట వారు చేరారు.

రామచంద్ర ఆశ్రమం.

గీత... అమ్మ గీత..

మొక్కల పాదులు సరి చేస్తున్న ఒక పదిహేనేళ్ల అమ్మాయి జుత్తుని వెనక్కి నెట్టుకుంటూ తలెత్తి.. పిలుపు వినిపించిన వైపు చూసి వస్తున్నా మేడం. అంటుంది.

త్వరగా రామ్మా. సాయంత్రం చూసుకోవచ్చు మిగిలినవి, అని వినిపించడంతో మరో సారి చెప్పించుకోకుండా.. చేతులు దులుపుకుం టూ పరిగెడుతుంది.

ఆ దారిలో ఎన్నో రకాల గులాబీలు తెల్లనివి, ఎఱ్ఱనివి, గులాబీ రంగు వి, బంతులు , చామంతుల మొక్కలు అందమైన పూలతో వాటి తలలు ఆడిస్తుండగా.. మల్లెపువ్వు వంటి చిన్న చిరునవ్వుతో పరిగెడుతుంది.

ఎస్ మేడం.. అంటూ నిలబడుతుంది.

గీత, ప్రేయర్ లో నువ్వే పాట పాడాలి గుర్తుందా? ఇవాళ ఆగస్ట్ 15. ఇంత ఆలస్యం చేస్తే ఎలా..

లేదు మేడం. అక్కడ మొక్కలు సరిచేస్తూ కూడా ఆ పాటే పాడుకున్నాను. చక్కగా పాడతాను ప్రేయర్ లో చూడండి. అంటూ చలాకీగా మాట్లాడుతుంది.

అమ్మా నాన్న లేరని దిగులు పడే సమయం కూడా లేకుండా ఊపిరి సలుపని పనులను తనకు తానే అప్పగించుకుంటుంది.

వంటరిగా, దిగులుగా ఉండే తన కన్నా చిన్న పిల్లల దగ్గరకు వెళ్లి .. తానే అమ్మై లాలించడం.

తన వయసువారికి ఒక స్నేహితురాలిగా మారి దైర్యం చెప్పడం.

మొక్కలు నాటి , పూలు పూయించడం. ఆశ్రమాన్ని ఎప్పుడు అందంగా అలంకరించడం. వంటపనిలో వంట వారికి సహాయం చేయడం. వార్డెన్ కి ఏకౌంట్స్ చూసి, రిజిస్టర్ అప్డేట్ చెయ్యడం.

ఆశ్రమం లో పిల్లలకు హోం వర్క్ లో సహాయం చెయ్యడం. ఇలా అందరికి తలలో నాలుకలా మారింది గీత.

ఇంత అలుపెరుగని పనుల మధ్యలో, రాత్రి తన పడకపై చేరాక తనకంటూ ఎవరూ లేరనే బాధ, మునిపంటి కింద దాచిన దాగక కన్నీటి వరదై సాగేది. తనకంటూ అమ్మా నాన్న, తమ్ముడు, చెల్లి ఉండాలని అలాంటి కుటుంబం కోసం కలలు కనేది. తన వింత కోరికలకు తానే నవ్వుకునేది.

అందరినీ స్కూల్ కి తీసుకొని, లైన్ లో పక్కనే ఉన్న స్కూల్ కి బయలు దేరింది.

అప్పుడే ఎదురుగా వాళ్ళ స్కూల్ బస్సే వీధి మలుపు తిరిగింది. దాన్ని చూడగానే, గీతకి ఎంతో ఆత్మీయులు దగ్గరవుతున్న ట్టు మురిసిపోవడం మొదలు పెట్టింది.

బస్ గేట్ దాటుకుని లోపలకు వెళ్లి పోయింది. ఒక్కొక్కరే నెమ్మదిగా కిందకు దిగి అసెంబల్ అవుతున్నారు.

గీత కూడా అందరితో పాటు లోపలికి వెళ్లి అసెంబ్లీ లో నిల్చున్నారు.

హెడ్ మాస్టర్ వచ్చి స్పీచ్ ఇవ్వడం అయిపోగానే అందరూ వందేమాతరం పాడారు.

స్పెషల్ సాంగ్ పాడటానికి గీత పేరుని పిలవగా...

గీత అసెంబ్లీ మధ్యలోకి వెళ్లి నిల్చొని..

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి..

జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రీ..

అంటూ స్వరాలు తెలియక పోయినా .. భావ యుక్తంగా పాడటం తో అందరూ ముగ్ధులై.. వాళ్ళ ఆనందాన్ని కరతాళ ధ్వనుల రూపం లో తెలియచేస్తారు.

మిఠాయిలను అందరికి పంచమన్న హెడ్ మాస్టర్ గారి ఆదేశం తో, గీత, తన క్లాస్ మెట్స్ కొందరు కలిసి.. ఒక్కొక్కరికీ పంచుతూ ఉంటారు.

అప్పుడు వెళుతుంది ఆమె మురళీ ధర్ వద్దకు. స్నేహ ఆత్మీయ భావం కళ్ళల్లో కనిపిస్తుండగా మిఠాయి ని ఇస్తుండగా.. మీరు చాలా బాగా పాడారు అని చెప్తాడు తనతో పాటు పదో తరగతి లో చదువుతున్న మురళీధర్.

