మనిషి బత్యం
మనిషి బత్యం
ఓ సారి దేవుడు ఎడ్లను పిలిచి మీకు ఇంత బత్యం(తిండి) ఇస్తాను అని అన్నాడంట.అవి మాకు అంత బత్యం వద్దు సామీ.మనుషులకియ్యి అని చెప్పాయంట.
అలాగే ఎన్నో జీవులు వాటి బత్యంలో వాటా మనుషులకిచ్చినాయంట.
అందుకే మనిషి ఎన్నో జీవరాశులకి కృతజ్ఞతతో ఉండాలంట.
ముందు కాలంలో అందుకే పశువుల్ని పక్షుల్ని పూజించడం వాటికి తినడానికి ఏమైనా పెట్టాక తను తినడం మనిషి సంస్కృతిగా చేసుకున్నాడు.
మా అమ్మమ్మ ఈ కథ చెప్పేది నాకు.
తను తినేటప్పుడు ఒక్క పిడస అన్నం పక్కన పెట్టి తిన్నాక దానిని బయట వేసేది.
కాకులో కుక్కలో దానిని తింటుంటే చూసి కృష్ణార్పణం అనుకునేది.