మనసును కదిపే బంధాలున్న చోట సమయం మరింత వేగంగా కదిలిపోతుంది. అలాగే పదో తరగతి పాఠాలు అయిపోయి పరీక్షల సమయం ఆసన్నమైంది.

గీత శ్రద్ధ గా అన్ని సబ్జెక్ట్స్ చదువుతూ, పరీక్షలకు సిద్ధం అవుతోంది.

పరీక్ష మొదటి రోజు స్కూల్ కి చేరుకున్నారు అంతా. మురళీధర్ గీత వద్దకు వచ్చి ఆల్ ది బెస్ట్.. పరీక్షలు బాగా రాయండి.. అంటూ ఒక పెన్ ఇస్తాడు.

ఆ పెన్ తోనే అన్ని పరీక్షలు రాస్తుంది గీత.

పరీక్షలు అయిపోయి.. సెలవలు ఇచ్చేశారు.

ప్రతిరోజు మళ్లీ , ఎప్పుడు మురళీ నీ కలుస్తానా అనే ఆలోచనలతో భారంగా రోజులు గడిపేది.

ఫలితాలు ఎన్నౌన్స్ చేసే రోజు..

అందరూ వచ్చారు..

కష్టపడి చదివినందుకు మొదటి రాంక్ తో నిలిచిన గీతకి స్టేజ్ మీద ట్రోఫీ అందించబడే సమయం.

అందరి చప్పట్లు మారుమోగుతుండగా.. స్టేజ్ మీదకు వెళ్లి ట్రోఫీ అందుకునే సమయం లో కూడా ఎన్నో ఆలోచనలు.. ఇంకెప్పుడు తనని మళ్లీ చూసే అవకాశం రాదని బాధ.. ఫంక్షన్ అయిపోయింది. తనకున్న ఒకేఒక ఆత్మీయ బంధం తనను వీడి వెళ్లే సమయం అనే వేదన ఆమెను ఎక్కువ కలిచి వేస్తోంది.

ఏం చెప్పాలో తెలియని భావం. బాధగా వెనుదిరిగింది.

మరుసటి సంవత్సరం ఇంటర్ లో చేరింది. ఆత్మీయ జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ మరింత పట్టుదలగా చదివింది. ఎప్పటిలా అందరికి తలలో నాలుకలా.. అన్నిట్లో ఫస్ట్ వస్తు ఉంది.

రోజులు చకచకా దొర్లుతున్నాయి. చదువు తప్ప వేరే ధ్యాస లేదు.

డిగ్రీ ఆ తర్వాత పి. జి.లో చేరి M.B.A gold medalist గా నిలిచింది. ఒక బహుళ జాతి సంస్థ తనను వెతుక్కుంటూ వచ్చి తనకు స్టార్ట్ అప్ కంపెనీ పెట్టుకోడానికి సహాయం చేస్తామని ఆఫర్ ఇచ్చాయి.

అయినా చిరునవ్వే తప్ప ఒకింత కూడా గర్వం లేదు.

ఆ రోజు రాత్రి కూడా తనకంటూ ఎవరూ లేరనే బాధ తనను నలిపేసింది. తనను దగ్గరకు తీసుకుని వోదర్చే వారు, నేనున్నాను అని భుజం తట్టే వాళ్ళు, తన గెలుపును ఆస్వాదించే వాళ్ళు లేరనే లోటు ఆమె కళ్ళల్లో వెలితిగా మిగిలిపోయింది.

మరుసటి రోజు సాయంత్రం.. వార్డెన్ నుంచి పిలుపు.

ఏంటి మేడం పిలిచారు అని డోర్ దగ్గర ఉండి అడుగుతుంది. వార్డెన్ టేబిల్ కి అటూ పక్క చైర్ లో కూర్చుంటే, ఆమె ముందు ఎవరో ఒక అతను కూర్చున్నారు.

లోపలికి రా గీత..

ఏంటి మేడం పిలిచారు అని అతని వైపు చూసింది. ఎక్కడో ఎప్పుడో చూసిన ఆనవాలు. సరిగా గుర్తించలేక పోయింది.

కానీ అవతలివైపు మనిషి కళ్ళల్లో ఒక వెలుగు.

గీత.. అతను మురళీధర్.. నిన్ను కలవాలని వచ్చారు అన్న మాటలు చెవుల్లో మారి మ్రోగాయి.

మురళీ: మేడం తనతో కాస్త విడిగా మాట్లాడాలి.

అలాగే అని ఆమె బయటికి వెళ్లిపోతుంది.

మురళీ: గీత.. మనం చదువుకునే రోజుల్లోనే నీ ప్రవర్తన మరియు నీ మంచి మనసు చూసి, నాకు నువ్వంటే చాలా అభిమానం ఉండేది.

నిన్ను , ఈ స్కూల్ నీ వదిలి వెళ్ళాకే ఆ అభిమానం కాస్త కాస్త గా పెరిగి.. నీపై ఉన్నది కేవలం అభిమానం కాదు .. నీతో కలిసి నడవాలని ఆశ అని అర్థమైంది. నీకు ఇష్టమైతే..

అని ఆగిపోతాడు..

అన్ని రోజులు గీత కళ్ళ మాటున దాగిన కన్నీళ్లు ధారలు కట్టాయి..

తన మనసు అర్థమై..

మా అమ్మ నాన్న నిన్ను చూడాలని అంటున్నారు.. వెళదామా అన్న అతని మాట వేయి వీణలు ఒకేసారి మీటినట్టు గా వినిపించింది గీతకి..

వార్డెన్ పర్మిషన్ తీసుకుని..

తనని ఇంటికి తీసుకువెళ్తాడు. అందరు ఆనందంగా వొప్పుకుంటారు. మరో రెండురోజుల్లో పెళ్లి చేసుకుని శాశ్వతంగా ఆశ్రమం నుంచి ఇంటికి వెళ్ళిపోతూ.. ఒక కోరిక కోరింది గీత.

మురళీ.. ఇన్నాళ్ళ ఈ వంటరి గీత నుంచి, అందరూ ఉన్న... ముఖ్యంగా ఈ మురళీధరుని కి ఇష్టం గా.. కుటుంబం అనే గడిలోకి వెళుతున్నాను.

అందుకే గీత నుంచి నేను నీ కృష్ణ ప్రియ గా మారాలనుకుంటున్నాను. పేరులో కూడా ఎప్పుడూ నీతో కలిసే ఉండాలని కోరుకుంటున్నా కాదనవుగా.

అది విని.. నీ ఇష్టం కృష్ణ ప్రియ అని నెమ్మదిగా దగ్గరకు తీసుకుంటాడు మురళీధర్.

మరి నీ సర్టిఫికెట్ లో ఉంటుందిగా ఎమ్ చేద్దాం అంటాడు.. అవన్నీ మార్పించేసానుగా అని కన్ను గీటుతుంది కృష్ణప్రియ.

అమ్మా దొంగా.. అని మరింత హత్తుకుంటాడు.

ఆరోజు మొదలైన ఆనందం.. కృష్ణ ప్రియ జీవితంలో.

స్టార్ట్ అప్ గా చేనేత కార్మికులను కొంతమందిని కలిపి పెద్ద పెద్ద మాల్స్ నుంచి ఆర్డర్స్ తీసుకు వస్తు.. సెలబ్రెటీస్ నీ కూడా చేనేతకు సహాయం గా ఆ చీరలను తమ కాస్ట్యూమ్స్ డిజైన్ లో వాడాలని వొప్పించి చేనేతకు ఆదరణ మరింత పెంచి.. మంచి పేరును సంపాదించుకుంది.

అన్నీ సంతోషాలు తప్ప మరో మాటే లేదు. స్టార్ట్ అప్ చాలా బాగా రెన్ అయ్యి మంచి లాభాలతో పాటు, మరి కొంతమంది కి ఉపాధి కల్పించింది. మురళీధర్ ఒక పెద్ద బహుళ జాతి సంస్థ లో ఉన్నత స్థానం లో ఉన్నాడు.

రత్నాల వంటి పిల్లలు. కృష్ణ కి దుఃఖం అంచులతో పాటు ఆనందం అంచులు కూడా తెలిశాయి.

                                  @@@

ఇలా అనుకుంటూ ఉండగా.. మురళీ కిచెన్ లోకి వచ్చి.. స్టౌవ్ ఆఫ్ చేసి.. శ్రీమతి గారు మళ్లీ ఆలోచనలో పడ్డట్టున్నారు.. కాస్త ఆలస్యమైతే టీ పొంగి పోయేది అని నవ్వుతాడు.

ఆ నవ్వులో చల్లదనాన్ని ఆస్వాదిస్తూ.. నా సంబరానికి.. టీ కాదు రోజు పాలు పొంగించాలి అంటూ టీ ఇద్దరికి cups లోనికి పోసి ఇస్తుంది. ఇద్దరు అవి తీసుకొని, హల్ లో బాల్కనీ గ్లాస్ డోర్ దగ్గర చైర్స్ లో కూర్చుని టీ తాగుతూ ఉంటారు..

బయట చల్లని గాలి తిరుగుతూ.. చినుకులు పడుతూ.. ఆ గ్లాస్ డోర్ పై పడి నెమ్మదిగా జారుతుండగా..

మురళీ ధర్, కృష్ణ ప్రియ నవ్వులు చిందిస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే..

పిల్లలు టీవీ లో వస్తున్న.. పాట వింటున్నారు.

..................

ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగ..

పండెననుకో ఈ బ్రతుకే మనసుతీరా..

...................................

       .......................................

శిశిరం లో చలి మంటై రగిలేదే ప్రేమ..

చిగురించె రుతువల్లే విరబూసే ప్రేమ...

మరువకుమా.. ఆనందమానంద మాయేటి మధుర కథ..

మరువకుమా.. ఆనందమానంద మాయేటి మనసు కథ..

......Rate this content
Log in

Similar telugu story from Classics